కారు వేగంగా దూసుకుపోతూనే వుంది.
డ్రయివ్ చేస్తున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆలోచనలు అంతకన్నా వేగంగా పరుగులు దిస్తున్నాయి.
లెక్చరర్ నీలిమా మనిషికాదు అన్న విషయం బహుశా ఎవరికీ తెలిసి వుండదు. కళ్ళారా చూశాడు కాబట్టి తనకు అనుమానం కలిగింది. మనిషి రూపంలో వున్న దెయ్యం నలుగురి మధ్యనా తిరుగుతుంటే ముందు ముందు ఏ మ్రామాదాలు జరుగుతాయో వూహించడం కష్టం. నీలిమా నిజ రూపం ఎలాంటిదో తెలియక తాము ఒక మనిషిలా భావించి ట్రీట్ మెంట్ యిస్తున్నామే తప్పు, అందువల్ల ప్రయోజనం లేదని ఇప్పుడు తెలుస్తోంది.
అందుకే తనకు తెలిసిన నత్యన్నీ నలుగురికి చెప్పాలని బయలు దేరాడాయన.
దూరంగా ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారు వేగాన్ని తగ్గించాడు.
ముందున్న వెహికల్స్ ఆగిపోవడంతో బ్రేకు వేశడతను.
కానీ....ఆ కారాగలేదు నరికదా ముందుకు వెళుతూనే వున్నది. బంగారుగా బ్రేకులు నొక్కి చూశాడతను.
ఉహు....అదే వేగంతో కారు వేశుతూనే వున్నది.
అసలు విషయం అతనికప్పుడు బోధపడింది.
బ్రేక్స్ ఫెయిల్!
కొన్ని నిమిషాలక్రితం బ్రేక్ వేసినప్పుడు కూడా నిక్షేపంగా వున్నాయి. ఇంతలోనే ఎలా పెయిలయ్యాయి.
అయోమయం, ఖంగారులకు తోడు భయం ఒక్కసారిగా అతన్ని నిలువెల్లా ఆవరించాయి.
కొన్ని అడుగుల దూరం మాత్రమే వుంది ముందున్న టాక్సికి, తన కారుకు మధ్యనున్న ఖాళి....సమయంలో బ్రేక్స్ పడకపోవడమంటూ జరిగితే ఏమవుతుందో అర్ధం కావడంతో అతని శరీరం చేమట్లతో తడిసిపోతోంది.
అప్పడే యధాలాపంగా అతని దృష్టిపదంలో పడింది రాబందు.
ఒక బిల్డింగ్ ప్తె అంతస్దు ప్తె నుంచి కొరకొరా....తనవ్తెపే చూస్తున్న ఆ రాబందుని గమనించగానే బ్రేక్స్ ఎందుకు పెయిలయివుంటాయో తెలిసి వచ్చింది.
ఎస్...నీలిమా దెయ్యం పనే ఇది!
ఆమె నిజరూపాన్ని గురించి తెలిసిన తన నోరు నోక్కేయడానికి చేసిన ప్రయత్నం ఇది.
అతనలా అనుకుంటుండగానే అతని కారు వెళ్ళి ముందున్న తాక్సిని గుద్దుకుంది. ఆ అదటుకు ఖంగారుగా బ్రేక్ వేశాడు ముందున్న టాక్సివాలా.
ముందుకు వెళ్ళే మార్గం లేకపోవడంతో ఆ స్పీడ్ కు ముందున్న రెండు చక్రాలు ప్రక్కకు తిరిగి, ఆ దిశగా ట్రాఫిక్ కానీస్టేబుల్ నిలుచున్నా ట్రాఫిక్ ఐలాండ్ వ్తెపు దూసుకుపోయింది సూపరింటెండెంట్ కారు.
ప్రాణాలమీద భయంతో కారు తలుపులు తెరుచుకుని బయటకు దూకేద్దామని అతను చేసే ప్రయత్నాలేమీ ఫలించలేదు.
ఎవరో తాళాలు వేసి బంధింఛినట్టు కారు తలుపులు బిగుసుకుపోయివున్నాయి.
అది కూడా నీలిమ దయ్యం పనే అని భావించాడతను.
భూతంలా దూసుకొస్తున్న ఆ కారుని గమనించి పిచ్చిగా అరుస్తూ దూరంగా ఎగిరిదూకి ప్రాణాలను రక్షించుకున్నాడు ఆ ట్రాఫిక్ కానీ స్టేబుల్.
అప్పడే ఎదురుగా వచ్చే ట్రాఫిక్ రిలీజ్ కావడంతో గట్టుతెగిన ప్రవాహంలా ఒక్క సారిగా అటువ్తెపు వాహనాలు ముందుకు కదిలాయి.
సూపరింటెండెంట్ డాక్టర్ కారు సూటిగాపోయి ఆ ట్రాఫిక్ లోకి జొరబడింది.
తోడేళ్ళ మధ్య జొరబడ్డ సింహంలా దూసుకుపోయిన ఆ కారు వెళ్ళడం వెళ్ళడం ఒక హేవిలోడ్ లారి మధ్యకు వెళ్ళి డికొంది.
అంతటిలో దాని ఇంజన్ పని అయిపోయింది కాబోలు గాలి తీసిన బెలూన్ లా తుఫ్....తుఫ్ మనే చిన్న శబ్దాలు చేస్తూ తుక్కుతుక్క్తే ఆగిపోయింది.
అప్పటికే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోయింది.
స్పృహ తప్పి రక్తపుముద్దలా పడివున్న ఆ డాక్టర్ ను అతికష్టం మీద బయటకుతిసి, ఇంకా అతనిలో ప్రాణాలు వున్నాయని గ్రహించి హాస్పిటల్ కు తరలించారు.


