Home » D kameshwari » Chikati Podduna Velugu Rekha


    "ఊహుఁ....ఈ చెయ్యి ఇలా వుండనీయండి. ఇలా గుండెలమీద పెట్టుకుంటే హాయిగా వుంది. మీ చెయ్యి ఇలా పట్టుకుంటే ఎంత బాగుందో తెలుసా...."ఏదేదో అనడం ఆరంభించాడు రామకృష్ణ. అతను జ్వరతీవ్రతతో సంధిమాటలు మాట్లాడుతున్నాడని అర్ధమైంది సుజాతకి. ఇకచేయ్యి విడిపించుకునే ప్రయత్నం చెయ్యలేదు. '-అబ్బ నా తల పగిలిపోతూంది సుజాతా, నీ చెయ్యి యిలా వేస్తే ఎంత చల్లగా వుంది. ఎంత హాయిగా వుంది" అంటూ ఏదేదో గొణుక్కుంటూ మగత లోకి జారాడు రామకృష్ణ. అమాయకంగా చిన్నపిల్లవాడిలా రెండుచేతులలో తనచెయ్యి పట్టుకుని గుండెలమీద వుంచుకుని, వదిలితే పారిపోతుందన్నట్టు పడుకున్న అతన్ని చూస్తుంటే సుజాత మనసు ఆ క్షణాన ఏదో అయిపోయింది. అలా అతన్ని వడిలోకి వేసుకుని లాలించాలని, చెదిరిన అతని జుత్తు ప్రేమగా సవరించాలని కోరిక కలిగింది. జ్వర తీవ్రతతో కాలిపోతున్న అతని చేతులమధ్య తన చేయి అలావుంచి, కదిలితే నిద్రాభంగం అవుతుందని అలా కూర్చుంది. చాలాసేపటికి అతను బాగానిద్రపోయాడని గుర్తించి, నెమ్మదిగా చెయ్యి లాక్కొని ప్రేమగా జుత్తు సవరించి, చటుక్కున ముందుకువంగి అతని కాలిపోతున్న నుదుటిమీద సున్నితంగా పెదాలు ఆనించింది. ఆ పని చేస్తున్నప్పుడు సుజాత నిలువెల్లా సిగ్గుతోనో భయంతోనో వణికింది. ఆ తర్వాత ఏమిటిది యిలాంటి పనిచేశాను అనుకుంటూ సిగ్గుతో ఆ గదిలోంచి పారిపోయింది సుజాత.
    జ్వరం తగ్గిన దగ్గిరనించీ అధమం పదిసార్లన్నా తనకి అన్నీ చేస్తున్నందుకు కృతజ్ఞతలుచెపుతూ శ్రమయిస్తున్నానంటూ నొచ్చుకుంటూ మాట్లాడేవాడు.
    "మీ నించి కృతజ్ఞతలు ఆశించి నేనేం మీకు చెయ్యలేదు, పదిసార్లు ఆ మాట చెప్పక్కరలేదు" నిష్టూరంగా అంది సుజాత.
    "మరి.....మరింకేం ఆశించి చేస్తున్నారో చెప్పండి, అది నే నీయవైతే సంతోషంగా యిస్తాను. సుజాతగారూ, కృతజ్ఞతలు చెప్పకుండా ఎలావుండమంటారో చెప్పండి. మీరు నాకు యీ పదిరోజులు చేసినసేవకి నేనేం యిచ్చి మీ బదులు తీర్చుకోగలను. అమ్మలేని లోటు కనపడలేదు. ఇది ఏ నాటి ఋణానుబంధమో, ముక్కు మొహం తెలియని నాకు మీ రిలా చెయ్యడం" అన్నాడు రామకృష్ణ మనసంతా కృతజ్ఞత నిండుకోగా.
    "ముక్కు మొహం తెలియని వారికీ నేనేం చెయ్యలేదు. మీ రింకా నన్ను ముక్కుమొహం తెలియని దానిక్రిందే జమ కడ్తున్నారని తెలియక చేశాను." సుజాత కాస్త కటువుగా అంది.
    తన మనసులో ఏముందో ఆ మాత్రం తెల్సుకోలేని ఆ మనిషికి యింకెలా చెప్పాలో అర్ధంకాని నిస్సహాయత అతనిమీద కోపం తెప్పిస్తూంది. ఓ ఆడపిల్ల మనసుని ఆ మాత్రం గ్రహించలేని మగాడు ఏం మగాడు! ఇంతకంటే విడమర్చి ఏ అమ్మాయి చెపుతుంది. యీ మాత్రం ఆలోచన లేదేం యితనికి!
    సుజాత ఎర్రబడ్డ మొహంలోకి వింతగా చూస్తూ "సుజాతగారూ, అందుకు నేననలేదు. మీరు......మీరు నన్నర్ధం చేసుకోలేదు. నా ఉద్దేశం అది కాదు." తడబడ్తూ ఏదో సంజాయిషీ యీయబోయాడు.
    "మీరేం చెప్పక్కరలేదు లెండి...." ఉక్రోషంగా అని విసురుగా వెళ్ళబోయింది. రామకృష్ణ చటుక్కున సుజాతకి అడ్డువచ్చి నిలబడ్డాడు. అతనికి ఆ క్షణంలో సుజాత మొహం చూస్తూంటే ఇన్నాళ్ళనించి తన మనసులో ప్రశ్నకి సమాధానం దొరికినట్లయింది. తన సందేహం నివృత్తి అయినట్లనిపించింది. తన మనసులో ఆలోచన సుజాత మనసులోనూ తిరుగుతోందని అర్ధమైపోయింది.
    "సుజాతా!" అన్నాడు రామకృష్ణ సుజాత చెయ్యిపట్టుకుని వణుకుతున్న గొంతుతో. సుజాత చకితురాలై చూసింది. "సుజాతా, ప్లీజ్ నన్నర్ధం చేసికోండి. మీకెలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలియడం లేదు నాకు. నేను.....నేను ఎన్నాళ్ళ నించో చెప్పాలని చెప్పలేకపోతున్నాను.....చెబితే అపార్ధంచేసికుంటారేమోనని మీకు నా పట్ల ఎలాంటి భావం వుందో తెలియక సందేహిస్తూ...." సుజాత ఏమంటుందోనని ఆమె మొహంలోకి చూస్తూ ఆగిపోయాడు.
    "హు, నోటితో చెపితే తప్ప గ్రహించలేరన్నమాట." మరోసారి నిష్ఠూరంగా అని చేయి విడిపించుకో బోయింది సుజాత. రామకృష్ణ ఆ చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని "సుజాతా!" అన్నాడు ఆనందంగా. ఆ క్షణంలో యింకేం మాట్లాడాలో తెలియక 'సుజాతా!' అంటూ ఆ చేతిని ఆనందపారవశ్యంతో గట్టిగా నొక్కాడు. సుజాత కళ్ళెత్తి అతని మొహంలోకి చూసింది. ఆ కళ్ళలోని ఆప్యాయతని, అనురాగాన్ని, ప్రేమని చూసి చకితురాలైంది. రామకృష్ణలాంటి మనిషిలో యిలాంటి భావం, యిలాంటి ఆవేశం చూడగలనని అనుకోని సుజాతకి ఆశ్చర్యంతో పాటు ఆనందంకూడా కల్గింది. ఇతనూ మనిషే! ఇతనికీ మనసుంది, ఆ మనసు స్పందించింది. అతని కళ్ళలోకి చూస్తూనే చెయ్యి నెమ్మదిగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ 'వదలండి' అంది మృదువుగా.
    రామకృష్ణ చిలిపిగా "ఊహు, వదలను. ముందుమాట యియ్యి" అన్నాడు ఆమె చెయ్యిని రెండు చేతులతో పట్టుకుని.
    "ఏం మాట యీయాలి?"
    "అదే అదే" రామకృష్ణ ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు. తను సుజాతని ఏం అడిగాడని, సుజాత ఏం యివ్వనందని ఈ అడగడం అన్పించింది. అతని మనసులో మాట సుజాతపైకి అనేసింది..... "మీరు నన్నేం అడిగారు? ఏం అడగకుండానే నే నేదో యీయనన్నట్టు ఈ అడగడం ఏమిటి?" అంది నవ్వుతూ. రామకృష్ణ సిగ్గుపడ్డాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra