"అంటి దగ్గర శ్రీవిద్య వుంటుంది. నేను మీతో వస్తాను అంకుల్! ఓ సారి ధైర్య రూం చూడాలని వుంది. ఆమె ఎక్కడ పడిపోయింది అంతా చూస్తాను" మహానంద వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెంటనే అడిగింది.
"సరేనమ్మా" అన్నాడు నిరంజనరావు. భార్యతో చెప్పి ఇంటికి బయలుదేరాడు మహానందతో కలిసి.
"మంచిపని చేశావ్" అన్నట్లు మెచ్చుకోలుగా చూసింది శ్రీవిద్య.
ధైర్య రూం చూసి విషయం తెలుసుకోవలనుకుంది మహానంద.
పరిశోధన మాసపత్రిక చదవడమే కాదు పరిశోధన చేయటం కూడా మహానందకి మహా ఇష్టం.
ఇప్పుడు ఆమె చేయబోయే పరిశోధనలో కొండను తవ్వి ఎలకను పట్టడమా! అంతుబట్టని రహస్యాన్ని చేధించటమా! ఆమెకే తెలియదు.
సరిగ్గా గంట తర్వాత నిరంజనరావు మహానంద తిరిగి వచ్చారు.
సావిత్రిని మామూలు మనిషిని చేయటానికి ఈ లోపల శ్రీవిద్య మాటలు చెపుతూ కూర్చుంది.
పరిశోధన లాంటి క్రైం మాసపత్రిక నవలలు తెగ చదవటంవల్ల నిత్యజీవితంలో కూడా వాళ్ అప్పుడప్పుడు లేడి డిటెక్టివ్ ల్లాగా కొండగుర్తులు కోడ్ మాటలు ఉపయోగిస్తుంటారు. స్నేహితురాళ్ళు ముగ్గురికి ఈ విద్య
13)
బాగా వచ్చు. కోడ్ తో సరదాగా ప్రవర్తించేవారు సరదాగా మాట్లాడుకునేవాళ్ళు.
మహానందను చూసి దురదపుడితే గోక్కున్నట్లు ముక్కు చివర గోక్కుంది శ్రీవిద్య. అలా గోక్కోవటం దురద పుట్టి కాదు. "ఏం చేశావ్!" ఏం తెలుసుకున్నావ్! ఏమయింది?" అన్న ప్రశ్నకి కోడ్.
చెవి లోపల దురద పుడితే వేలు చెవిలో దూర్చి కదిలిస్తారు కొందరు. అలా చేసింది మహానంద. అంటే అర్ధం" తెలుసుకున్నాను అని...."
మహానంద తెలుసుకున్న అ పరమ రహస్యం ఏమిటి? శ్రీవిద్యతో తర్వాత చెపితే గాని అదేమిటో తెలియదు.
శ్రీవిద్య ముక్కు చివర గోక్కోవటం మహానంద చెవిలో వేలు పెట్టుకుని కదిలించటం నిరంజనరావుగాని సావిత్రిగాని చూడలేదు. ఓ వేళ గమనించినా వాళ్ళకి అర్ధం కాదు. దురదపుడితే గోక్కోటంసహజం కాబట్టి అదెవరూ పట్టించుకోరు.
మహానంద శ్రీవిద్య మరో గంటసేపు కుర్చుని మళ్ళి రేపు వస్తామని వెళ్ళటానికి లేచారు.
అర్జెంట్ అయితే ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ యిచ్చింది మహానంద.
ఆసుపత్రిలో ధైర్య వున్న ఆ రూంలోంచి బయటికి వచ్చేముందు మహానంద ధైర్య మీదకి వంగి మృదువుగా ధైర్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ." ఎంతపని చేశావు ధైర్యా!" అనుకుంది.
ధైర్య చేతిని తన చేతిలోకి తీసుకుని పెదవులకానిచ్చుకుంది. శ్రీవిద్య.
అ తర్వాత స్నేహితురాళ్ళు యిరువురు తడిబారిన కళ్ళతో రూలోంచి బయటకికోచ్చారు.
నిరంజనరావు గేటుదాక వచ్చి వాళ్ళిద్దరిని సాగనంపాడు.
12
గౌతం రెండు విషయాలు తెల్చుకోవాలనుకున్నాడు'
ఒకటి.
హోటల్ ఇంద్రభవన్ కి వెళ్ళిన వరదరాజులు ఎటు వెళ్ళాడు?
రెండు.
తను పనిచేసే చోట శేట్ జీని అడిగి ఏదో ఒక చిన్న జాబ్ చూస్తానన్న వరదరాజులు జాబ్ చుదకపోగా అప్పటి నుంచి అసలు కనిపించకుండా ముఖం చాటెయ్యటం ఎందుకు
వరదరాజులుని కలిస్తే తప్ప ఈ రెండు విషయాలు తెలియవు. గౌతం పగలు ఎప్పుడు వెళ్ళినా వరదరాజులు రూంకి తాళం కప్ప వేళ్ళాడుతూ దర్శనం యిస్తున్నది.
వరదరాజులు రూంకి వస్తున్నాడా రావటంలేదా!
వరదరాజులు అనే శాల్తి వున్నదా మాయం అయిందా!
వరదరాజులు వున్న యింటికి కాస్త పక్కగా కొట్లు దూరంగా ఇళ్ళు ఉన్నాయి గాని ఆ యింటికి ఆనించి లేవు. ఓ పక్కగా వున్న కిళ్ళి షాపు అతన్ని అడిగాడు గౌతం. "రాత్రిళ్ళు వస్తున్నట్లున్నాడు. నిన్న మొన్న లైటు వెలుగుతుంటే చూశాను." అని చెప్పాడు అతను!


