Home » Mainanpati bhaskar » Claimax

అతని పిలుపు విని సంభ్రమంగా చూసింది వరలక్ష్మి. కొద్ది క్షణాలసేపు అపనమ్మకంగా అతనివైపు చూసి, "హరీన్!" అని పెద్దగా కేకపెట్టి అతన్ని కావలించుకుంది.
"అమ్మా!"  అన్నాడు హరీన్.
"నన్నొదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాయనా! ఎందుకుబాబూ , నీకు అంత నిర్దయ!" అంటోంది వరలక్ష్మి.
తల్లీకొడుకులు అలా ఉండగానే బాత్ రూంలోంచి బయటకు వచ్చింది కరుణ.
రుద్దమైన కంఠంతో కరుణని తన తల్లికి పరిచయం చేశాడు హరీన్.
ఆప్యాయంగా ఆమెని పలకరించింది వరలక్ష్మి.
ఆర్ద్రంగా వున్న ఆ దృశ్యం చూస్తే, చనిపోయిన తన తల్లి గుర్తుకు వచ్చింది కరుణకి.
తన తండ్రి గుర్తు వచ్చాడు.
తను కోల్పోయిన ఆప్యాయత, అనురాగం, అభిమానం, ఆస్తిపాస్తులు - అన్నీ గుర్తువచ్చాయి.
వాటన్నిటికీ కారణభూతమైన ఆ అజ్ఞాతశత్రువు గుర్తువచ్చాడు.
పట్టుదలతో కరుణ పెదిమలు బిగుసుకుపోయాయి. ఆ అజ్ఞాత శత్రువు ఆచూకీ కనిపెట్టి తీరుతుంది తను! కనిపెట్టాలి.
అతని జాడ తెలిశాక అతన్నీ అతని కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది తను.
భూలోకంలోనే నరకం చవిచూపిస్తుంది వాళ్ళకి.
ఆ ప్రయత్నంలో తన జీవితం బుగ్గిఅయిపోయినా సరే - సాధించి తీరుతుంది తను.
అది తప్పదు.
                                                              30

తన తండ్రికి ఏ హాని జరగకూడదని హరీన్ డాక్టర్ ని అలా హెచ్చరిస్తూ ఉండగానే , అక్కడికి వచ్చింది మధుమతి. ఆమె చేతిలో ఒక మేగజైన్ ఉంది. సన్సేషనల్ రాసే ధనుంజయ్ ఆర్టికల్ ఉంది దానిలో. జర్నలిస్టుల్లో ఎక్కువ శాతం మంది తమ వృత్తి మీద ఎంతో భక్తీ శ్రద్దలు ఉంటాయి. సత్యాన్ని దాచరు వాళ్ళు. అసత్యానికి ప్రాచుర్యం ఇవ్వరు.
కానీ ధనుంజయ్ అలాంటివాడు కాడు. తులసివనంలో గంజాయి మొక్కలాంటి వాడు అతను. అతనికి సెన్సేషన్ ముఖ్యం. ఆ తర్వాతే మిగతావన్నీ, ఒకవేళ సేన్శేషనల్ వార్తలేమీ లేకపోతే , తనే ఏవేవో సృష్టించి రాయగల మహిమ ఉంది అతనికి.
ధనుంజయ్ ఆ సంచికతో రాసిన ఆర్టికల్ కి టైటిల్.
"హరీ అన్నాడనుకున్న హరీన్ తిరిగి రాక"
"ముక్కూ మొహం తెలియని అమ్మాయితో లోయలో లుకలుక!"
అది చదవగానే హరీన్ పెదిమలు కోపంతో బిగుసుకుపోయాయి. ఆ కోపం, ధనుంజయ్ తన మీద రాసినందుకు కాదు - అన్నెం పున్నెం ఎరుగని కరుణ మీద బురదజల్లినందుకు.
విసురుగా మేగజైను ని పక్కన పడెయ్యబోతుంటే అతనికి మరో వార్త కనబడింది.
ప్రముఖ సినీ నిర్మాత జీవరాజ్ వచ్చేనెలలో మొదలెట్టబోతున్న కొత్త చిత్రం గురించిన వార్త అది.
అది చదివిన హరీన్ నిశ్చలంగా కూర్చుని కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి, "కరుణా.........పద, పోదాం" అన్నాడు.
"మీకు ఆరోగ్యం ఇంకా కుదుటపడలే....." అని అభ్యంతర పెట్టబోయింది కరుణ.
ఆమె మాటలు చెవిన పెట్టకుండా, తల్లివైపు తిరిగాడు హరీన్.
"అమ్మా! ఇంకోక్కసారి , చివరిసారి అడుగుతున్నాను - నాతొ వచ్చేయ్యమ్మా!" అన్నాడు ఆర్తిగా.
జవాబు చెప్పకుండా గుడ్లెంబడి నీళ్ళు కుక్కుకుంటూ ఉండిపోయింది వరలక్ష్మి.
నిట్టూర్చాడు హరీన్. మగతలో ఉన్న తండ్రి వైపు ఒక్కసారి చూసి, బయటికి నడిచాడు.
కరుణనీ, హరీన్ నీ ఇంటిదగ్గర తన కారులో డ్రాప్ చేసి, స్టూడియో కి వెళ్ళిపోయింది మధుమతి.
గెరేజ్ లో నుంచి తన సొంతకారు బయటికి తీశాడు హరీన్. "ఇప్పుడే వస్తాను" అని కరుణతో చెప్పి, తను కూడా స్టూడియోకి వెళ్ళాడు హరీన్. ప్రొడ్యూసర్ జీవరాజ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని, ఆ సెట్ లోకి నడిచాడు.
కాని, అతను వెళ్ళేసరికే జీవరాజ్ ఇంటికి వెళ్ళిపోయాడని తేలింది.
మళ్ళీ మధుమతి చిత్రం షూటింగు జరుగుతున్న చోటికి వచ్చాడు హరీన్. దాన్లో హీరో కిశోర్.
అతనికి గుర్తొచ్చింది.
నిజానికి ఇది తను నటించవలసిన చిత్రం. కానీ ఇందులో కిశోర్ నటిస్తున్నాడు - తన స్థానంలో.
అయినా బాధపడలేదు హరీన్. తను కాకపోతే కిశోర్! ఎవరైతేనేం , పిక్చరు బాగా రావాలి! నిర్మాత బాగుపడాలి! అందరూ బాగుండాలి!
అదీ తన పాలసీ!
షాట్ మధ్య గ్యాప్ లో , మేకప్ అసిస్టెంటు అద్దం చూపిస్తుంటే విగ్గు సరిచేసుకుంటున్న కిశోర్ కి అద్దంలో హరీన్ కనబడ్డాడు. వెంటనే కిశోర్ మోహంలో రంగులు మారాయి. హరీన్ ని గమనించనట్టే మొహం పక్కకి తిప్పుకుని తన కోసం ప్రత్యేకించబడిన ఫోల్దింగ్ చెయిర్ లో కూర్చున్నాడు. దానిపైన వేసిన తెల్లటి గుడ్డ కవర్ మీద "కిశోర్" అని ఎంబ్రాయిడరీ చేసి ఉంది. పక్కన మరో రెండు చెయిర్స్ ఉన్నాయి. వాటిలో పెద్ద ప్రోడ్యుసర్స్ ఇద్దరూ కూర్చుని ఉన్నారు. కిశోర్ కుర్చీలో కూర్చుని త్రిబుల్ ఫైవ్ సిగరెట్ అంటించగానే, గొంతులో ఎంతో నమ్రత పలికిస్తూ, తన నెక్స్ ట్ పిక్చర్స్ కి డేట్స్ కోసం అడగడం మొదలెట్టారు వాళ్ళు.
వాళ్ళు కూడా హరీన్ ని గమనించాడు.
కానీ కిశోర్ హరీన్ గమనించనట్లు ప్రవర్తించడం కూడా గమనించారు వాళ్ళు. హీరో గారి మనోభావాలను అర్ధం చేసుకుని, దానిప్రకారం నడుచుకాకపోతే పనులు జరగవు ఈ ఇండస్ట్రిలో.
అక్కడే ఉన్న మధుమతి మాత్రం అది చూసి బాధపడి, హరీన్ దగ్గరికి వచ్చింది. "కూర్చో హరీన్!" అని తన కుర్చీ చూపించి, ప్రొడక్షన్ కుర్రాడితో "జ్యూస్ తీసుకురా!" అంది.
ఆమె గొంతు విన్నాక, ఇంక ఇటు చూడక తప్పలేదు కిశోర్ కి. హరీన్ ని అప్పుడే చూసినట్లు నటిస్తూ స్టయిల్ గా కళ్ళెగరేసి, "ఎప్పుడూ వచ్చారు..........ఈ సీన్ అయ్యాక మాట్లాడదాం!" అన్నాడు.
జ్యూస్ కోసం వెళ్ళిన కుర్రాడు దూరం నుంచే ఇదంతా చూసి, తిరిగి రాకుండా వేరే ఇంకేదో పన్లో జొరబడిపోయాడు.
హరీన్ కీ, మధుమతికీ కూడా పరిస్థితి అర్ధం అయింది. కోపంగా ఏదో అనబోయింది మధుమతి.
ఆమె గనక మాటతూలితే ఆమెకు ఇండస్ట్రిలో స్థానం లేకుండా చెయ్యగలరని తెలుసు హరీన్ కి.
అందుకని ఒకే ఒక్క ముక్క అన్నాడు అతను -
"మధుమతీ.......నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా, నా మాట మీద నీకు ఏ మాత్రం గురి ఉన్నా నోరు జారకు నీ పరిస్థితిని పాడుచేసుకోకు!"
కిశోర్ ని ఏదో అనబోతున్న మధుమతి హరీన్ మొహంలోకి చూసి, ఆగి వణుకుతున్న పెదిమలని కంట్రోలులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ నిలబడిపోయింది.
"వస్తాను మధుమతీ!" అన్నాడు హరీన్.
"ఎక్కడికి వెళుతున్నావు హరీన్?"
"జీవరాజ్ దగ్గరికి"
కొద్దిక్షణాలు ఆగి, "బెస్టాఫ్ లక్ హరీన్!" అంది మధుమతి.
కారులో జీవరాజ్ ఇంటికి వెళ్ళాడు హరీన్.
చాలా పెద్ద భవంతి జీవరాజ్ ది. హరీన్ కారు గేట్లో ప్రవేశించే సమయానికి అతను తన ఇంటి రెండో అంతస్తు దగ్గర నిలబడి కాఫీ తాగుతున్నాడు.
హరీన్ రాకని గమనించగానే గాభరాపడ్డాడు జీవరాజ్. తన తదుపరి చిత్రంలో హరీన్ ని బుక్ చేస్తానని ఇదివరకు చెప్పాడు తను.
అందుకని ఇప్పుడు పీకమీద కుర్చుంటాడా హరీన్?
కంగారుగా తన నౌకరుని పిలిచి చెప్పాడు జీవరాజ్.
"నేను ఇంట్లో లేనని చెప్పు హరీన్ తో!"
నౌఖరు తల ఉపి, బయటికి వచ్చి, నిర్లక్ష్యంగా హరీన్ వైపు చూస్తూ "అయ్యగారు లేరు" అన్నాడు పెడసరంగా.
"జీవరాజ్ గారు మేడమీద ఉన్నారు. నేను చూశాను. ఆయన్ని తక్షణం కలుసుకోవాలి నేను" అని, నౌఖరు అభ్యంతరం పెట్టేలోగా, లోపలికి నడిచాడు హరీన్.
అది చూసి, వెనకదారి నుంచి గబగబ వెనక్కి వెళ్ళిపోయాడు జీవరాజ్. కారెక్కి స్టార్ట్ చేశాడు. కారు వేగంగా గేట్లోనుంచి బయటికి దూసుకుపోయింది.
అతనికి ఒకటే భయం! ఇప్పుడు హరీన్ ని కలుసుకుంటే చిక్కొచ్చిపడుతుంది. అతని మొహమాటానికి గనక తను లొంగి ప్లాప్ హీరోతో, ప్లాప్ పిక్చరు తీసి, ప్లాప్ ప్రొడ్యూసర్ గా మారవలసి వస్తుంది తను.
జీవరాజ్ కారు గేట్లో నుంచి బయటికి వెళ్ళడం చూసి, తను కూడా కారెక్కి ముందుకు నడిచాడు హరీన్.
ఎలాగైనా జీవరాజ్ ని కలుసుకోవాలి తను - తక్షణం!
రెండు కార్లూ రేసులోలా పరిగెత్తాయి.
చివరికి జీవరాజ్ కారుని మెరీనా బీచ్ దగ్గర ఓవర్ టేక్ చేయ్యగాలిగాడు హరీన్.
తప్పనిసరై తన కారుని అప్పాడు జీవరాజ్. కిందకు దిగి, వెర్రినవ్వు నవ్వాడు జీవరాజ్ "నా పిక్చర్లో ఇప్పటికే కిశోర్ ని హీరోగా ........." అని అనబోతుంటే, అడ్డుపడ్డాడు హరీన్.
"మిస్టర్ జీవరాజ్! మీ పిక్చర్లో ఛాన్సు ఇప్పించమని బతిమాలి భంగపడటానికి రాలేదు నేను. అలాంటి పనులు ఇండస్ట్రికి వచ్చిన కొత్తలో కూడా నేను చెయ్యలేదు. నేను వచ్చిన కారణం వేరే ఉంది."
ఏమిటది?"
"ఇది!" అని జేబులోనుంచి ఒక నోట్ల కట్ట బయటకు తీశాడు హరీన్.
"ఏమిటది?" అన్నాడు జీవరాజ్ మళ్ళీ ఆశ్చర్యంగా.
"మిస్టర్ జీవరాజ్ - నేను మంచి స్వింగులో ఉన్నప్పుడు మీరు నా వెంటపడి , బతిమాలి ఇచ్చిన అడ్వాన్సు ఇది! ఇప్పుడు మీరు మరో హీరోని బుక్ చేసుకున్నారు కాబట్టి, మీ అడ్వాన్సు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. కాదనకుండా తీసుకోండి!"
నోరెళ్ళబెట్టి హరీన్ వైపే చూస్తూ ఉండిపోయాడు జీవరాజ్. చాలా సేపటి తర్వాత తేరుకుని, వంటనే హరీన్ చేతులు పట్టేసుకున్నాడు. "తప్పుగా అనుకోకండి హరీన్! పరిస్థితుల ప్రాబల్యం వల్ల......."
నిర్వేదంగా నవ్వి, "నేను అంతా అర్ధం చేసుకోగలను" అన్నాడు హరీన్.
"హరీన్........" అని ఇంక ఏదో చెప్పబోయాడు జీవరాజ్.
అతన్ని ఇంకేం మాట్లాడనివ్వకుండా , అతని చేతిలో నోట్ల కట్ట పెట్టేసి కారెక్కాడు హరీన్.
ఇంటికి తిరిగి రాగానే, అతని కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్న కరుణతో అన్నాడు.
"నన్ను క్షమించు కరుణా!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra