Home » Suryadevara rammohan rao » Aaro Rudrudu

 

    "నిన్నే... మెట్లు దిగు" గద్దించిందావిడ.
    
    "బామ్మగారీవేళ కొత్త పదం కనిపెట్టినట్టున్నారు.... బామ్మగారూ! శతృఘ్న ఈవేళేం చేసాడో తెల్సా... క్రాస్ రోడ్స్ దగ్గర" ఒళ్ళంతా వంకర్లు తిరిగిపోతూ ఏదో చెప్పబోయాడు కూర్మం.
    
    "బుచ్చికి నంగనాచి తోడని- ఒరేయ్ కూర్మం! మాట్లాడకుండా ఆ సరుకుల్ని లోనబెట్టు....వెళ్ళు పో" కసిరిందావిడ నోటిని చేత్తో మూసుకుంటూ గప్ చిప్ గా ముందుకెళ్ళిపోయాడు కూర్మం.
    
    "ఏంటి బామ్మ... ఏంటి కథ...." అమాయకత్వాన్ని నటించాడు శతృఘ్న.
    
    "ఒరేయ్ పెసరబద్ద బడుద్దాయ్! ఇలారా" సోఫామీద కూర్చుంటూ పిల్చింది బామ్మ.
    
    "బామ్మా! నువ్వు ఇన్ని కొత్త కొత్త పదాల్ని ఎక్కడ నుంచి సృష్టిస్తావ్- ఒక్కసారి చెప్పు" పిల్లిలా నడుచుకుంటూ ఆమె దగ్గర కొస్తూ అడిగాడు శతృఘ్న.
    
    "ఒకడు నల్లకుక్కకి వెండి గరిటె కట్టాట్ట....ఎందుకో తెలుసా-చెప్పరా డి.సి.పి."
    
    "ఇంకెవరయినా నన్నలా పిలిస్తే... నేనేం చేసేవాన్నో తెలుసా?"
    
    "ఏం చేస్తావ్? కాళ్ళూ, చేతులూ విరిచేసి నిచ్చెనకు కట్టేసి ఊరేగిస్తావ్ అవునా!"
    
    "కరెక్టు.... కరెక్టు... నేను ఎవరనుకున్నావ్... డి.సి.పి.నే బామ్మా...కాస్త గౌరవం చూపవే."
    
    "మాట మార్చకు- నేనడిగిందానికి జవాబు చెప్పు" సీరియస్ గా అందావిడ.
    
    "నల్లకుక్కకి ఎవడయినా వెండి గరిటె కడతాడటే- కడితే ఎవడయినా....కుక్క తోకకి కడతాడు" చిరాగ్గా అన్నాడు శతృఘ్న.
    
    "నీలాంటోడు మనవడయితే- నాలాంటిది వెండి గరిటె కట్టాల్రా బడుద్దాయ్."
    
    "నేను వీధిలో ఫైర్ బ్రాండ్ నైతే ఇంట్లో నాపాలిట ఫైర్ బ్రాండ్ వి నువ్వు కొత్త, కొత్త పదాలు సృష్టించి అరుస్తావే తప్ప అసలేం జరిగిందో చెప్పకూడదటే-" ఆమె వడిలో తలపెట్టుకుని పడుకుని, చిన్నపిల్లాడిలా గారంగా అడిగాడు శతృఘ్న.
    
    "వాళ్ళెవర్తోనో తగువు తెచ్చుకున్నావ్....ఎవడ్నో పెద్దాడ్ని...బట్టలిప్పించి నడిరోడ్డు మీద ఊరేగించావ్... కోర్టులో కేసు గెలవలేదని....కోపంతో శెలవ్ పెట్టేశావ్. అసలేంట్రా ఇదంతా.... వాళ్ళు రౌడీవెధవలట కదా! వాళ్ళ ద్వారా నీకెప్పుడు, ఏం ప్రమాదం జరుగుతుందోనని నేహడలి ఛస్తుంటే..."
    
    ఆ గొంతులోని బాధను అర్ధం చేసుకున్నాడు శతృఘ్న.
    
    తల్లీ, తండ్రీ యాక్సిడెంట్ లో చనిపోయిన దగ్గర్నింఛీ, తనని కంటికి రెప్పలా కాపాడిన బామ్మ... ప్రాణ సమానంగా తనని ప్రేమించే బామ్మ... అభిమానాన్ని కోపం ద్వారా వింత వింత మాటల ద్వారా తప్ప మరే విధంగా వ్యక్తం చెయ్యలేని వింత మనస్తత్వం గల బామ్మ.
    
    శతృఘ్నకు కళ్ళు చెమర్చాయి.
    
    "నీ తిట్లు వినకపోతే నాకు ఇంట్లో వున్నట్టుండదే బామ్నా!"
    
    అలా అంటున్న మనవాడివేపు ప్రేమగా చూసి, ఆత్మీయంగా జుత్తు నిమిరి, "ఒరేయ్... కన్నా.... కొడుకువైనా... మనవడివైనా నువ్వేకదరా. నేనెవరికోసం బతుకుతున్నాను చెప్పు ఆఁ.... నువ్వు చక్కగా ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకుని, బృందావనం లాంటి ఈ ఇంట్లో రాధాకృష్ణుల్లా తిరుగుతుంటే చాలురా ఈ జన్మకది చాలు."
    
    "ఓస్... ఇంతేకదా... మంచి తెలుగు రాధను చూడు. ఈ బీహార్ రాధాలు మనకు నప్పరు."
    
    అదే సమయంలో కిచెన్ రూమ్ లోంచి పరుగు పరుగున వచ్చాడు కూర్మం.
    
    "బామ్మగారూ! రాధాకృష్ణులంటారేంటండీ బాబూ....ఆ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కాదు రాధ కృష్ణుడికి పెళ్ళాం కాదు అత్తట....ప్రేమించిన అత్త....తో పెళ్ళేంటండీ బామ్మగారు హవ్వ.... హవ్వ..."
    
    "ఒరేయ్ ముదనష్టపోడా! వంకలు పెట్టకురా రాధ కాకపోతే ఇంకో గోపిక ముందు మంచి పిల్లను చూడు అలా రోడ్డుమీద పిచ్చి చూపులు చూస్తూ నిలబడడం కాదు. మంచి పిల్ల కనబడితే చెప్పు" నవ్వుతూ అందావిడ.
    
    సరిగ్గా అదే సమయంలో బామ్మగారికి ఏదో విషయం జ్ఞాపకానికొచ్చి- "ఒరేయ్ శత్రూ! నరేంద్రకుమార్ గారెవర్రా...?" అడిగిందావిడ.
    
    "ఏం?"
    
    "ఎవరో చెప్పు!"
    
    "ఆయన గవర్నమెంట్ చీఫ్ సెక్రట్రీ."
    
    "మధ్యాహ్నం నుంచి ఆయన మూడుసార్లు ఫోన్ చేశారు- అర్జంటట."
    
    ఆ మాటతో డి.సి.పి. శతృఘ్న ముఖం గంభీరంగా మారింది. మరే మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఫోన్ వేపు నడిచాడు.
    
    చీఫ్ సెక్రట్రీతో మాట్లాడాక, ఫోన్ పెట్టేసి-
    
    "బామ్మా...చాలా అర్జంటట- నేవెళుతున్నా...ఒక గంటలో వస్తాను."
    
    గబగబా బయటికొచ్చి, జీపు స్టార్ట్ చేసాడు శతృఘ్న.
    
    అప్పుడే-
    
    పాట్నా వీధుల్లో చీకటి ముసురుకుంటోంది.
    
                                           *    *    *    *    *
    
    బీహార్ చెఫ్ సెక్రట్రీ నరేంద్రకుమార్ రెసిడెన్స్.
    
    పోర్టికోలో జీపు ఆగింది. అందులోంచి దిగిన శతృఘ్న వేపు చూసారు లాన్ లో కూర్చున్న చీఫ్ సెక్రట్రీ నరేంద్రకుమార్.
    
    "రావయ్యారా... నీకోసం ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్, బీహార్ గవర్నమెంట్ వల పట్టుకుని గాలిస్తుంటే... నువ్వెక్కడి కెళ్ళిపోయావ్" నవ్వుతూ అడిగారు నరేంద్రకుమార్.
    
    "ఏంటి సార్! మీరు నా కోసం సెర్చ్ చేస్తున్నారట..." కుర్చీలో కూర్చుంటూ అడిగాడు శతృఘ్న.
    
    ఇద్దరి మధ్యా సంభాషణ ఇంగ్లీషులోనే జరుగుతోంది.
    
    "ఏ.పి. గవర్నమెంట్ నుంచి నీకో ఆఫర్ వచ్చిందయ్యా...! అక్కడ లిక్కర్ ప్రొహిబిషన్ పెడుతున్నార్ట....అక్కడి చీఫ్ సెక్రట్రీ నీ గురించి నన్ను ఫోన్ చేసి అడిగాడు" చెప్పారు నరేంద్రకుమార్.
    
    "జోకులెయ్యకండి సార్! నేనేదో నేషనల్ స్టార్ నైనట్టు.... నన్ను వాళ్ళు అడగటమేంటి సార్! నేను కిరణ్ బేడీనా- గిల్ నా!"
    
    "నిజమయ్యా బాబూ! కిరణ్ బేడీ నిన్నటి ఆడహీరో, గిల్ నేటి మగ హీరో, నువ్వు రేపటి హీరోవి. ఏం కాకూడదా? ఇండియాటుడే నేనూ చూశానయ్యా బాబూ- దొంగవేషాలెయ్యక-" అన్నాడాయన నవ్వుతూ.
    
    శతృఘ్న మాట్లాడలేదు.
    
    ఆశ్చర్యపోయాడు.
    
    "సిన్సియర్ గా డ్యూటీ చేసేవాళ్ళ కొరత దేశంలో చాలా ఉంది. అందుకే- నీకీ ఆఫర్ వచ్చింది. అక్కడి యాన్టీ ప్రొహిబిషన్ సెల్ ని నీకప్పగిస్తారులా వుంది."
    
    "ఆంధ్రాలో ప్రొహిబిషనా?" పెద్ద పెట్టున నవ్వాడు శతృఘ్న.
    
    "నో మిస్టర్ శతృఘ్న! యూ ఆర్ రాంగ్ ప్రస్తుతం ఏ.పీ. చీఫ్ మినిస్టర్ కుమారి త్రిభువనేశ్వరీదేవి యంగ్ అండ్ ఎనర్జటిక్ లేడీ! గాంధీయన్ సిస్టమ్ లోంచి వచ్చిందావిడ" ఏదో చెప్పబోయాడు నరేంద్రకుమార్.
    
    త్రిభువనేశ్వరీదేవి.
    
    ఆ పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు శతృఘ్న.
    
    కళ్ళ ముందు ఏదో అదృశ్య జ్ఞాపకాల వెల్లువ ఒకదాని వెనుక ఒకటి అలల్లా వెళ్ళిపోయాయి.
    
    త్రిభువనేశ్వరీదేవి...
    
    ఆ మాట వినగానే గుండె ఉలిక్కిపడింది.
    
    ఒక అందమైన జ్ఞాపకం-
    
    దూరంగా జరుగుతున్న జాతరను చూడడానికి వెళుతున్నప్పుడు రెండు చిట్టి చేతుల ఆత్మీయ స్పర్శ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra