Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

  

     ఆమె ముఖంలో  ఇష్టంలేని సంగతులు తలుచుకుంటున్న భావం కదలాడింది. "ప్రియ మరణం తలుచుకోవడానికి కూడా మనసు అంగీకరించడం లేదు" బాధని మించిన అసహనం ఆమె కంఠంలో ద్యోతకమయింది.
   
    "అంటే..... ప్రియది సహజ మరణం కాదా?" అడిగింది ధరణి.
   
    "సహజ మరణమే. జ్వరం వచ్చింది" అంది పరిమళ.
   
    "డాక్టర్ మీరేదో దాస్తున్నారు. సరే.... ఇష్టం లేకపోతే చెప్పకండి. కానీ నేను ఇదంతా ఎందుకడుగుతున్నానో ఒక్కసారి ఆలోచించండి. నాకూ అదే ఈడు పాప ఉంది. ప్రియలాగే నాకు దూరంగా శుభోదయా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతోంది! ఇలా ఇంకొక తల్లి గుండె పగిలిపోకుండా, మరో చిన్నారి పువ్వురేకలు చిదమబడి వసి వాడిపోకుండా చూడాలనే తపనే నాలో ఇంత ఆసక్తిని కలగజేస్తోంది. వస్తా!" ధరణి లేచి నీలూ వైపు ఓసారి చూసి, బైటికి నడిచింది.
   
                                        *    *    *
   
    ధరణి మనసంతా వ్యాకులమైపోయింది. ఆఫీసులో కూడా మాటిమాటికీ నీలూ మాటలే గుర్తుకొచ్చాయి. శ్రీధర్ కి ఫోన్ చేసింది.
   
    "ఏమిటీ?" అడిగాడు శ్రీధర్.
   
    "అర్జెంటుగా పిల్లల్ని చూడాలని వుంది!" అంది.
   
    "సాయంత్రం వచ్చేస్తారుగా!" అన్నాడు.
   
    "నాకు ఇప్పుడే చూడాలనిపిస్తోంది" అంది.
   
    "ఏమైంది నీకూ?" శ్రీధర్ విసుగ్గా అడిగాడు.
   
    ధరణికి జరిగినదంతా చెప్పెయ్యాలనిపించింది. కానీ శ్రీధర్ కి చెప్తే గొడవ! అసలే తనకన్నా సెన్సిటివ్, అని ఆలోచించి ఊరుకుంది.
   
    "కొన్ని గంటలేకదా, ఓపిక పట్టు వచ్చేస్తారు" ఫోన్ పెట్టేశాడు శ్రీధర్.
   
    ధరణి కూడా నిస్పృహగా ఫోన్ పెట్టి చూసేసరికి ఎదురుగా బాలాజీ నిలబడి వున్నాడు. నున్నగా గుండు మెరుస్తోంది.
   
    "తిరుపతి వెళ్ళొచ్చాను. లడ్డూ తీసుకోండి మేడమ్" అన్నాడు. సెక్షన్ లో ఎవరు తిరుపతి వెళ్లొచ్చినా ఇలా లడ్డూ ప్రసాదం పంచి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. "థాంక్స్" ధరణి తీసుకుని నోట్లో వేసుకుంటూ ఉంటే 'తిరుపతి వెళ్దామన్నావుగా....ఎప్పుడూ?' అన్న పూజ మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు సెలవు దొరకదేమోనన్న దిగులు లేదు. వెళ్ళిరావాలి. 'ఇవాళే శ్రీధర్ తో కూడా మాట్లాడాలి' అనుకుంది.
   
    గీత పట్టుచీర కట్టుకొచ్చింది. తన పెళ్ళికి శుభలేఖలు పంచి పెడుతోంది. ఆమె ముఖంలో ఆనందం తెలిసిపోతోంది. మానవులు ఉద్యోగం, పెళ్ళి, ఆ తర్వాత పిల్లలూ-ఎచీవ్ మెంట్స్ అనుకుంటారు. కానీ చివరిది ఎచీవ్ మెంట్ కాదు, రెస్పాన్స్ బిలిటీ!
   
    "పెళ్ళి తిరుపతిలో అని ఎగ్గొట్టేవు సుమా! తప్పకుండా రావాలి!" శుభలేఖ మీద పేరు రాస్తూ అంది. "వస్తాం ఫ్యామిలీ అంతా రావడానికి ట్రై చేస్తాం" అంది ధరణి.
   
    "మొత్తం త్రీ వీక్స్ లీవ్ అప్లై చేశాను" అంది గీత.
   
    "ఇంక మొదలు లీవులు పెట్టడం తర్వాత మెటర్నిటీ లీవ్ పెడతావుగా!" నవ్వింది ధరణి.
   
    "నీ ఆశీర్వాదానికి థాంక్స్ కానీ అసలు నేను పిల్లల్నే కనదలుచుకోలేదు" అంది గీత.
   
    "అదేం?"
   
    "ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని దిక్కులేని వాళ్ళలా వదిలేస్తున్న మా వదినెనీ, అక్కనీ చూస్తూ కూడా ఇంకా పిల్లల్ని కనమంటావా? స్వేచ్చ ఎక్కువైపోయి ఆ పిల్లలు ఇష్టం వచ్చినట్లు తయారవుతున్నారు. నాకు ఎలాగూ ఉద్యోగం చెయ్యడం తప్పదు. అసలు అది చూసేగా మా ఆయన చేసుకుంటున్నది. ఇంక పిల్లలెందుకు చెప్పు?" విరక్తిగా అంది.
   
    ఆమె చెప్తున్న మాటల్లో నిజం ఉన్నా ధరణి మనస్సు చివుక్కుమంది. ఓ తెల్లకాగితం లాక్కుని రిజిగ్నేషన్ రాసిపారేద్దాం అనిపించింది. గీత మరోసారి పెళ్ళికి తప్పకుండా రమ్నని పిలిచి వెళ్ళిపోయింది. ఆఫీసు వదిలిపెట్టగానే ఆటోలో ఇంటికి వెళ్ళింది.
   
    అభీ చందూ వీపు మీదెక్కి ఆడుకుంటూ కనిపించాడు.
   
    "ఎప్పుడొచ్చావురా!" అని తమ్ముడ్ని పలకరిస్తూనే లోపలికి వెళ్ళింది. పూజ కోసం గదులన్నీ వెతుకుతూ "అభీ.. అక్క ఎక్కడుందీ?" అంది.
   
    "ప్రియా వాళ్ళింటి కెళ్ళింది" అన్నాడు వాడు. పిడుగుపాటు పడినదానిలా చూసింది ధరణి. "ఎందుకు పంపించారూ?" కోపంగా అడిగింది. చందూ అర్ధంకానట్లు చూస్తూ "నాతో ఏం చెప్పలేదు" అన్నాడు.
   
    "వెళ్ళు... వెళ్ళి దాన్ని అర్జెంటుగా తీసుకురా" అరిచింది ధరణి.
   
    చందూ వెంటనే వెళ్ళిపోయాడు. ధరణి అభినవ్ తో "ఎందుకు వెళ్ళిందీ?" అంది.
   
    "ప్రియ చచ్చిపోయిందని స్కూల్లో చెప్పారట. నిజమా కాదా అని చూడటానికి వెళ్ళింది" అన్నాడు అభి. చందూ వచ్చేవరకూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బైటకీ తిరిగింది ధరణి.
   
    చందూ ఒక్కడే వచ్చాడు. ధరణి కంగారుగా "ఏదీ?" అంది.
   
    "కనిపించలేదు. వాళ్ళ ఇంటికి తాళం వుంది!"
   
    ధరణి "పూ....జా...." అని కేకపెట్టింది. ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించాయి.
   
    "భయపడకు! నే చూసొస్తాను" చందూ మళ్ళీ బయల్దేరుతూ అన్నాడు.
   
    "ఆగు.....నేనూ వస్తాను....అభీ! డాడీ వస్తే అక్కని వెతకడానికి వెళ్ళాం అని చెప్పు!" అంటూ తనూ బయల్దేరింది.
   
    ధరణీ, చందూ, పూజ ఫ్రెండ్స్ అందరి ఇళ్ళలోనూ వెతికారు. పూజ కనిపించలేదు. ధరణికి ఏడుపు ఆగడం లేదు.
   
    "ఇంటికి వచ్చిందేమో ఓసారి చూసొద్దాం" అన్నాడు చందూ.
   
    ఇంటిముందుకొచ్చి నిలబడి ఒక్కక్షణం ముఖద్వారాన్ని చూసింది ధరణి. లోపలికి ప్రవేశించబుద్దికాలేదు. కూతురు లేని ఇంటిని ఊహించుకోలేకపోయింది. తిరుపతి రప్పించుకోవటం కోసం దేవుడు అటువంటి మంచిచేస్తాడని నమ్మకం కలగలేదు.
   
    ఏదైనా అవుతుందేమో అనుకుని భయపడటం కన్నా- అయిపోయింది అనుకోవటంలో రిలీఫ్ ఎక్కువ అక్క ఆలోచన తెలియని చందూ లోపలికి వెళ్ళాడు.
   
    ధరణి ఒక నిర్ణయానికి వచ్చినట్టు- గుండెల్నిండా గాలి పీల్చుకుని వెనుదిరిగింది. ఇంటిలోకి కాదు. స్కూలువైపుకి.
   
    ......
   
    ఆమె స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి గంటపట్టింది. ఆ చుట్టు ప్రక్కల దాదాపు నిర్మానుష్యంగా వుంది. మసకచీకట్లు అలుముకుంటున్నాయి. కీచురాళ్ళ శబ్దం తప్ప-అంతా నిశ్శబ్ధంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ "...ఎవరు కావాలి?" అన్న ప్రశ్న వినపడింది.

    వెనుకనుంచి అంత హఠాత్తుగా ఓ స్వరం వినపడేసరికి ధరణి ఉలిక్కిపడింది. వెనుక గూర్ఖా నిలబడి వున్నాడు. అతడు గూర్ఖాలా లేడు. అతడి గొంతులో వినపడిన కర్కశం-అతడి రూపానికి తగినట్టుగా వుంది! ధరణి ఒక్క నిముషం తడబడి వెంటనే సర్దుకుని, "మా పాప ఇక్కడే చదువుతోంది. చూడటానికి వచ్చాను" అంది.
   
    "అలా ఎప్పుడుపడితే అప్పుడు రానివ్వరు-"కొట్టినట్టు జవాబు చెప్పి, గేటు మూసేసాడు.
   
    ధరణి ఆశ్చర్యపోలేదు. ఆమె ఆ సమాధానాన్ని ముందే వూహించింది. అతడివైపోసారి చూసి వేగంగా వెనుదిరిగింది. అయితే రోడ్డు మీదకి వెళ్ళలేదు.
   
    వెనుకవైపుకు వెళ్ళింది.
   
    దాదాపు అయిదెకరాల స్థలంలో వున్నదా స్కూలు. ఆమె వెనుకవైపుకి వెళ్ళటానికి అరగంట పట్టింది. అప్పటికి బాగా చీకటిపడింది. ఆమె ఆగి, చుట్టూ పరికించి, ఎవరూ గమనించటంలేదని నిశ్చయించుకుని, కాంపౌండ్ వాల్ మీద చేతులేసింది.
   
    ఎప్పుడో చిన్నప్పుడు ప్రాక్టీసు చేసిన హైజంప్!!!
   
    ఊపిరి బిగపట్టి - ఒక్క గెంతులో లోపలికి దూకింది. వెనుకవైపంథా తుప్పలు వుండటంతో ఆమె కాళ్ళు గీసుకుపోయాయి. ఆమె పట్టించుకోలేదు. సన్నటి కాలిబాటని వెతికి పట్టుకుని, భవనాలదిశగా సాగిపోయింది.
   
    స్కూల్ కి కాస్త దూరంలో హాస్టల్ వుంది. స్కూల్ భవనం చీకటిగా వుంది. హాస్టల్ లో లైట్లు వెలుగుతున్నాయి. పిల్లలు చదువు ప్రారంభించినట్టున్నారు.
   
    ధరణి నెమ్మదిగా వెళ్ళి, కిటికీలోంచి లోపలికి తొంగి చూసింది. అందరూ నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. ఒక పాప కళ్ళు తుడుచుకుంటూ పుస్తకం మీద చూపు నిలపటానికి ప్రయత్నం చేస్తోంది. ధరణి మనసు ఆర్ద్రమైంది. ఇంటిమీదిబెంగతో ఆ పాప ఏడుస్తోందని గ్రహించటానికి ఆ తల్లి మనసుకి ఎక్కువ సమయం పట్టలేదు. సైనిక కవాతులో తప్పనిసరిగా పాల్గొనవలసివచ్చిన జవానుల్లా - పిల్లలందరూ అభావంగా పుస్తకాలు చేతుల్లో పట్టుకుని వున్నారు.
   
    ధరణికి కొడుకు గుర్తొచ్చాడు. ఒకరోజు అన్నం కలిపి పెడుతూంటే అభినవ్ అడిగాడు. "....చిన్నప్పుడు నువ్వు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మమ్మ ఇంట్లో వుండేదా?"
   
    తన తల్లి గురించి వాడు ఎందుకు అడుగుతున్నాడో అర్ధం కాక "ఆ!" అంది.
   
    "నీకు రోజూ ఇలాగే అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టేదా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra