Home » Jonnalagadda rama lakshmi » Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1


                              తగిన వరుడు
                                                               జొన్నలగడ్డ రామలక్ష్మీ

                             

    "ప్రతిక్షణం ఎంతో విలువైనది. మాటలతో వృధా చేసుకుంటే నీకే నష్టం!" అంది గీత.
    "గీతా! నేను మాటలకోసమే ఇక్కడకు వచ్చాను. " అన్నాడు రాంకుమార్ గంభీరంగా.
    "అంటే?" అంది గీత ఆశ్చర్యంగా.
    "నీకు నేనిచ్చే వందరూపాయలకూ నీ నుంచి నే నాశించే ప్రతిఫలం వేరేవుంది-" అన్నాడతడు.
    "ఏమిటది?"
    "నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమెపేరు జ్యోతి. ఆమె కూడా నన్ను ప్రేమించింది. ఇద్దరం పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాం....."
    గీత అసూయగా అతడివంకచూసి-"అయితే?" అంది.
    "నేను పెద్ద కంపెనీలో మేనేజర్ని నా కింద నలుగురు స్టెనోలుంటారు. నలుగురూ ఆడవాళ్లే ఫేషనబుల్ గా ఉంటారు. వాళ్ళతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూండాలి పెళ్ళయ్యాక నా భార్య ఇది ఎంతవరకూ సహిస్తుందని నా అనుమానం!" ఆగాడతడు.
    "అయితే?"
    "నువ్వు యధాలాపంగా ఆమె - అంటే జ్యితిని కలుసుకో మనిద్దరికీ ఏదో సంబంధమున్న భ్రాంతిని కలిగించు. ఆ తర్వాత ఆమె ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో నేను గమనిస్తాను...." అన్నాడు రాంకుమార్.
    "ఇదేం సరదానీకు?"
    "నా సరదా నీకు వందరూపాయలిస్తోంది"-అన్నాడతడు.
    "అవును అదీ శ్రమలేకుండా?" అని ఆమె ఓసారి వళ్ళు విరుచుకుని "ఒంటరిగా హోటల్ గదిలో డబ్బిచ్చి కొనుక్కున్న ఆడదాన్ని ఏ మాత్రమూ వాంచించకుండా-తను కోరిన మరో ఆడదాని శీలం గురించి పరీక్షించమని నియమించే నీవంటి భర్త లభించడం ఆ జ్యోతికి న్యాయమో, అన్యాయమో అర్ధంకావడంలేదు. నీవంటివాడికి నలుగురుకాదు. నలభైమంది ఆడ స్టెనోలున్నా ఇబ్బంది లేదు-" అందామె.
    "ఇది నాకు కాంప్లిమెంటే అవుతుంది. అనుకున్న ఫలితం సాధిస్తే నీకు మరో వందరూపాయలిస్తాను-" అన్నాడు రాంకుమార్.
    "ఇట్సాల్రైట్-శ్రమలేకుండా మరో వంద సంపాదించుకుంటాను నువ్వు సాధించదల్చుకున్న ఫలితం మాత్రం నాకర్ధంకావడంలేదు-" అంది గీత.
    "దీన్నే అట్నించి నరుక్కురావడమంటారు-" అని నవ్వాడు రాంకుమార్.
    రాంకుమార్ జ్యోతిని అందంచూసి ప్రేమించాడు. ప్రేమించి ఏడాది దాటింది. అతడెంత ప్రయత్నించినా జ్యోతి వారిమధ్య కొంత మినిమమ్ డిస్టన్స్ మెయింటైన్ చేసింది ఆమె నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే మనిషి అని అతడు గ్రహించాడు.
    రాంకుమార్ గతజీవితం అంత మంచిదికాదు. అతడు చేసిన కొన్ని తప్పులు బయటపడితే జ్యోతి సహించక పోవచ్చు. అప్పుడు దాంపత్య జీవితం నరకం కావచ్చు. అందుకని పెళ్ళికిముందే ఆమె తన తప్పులకెలా రియాక్టవుతుందో చూడాలి. సూటిగావచ్చి తననడుగుతుందా లేక మనసులో పెట్టుకుని తనకు దూరంగా ఉంటుందా? లేక తనకీ అదృష్టమే చాలనుకుని సరిపెట్టుకుంటుందా?
    ఆమె తనకు దూరమై మరిచిపోవాలని ప్రయత్నిస్తే? తను దగ్గర కావాలనుకున్నా రానివ్వకపోతే?
    ఫరవాలేదు. తనకు ఆల్టర్నేటివ్ ఉంది. ఆల్టర్నేటివ్ పేరు చందన. చందనకు అందమేకాదు. ఆస్తికూడావుంది. అమెవన్నీ ఆధునికభావాలు. ఈ ఆధునిక యుగంలో ఆమె వంటి యువతితోడుగా ఉంటే తనకు అదృష్టమే!
    జ్యోతిని వదుల్చుకుందుకు తా నీ పథకం వేశాడా? లేక నిజంగా జ్యోతిని పరీక్షించాలనుకుంటున్నాడా?
    ఆ విషయం రాంకుమార్ కే తెలియదు. లేక తెలియదని తన్ను తాను మోసగించుకుంటున్నాడో!
    ఈ పథకం మాత్రం అతడికి చందనను చూశాకా, ఆమె ఆస్తిగురించి తెలిశాకా, ఆమెకూడా తనంటే యిష్టపడుతున్నదని గ్రహించాకా-తట్టింది.
    "ఎట్నించైనా కానీ-ఈ నరకడాలు నాకు నచ్చవు. ఏది ఏమైనా నరుకుతున్నది నేను కాదుగదా-అదే నాకు తృప్తి!" అంది గీత.

                                        2

    పోస్టాఫీసులో నిలబడి ఎదురింటి వైపే చూస్తోంది గీత.
    అదే జ్యోతి యిల్లు.
    ఆ యింటికి వెళ్ళి ఆమెనెలా పలకరించాలీ ఆమెతో ఏం మాట్లాడాలీ అని ఆలోచిస్తోంది గీత. ఒక పథకం ఆమె బుర్రలో రూపు దిద్దుకుంటోంది.
    గీత ఆలోచిస్తూండగానే తలుపులు తీసుకుని ఆ ఇంట్లోంచి ఓ యువతి బయటకు వచ్చింది. ఆకాశం రంగు చీర, అదేరంగు బ్లవుజూ-విరబోసుకున్నజుట్టు-ఆమె ఆకాశగంగాలా వుంది.
    "జ్యోతి బాగుంది!" అనుకుంది గీత.
    ఆ యువతి రోడ్డుమీదకు వచ్చింది. ఆమె నడకలో వయ్యారాలున్నాయి.
    "రాంకుమార్ ది మంచి చాయిస్-" అనుకుంది గీత.    ఆమె యిక ఆలస్యం చేయలేదు త్వరగా వెళ్ళి ఆమెను కలుసుకుని-"హలో!" అని పలకరించింది.
    "హాయ్"-అందామె.
    "తీయనిగొంతు" - అనుకుంది గీత-"మీతో అర్జంటుగా మాట్లాడాలి-" అంది జ్యోతితో.
    "నాతోనా-మీరెవరో నాకు తెలియదు....." అంది జ్యోతి.
    "నాకూ మీ గురించి పూర్తిగా తెలియదు. అయినా మాట్లాడే విషయానికి పరిచయం అవసరం లేదు...." అంది గీత.
    "ఏమిటి మీరు మాట్లాడేది?"
    "ఇక్కడ బాగుండదు. దగ్గర్లో పార్కుంది. అక్కడకు వెడదాం" అంది గీత. జ్యోతి అయిష్టంగానే ఆమె ననుసరించింది.
    ఇద్దరూ రెండు సందులు తిరిగి ఓ పార్కులకి వెళ్ళారు. అక్కడ స్థిమితంగా కూర్చున్నాక-"ఇది పురుషప్రపంచంగా ఉంటోంది. తలచుకుంటే మగాన్నో ఆట ఆడించగల స్త్రీ మగాడి చేతిలో కీలుబొమ్మగా ఉంటోంది-" అంది గీత.
    "అయితే?" అంది జ్యోతి.
    "ప్రచారంలో ఆడది సినిమాల్లో ఆడది సౌఖ్యానికి ఆడది ఎక్కడచూసినా ఆడదానికి ఆటబొమ్మకు మించిన విలువలేదు. ఇది అన్యాయం ఈ అన్యాయాన్ని ఆడది ప్రతిఘటించాలి. పురుషుడికి తగిన విధంగా బుద్ధిచెప్పాలి." అంది గీత.
    "మీరు ఉమెన్స్ లిబ్ ప్రతినిధులా?" అంది జ్యోతి.
    "అవును నాకు మీ వంటి యువతులు సహకరించాలి."
    "ఏ విధంగా?"
    "నువ్వూ నా దారిలోనే నడుస్తున్నావని తెలిసే-మనం చేతులు కలిపి మరికొందరు యువతులను మనకులా తయారుచేయాలని కోరికపుట్టి నిన్ను పిలిచాను."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra