Home » Yamini saraswathi novels » కాలనాగు

    చప్పున పంచపాత్రలోని నీళ్ళు తీసుకుని ఉచ్చాటన మంత్రం పఠిస్తూ దాని ముఖంపై చల్లారు.

    ఆ సర్పం అదృశ్యమైంది.

    నా పుణ్యం మంచిది. నన్ను కన్నతల్లి కడుపు చల్లనైంది. అందుకే సమయానికి భావ శైదిల్యం కలిగింది. కళ్ళు తెరచి ప్రాణం కాపాడుతున్నాను. ఇంకో క్షణం గడిస్తే కాటుకి గురి అయ్యేవాడిని...

    ఏమయ్యాదో !  ఏం జరిగిందో...

    ఏది ఏమైనా దేవత దయ ఇంకా వుంది.

    జప ఫలితం వ్యయమవుతున్నా దేవతా ప్రసన్నత మిగిలే వుంది.

    శాస్రీగారు తృప్తిగా నిశ్వసించారు.

    ఫరావలేదనుకుని యిక ఆ పూటకి జపం చాలించి లేచారు.

   
                                                                             35


    పకపక నవ్వుతోంది 'కాలనాగు'

    విరగబడి నాట్యం చేస్తోన్నట్టుగా నవ్వుతోంది.

    సిగ్గుతో, అవమానంతో చితికి పోతున్నట్టుగా  వుంది ఉలూచికి, పోటీగా నిల్చుంది తను. తనే 'కాలనాగు' నని భయపెట్టింది. అల నటించి అటు అడిత్యని యిటు శ్రీధరశాస్రిని హడాలగొట్టింది.

    కానీ యిపుడేమయింది?

    'కోర విరిగింది'

    'కాలనాగు' మాటలకి పాడగా దించుకుంది ఉలూచి.

    అవును!

    తను శ్రీధరశాస్రిని ఏమరుపాటున ఉన్నప్పుడు కాటేయ్యబోయింది అతన్ని తన విషయంతో జేవన్ మృతుడిని చేయాలనుకున్నది.

    ఆ శాస్రీ కదా తన పన్నాగాన్ని భగ్నం చేస్తున్నది. అతనే కదా ఆదిత్య తనకి కాకుండా చేసింది. అతని రక్షణ చూసుకుని కదా ఆ ఆదిత్య అంత గర్వంగా ప్రవర్తించింది.

    మద్యలో యీ 'కలనగు'!

    "ఊఁ ఇకనైనా  బుద్దిగా వుండు. శాస్రిగారివంటి వారి జోలికేడితే అవమానం తప్పదు. ఇప్పుడు కోరవిరిగింది. రేపు పడగ చితికిపోతుంది" హెచ్చరికగా అంది 'కాలనగు'

    మరోమారు కోర తడుముకుంది ఉలూచి.

    తను కాటు వేయబోయే సమయానికి అతను కళ్ళు తెరిచాడు. మంత్రజలాన్ని తన ముఖాన చాలలేదు. ప్రాణం పోయినట్లయింది. కానీ పోలేదు. అయితేనేం విషం చిలికే ఒక కోర విరిగిపోయింది.

    తనుప్పుడు పూర్ణనాగు కాదు....

    శత్రువులకి యీ విషయం తెలిస్తే ఎంత లోకువ!

    మనుషులకి తెలిస్తే తనకి భయపడతారా! ఊరకే బుసకోట్టాలి. బెదిరించాలి! ఛీ! ఛీ! ఎందుకి నాగజన్మ!

    "ఉలూచీ!" కాలనాగు నవ్వుతూ పిలిచింది_

    కానీ  ఆ నువ్వు తన వైపు విషం  చిలికినట్టుగా అనుకుంది ఉలూచి అందుకే ఉలకలేదు, పలకలేదు.

    "నువ్వు నీ  ప్రవర్తన మార్చుకో బిడ్డిగా మేసలుకో_హాయిగా నాగావళీ నదీతీరంలో గాలి భోంచేయ్. నాగావళీ కొండల్లో తపస్సు చెయ్ బనీ మనస్సులోని ఆ దుర్బుద్దులన్నీ తుడిచి పెట్టుక పోతాయి_

    "నీ సలహకి  కృతఙ్ఞతలు" బుస బుసమన్నది ఉలూచి

    'తొలినుంచీ నీ కిదే తొందర అందుకే నీకు కోర భంగమవుతుంది!" హేళనగా అంది కాలనాగు

    "నా యిష్టం!" బింకరంగా అంది ఉలూచి

    "నీ  యిష్టం! ఎంత మొండిగా అంటున్నావే! నీ యిష్టం ప్రకారం ప్రవర్తించి నాగాజతికే తీరని తలవంపులు తెచ్చావు" మందలింపుగా మది కాలనాగు. కాలనాగులో జాలి మొలకెత్తింది."ఉలూచీ! నా మాట విను. ఈ దుడుకుమోత్తనం. దూర్మర్గపు ఊహలు మానేయ్. మంచిగా మసులుకో_

    "నీ హితోక్తులు నా అక్కర్లేదు" తిరస్కారంగా అంది ఉలూచి. పొట్టపై జరజర నాలుగడుగులు పాకింది.

    "ఉలూచీ! ఎక్కడికే?"

    "నీ కెందుకు?" ఉక్రోషంగా అడిగింది.

    అచ్చం ఒక మనవ మాత్రురాలుగా ప్రవర్తిస్తున్నావు. ఛీ! నాగాజాతికే అవమానం తెస్తున్నావు!"

    "ఏం చేశానేమిటి?"

    "తెలీనట్టు!ఉలూచే! మనం దివ్యులం! మానవులు మనకంటే తక్కువ జాతి వాళ్ళు. వాళ్ళ పూజలందుకోవాలి మనం అలాటిది మనమే వాళ్ళముందు ప్రణయ బిక్షకి దేహి అనకూడదు!"

    కలనగు బోధలు ఉలూచీ చెవికేక్కలేదు.

    బుసబుసలాడుతూ, పొట్టపై సర్రున ప్రాకుతూ వెళ్ళిపోయింది.
 
    ఉలూచీపై జాలితో కాలనాగు అటే చూస్తుండి పోయింది!
   
   
                                                                           36


    నాగరాజు మనస్సు గలి పొరలపై, నీల జలదాలపై, పూల కెరటాలపై సయ్యటలాడుతూ తుళ్ళింతలతో తేలి ఆడుతున్నది.

       అతనికి సంధ్య తనతో అంతగా మనసిచ్చి మాతాడటం, మచ్చికగా మాటాడటం, చిరునవ్వుతో మాటాడటం ఆమె మనస్సు తను జయించినట్లుగా, ఆమె తనకి మనస్సు అర్పించినట్లుగా అనిపించసాగింది.
ఆ భావన రాగానే ప్రవహించినట్లుగా అనిపించసాగింది.

    అతడు వైద్యనాథన్ యింటి నుంచి నేరుగా విశ్వేశ్వరంగారి యింటివైపు కదిలేడు.

    దారిలో ఎదురైనా ప్రతివ్యక్తి తనని అభినందిన పూర్వకంగా చూస్తున్నట్టేఅనిపించసాగింది. తను సంధ్య మనస్సుని జయించాడని అప్పుడే యీ జనానికి ఎలా తెల్సింది? అనుకున్నాడు.

    అతను విశ్వేశ్వరంగారి యిల్లు చేరుకునే సరికి బాగా చేకటిపడింది రోడ్డుమీది నుంచి వాళ్ళింటి కౌంపౌండ్ గేటుదాటి లోపల ప్రవేశించాడు నాగరాజు, రివ్వున వీస్తోన్న గలి సుళ్ళు తిరుగుతూ చెట్ల సందుల్లో కొమ్మల మద్యలో. ఆకుల సందుల్లో దూరి అదో విధమైన శబ్దాన్ని సృష్టిస్తోంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra