Home » Mainanpati bhaskar » Bhama Kalapam

 

    అతను కళ్ళప్పగించి భోజనం ప్లేటు వైపు చూస్తున్నాడు.

 

    కాబేజీ కూర, కూటు, బీట్ రూట్ పెరుగు పచ్చడి.

 

    పెరుగులో రక్తం కలిపినట్లుగా ఎర్రగా ఉంది బీట్ రూట్ పెరుగు పచ్చడి!

 

    భయం ఒక్క తెరలా వచ్చి అతని కడుపు కుదిపేసింది. ప్రయత్నపూర్వకంగా అదుపులోకి తెచ్చుకున్నాడు.

 

    "మీరు డిన్నర్ ఎంజాయ్ చెయ్యటం లేదు. ఏమి ఆలోచించకండి. సరదాగా ఉండండి" అంది సుదీర.

 

    ఒక అప్పడాన్ని కొంచెం తుంచి నోట్లో పెట్టుకున్నాడు భరత్.

 

    వెయిటర్ అందమైన కప్పుల్లో ఫ్రూట్ సలాడ్ తెచ్చి పెట్టాడు. దానిలో గడ్డలాగా, ఎర్రగా వున్న జెల్లి!

 

    ఎర్రటి మంసఖండంలాగా!

 

    దాన్ని చూడగానే ముందుకు వంగిపోయి, టేబుల్ కింద వామిట్ చేసుకున్నాడు భరత్.

 

    డైనింగ్ హల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కొంతమంది మొహం వికారంగా పెట్టి, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుదీర మొహం అదోలా అయిపొయింది.

 

    మేనేజరు వెళ్ళి డాక్టరుని పిలుచుకు వచ్చాడు. డాక్టరు వచ్చి ఇంజక్షను ఇచ్చాక, గదికి వెళ్ళి నీరసంగా పడుకుని వుండిపోయాడు భరత్.

 

    మోకాళ్ళలో తలపెట్టి శున్యంలోకి చూస్తూ, అతని పక్కనే కూర్చుని రాత్రంతా అలాగే ఉండిపోయింది సుదీర.

 

    వాళ్ళ గదికి అటువైపు ఉడిపి దంపతుల రూము. ఇటూ వైపు సర్జార్జిల జంట.

 

    ఆ పంజాబీ అమ్మాయికి బొత్తిగా బిడియం లేనట్టు వుంది. అర్ధరాత్రి దాటాక, ఆ అమ్మాయి హర్షాతిరేకంతో వేసిన కేకలు అస్పష్టంగా వినబడటం మొదలెట్టాయి.

 

    ఇటువైపు గదిలోంచి ఉండి ఉండి సంకోచంగా గాజుల గలగల.

 

    ఇంతకాలం నుంచి తనని చూసి తక్కిన వాళ్ళు, జెలసితో ఏడవడమే తెలుసు సుదీరకి.

 

     ఇపుడి అనుభవం కొత్తగా ఉంది.

 

    కొందరికి కొన్ని ఉంటాయి. తనకి అన్ని ఉన్నాయి. డబ్బు, చదువు, అందచందాలు , ఇష్టంగా చూసుకునే తల్లిదండ్రులు, బట్టలు, నగలు, కార్లు, బంగళాలు, తోటలు, నౌకర్లు, చాకర్లు-

 

    ఇన్ని ఉండి ఇంకొకళ్ళని చూసి అసూయపడవలసిన అవసరం వస్తుందని కలలో కూడా అనుకోలేదు తానెప్పుడు!

 

    ఇవాళ మొదటిసారిగా జెలసి అనిపిస్తోంది- ఆ పంజాబీ అమ్మాయి పావురంలా కువకువ చేస్తున్న శబ్దాలు వుంటుంటే.

 

    ఆ రాత్రి అలా తెల్లారిపోయింది.

 

    "ఈ ఊటి వాతావరణం మీకు సరిపడినట్లు లేదు. గోవా వెళ్ళిపోదాం" అంది సుదీర మర్నాడు పొద్దున్నే. నేరస్తుడిలా చూశాడు భరత్.

 

    వెంటనే సూట్ కేసులు సర్దేసింది సుదీర.

 

    గోవా ఒబరాయ్ బాగ్ మాలో దిగారు. బీచ్ లో పాలకోవాల్లాంటి అమ్మాయిలు, మల్గోవా మామిడి పళ్ళలాంటి అబ్బాయిలు. శృంగార భరితంగా ఉంది వాతావరణం.

 

    ఆ సముద్ర తరంగాల్లా కోరిక ఉదృతంగా ఎగసి పడవలసిన సమయంలో కూడా ఎండిపోయిన నదిలాగ స్తబ్దంగా వున్నాడు భరత్.

 

    అక్కడ నుంచి మళ్ళీ దిశ మార్చుకుని కోవలం బీచ్ కి వెళ్ళారు. కేవలం కొబ్బరిబొండాలు తగాడంలోనే గడిచిపోయింది అక్కడ. లేత కొబ్బరి ముక్కలా ఉన్న సుదీర అందం భరత్ లో చలనం తెప్పించలేకపోయింది.

 

    అక్కడ నుంచి తెక్కాడి వైల్డ్ లైఫ్ శాంక్చుయరి, చుట్టుతా దట్టమైన అడవి. మధ్యలో కాటేజీ.

 

    ఆరోజు కొంచెం మామూలు మూడ్ లోనే ఉన్నాడు భరత్. అంత మాత్రానికే సంతోష పడిపోయింది సుదీర. ఆ సంతోషంలో తనకి భోజనం కూడా సరిగా సహించలేదు. ఎప్పుడెప్పుడు గదిలోకి వెళ్ళిపోయి అతని చేతుల్లో వాలిపోదామా అని వుంది తనకి.

 

    "నువ్వు భోజనం సరిగా చేసినట్లే లేదు. ఆకలి తీరిందా?" అన్నాడు భరత్.

 

    "ఉత్త భోజనంతో ఆకలి తీరుతుందా?" అంటూ భావగర్భితంగా అతని వైపు చూసింది సుదీర.

 

    "ఇంకేమన్నా కావాలా?" అన్నాడు భరత్ యధాలాపంగా.

 

    "యా! ఐ వాంట్...." ఫక్కుమని నవ్వి అతన్ని వాటేసుకుని మిగతా మాట చెవిలో చెప్పింది సుదీర.

 

    తన చెవులని తనే నమ్మలేనట్లు చూశాడు భరత్.

 

    "ఏమిటి అమ్మాయి! బొత్తిగా సిగ్గు లేదే అనుకుంటున్నారా? అమ్మ దగ్గరా, మొగుడి దగ్గరా సిగ్గుపడితే ఆకలి తీరదు" అంది సుదీర.

 

    సందేహంగా ఆమె చుట్టూ చేతులేశాడు భరత్. ఆమె కళ్ళు అరమోడ్పుగా అయిపోయాయి. అతని ఉపిరికి ఆమె ముంగురులు నెమ్మదిగా అటూ ఇటూ కదులుతున్నాయి. అతని గుండెల మీద గుబురు వెంట్రుకలు ఆమె చెంపలకి గుచ్చుకుంటూ గగుర్పాటు కలిగిస్తున్నాయి.

 

    వాళ్ళిద్దరూ హానిమూన్ కి వచ్చిన తరువాత , మొదటిసారిగా అతనిలో చలనం వచ్చింది. అతను ఆమెకి మరి కొంచెం సన్నిహితం కాబోయేటంతలో.

 

    అడవిలో చిరుత గాండ్రించింది. వెంటనే హృదయ విదారకంగా ఒక జింకపిల్ల పెట్టిన చివరి కేక. చిరుతప్రాయంలోనే చిరత పులికి ఆహారం కాబోతూ ఆ ప్రాణి పెట్టిన చావు కేక!

 

    దయాకర్ ఎలుగెత్తి అరుస్తున్నట్లు అనిపించింది భరత్ కి. ముడుచుకుపోతూ , సుదీర కౌగిలి విడిపించుకుని , దూరంగా వెళ్ళిపోయాడు.

 

    పెదిమలు కొరికి పట్టి, ఆగ్రహాన్ని దుఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించింది సుదీర. "గాడ్డామిట్! వై ఆర్ యూ అవాయ్ డింగ్ మీ? నన్నెందుకిలా తప్పించుకు తిరుగుతున్నారు మీరు?" అంది వణుకుతున్న గొంతుతో.

    
    "సారీ సుదీరా! నా మనసు బాగా లేదు."

    
    చటుక్కున అతని దగ్గరికి వచ్చింది సుదీర. "భరత్! అలా ఉండకండి! ఎంత హుషారుగా ఉండవలసిన సమయం ఇది! సూట్ కేసు నిండా బట్టలు, బ్రీఫ్ కేసు నిండా డబ్బు, ఒంటినిండా వయసు. ఇవన్ని , ఇదిగో ఈ అడవిలో కాస్తున్న వెన్నేలలాగా వృధా అయిపోవలసిందేనా?"

 

    మాట్లాడకుండా వింటున్నాడు భరత్. అతని శరీరం సన్నగా కంపిస్తుంది.

 

    చరచర బాత్ రూములోకి వెళ్ళిపోయి, చన్నిళ్ళ షవర్ అన్ చేసింది సుదీర. షవర్ తో బాటు ఆమె కళ్ళు కూడా వర్షించాయి ధారగా .

 

    చన్నిళ్ళు ఆమె శరీరంలోని తాపాన్ని కొద్దిగా తగ్గించగా, కారిన కన్నీళ్ళు ఆమె మనసులోని భారాన్ని అతి కొద్దిగా కూడా తగ్గించలేకపోయాయి.


                                                                        ------------

 

    "హానిమూన్ కి వచ్చాం. వచ్చిన పని కానేలేదు. వేరే పనులన్నా చూసుకుని వెళ్దాం. డిల్లిలో నాకు కొంచెం బిజినెస్ ఉంది." అంది సుదీర. ఆమె గొంతులో వెక్కిరింపు చోటు చేసుకుంది కొత్తగా.

 

    తను అప్పుడే, అక్కడే చనిపోతే బాగుండు అన్నంత అవమానం కలిగింది భరత్ కి.

 

    డిల్లిలో సుదీర పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ బిజినెస్ ఉమన్ గా పగలంతా తన వ్యవహారాలూ పూర్తీ చేసుకుని,  సాయంత్రం షాపింగ్ కి బయలుదేరింది. ఆమెకి ఎస్కార్టులాగా వెంట వెళ్ళాడు భరత్.

 

    పెద్ద షాపింగ్ ఆర్కేడ్ కి వెళ్ళారు.

 

    "డిల్లిలో మంచి లెదర్ వస్తువులు దొరుకుతాయి." అంది సుదీర. మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నట్లు.

 

    "అలాగా!" అన్నాడు భరత్. కానీ, అప్పటికే అతని మొహం కొంచెం అప్రసన్నంగా అయింది.

 

    అతి మృదువుగా , అతి సుందరంగా ఉన్న కిడ్ లెదర్ బాగ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది సుదీర.

 

    మొహం చిట్లించాడు భరత్. "వద్దు సుదీర! అది కొనొద్దు!" అన్నాడు బతిమాలుతున్నట్లు.

 

    ఆశ్చర్యంగా చూసింది సుదీర. "ఏం?"

 

    "ఆ చర్మం ఎలా వస్తుందో తెలుసా సుదీరా?"

 

    "అది గొర్రెపిల్ల చర్మం. నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా?"

 

    "ఆ గొర్రె పిల్లను ఎంత దారుణంగా హింసించి చర్మం ఒలుస్తారో తెలుసా సుదీరా? ఒక జాతి గొర్రె వుంటుంది. అది కడుపుతో ఉండగా, నెలలు నిండక ముందే దాన్ని ఇనుప చువ్వతో కొడతారు. ఆ బాధకి ప్రసవిస్తుంది గొర్రె. అప్పుడే పుట్టిన ఆ పిల్లని చంపకుండానే తోలు ఒలుస్తారు. అది చచ్చాక తోలు అంత మృదువుగా ఉండదుట. చంపకపోతే ఒలిచిన చర్మం సిల్కులా ఉంటుందిట. చెప్పలేనంత ఖరీదు అది. ధనవంతుల విలాసాల కోసం దుర్భరమైన చావు చస్తాయి ఆ గొర్రె, దాని పిల్లనూ."

 

    అతన్ని చిత్రంగా చూసింది సుదీర. "మరి అంత సున్నితంగా ఆలోచిస్తే ఎ పని చెయ్యలేం!"

 

    "ప్లీజ్ సుదీరా! ఆ హ్యాండ్ బాగ్ కొనకు! నా తృప్తి కోసం!"

 

    నిరసనగా నవ్వి , దాన్ని కౌంటర్ మీద పెట్టేసింది సుదీర. పక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ చాలా రకాల పెర్ ఫ్యూమ్ లూ, క్రిములూ, లోషన్ లు వున్నాయి. ఒక అందమైన సీసాలో వున్న సెంటుని సెలెక్ట్ చేసుకుంది సుదీర.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra