Home » Vasundhara » Vasundhara Kadhalu - 6

 

                       హత్యల నోటుబుక్కు!

                                                                       వసుంధర
    
    రంగారావు నెవరో చంపేశారట చూద్దాం వస్తావా ?" అన్నాడు పుండరీ.
    "నేను రాను. శవాన్ని చూడలేను నేను--"అన్నాడు వాసు.    
    పుండరీ వాసును నొక్కించలేదు. వాసు సంగతి పుండరీకి చిన్నప్పట్నించి తెలుసు.
    వాసుది మెత్తటి మనసు. ఎవరికే కష్టం కలిగినా చూడలేదు. జబ్బుల గురించీ, గాయాల గురించి , అయితే వినను కూడా వినలేడు. అటువంటి చర్చలు వచ్చినప్పుడతనికి కళ్ళు తిరుగుతాయి. అవతలి వాళ్ళను  అపివేయనునైనా కోరతాడు. లేదా తనే అక్కణ్ణించి లేచి వెళ్ళిపోతాడు.
    వాసుతో కాస్త పరిచయమున్న ప్రతి ఒక్కరూ అతడు మంచివాడనీ, అతి మంచివాడనీ అంటారు.
    వాసుకున్న మనస్తత్వం వల్ల అతడికి చాలా నస్జ్తాలున్నాయి. ఒక పర్యాయం అతడి చేయి తెగితే అరక్తం చూసి మూర్చపోయాడు. ఎవరో డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాల్సి వచ్చింది. తీరా చూస్తె అదంత ప్రమాదకరమైన దెబ్బకాదు.
    అంతేకాదు ఇంట్లోకి తేలు, పాము లాంటి వేమైనా వస్తే అతడు వాటిని కొట్టలేడు. తను కొడితే అవి గిలగిలా తన్నుకుని ఎలా బాధపదతాయో ఊహించుకుని అతను ముందే వనికిపోతాడు. ఆఖరి కతను ఈగ, దోమ , చీమ పెను లాంటి వాటిని కూడా చంపలేడు. ఎటొచ్చీ అందువల్ల ఎవరికీ నష్టం లేదు.
    ఇటువంటి వాసు హత్య చేయబడ్డ మనుషుల నెలా చూడగలడు? ఆసలు హత్యేలా జరిగిందీ ఎవరైనా వివరించి చెబుతుంటేనే అతను వినలేడు!
    రంగారావు హత్య ఊళ్ళో పెద్ద సంచలనం కలిగించింది. కారణం -- రంగారావు పరమ దుర్మార్గుడు! అతన్ని చంపాలని చాలామంది అనుకున్నారు. చాలామందికి దమ్ముల్లేక పోయాయి. దమ్ములున్న వాళ్ళలో కొందరు పులుసులోకి దమ్ము ల్లేకుండా చితగోట్టబడ్డారు. మిగతా వాళ్ళు జైలుకి పోయారు.
    రంగారావు దుర్మర్గుడే కాదు. చాలామంది దుర్మార్గులకు లాగే పలుకుబడి ఉన్నవాడు కూడా.
    రంగారావు గంబ్లింగ్ హౌసెస్ నడుపుతాడంటారు. సినిమా హళ్ళ దగ్గర మనుషుల్ని పెట్టి బ్లాకులో టికెట్లమ్మిస్తాడంటారు. ఇవి అతడు రహస్యంగానే చేసే పనులు, అయితే అతను పబ్లిగ్గా చేసే పనులు కొన్నున్నాయి. ఒకటి తాగడం రెండు నచ్చిన ఆడపిల్లని ఎత్తుకు పోయి అనుభవించి వదిలెయ్యడం.
    ఒకసారి అనుభవించబడి వదిలెయబడినట్లు పోలీస్ స్టేషన్ కెళ్ళి చెప్పుకునే ఆడపిల్లలీ దేశంలో ఉండరు. వాళ్ళు చావనైనా చస్తారు చావలేక బ్రతుకుతారు- తప్పితే ఆ దుర్మార్గుడ్ని పట్టివ్వడానికి ముందుకు రారు.
    రంగారావు కళ్ళ బడకుండా ఆడపిల్లల్ని దాచుకోవడం ఆ ఊళ్ళో చాలామందికి అవసరమని తెలుసు. అతని కళ్ళబడి ఆకర్షించిన పిల్లయితే కట్టుదిట్టాలే మాత్రం సడలించినా ఆతడు కాజేసుకు పోతాడు.
    ఎవరో ఒకరు ఆ వెధవని చంపేస్తే ఎంత బాగుండును? అని అందమైన అమ్మాయిల తలిదండ్రులు అన్నలు, భర్తలు అనుకుంటుండెవారు.
    అలాంటి రంగారావు చచ్చిపోయాడు. అదీ హత్య చేయబడి!
    హత్యయినా సామాన్యమైనది కాదు. రంగారావు తన గదిలో కుక్కచావు చచ్చాడు.
    రంగారావుని అతడింట్లో అంతలా చంపగలిగిన హంతకుడు సామాన్యుడు కాదని ఊరంతా అలజడి బయల్దేరింది. అతణ్ణి మహాను భావుడని అరాధించాలా, మరో దుర్మార్గుడవతరించాడని భయపడాలా అన్న మీమాంస తేలక చాలామంది బాధపడుతున్నారు.
    ఏది ఏమైనా ఆ హంతకుడి ఆచూకీ మాత్రం తెలియలేదు.

                                    2
    "ఈవేళ నువ్వు అయిదు నిమిషాలు లేటుగా వచ్చావు" అన్నాడు వెంకన్న తన అసిస్టెంటు సీతమ్మ వంక చూసి.
    "ఆలశ్యంగా రావడం నాకిది రెండో సారి. కానీ మీరు మెచ్చే కారణం ఆలస్యానికుండడం మాత్రం ఇదే మొదటి సారి అనుకుంటాను-" అంది సీతమ్మ.  
    "కారణం చెప్పకుండానే నేను నిన్ను మెచ్చుకుంటాననుకోవడం నీఅహంకారాన్ని తెలియజేస్తుంది. వాట్ డుయుసే రాజమ్మా!" అన్నాడు వెంకన్న తన రెండవ అసిస్టెంటు తో.
    "సీతమ్మ అహంకారి అని మీరంటే ఏ కారణమూ వినకుండానే నేను ఒప్పేసుకుంటాను" అంది రాజమ్మ.
    సీతమ్మ కోపపడలేదు. మందహాసం చేయలేదు. తన  జాకెట్లోపల్నుంచి ఓ చిన్న డైరీ తీసి వెంకన్న ముందుంచి "ముందిది చూడండి. మనం తర్వాత మాట్లాడుకుందాం!" అంది.
    వెంకన్న కుతూహలంగా డైరీ తీసి చూశాడు. అది డైరీ లాంటి పాకెట్ నోట్ బుక్. పైన ప్లాస్టిక్ కవరుంది. పుస్తకంలో మొదటి పేజీ వదిలేయబడి వుంది. రెండవ పేజీలో ఆరంభంలో ఒకటి అనే అంకె వేసి వుంది. దాని క్రింద ఇలా రాసి వుంది.
    "వాడు దాన్ని రేప్ చేసే ప్రయత్నంలో ఉంటాడు. నేను రెండో అట సినిమా చూసి వాడింటికి వెడతాను. తలుపు తడతాను. వాడు తీస్తాడు. నన్ను చూసి కంగారు పడతాడు. నేను జేబులోంచి బెల్టు తీస్తాను. వాణ్ని కొట్టడం ప్రారంభిస్తాను. వాడి కళ్ళు తట్లు తీరేలా కొడతాను. తర్వాత గదిలో దొరికిన కర్ర పుచ్చుకొని వాడి బుర్ర పగలకోడతాను. ఆటర్వతనే నేను తెచ్చిన కత్తి వాడి గుండెల్లో దిగబడి వెచ్చటి రక్తం గదిలో చిమ్ముతుంది. అప్పటికింకా అది కూడా అక్కడే ఉంటె దానికి ధైర్యం చెప్పి పంపెస్తాను."
    "ఇదేక్కడ దొరికింది నీకు?' అన్నాడు వెంకన్న.
    "ఆలస్యానికి క్షమార్పణ చెప్పుకోవాలా? మీ ప్రశ్నకు జవాబు చెప్పాలా?' అంది సీతమ్మ.
    "లంచాలతో వెంకన్నను మభ్య పెట్టలేవు. ముందు క్షమార్పణ చెప్పి అపుడు జవాబు చెప్పు. నో జోక్స్, అయాం సీరియస్ -" అన్నాడు వెంకన్న గంబీరంగా.
    వెంకన్న ముఖం చూసి సీతమ్మ ముఖంలో రంగులు మారాయి-- "ఆఫీసుకు వచ్చేటప్పుడు నేను సాధారణంగా పార్కు లోంచి క్రాస్ చేసి వస్తుంటాను. ఈ రోజు అలాగే చేస్తుండగా పార్కులోంచి ఓ మనిషి -- అంతసేపూ బెంచీ మీద కూర్చున్నవాడు చటుక్కున లేచి వెళ్ళిపోవడం చూశాను. అతడు లేచిన చోట ఈ నోట్ బుక్ వుంది. తీశాను. అతని కందజేయాలనుకున్నాను. కానీ అతనేదో హడావుడిలో ఉన్నాడు. అతన్ని కాసేపు అనుసరించి ఫియిలై పోయాను. ఆ విధంగా అయిదు నిముషాలస్యమైంది. అందుకు నన్ను మన్నించండి బాస్. తర్వాత ఇందులోని వివరాలు చదివాను. అంతే! నాకు ముచ్చెమటలు పోశాయి-- శరవేగంతో ఆఫీసుకు వచ్చేశాను...."
    "రాజమ్మా-- ఒక్కసారి రంగారావు హత్య గురించి మనకు తెలిసిన వివరాలు చదువు...." అన్నాడు వెంకన్న.
    తనక్కావల్సిన వివరాలు తీయడానికి రాజమ్మ కొద్ది సెకన్లు మాత్రమే తీసుకుని -- "వినండి బాస్!" అంటూ ఆమె చదవడం ప్రారంభించింది.
    హంతకుడెవరో గాని అతడికి రంగారావు మీద చాలా కసి వుంది. ముందతన్ని బెల్టుతో బాదాడు. తర్వాత తల మీద గదిలో వున్న ఓ కర్రతో మోదాడు. ఆపైన కత్తితో పొడిచాడు. ఆ సమయంలో అక్కడొక స్త్రీ మసలిన చిహ్నాలున్నాయి. గదిలో కొట్లాట జరిగిన సూచనలున్నాయి. పక్కమీద సంఘర్షణ జరిగిన సూచన లున్నాయి. ఆడవాళ్ళ జాకెట్ బొత్తాలు రెండు, చిరిగిన చీర పీలిక, అక్కడక్కడ తల వెంట్రుకలు పాడుగాటివి ఉన్నాయి. ఒక స్త్రీ అక్కడ పురుషుడ్ని ప్రతిఘటించిదనడం లోసందేహం లేదు. అయితే ఆ స్త్రీ యే ఈ హత్య చేసి వుంటుందనుకోవడానికి అవకాశాలంతగా కనిపించడం లేదు. రంగారావు వంటి బాలవంతుడ్ని ఒక స్త్రీ అంతలా హింసించలేదు. ఒకవేళ ముందుగా ఏ తలమీదనో కొట్టడమో , కత్తితో పొడవడమో అపుడు బెల్టుతో కొట్టిందనుకుందామన్నా -- దెబ్బ తగిలాక కత్తి పోటు తిన్నాక -- హతేడు పెనుగులాడి నట్లు కనబడదు. శవాన్ని కదిపిన సూచనలు లేవు. మరి బెల్టు దెబ్బలు -- హతుడి వీపు మీద కూడా వున్నాయి.
    "ఈ నోట్ బుక్ రంగరావు ను హత్య చేసిన వాడిదంటావా?" అన్నాడు వెంకన్న.
    "నేనేమీ అనను. తర్వాత పేజీలు  చూడండి--" అంది సీతమ్మ.
    వెంకన్న పేజీ తిరగేసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ పైన రెండంకే వేసి వుంది. దాని క్రింద ఇలా వ్రాసి వుంది.
    రాత్రి రెండో అట సినిమా చూసి వాటింటికి వెడతాను. వాడు తలుపు తీసి నన్నాప్యాయంగా లోనికి ఆహ్వానిస్తాడు. నేను వాడితో పాటు లోపలకు వెడతాను. నా జేబులోంచి ఇన్ హేలర్ తీసి -- ఇది చూశారా? కొత్తగా మార్కెట్లోవచ్చింది. దీని వాసన ఎంత బాగుందో" అంటాను. వాడు దాని వాసనా చూసి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు వాణ్ని కూర్చున్న కుర్చీకే కట్టేస్తాను. తర్వాత జేబులోంచి కత్తి తీసి -- వాణ్ని తట్టి లేపుతాను. చూస్తుండగానే వాడి పీక కోసి మొండెం నుంచి తల వేరు చేస్తాను.  

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra