Home » Dr c. ananda ramam » Kanapadutaledu

"లవాడుకోడమంటే పోట్లాడుకోవడం. నేను ప్రత్యెకమైన పదాలుకా యిన్ చేస్తాను మీలాంటి దంపతుల కోసం. ఉత్తరం చదివావుగా! జీవన్ దగ్గిర కొచ్చిన పోలిసే యీ ఒరియాపంత్ అనడంలో సందేహం లేదు. ఏం చేద్దామనుకుంటున్నావు?"
"మనోహర్ గారికి చెప్పి కోణార్క్ దేవాలయం పరిసరప్రాంతాలు గాలింపిస్తాను."
"అవతలి వాళ్ళు తెలివి తక్కువవాళ్ళు గారు. పోలీసు వాసన కొట్టిన మరుక్షణం అక్కనుంచి వుడాయిస్తారు రాగాతో సహా ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. ముందు హాస్పిటల్ కి వెళ్ళి జీవన్ బి యిక్కడికి తీసుకునిరా!"
"నేనా!"
"నువు కాకపోతే నేనా? ఏం తోచక బోరుకొడుతున్న ఒకపూట సినిమాకి కంపెని గా తప్ప మరెందుకు పనికిరాడు జీవన్ నాకు" చటుక్కున ముఖం తిప్పుకోంది అణు. జలజ జీవన్ గురించి తేలిగ్గాను, చులకగాను మాట్లాడినప్పుడు తన కెందుకు యింత కష్టం కలుగుతుందో ఆమెకి అర్ధం కావడం లేదు. జీవన్ పట్ల తన మనసులో మంచి అభిప్రాయం వుండడం కారణమా! జీవన్ ని ఎవరేమన్నా భరించలేని వెర్రి ప్రేమే యింకా తనలో మిగిలి వుందా?
 ఏం ఫరవాలేదులే నీ బోటివాళ్ళు ఎప్పటికప్పుడు అతనికి దొరక్కపోరు జీవన్ కి దొరుకుతూనే వుంటార్లె" అంది.
జలజని చాలా పెద్ద దెబ్బ కొట్టాననుకొంది అణు. ఫకాలున నవింది జలజ.
"హైదరాబాద్ లో మీ అత్తగారూ, ఆడపడుచు నీ బోటి డాన్సర్లు సంసారాలు చెయ్యరని అడిపోసుకుంటున్నారు. అంచేత నీ బోటివాళ్ళు , నా బోటి వాళ్ళ కంటే ఏ విధంగానూ ఎక్కువగాదు."
"వాళ్ళ మాటలకూ కూడా విలువయియ్యాలా?"
"మై డియర్ ఫ్రెండ్! ఈ విలువలనేవి ఏ ఆకాశంలోంచో మన నెత్తి మీదకి వూడి పడలేదు. అన్నీ మన అవసరాలని బట్టి, ఆలోచనల స్థాయిని బట్టి మనం సృష్టించుకున్నవే. భర్త వేశ్యలతో తిరిగినా యింట్లోనే గానా బజానాలు ఏర్పాటు చేసుకున్నా ఉత్తమ ఇల్లాలులా గడప దాటకుండా భర్త గారి సేవలు చెయ్యటం మీ అత్తగారి దృష్టిలో గొప్ప విలువ. భర్త పుట్టింటికి పొమ్మంటే సావిత్రిలా తమ్ముడి దగ్గర కొచ్చేసి శోకాలు పెట్టడం మీ ఆడపడుచు దృష్టిలో గొప్ప  కాలం గడిచింది. ఆలోచనల ధోరణి దానితో బాటు సామాజిక వాతావరణం మారాయి.
నీ భర్త నీ ఆత్మగౌరవాన్ని మన్నించకపొతే ప్రేమలో నువు నిజాయితీ వున్నట్లే, అతడు నిజాయితీగా వుండకపోతే అతడితో కలసి వుండక్కర్లేదనుకున్నావు నువు. అది నీ ఆధునికత, ఏం తోచనప్పుడు ఒక మగాడితో కలిసి సినిమా కెళ్ళడంలో తప్పు లేదనుకున్నాను నేను. ఇది నా ఆధునికత. ఈ క్రమంలో ఏది ఎక్కువ ఏది తక్కువ? ఏది మంచిది, ఏది చెడ్డది?"
"రాగకి ఇద్దరు మమ్మిలు అని నేర్పించడం కూడా ఆధునికతలో ఒక భాగమేనా?"
మళ్ళీ నవింది జలజ.
"ఎమోషనల్ స్ట్రెస్ మనిషిని బలహినపరుస్తుందని ఎక్కడో చదివాను. నీ విషయంలో అది నిజమనిపిస్తోంది. జీవన్ బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుని, అతడిని ఒక వ్యాపకంలో కుదురుగా నిలవడానికి అతడు చేసిన అప్పులు తీర్చడానికి చాలా శ్రమ పడ్డావు. ఆ శ్రమ వల్ల బహుశా నీకు తెలియకుండానే నీ నిబ్బరం తగ్గి వుంటుంది. అందుకే రాగ యిద్దరూ మమ్మీలు అనగానే సందర్భం తెలుసుకోకుండా కోపం తెచ్చుకున్నావు. అప్పటికి రాగ చాల చిన్నపిల్ల. అప్పుడప్పుడే మాటలోస్తున్నాయి. ఆరోజు రాగని మాతో పార్కు కి నేనే తీసుకెళ్ళాను. నువు పిచ్చిదానివి చెప్పానుగా నిబ్బరం పోగొట్టుకుని అలోచిస్తున్నావని నిజంగా జీవన్ పట్ల నువనుకునే ఉద్దేశమే నాకుంటే రాగని వెంట తీసుకెళ్తానా? ఆరోజు కబుర్ల మధ్య రాగకి ముద్దుగా రెండు, ఇద్దరూ అనే మాటలు నేర్పించాను నేనే. "మేక చెవులేన్ని?" "రెండు" "నీ కాళ్ళేన్ని" "రెండు" "నీ చేతులేన్ని?" "రెండు" "నీ కళ్ళేన్ని" "రెండు" అలా అలా చెప్పిస్తున్నాను. అది ఎంతవరకూ పట్టుకుందో చూడాలని "నీకు మమ్మీలెందరు?" అన్నాను. గాడిలో పడిపోయిన రాగ "రెండు" అంది. నేను నవుతూ "రెండో మమ్మీ ఎవరు?" అన్నాను దానికేం తోచక "నువే" అంది. మేము నవేసుకున్నాము ఆ విషయానికప్పుడు అంత ప్రాముఖ్యత నివలేదు. ఇదంతా మర్చిపోకుండా నీకు చెప్పుతుందని గాని, నువు దాన్ని మరోరకంగా తీసుకుంటావని గాని అనుకోలేదు."
"ఇంతకీ నువనే దేమిటి? భర్త భార్య నాహనించకుండా మరొకరితో సినిమా కెళ్ళి పొతే చిరునవ్వుతో చూస్తూ వూరుకోవాలనా?"
"ఊరుకోమని నేననలేదు తెలుగు నవలల్లోని హీరో హీరోయిన్ల లాగ మనసు విప్పి మాట్లాడుకోకుండా అపార్ధాలు పెంచుకోవద్దంటాను. నా పట్ల జీవన్ ఉద్దేశమేమిటో, నాతో సినిమా కెళ్ళడంలో అతని మేటివ్ ఏమిటో స్పష్టంగా అతడినే అడిగి వుండవలసింది. భార్యగా నీకా అధికారం వుంది."
"అడిగితే ఏముంది? మాములు స్నేహమే అంటారెవరైనా"
"భార్యా భర్తల మధ్య ఆ మాత్రం కనీసపు విస్వసమేనా లేని ప్రేమ వివాహాలు మీవి" వెటకారంగా నవింది జలజ.
"పోనీ అలా అంటాడనే అనుకుందాము అపుడు నువు "సాధారణ స్నేహభావంతోనైనా యిలా సినిమాలకి, షికార్లకి తిరగడం నాకు నచ్చదు" అని చెప్పి వుండవలసింది. అది శృతి మించి రాగాన పడ్డమే గాకుండా మొదట్లోనే చెప్పుండ వలసింది నూరు తిట్ల బ్రాహ్మడి కధ విన్నావా? ఒక బ్రాహ్మడి భార్య ఎప్పుడూ అతన్ని తిట్టిపోసేదట. ఒకనాడతడు అతని స్నేహితుణ్ణి భోజనానికి పిల్చాడట." ఈ ఒక్క రోజుకి నా స్నేహితుడి దగ్గర నా పరువు నిలబెట్టడానికి నేను తిడతాను నువు పడు." అని ప్రాధేయపడ్డాడట ఆ మహా యిల్లాలు నూరు తిట్ల వరకు కన్సెషన్ యిచ్చి ఆపిన ఒక్క మాటైనా పడనని ముందే వార్నింగ్ యిచ్చేసింది.
తన తిట్లన్నీ భార్య సహనంతో భరిస్తోందన్న పారవశ్యంలో ఆ బ్రాహ్మణుడు నూరో తిట్టు దాటిపోయి నుటోక్కటి చేరుకున్నాడు. ఆ తిట్టు వింటూనే ఆ సాది లలామ పులుసు కుండతో మొగుడి నెత్తిన మొత్తిందట. అలాగే నువు కూడా మేము షికార్లకెళ్తే వూరుకున్నావు షాపింగ్ కెళ్ళినా గొడవ చెయ్యలేదు. తీరా సినిమా కెళ్ళేసరికి ఏకంగా తెగ తెంపులు చేసుకుని వెళ్ళిపోయావు నీకు కోపం వచ్చినా సరే. ఇది నాకెంత మాత్రం నచ్చలేదు."
"నా మానసిక సంఘర్షణని నా అయిష్టాన్ని అతడే అర్ధం చేసుకుంటాడని ఆశ పడ్డాను."
"అరె! నువంత వండర్ ఫుల్ పూల్వా?" ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంది జలజ చురుక్కున చూసింది అణు.
"లేకపోతే ఏమిటి? చల్లపల్లిలో భూత్ బంగాళాని, అద్ద్దాల గదిని, ఆ భూత్ బంగాళాలో గడచినా శతాబ్దాల నాటి స్త్రీ భూతంలా తిరగాడే మీ అత్తయ్యని చూశాక కూడా జీవన్ ఏ వాతావరణంలో పుట్టి పెరిగాడో నీ కర్ధం గాలేదా? కేవలం నిన్ను మరొక్కసారి చూడటానికి సునాయాసంగా పదివేలు ఖర్చు పెట్టిబప్పుడైనా అది అండర్ లైన్ తన దగ్గర డబ్బు లేనపుడు- అప్పుడైనా అతడెంత దూరాలోచన లేనివాడో నీ కర్ధం గాలేదా? పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడైనా నీ ముందు ఆర్ధిక పరిస్థితి విప్పి చెప్పకపోయినా అతడు ఎంత దురభిమానో వూహించలేదా?
నువు వాస్తవ పరిస్థితి గ్రహించి సమస్యల పరిష్కారానికి పూనుకున్నప్పుడు నీకు కృతజ్ఞత చూపడానికి మారుగా నీ మీద కోపం తెచ్చుకున్నప్పుడైనా అతడేలాంటి మధ్యా విలువల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాడో గ్రహించాలేదా? ఇప్పటి వరకు నువు అతడ్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాకే యిన్ని బలహీనతల మధ్య మినుక్కుమినుక్కుమనే స్వచ్చమైన పసి మనసుని గుర్తించి పెళ్ళి చేసుకున్నావనుకున్నాను కాని ఇదేమిటి? నా అంచనాలన్నీ తల క్రిందులు చేసేస్తూ మనసులో పసితనాన్ని నువు సృశించగలిగితే అతడు నీ చేతిలో కీలు బొమ్మ అని యిప్పటికి నీకింకా అర్ధం కాలేదా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra