Home » Yerramsetti sai » Bomma Borusu


    తను చేయగలిగింది ఒక్కటే! ఆఖరి ప్రయత్నంగా ఆమెను తీసుకువచ్చి ఆమె తన ప్రవర్తన మార్చుకుంటుందేమో పరిశీలించడం! ఒకవేళ అది వరకు లాగానే ఆమె తన మొండి పట్టువదలకపోతే ఆమెతో కోర్టుద్వారా సంబంధాలు తెంచుకుని నాగమణిని వివాహం చేసుకోవడం! అంతే! దానివల్ల అటు తన తల్లిదండ్రులను కూడా సంతృప్తి పరచినట్లుంటుంది. తండ్రి, తల్లీ ఈ మధ్య కాలంలో రెండుసార్లు తనకు నచ్చజెప్పడానికి వచ్చివెళ్ళారు. ఆమెను వెంటనే తీసుకురమ్మనీ, ఇలాపట్టుదలలు పెట్టుకోవడం మంచిదికాదనీ సలహాయిచ్చారు.
    నాగమణి గుర్తుకొచ్చేసరికి అతని మనసు కొంచెం బాధపడింది తొందరపడి బలవంతంచేసి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు అటు ఆమెకూ మనశ్శాంతి లేకుండాచేశాడు. ఒకవేళ ఆమె తన మనసు మార్చుకుని తనతోబుద్దిగా సంసారం చేస్తానంటే నాగమణి గతేమిటి మరి? ఆమె తనతో అదివరకులా స్వేచ్చగా మాట్లాడడం లేదు. అందువల్లే తనకూ ఆమెను చూస్తే తప్పుచేసినట్లు అనిపిస్తోంది. రాత్రి తొమ్మిదయిపోయాక ఇల్లుచేరుకున్నాడతను. ఉదయం ఎవరో తలుపుకొడుతున్నట్లు శబ్దమై మెలకువ వచ్చింది శ్రీనివాసరావ్ కి. లేచివెళ్ళి నిద్ర కళ్ళతోనే తలుపు తెరిచిచూశాడు.
    ఎదురుగ్గా తన తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు, వారందరి వెనుక హేమ, ఆమె చేతిలో పాప కనిపించారతనికి. మతిపోయినట్లయింది నిద్రమత్తంతా దెబ్బకు వదిలిపోయింది. అందరూలోపలకు నడిచారు మాట్లాడకుండా! మరుక్షణంలో ఇల్లంతా హడావుడిగా తయారయిపోయింది. ఆమె మామూలుగా తనపని తను చేసుకోవడం ప్రారంభించింది.
    ఎనిమిదవుతుండగా కాఫీ తెచ్చి అతనికందించింది ఆమెతో సంభాషణలు ఎలా ప్రారంభించాలో తెలీడంలేదతనికి ఇదంతా తన తల్లిదండ్రులు తీసుకున్న చొరవవల్లే జరిగిందని తెలుస్తూనే వుంది. బహుశా ఆమెను వాళ్ళు కాపురానికి రమ్మని బ్రతిమాలినా బ్రతిమాలి ఉండవచ్చు! అయితే తనేవారిని పంపించాడని ఆమె అనుకుంటే మాత్రం పెద్ద చిక్కే! తను మరింత చులకనయిపోతాడు ఆమె దృష్టిలో.
    హేమమాత్రం ఇదేమీ ఆలోచించడంలేదు. ఆమె అన్నిటికీ ఏ రోజో సిద్దపడింది. అసలు ఇక్కడికి రావాలని తను అనుకోనే లేదు. రెండుసార్లు తన అత్తమామలు రావడం, బ్రతిమలాడటంవల్ల తన తల్లిదండ్రులు కూడా మెత్తబడ్డారు. "ఒకవేళ శ్రీనివాసరావే తల్లిదండ్రులద్వారా ఈ విధంగా కబురు చేస్తున్నాడేమో! బహుశా అతగాడిపొగరు చాలావరకూ అణగిఉంటుందిలే!" అన్నాడు రామరాజు.
    "వెళ్ళికొద్ది రోజులుంటే మనది మాత్రం పోయిందేముందీ? మళ్ళీ అదివరకు పిచ్చి వేషాలేస్తే ఒక్క ఉత్తరం రాసిపారేయ్! మేము వచ్చి ఇంటికితీసుకొచ్చేస్తాం! ఆ తరువాత శాశ్వతంగా తెగతెంపులు చేసుకుందాం!" అంది తల్లి. తనకూ వారిని కాదనాలనిపించలేదు. ఉదయం నుంచీ చూస్తోంటే అతని విషయం ఏమీ అంతుబట్టటంలేదు. రాత్రి భోజనాలయాక పాపాయిని ఉయ్యాలలోపడుకోబెట్టిగదిలోకి నడిచింది హేమ. అప్పటికే గదిలో మంచం మీదపడుకుని వున్నాడతను.
    హేమ ఏదో పుస్తకం తీసుకుని చదువుతూకూర్చుంది కుర్చీలో.
    ముందు ఆమె మాట్లాడాలని అతనూ, అతనే మాట్లాడాలని హేమ ఎదురుచూడసాగారు.
    చివరకు శ్రీనివాసరావే మాట్లాడక తప్పలేదు.
    "ఇప్పటికయినా పంతాలు పోయినట్లేనా?" అన్నాడు ఆమెవేపు చూస్తూ.
    "ఏమో! మీకే తెలియాలి!" అంది హేమ పొడిగా "ఎలా తెలుస్తుంది? నువ్వంత దూరంగా వుంటే!" నవ్వుతూ అన్నాడతను. హేమ జవాబివ్వలేదు.
    లేచి ఆమె దగ్గరకు నడిచి రెండు చేతుల్తో ఆమెను లేవనెత్తికౌగలించుకున్నాడు శ్రీనివాసరావ్. ఆమె అయిష్టంగానే అతని కౌగిట్లో వదిగిపోయింది. రాత్రంతా మధురంగానే గడిచిపోయింది ఇద్దరికీ. అతను చూపుతున్న ప్రేమ, అతనికి తనమీద కలిగిన ఆకర్షణ ఇవన్నీ తాత్కాలికాలనీ ఏ క్షణాన్నయినా అవి వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం ఉందనీ అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే వుంది ఆమెకు.
    "పాపాయి అచ్చం నీ పోలికే కదూ?" అడిగాడు శ్రీనివాసరావ్.
    "ఏమో! అందరూ మీ పోలికే అంటున్నారు!"
    "ఊహు! నాకలా అనిపించడంలేదు!" ఆమె మాట్లాడలేదు.
    "ఇకనుంచయినా మనమధ్యగొడవలు లేకుండా ఉంటాయా?" అడిగాడతను.
    "నాకేం తెలుస్తుంది? మీరే చెప్పాలది!" గంభీరంగా అంది ఆమె.
    "అంటే అవన్నీ నామూలానే వస్తున్నాయంటావ్?అంతేనా?"
    "మళ్ళీ యిప్పుడెందుకు పాతవన్నీ తవ్వుకోవడం?" అసహనంగా అందామె. శ్రీనివాసరావ్ మాట్లాడకుండా ఊరుకున్నాడు.
    మర్నాడు ఉదయం ఇరువురి తల్లిదండ్రులూ ఊరు వెళ్ళిపోయారు. భోజనంచేసి శ్రీనివాసరావ్ ఆఫీసుకి బయల్దేరాడు.
    శంకరం బస్ లో కనిపించాడతనికి "ఇదేం బావుండలేదు!" అన్నాడు.
    "ఏది?"
    "ఇదే! అంత సంపాదన ఉన్నా కూడా ఏ మోటార్ సైకిలో కొనుక్కోకుండా యిలా బస్సుల్లో తిరగడం!"
    "కొంటానోయ్! తొందరేముందీ?" నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు.
    నవ్వుతూ అన్నా నిజంగా కొంటే ఎలా వుంటుందీ అన్న ఆలోచన ప్రారంభమయిందతన్లో! తన దగ్గర డబ్బులేని మాట వాస్తవమేకానీ హేమసంపాదించిన డబ్బంతా ఏమయినట్లు?ఆమె దగ్గరే ఉండి ఉంటుంది. ఆడదాని దగ్గర డబ్బు వుండడం ప్రమాదకరం! అది ఆమెకు లేని పోని అహంభావాన్ని కలుగజేస్తుంది. అసలు దేశంలో ఇన్ని విడాకులు ఇంతగా బరితెగించిపోవడాలూ జరుగుతున్నాయంటే ఆడదానికి అందుతోన్న ఆర్ధిక వనరులే కారణం కదూ! ఆ సాయంత్రమే ఆ విషయం హేమ దగ్గర కదపాలని నిర్ణయించుకున్నాడతను.
            
                                                                   * * * * *


    నాగమణి ఇప్పుడు శ్రీనివాసరావ్ గురించి ఆలోచించడం మానుకుంది. ఆ ఇంట్లో దిగిన కొద్దిరోజుల్లోనే ఆమెకు భవాని మంచిస్నేహితురాలయిపోయింది. ఇంట్లో భవానీ ఆఫీసులో చంద్రం ఆమెకు ఎంతో సన్నిహితులయిపోయారు.
    చంద్రంతో ఆమెకెంతో చనువుకూడా ఏర్పడింది. అతనికి కూడా తనంటే అభిమానం ఆఫీస్ లో అందరూ అతనిని తేలికభావంతో చూడడం తనకుతెలుసు. అందుకే ఎవ్వరితోనూ ఫ్రీగా మసల్లేకపోతున్నాడతను. అతననుభవిస్తోన్న దరిద్రమే అతని ఆ పరిస్థితికి కారణమని తను గ్రహించగలిగింది. అయితే అందరిలా అతనిమీద చిరాకు కలగలేదు తనకి. అతనంటే జాలి, సానుభూతి చోటు చేసుకున్నాయ్. సాధారణంగా ప్రతిరోజూ తమతోపాటు అతనికీ కాంటీన్ నుంచి కాఫీ తెప్పిస్తూంటూందామె.
    ఓ రోజు ఉదయమే ఆమె ఇంటికొచ్చాడతను. "ఏమిటి ప్రొద్దున్నే వచ్చారు?" అడిగింది నాగమణి.
    "నాకు అర్జంటుగా ఇరవైరూపాయలు అప్పుకావాలి!" అన్నాడతను సీరియస్ గా. నాగమణి మారుమాట్లాడకుండా లోపలికెళ్ళి తన సూట్ కేస్ లో నుంచి ఇరవై రూపాయలు తెచ్చి అతనికిచ్చింది.
    "చాలా థాంక్స్ నాగమణిగారూ! మీరెంత గొప్ప మనసుగలవారో నాకు అర్ధమయింది.
    నాతో అందరూ అన్ని పనులూ చేయించుకునే వారేగాని ఎప్పుడయినా ఎవర్నయినా పదిరూపాయలు అప్పు అడిగితే ఒక్కరూ ఇవ్వరు. అధవా ఎవరయినా ఇచ్చినా రెండో మూడో! అంతే! మీరు నా వల్ల ఏ సహాయాలూ పొందకపోయినా నాకింత గొప్ప సహాయం చేస్తున్నారు. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేనువస్తాను." కళ్ళనిండుగా చేరిన నీటిని తుడుచుకుంటూ వెళ్ళిపోయాడతను.
    చాలాసేపు నాగమణి అతని మాటలే తల్చుకొంటూడిపోయింది. ఆమెకు అతనిమీద అభిమానం మరింత ఎక్కువయింది. అయితే జీతాలు వచ్చిన తరువాత కూడా చంద్రం ఆ మొత్తం తిరిగి చెల్లించలేకపోయాడు. తనా విషయం ఏమాత్రం పట్టించుకోకపోయినా అతను అదే గుర్తుంచుకుని తనకు మొఖం చూపడానికి కూడా సిగ్గుపడుతున్నట్లు గ్రహించింది నాగమణి. సాధారణంగా రోజూ ఇద్దరూ కలిసే ఆఫీస్ నుంచి ఇల్లుచేరుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య అతను కావాలనే తనువెళ్ళిపోయేవరకూ ఆఫీస్ లోనే కూర్చుని ఆ తరువాత ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు.
    ఓ రోజుకావాలనే తనూ ఆఫీస్ లోనే ఉండిపోయింది నాగమణి. అందరూ వెళ్ళిపోయినా అతను కదలలేదు. నాగమణి ఎప్పుడూ వెళ్తుందా అని ఎదుర్చూస్తూ కూర్చున్నాడు. చివరకు నాగమణే అతని దగ్గరకు నడిచింది.
    "ఏమిటి ఈ మధ్య పాపం పని ఎక్కువయిపోయినట్లుంది మీకు?" అడిగిందామె.
    "ఆ-అవును-కొంచెం- వాసుదేవరావ్ డ్రాఫ్ట్ రాయమంటేనూ" తడబడుతూ అన్నాడతను తనముందున్న కాగితం మడిచివేస్తూ.
    "ఏదీ ఇంతసేపూ ఏం డ్రాప్ట్ రాస్తున్నారో కొంచెం చూడనీండి!" అతని చేతిలోని కాగితం చటుక్కున లాక్కుని చూసిందామె. దాన్నిండా ఏవేవో పిచ్చిగీతలున్నాయ్. ఓ మూల ఓ పిల్లిపిల్లబొమ్మ.
    "చాలా మంచి డ్రాఫ్ట్" నవ్వేస్తూ అందామె.
    అతను సిగ్గుపడిపోయాడు.
    "అబద్దాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నారు చంద్రంగారు?"
    "సారీ! తల వంచుకున్నాడు.
    "ముందు బయటకు పదండి! తరువాత సారీ చెబుదురుగాని. ఇద్దరూ ఆఫీస్ బయటకు నడిచారు. "చూడండి చంద్రంగారూ! మీరునాకు వెంటనే నా ఇరవై రూపాయలు తెచ్చివ్వాలని నేనన్నాన్నా? వెంటనే తిరిగి ఇవ్వలేకపోయినంత మాత్రాన అలా తప్పించుకు తిరగాల్సిన పనేముందీ? ఆ ఇరవై మీ దగ్గరుండటంవల్ల నాకు జరిగే నష్టమేముందీ? ఇప్పుడు కాకపోతే మరెప్పుడో మీ పరిస్థితి మెరుగయినప్పుడు ఇద్దురుగాని! అవసరాలనే వి ఎవరికయినా వస్తాయి....." అంది సానుభూతిగా అతని కళ్ళవెంబడి నీళ్ళుతిరిగినయ్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra