Home » Mainanpati bhaskar » Daimond Raja Aathin Rani

 

    రియల్ లైఫ్ లో సంవత్సరానికి ఓసారి ఓ పండుగకి చెల్లెలిని తన ఇంటికి పిలిచి, పసుపూ, కుంకుమా , ఓ చీరె జాజెట్టు పెట్టడం కూడా దండగే అనుకునే అన్న సినిమాల్లో మాత్రం చెల్లెలి కోసం అష్టకష్టాలు అనుభవించే అన్నయ్య క్యారెక్టర్ ని చూసి క్లాప్స్ కొడతాడు.


    తన జీవితంలో సొంత అన్న మీద ఆస్తిలో మరింత వాటా కోసం దావా వేసే తమ్ముడు అన్నదమ్ముల అనుబంధం సెంటిమెంటుతో వచ్చే సినిమాలకి సక్సెస్ చేస్తాడు.


    ఇలా తరచి చూసుకుంటూ పోతూ ఉండగా నటరాజ్ కి మరో విషయం కూడా అర్ధం అయింది.


    "అందరి కోసం ఒకరు. ఒకరి కోసం అందరూ!" అనే పద్దతిలో వేల సంవత్సరాల నుంచి సాగిన మన సంస్కృతీని వదిలేసి "నీ కోసమే నువ్వు జీవించు. నీ కోసమే నువ్వు సంపాదించు. నీ కోసమే నువ్వు ఖర్చు పెట్టుకో! అలక్ నిరంజన్! అనే ఇరవై ఒకటవ శతాబ్దపు సంస్కృతిలోకి అడుగు పెట్టబోతూ , తన ముందే మంచులా కరిగిపోతున్న పాత విలువలని పూర్తిగా మర్చిపోలేక, వాటిని సినిమాలలో చూడాలని ఇష్టపడుతున్నాడు సగటు ప్రేక్షకుడు.


    అందుకనే ఎంత వయోలెన్స్ ఉన్న పిక్చరయినా కూడా ఎంత సెక్స్ గుప్పించిన బూతు చిత్రమైన కూడా , సెంటిమెంట్ ఉన్న సీన్లు లేకపోతే నిలబడదు.


    దానాదీనా తేలిందేమిటంటే.........


    మనకి ఒక అరడజను సినిమా కధలు మాత్రమే ఉన్నాయి. వాటిని మాత్రమే చూడడానికి ఇష్ట పడతాడు ప్రేక్షకుడు. తల్లీ- కొడుకు సెంటిమెంట్ , అన్నా చెల్లెలు సెంటిమెంట్, అన్నా - తమ్ముడు సెంటిమెంట్, బీద - గొప్ప సెంటిమెంట్. క్రితం తరం ఇంట్లో భార్యతోనే గాక బయట కూడా ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళతో 'దక్షిణ నాయకత్వం' వెలగబెడితే అదో గొప్పగా చెల్లుబాటు అయింది. కాబట్టి ఆ వాసనలతో ఇద్దరూ హీరోయిన్ల సెంటిమెంట్, వయోలెంట్ గా మారిపోతున్న రోజులు కాబట్టి పోలీసు - ఖైదీ - లాయరు సెంటిమెంట్, సరదాగా అత్తా -అల్లుడు సెంటిమెంట్.


    ఇవి తప్ప వేరే కధలు మనకి లేవు. లేవు అంటే వేరే కధలు మన సినిమాలకి పనికి రావట్లేదు! ఇవి తప్ప వేరేవి తీయడానికి నిర్మాతలు సాహసించరు. ఒకవేళ ఎవరైనా సాహసించినా కూడా ప్రేక్షకులు వాటిని తిప్పి కొడతారు. పదేపదే రుజువయిన విషయం ఇది. "మంచి సబ్జెక్ట్ కోసం వెదుకుతున్నాం" అన్నది ఆత్మసంతృప్తి కోసం ఆడుకునే అందమైన నాటకం! మంచి సబ్జెక్టు అంటే ఏమిటంటే ఉన్న ఈ అరడజను సబ్జెక్టులనే మళ్ళీ మళ్ళీ కొత్తగా చెప్పగలగడం! ఆ కధలకే కొత్త సీన్లు క్రియేట్ చెయ్యగలగడం! కొత్త గెటప్ లూ, కొత్త స్టెప్పులు కొత్త జర్కులు చూపించగలగడం! ఈ విషయంలో నుంచి బయటపడి అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు నిజంగానే మంచి సబ్జెక్టుతో నీటుగా సినిమాలు తీసి ఉండవచ్చు. వాటికీ ప్రేక్షకుల ఆదరణ లభించి వుండవచ్చు. కానీ వాటికి వచ్చే ఆదాయంతో పోలిస్తే కమర్షియల్ ఫార్ములా సినిమాలకి వచ్చే ఆదాయంలో వందో వంతు కూడా ఉండదు! అందుకని నిజాయితిగా మంచి సబ్జెక్టు అనుకుంటూ రంగంలోకి దిగిన నిర్మాత కూడా చివరికి ఫార్ములా సబ్జేక్తుకి దాసోహం అనడం తప్పడంలేదు.


    పోను పోనూ అందరికి అర్ధమైపోయిన ఈ ఫర్మలాకి మరో బ్రిలియంట్ ఫార్ములా జోడించాడు నటరాజాన్.


    అదే జంతువుల సెంటిమెంట్!


    హీరోయిన్ ని రక్షించే ఏనుగులూ, పగబట్టిన పాములూ, రక్షణ ఇస్తూ పడగ బట్టే పాములూ - ఇవన్నీ నటరాజన్ కమర్షియల్ ఫార్ములా సెంటిమెంట్లు.


    సినిమాల్లో సెంటిమెంటు గుప్పించినా కూడా అతనికి నిజంగానే తన తల్లి అంటే అమితమైన అభిమానం! జంతువులంటే నిజంగానే ప్రేమ! సాటి మనుషులంటే అందులోనూ పేద సాదలంటే ప్రాణం!


    అందువల్లనే అతను సెంటిమెంట్లతో "ఆడుకున్నా" కూడా ఆ ఆటలో ఎంతో కొంత నిజాయితీ కనబడేది. ఫీలింగ్ ఉండేది ఆర్తి గోచరించేది.


    అది ప్రేక్షకులకు బాగా పట్టింది! ప్రేక్షకులు అతన్ని మెగా ప్రొడ్యుసర్ ని చేసేశారు. అతను సంపాదించిన ధనం అతనికి ఎంత పవర్ ని ఇచ్చిందంటే , ఇవాళ అతను వంటిమీద షర్టు, బనీను కూడా లేకుండా అడ్డ పంచెను ఎత్తి గుండెలదాకా మడిచి కట్టి, ఒళ్ళంతా విభూది పట్టీలు పెట్టుకుని, కాళ్ళకి చెప్పులు లేకుండా, ఖారా కిళ్ళి నమిలి ఉమ్మేస్తూ ప్లయిట్ లో "జే" క్లాస్ అనే ఎగ్జిక్యుటివ్ క్లాస్ లో కూచున్నా కూడా జనాలు అతనికి నీరాజనాలు పడతారే తప్ప ఇదేమిటని అడగరు!


    ఇప్పుడు అలాంటి గెటప్ లో ఉన్న నటరాజన్ హైదరాబాద్ ప్లయిట్ లో కూర్చుని తన సెక్రటరీ అర్ధనారీశ్వరన్ ని అడిగాడు .


    "ఏమోయ్! హైదరాబాద్ షూటింగ్ అరేంజ్ మెంట్స్ అన్నీ అయినాయా?"


    ఎప్పుడూ, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ నటరాజన్ కి తెలుస్తూనే ఉంటాయి. అయినా కూడా అతను టెస్టు చేస్తున్నట్లు ప్రశ్నలు వేస్తూ వుంటాడు.


    మన తెలుగు పటం షూటింగ్ కి అక్కడ అరేంజ్ మెంట్స్ అన్నీ చేసినా సార్!" అన్నాడు అర్ధనారీశ్వరన్.


    "ఇన్ డోర్ ఎక్కడ?"


    'హైదరాబాద్ దగ్గర్లోనే వున్న పాలెస్ లో సార్!"


    "ఏ పాలస్?" అన్నాడు నటరాజన్.


    "రాణీపూర్ పాలెస్ సార్" అన్నాడు సెక్రటరీ అర్ధనారీశ్వరన్.

 


                                                          * * *


    మీనాక్షి కలత నిద్రలో లేచి తలుపులు తియ్యగానే గుమ్మం దగ్గర కనబడ్డాడు డైమండ్ రాజా.


    ":మీరా! ఇక్కడ కెందుకొచ్చారు?" అంది మీనాక్షి తడబడుతూ.


    "పనిమీద!" అన్నాడు రాజా క్లుప్తంగా.


    అంతలోనే గుర్తొచ్చింది మీనాక్షికి. తను అతనితో కఠినంగా ఉండదలుచుకున్న సంగతి! అందుకనే గొంతులో సాధ్యమైనంత కాఠిన్యాన్ని పలికిస్తూ అంది.


    "నాతొ ఏం పని మీకు?"


    "నీతో పని ఉందని నేను అన్లేదే?" అన్నాడు రాజా.


    అతని పెదాల మీద చిరునవ్వు మెదుల్తోంది.


    "మరి"


    "మీ అమ్మగారిని చూడడానికి వచ్చాను."


    "మా అమ్మని చూసుకోవడానికి నేను ఉన్నాను. మీరెందుకు?"


    "మీ అమ్మని నువ్వు సరిగ్గా చూసుకోలేక పోతున్నావు కాబట్టి. ఆ బాధ్యతని నేను టేక్ ఓవర్ చేయదలుచుకున్నాను."


    "మీకది అనవసరం!"


    "అని నేను అనుకోవడం లేదు. అడ్డంలే!"


    "ఏమిటి జబర్దస్తి! నా సంగతి మీకు తెలియదు!"


    ఒక్కసారి మీనాక్షిని అంచనా వేస్తున్నట్లు ఆపాదమస్తకం ఎగాదిగా చూశాడు రాజా. అప్పుడు మీనాక్షి ఉహించలేనిది జరిగింది.


    రెండుచేతులతో మీనాక్షిని పసిపాపని ఎట్టుకున్నట్లు ఎత్తేసుకుని రెండు అంగల్లో రోడ్డు మీదకెళ్ళిపోయాడు రాజా. అక్కడ , మనిషి అంత ఎత్తు ఉన్న రెండు గుర్రాలు పూన్చిన గుర్రపు సార్ట్ ఉంది. చిన్నసైజు రధంలా వుంది అది. అంత ఎత్తు గుర్రాలని ఎప్పుడూ చూసి ఉండలేదు మీనాక్షి.


    ఇంకొంచెం పరీక్షగా చూస్తే అవి పంచకళ్యాణి గుర్రాలని అర్ధమయింది ఆమెకి. వాటి మొహాలమీద తెల్లటి మచ్చలు! పాదాలకి పాంజేబు పట్టాలలాగ పొడలు.


    మీనాక్షిని ఎత్తి, గుర్రపు సార్ట్ లో కుదేశాడు రాజా. సార్ట్ లోపల ఎర్రటి ముఖమల్ మెత్తలు ఉన్నాయి.


    "చల్!" అని చెర్నకోల్ విదిలించాడు రాజా.


    గుర్రాలు రెండు సకిలించి, టక్ టక్ టక్ అని గిట్టల శబ్దం చేసుకుంటూ పరుగందుకున్నాయి. కొద్ది క్షణాలలోనే గాల్లో పరిగెడుతున్నంత వేగంగా గాలప్ అందుకున్నాయి అవి!


    "ఏమిటా దౌర్జన్యం!" అంది మీనాక్షి కోపంగా.


    కానీ, తడిసిపోయిన గంధకంలా, ఆ కోపంలో పవర్ లేదు.


    "ఏమిటీ నీ నాటకం!" అన్నాడు రాజా నవ్వుతూ.


    తలవంచుకుంది మీనాక్షి.


    "నేను నీ నాటకం గ్రహించలేని అమాయకుడిని అనుకోకు!" అన్నాడు రాజా. "నా ఆస్తిపోతుందని భయపడి నాకు దూరమైపోవాలను కుంటున్నావు నువ్వు! అవునా?"


    దొరికిపోయిన దొంగలా చూసింది మీనాక్షి.


    "నేను అసలే కేటుగాడిని! అప్పనంగా దొరికిన పదివేల కొట్లనీ పోగొట్టుకుంటాననుకుంటున్నావా ఏమిటి?"


    "అందుకే దయచేసి నన్ను మర్చిపోండి!"


    "ఆస్తిని వదలను! అమ్మాయిని వదలను!"


    "మరి ఏం చేస్తారు?"


    "ఈ లోకాన్ని షేక్ చేస్తాను."


    అతను అన్నంత పనీ చేయ్యగాలడనీ అనిపిస్తూనే వున్నా గట్టిగా ఎటూ తేల్చుకోలేకపోయింది మీనాక్షి.


    హటాత్తుగా అన్నాడు రాజా. "ఐ లవ్ యూ మీనా ఐ లవ్ యూ!"


    ఏమీ మాట్లాడకుండా వుండిపోయింది మీనాక్షి.


    "ఐ లవ్ యూ అని నేను చెప్పినప్పుడు , ఐ లవ్ యూ టూ అని నువ్వు చెప్పటం సభ్యత! యామ్ ఐ రైట్?" అన్నాడు నవ్వుతూ.


    "నో యూ ఆర్ రాంగ్!" అంది మీనాక్షి.


    కొద్దిక్షణల పాటు మీనాక్షి మొహంలోకి చూస్తూ వుండిపోయాడు రాజా. తర్వాత నిట్టూర్చి "సరే! నీ చేత అలా అనిపించడానికి వేరే ఖరీదైన పద్దతి ఉపయోగించాల్సివస్తుంది" అన్నాడు. "ఏమిటదీ?" అని మీనాక్షి అడగక ముందే తన జేబులో నుంచి ఒక చిన్న సంచీ తీశాడు రాజా. అది పూర్వకాలం మనుషులు కాసులు వేసుకునే రకం చిన్న వెల్వెట్ సంచి! దాని మూతికి ఉన్న తాడుని లాగాడు రాజా. సంచీని అరచేతిలోకి వంపాడు. ధగధగ మెరుస్తున్న వజ్రాలు, వైడూర్యాలు , మరకతమాణిక్యాలు, పచ్చలు, కెంపులు అన్నీ అతని చేతిలో పడ్డాయి. ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తోంది మీనాక్షి. రాజా ఒక పచ్చని తీసి మీనాక్షికి కనబడేలా పట్టుకున్నాడు. చాక్లెట్ సైజులో ఉంది ఆ పచ్చ!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra