Home » Mainanpati bhaskar » Ardharathri Adapaduchulu


    అక్కడిదోమలు! విపరీతంగా!
    దోమలు ఇంకా ఉండి ఉంటాయా?
    దోమలు ఉంటే ఉంటాయి కానీ అమ్మా! నాన్నా?
    తమ్ముడూ చెల్లీ?
    ఇంకా, అక్కడే ఉన్నారా? ఉంటారా?
    ఆమె మనసు దిగులుగా అయిపోయింది. ఉంటే, ఏం చేస్తూ ఉండి ఉంటారు వాళ్ళు?
    తమ్ముడూ చెల్లీ ఏం చదువుతున్నారు?
    ఏమనుకుంటున్నారు తనని గురించి?
    చనిపోయిందనుకుంటున్నారా?
    చెడిపోయిందనుకుంటున్నారా?
    అందరూ గుర్తున్నారు తనకి. కానీ వాళ్ళ రూపు రేఖలు మాత్రం అంతగా గుర్తులేవు. అస్పష్టంగా కనబడతారు వాళ్ళు తనమనోఫలకం మీద.
    పెన్సిల్ తో గీసిన బొమ్మలని అక్కడక్కడ రబ్బరుతో తుడిచేసినట్లు.....
    అమ్మది పొడుగాటి జడ. అది క్లియర్ గా గుర్తుంది తనకి. తడిగా మెరుస్తూ ఆర్ద్రంగా కనబడే కళ్ళు అమ్మవి. అవి తనకు కళ్ళకుకట్టినట్లు కనబడుతూనే ఉంటాయి ఇంకా.
    అలాగే నాన్నగారూ....    
    ఆయనకి గెడ్డం కింద పెన్సిల్ తో నొక్కినట్లు గుంట ఉంటుంది.
    తను నాన్నగారితో మాట్లాడుతుంటే తల ఎత్తి చూడవలసివచ్చేది. అలాచూసినప్పుడల్లా ఆ గుంట చాలా ప్రామినెంట్ గా కనబడేది.
    చెల్లెలికి చెవికిందగా చెంపమీదతేనెచుక్క పడినట్లు పుట్టుమచ్చ.....
    తమ్ముడికి నుదిటిమీదపడే జుట్టు.....
    ఇనేవాళ్ళ రూపాలను గురించిన తనకిమిగిలిన జ్ఞాపకాలు!
    పద్దెనిమిదేళ్ళక్రితం తను అవన్నీ మర్చిపోవాలని కఠోరమైన నిర్ణయం తీసుకున్నాకూడా.....
    వద్దన్నా వెంటాడే జ్ఞాపకాలు ఇవి!
    ఒక్కసారి తల విదిలించి, తనని తాను అదుపులోకి తెచ్చుకుని, బేరర్ ని పిలిచింది సీత.
    వెంటనే ప్రత్యక్షమయ్యాడు బేరర్.
    "మేనేజర్ ని పిలు."
    మరు నిమిషంలో మేనేజర్ వచ్చాడు.
    "చంద్రకాంత్! వీళ్ళు నా ఫ్రెండ్స్!"అంది సీత క్లుప్తంగా.
    చంద్రకాంత్ చిరునవ్వుతో తలపంకించి, ఫోల్డరులో బ్రహ్మాజీరావు ఉంచిన డబ్బువదిలేసి చెక్ మాత్రమే తీసుకునివెళ్ళి దానిమీద "పెయిడ్"అన్న స్టాంపు వేసి, "విత్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద హవుస్ సర్!" అని దాన్ని బ్రహ్మాజీరావుకి ఇచ్చేశాడు.
    "ఇదేమిటి?" అన్నాడు బ్రహ్మాజీరావు ఆశ్చర్యంగా.
    ప్రమీల చిత్రంగా చూస్తోంది ఇదంతా.
    "ఇటీజ్ మై ప్రివిలేజ్!" అని నవ్వు తెచ్చుకుని లేచి నిలబడింది సీత."వస్తాను!" అని అందరికీ చెప్పి మనోహర్ తోమళ్ళీ ప్రత్యేకంగా చెప్పింది."ఓకే మనోహర్! సీ యూ!"
    ఆమెవెళ్ళిపోతుంటే అందరూ అటే చూస్తూ ఉండిపోయారు.
    అప్పుడు హఠాత్తుగా అన్నాడు బ్రహ్మాజీరావు.
    "అరె! అరెరె! అదేమిటి?"
    అతని గొంతువిని రెస్టారెంట్ లో ఉన్న అందరూ తిరిగి చూశారు.
    వెంటనే అందరి కళ్ళలో భయం గోచరించింది.
    ఆ హాలులోని ఎయిర్ కండిషనర్ లోనుంచి అగ్నిశ్వాస వెలువడినట్లు భగ్గుమని వెలువడినట్లు భగ్గుమని వెలువడింది ఒక మంట. వెంటనే దగ్గరలో వున్నపల్చటి నైలాన్ కర్టెన్లు అన్నీ అంటుకున్నాయి. ఎయిర్ కండిషనర్ లో నుంచి మళ్ళీ వెలువడ్డాయి మంటలు.
    అన్ని అంతస్తులు వున్న బిల్డింగులో సాధారణంగా సెంట్రల్ ఎయిర్ కండిష నింగు ఉంటుంది. అక్కడనుంచి సమశీతోష్ణంగా ఉండే గాలిని బిల్డింగ్ అంతటా డిస్ట్రిబ్యూట్ చెయ్యటానికి ఏసీ డక్ట్స్ అనే గొట్టాలు ఉంటాయి. అలాంటి స్కై స్క్రేపర్స్ లో గనక అగ్నిప్రమాదం సంభవిస్తే ఒకచోట మొదలైన మంటలు ఆ ఏసీ డక్ట్స్ ద్వారా భవంతి అంతటా వ్యాపించే అవకాశం వుంది. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే మళ్ళీ మంటలు కక్కింది ఎయిర్ కండిషనర్.
    అప్పుడు వినబడటం మొదలెట్టాయి. ఆటో ఫైర్ డిటెక్టర్ స్మోక్ అలారమ్ తాలూకు వార్నింగ్ సిగ్నల్సు ఆ బిల్డింగులో వున్ననలభై అంతస్తులలోని ప్రతి అంతస్తు మంచిబిల్డింగుతో ఉష్ణోగ్రత అసాధారణమైన స్థాయికి చేరుకున్నా బిల్డింగులో దట్టంగా పొగకమ్మేసినా ఆటోమాటిక్ గా అలారమ్ మోగిస్తాయి ఆ పరికరాలు. వాటితోబాటే జనం కలకలంవినబడడం మొదలెట్టింది.మనుషులు భయంతో వళ్ళుమర్చిపోయి చేస్తున్న ఆక్రందనలు వినబడడం మొదలెట్టాయి.
    అప్పుడు నెమ్మదిగా గాజుబుడగ పైకి తేలుతున్నట్లు పైకి వచ్చి ఆగింది ఒకలిఫ్టు. ఆ లిఫ్టు బిల్డింగు నిర్మాణం జరుగుతున్నప్పుడు మెటీరియల్స్ ని సులభంగా పైకి చేరవెయ్యడానికిగానూ ఒక లిఫ్టుని ఏర్పాటుచేశారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత లిఫ్టుకీ రూపంమార్చేసిదాన్ని అత్యంత విలాసవంతంగా కనబడేటట్లుచేసి కస్టమర్సు వాడుకోవడానికి వీలుగా వుంచారు మామూలు లిఫ్టులాగా దానికి నాలుగువైపులా కొయ్యగోడలు లేవు. పూర్తిగా గ్లాస్, గ్లాస్ బబుల్ లా వుంది అది.
    లిఫ్టు ఆగీ ఆగగానే ఆ హాల్లో ఉన్నవాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ తోసుకుంటూ లిఫ్టువైపు పరిగెత్తారు.
    బ్రహ్మాజీరావు కుటుంబం కూర్చున్నటేబుల్ కి చాలా దగ్గరలోనే ఉంది ఆ లిఫ్టు. చటుక్కున లేచి నిలబడ్డాడు బ్రహ్మాజీరావు. కొడుకు మనోహర్ చెయ్యి పట్టుకుని గబగబ లిఫ్టు దగ్గరికి లక్కెళ్ళాడు.
    "ఎక్కు!" అన్నాడు త్వరత్వరగా.
    "నో డాడీ!" అన్నాడు మనోహర్ చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ. తనతల్లీ తండ్రీ ఇక్కడ మంటల్లో చిక్కుకుపోతుంటే వాళ్ళని వదిలేసి తను సురక్షిత స్థానానికి ఎలా వెళ్ళగలడు?
    వాళ్ళకి తోడు భువినుంచి దివికి దిగివచ్చిన దేవతలాంటి సీత కూడా ఈ మంటలకు ఆహుతైపోతుందేమో!
    చెయ్యివిదిలించుకోవడానికి చూస్తున్నాడు గానీ అది అతనికి సాధ్యం కావడంలేదు. చాలా నాజూగ్గా అందమైన ఆడపిల్లలా వుంటాడు మనోహర్. బ్రహ్మాజీ రావుది ఉక్కు పిడికిలి. బలంగా మనోహర్ ని లిఫ్టులోకి తోశాడు.
    "నోడాడీ!" అంటూ మళ్ళీ బయటకు రాబోయాడు మనోహర్. ఆ లోపలే మరి పదిమంది లిఫ్టులో ఎక్కేశారు.
    దాన్లో నుంచి దిగడం మనోహర్ కి సాధ్యం కాలేదు. లిఫ్టు తలుపులు మూసుకుపోయాయి. గాజు బుడగగాల్లో నెమ్మదిగా దిగుతుట్లు కిందికి వెళ్ళిపోయింది లిఫ్టు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra