Home » Nanduri vithal » Mamatha

 

    'ఏం లేదమ్మా కంకర రాయి క్రింద చెయ్యి నలిగింది.' అంటూ సర్ది చెప్పింది.
    ఆ రాత్రి లారీ హాస్పిటల్ కు చ్రేరేసరికి అర్ధరాత్రి అయింది. మెదడు చిట్లిందట. ఆపరేషను చేయాలన్నారు. శారడంమగారు , పావనీ శోకాలు పెడుతున్నారు. నర్సు లొచ్చి మందలించారు. చివరకు పెద్ద డాక్టరోచ్చి 'వీళ్ళద్దరినీ ఎక్కడి కన్నా తీసుకెళ్ళండి. వాళ్ళు యిక్కడుండి చేయగలిగిందేమీ లేదు' అంటూ హెచ్చరించాడు. హాస్పిటలు దగ్గరలోనే ఒక హోటల్లో గది తీసుకుని, బలవంతంగా ఇద్దరినీ అక్కడకు తీసుకు వెళ్ళాడు కోనేటిరావు.
    అప్పటికే కోనేటిరావుకు తెలిసింది రెండు రోజుల క్రితమే సీతమ్మ గారు పోయిందని, హోటలు లోకి వెళ్ళిం తర్వాత ఆవార్త బయటపెట్టాడు.
    కోయ్యబారిపోయింది శారదమ్మ గారు.
    'అయన ఎక్కడున్నారు ?' అంది పావని కాసేపటికి.
    'ఏమో, అతని విషయం ఎవరూ చెప్పటం లేదు.'
    'నేను ఏడవకుండా కూర్చుంటా అయన దగ్గరుండనివ్వమను' అంటూ క్షణ క్షణానికి బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నది శారదమ్మ గారు. 'ఆలా రానివ్వరండీ' అంటూ అతి బలవంతం మీద ఆపుచేయగలుగుతున్నాడు కోనేటిరావు.
    స్వామి ఏమైనట్లు?- ఆలోచించిన కొద్ది పావని మనస్సు చిందర వందరలై చిక్కుపడి పోతున్నది. తాను పొరపాటు చేయలేదుగనా? చేయరాని తప్పిదం చేయడం జరిగిందా? ఎందుకో మనస్సు కీడును శంకిస్తున్నది. అతని మనస్సు విరిగి పోయి -?  తలచుకొన్న కొద్ది భర్త మీద వల్లమాలిన జాలి పుట్టుకొచ్చింది. పెద్ద ఆశలు లేని అతి సాదా జీవితంలో తృప్తి పడ గల మనిషి. 'వచ్చింది చాలు పావనీ!- అమ్మా- నువ్వూ - నేనూ - పచ్చడి మెతుకులు తిన్నా సుఖంగా బ్రతకగలం. రోజుల కలిసొచ్చి నాలుగు ట్యూషన్లు దొరికితే ..' అంతకు మించిన ఆశలూ అభిప్రాయాలు లేని అల్ప సంతోషి. తన అదృష్టాన్ని పరీక్షించాలని తానె ఆరాట పడింది. దారిద్ర్యాన్ని అనుభవిస్తూ -- నిస్సారమైన బ్రతుకు వద్దంటూ మొరాయించి కేకలు పెట్టింది తన మనస్సు.
    నిద్రరాక కిటికీ లోంచి బయటకు చూసింది. బయట వరండాలో పడక కుర్చీలో సిగరెట్టు కాలుస్తూ, కాళాడించుకుంటూ పడుకున్న వ్యక్తీ కోనేటి రావని గుర్తుపట్టింది. ఏడ్చి ఏడ్చి తల్లి సొమ్మసిల్లిపడుకుంది. అది నిద్రకాదేమో . నిస్సేజమై నీరసించిన శరీరంలో చోటు చేసుకున్న ఒక రకమైన మత్తు. మృత్యుగర్భం లోంచి పుట్టిన ఒక శక్తి లేశం.
    'టీ తాగుతావా పావనీ" అన్నాడు కోనేటిరావు.
    'వద్దండీ.'
    అతని పిలుపులో - చూపులో తొణికిన ఆత్మీయత లో - అంతర్లీనంగా పడగలెత్తిన లాలనను దాచుకోలేక పోయాడు . 'కొంచెం త్రాగు. తల నొప్పి వస్తుంది.' అంటూ నడిచి వెళ్ళాడు బయటకు.
    ఎక్కడ స్వామి? ఎక్కడ కోనేటిరావు? కరవబోతున్న కాలనాగును కూడా ద్వేషించలేని మనస్సెక్కడ? నిస్సహాయంగా భయంగా గుండెలకు హత్తుకుని ఆదమరచి నిద్ర పోతున్న పసిగుడ్డును గూడా హతమార్చి -- ఆమె సౌభాగ్యాన్ని కూడా హరించడానికి యత్నించే మనస్సెక్కడ? రక్తాన్ని పంకిలం చేయాలను కుంటున్న ఆ కీటకాన్ని నలిపి కాలరాసే శక్తి తనకు లేకపోయిందే? పునాది కదిలి కంపిస్తున్న తను దాంపత్య సౌధానికి గొడ్డలి పెట్టు పెట్టాలని నిరీక్షిస్తూ -- తనకు సేవలు చేస్తున్నమనిషి పట్ల -- ఎంతటి కృతజ్ఞత చూపెట్టగలదు తను?
    'మీ ఆయన్ను గురించి అలొచిస్తున్నావా? ఏం భయపడకు. ఎక్కడికి పోతాడు? తిరిగి తిరిగి అతనే వస్తాడు- నేనున్నాను' అంటూ లాలనగా టీ కప్పు అందించ బోయాడు. బలవంత పెట్టాడు. తనని చూస్తున్న కొద్దీ అతని మనస్సు తరుక్కు పోతున్నదట! అన్నీ అనుభవించవలసిన వయస్సులో యిలా జరిగుతుందనుకోలేదుట తను!!!
    ఏం మనిషి?
    ఏం మనస్సు?
    మాట్లాడే శక్తి భగవంతుడు మనిషి కెందు కిచ్చాడు? స్వరూపం లేని మనస్సు కు రూపమిచ్చి చూపించడానికా? కప్పిపుచ్చి మరొక వేషం చూపించి మోస పుచ్చటానికా?
    'తర్వాత నువ్వు రావలసిన అవసరం లేదు' అంటూ ఆనాడు తల్లిని వెంట బెట్టుకు వెళ్ళిపోయాడు స్వామి. 'పోనీ' అనుకుంది. నిజంగా వెళ్ళిపోయాడేమో? కంపించింది భయంతో.  ఆ ప్రమాదం ఎదుట పడనప్పుడు -బాధల గురించి - దురదృష్టాల గురించి అమిత సాహసం ప్రదర్శిస్తూ -- నిబ్బరమైన కబుర్లలో తను తెగింపును చూపించాలని వెంపర్లాడే జబ్బు - మనిషి నరాల్లో వుంది. 'ఏమైనా సరే' అన్న తెగింపు - ఆ దురదృష్టం నిజంగా బయటపడినప్పుడుండదు.
    టీ త్రాగింది పావని.
    'నిద్ర రావడం లేదా?' అన్నాడు కోనేటిరావు.
    'వస్తుంది ' - కళ్ళు మూసుకు పడుకుంది. శరీరంలో రక్తం ప్రవహిస్తున్నట్లనిపించలేదు. గుండె నరాల్లోకి చిమ్ముతున్నది కేవలం భయం. ఆ భయం ఆమెలోని అభిజాత్యాన్ని - పౌరుషాన్ని కాల్చి హరించింది. దురదృష్టం నిప్పు లాంటిది. కఠినమైన లోహం తలవంచి కరిగిపోతుంది. లోహంలోని మాలిన్యం ఆ మహాగ్నిలో కాలి - కాలుష్యరాహిత్యాన్ని సాధించవచ్చు. అలిసిపోయిన మనస్సూ - శరీరం - చైతన్యం కోల్పోయి ముణుకు పోయాయి దుప్పటి ముసుగులో. పీడ కల  . అస్పష్టమైన రూపాలు కదులాడుతూ ఏడుస్తూ . పెద్ద పెట్రోలు మంట తనను చుట్టింది ఆశలా. తనను రక్షించటానికి నడుం కట్టి లోపలికి దూకిన స్వామి - ఎత్తుకుని బయటకు లాగాడు. కాలిపోయింది అతని ముఖం. రాలిపోయాయి అతని గ్రుడ్లు. చూపు పోయింది. తన కళ్ళు అతని వయ్యాయి. తన కోపం బ్రతుకంతా చీకటి చేసుకున్న భర్తను నడిపించుకుంటూ కొండె మెట్లెక్కుతున్నది తను. కనిపించక- మంచు పొరల చాటున పిలిచిన శిఖరాన్ని చేరాలని ప్రయత్నం. కాలు జారింది. తనను పట్టుకున్న స్వామి వళ్ళు తూలింది. అగాధం లో రాలిపోతున్నారిద్దరూ. కేక పెడుతూ లేచింది, మనస్సు. లేకలేక భయంకరంగా - గుండెల్లో గుచ్చుకున్న వాడి బాణపు దెబ్బకు విలవిల లాడిన పక్షిలా గిలగిల లాడింది శరీరం. రక్కింది కొరికింది తిట్టింది కేకలు పెట్టింది. మంచం మీద నుంచి క్రిందకు దూకి, గేటు దాటి బయటకు పరిగెత్తింది వెర్రిలా.

                                                              15

    'టైమెంతయింది.'
    'ఏమో'
    'పదకొండు దాటింది'
    'దాటనీ'
    'ఈ రాత్రి కిక్కడే పడుకుందామనుకుంటూన్నావా?'
    'నీకు అభ్యంతరం లేకపోతె?
    'నా అభ్యంతరం సంగతేముంది లే అక్కడ అందరూ. నీకోసం ఎదురు చూస్తుంటారు.'
    'నాకోసం ఎదురు చూసే మనిషి వెళ్ళి పోయింది.'
    'ఎందుకలా బెంబేలు పడిపోతావు ? పోయినవాళ్ళతో పాలెం గదా? పావని కంగారు పడుతుండాలి. వెళ్ళు బావయ్య పెందరళే యింటికి.'
    'వెళ్ళకుండా ఎంతకాలం ఇలా ఉండగలావ్? తల్లీ తండ్రీ పోవడమనేది నీ ఒక్కడీకే జరగడం లేదు గదా బావయ్యా ఈ ప్రపంచం లో?'
    'అది కాదు శ్రీదేవి'
    'ఏం కాదు?'
    'నీకు తెలియదు . ఎలా - ఎలా చెప్పను. చెప్పకుండా యెలా భరించను.'
    'నువ్వు ఆడపిల్లవు కాదు. బావయ్యా మగ మహారాజు. నిజానికి నాలాటి అబల కష్టాలు భరించలేక ఏడుస్తుంటే - నీలాటి వాడు కళ్ళు తుడిచి వోదార్చాలి. అటు వంటిది నిన్నే నేను వోదార్చాల్సివస్తుంది.'
    చేతులతో చెంపలు నిమిరి స్వామి చెక్కిళ్ళు తుడిచింది శ్రీదేవి. స్వామి ఏడ్చి ఏడ్చి ఒక్కసారి లేచాడు ఏదో బంధాన్ని త్రెంచుకున్నట్లు.
    "శ్రీదేవి! ఒక్కమాటడిగేదా?'
    'చెప్పు'
    ' చెప్పనా?'
    'సందేహమెందుకు బావయ్యా. ఇంత దూరం వచ్చాం జీవితంలో. చిన్నతనాలు సిగ్గులూ అన్ని ఎక్కడివక్కడ త్రెంచుకుని- చెప్పు. దాపరికం లేకుండా చెప్పు. నాకు అంత ఆత్మీయంగా కబుర్లు చెప్పే మనిషేవరూ లేరని నీకూ తెలుసు.'
    'నన్ను అపార్ధం చేసుకోకు శ్రీదేవి.'
    'ఉన్నమాట చెప్పటానికి మనిద్దరి మధ్యా యింత ఉపోద్ఘాతం కావాలంటావా?'
    'నువ్వు నాతొ వచ్చెయ్యగలవా శ్రీదేవి?'
    'బావా?'
    'ఔను.'
    'ఏమిటి నువ్వంటున్నది?'
    'అమ్మ పోయిన క్షణం నుంచీ అనుకున్న మాటే అంటున్నాను.
    'నీకేం మతి పోలేదు గదా?'
    'నువ్వు అతన్ని నిజంగా ప్రేమిస్తున్నావా?'
    'అతనంటే - వో మా సూర్యారావు గారినా?'
    'చెప్పు. అతన్ని వదిలి రాలేవా? బ్రతికి నంతకాలం మనం కలిసి వుందాం. ఎన్నడూ  నీకు అన్యాయం చెయ్యను. నమ్ము శ్రీదేవి.'

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra