Home » Vasundhara » Vasundhara Kadhalu - 15

 

    శ్యామల ఆత్మహత్య చేసుకోవలసిన అవసరమేమిటో నాకు తెలియదు. ఆమెకూ నాకూ మధ్య రహశ్యాలేమీ లేవు. అందుకే ఆమె ఆత్మహత్య ఒక మిస్టరీ గా తోచసాగింది నాకు.
    కాసేపు బద్దకంగా పడుకున్నాక లేచి ఒకసారి పక్క దులిపి వేసుకుందా మనుకున్నాను. దుప్పటి తీసి దులిపెసరికి ఒక కాగితం మడత క్రింద పడింది. ఏమిటై ఉంటుందా అని తీశాను. నా ఉత్తరం కాదది.
    "డియర్ రమణరావ్!
    నాకు పది వేలు కావాలి. ఈరోజు సాయంత్రానికి అన్నీ పది రూపాయలనోట్లు సరిగ్గా పది వేలు . ఎక్కడివ్వాలో తెలుసు గదా!

                                                                                           శ్యామల"
    ఒక్కసారి బుర్రలో వెయ్యి బాంబులు పేలాయి. మొదటనేనది - శ్యామలను హత్య చేయడానికి నేను వేసుకున్న పధకం - రాసిన కాగితమని ఆశపడ్డాను. అయితే అది రమణరావు ఉత్తరమని ఏమాత్రమూ ఊహించలేక పోయాను. మరి రమణరావు ని శ్యామల బ్లాక్ మెయిల్ చేస్తోందని తెలిసింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ ఉత్తరం నా మంచం మీదకు ఎలావచ్చింది? ఎందుకు వచ్చింది?
    క్షణక్షణానికి మిస్టరీ పెరిగిపోతోంది. ఇంతవరకూ శ్యామల ఆత్మహత్య కు కారణాలు తెలియలేదు. కానీ ఇప్పుడేదో అనుమానాలు నాలో కలగసాగాయి. శ్యామల రమణారావుని బ్లాక్ మెయిల్ చేస్తోంది అంటే ఆమెకు శత్రువున్నాడు. అందులోనూ రమణరావు సామాన్యుడు కాడు. బాగా డబ్బున్న వాడు. శ్యామలను హత్య చేయించడం అతనికి కష్టం కాదు.
    ఈ ఉత్తరం శ్యామల, రమణారావు కు రాసింది. అది రమణరావుదగ్గర ఉండాలి కానీ ఇక్కడెందుకుంది? అంటే అతగాడి క్కడికి వచ్చాడా?
    ఎందుకు వస్తాడు? ఎలా వస్తాడు?
    అయితే అతను 21 వతేదీన క్లబ్బు కు తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను పూర్తిగా 24 గంటలు నిద్రపోయాను. అందుకేదో ముఖ్యమైన కారణ ముండాలి.
    ఆలోచిస్తుంటే రమణరావుకీ శ్యామల ఆత్మహత్య కీ ఏదో సంబంధ ముండాలనిపించింది. కానీ అదేమిటో నాకు సరిగా తెలియలేదు.

                                     6
    మర్నాడు పనిమనిషి ద్వారా మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. నా తమ్ముడు ఇక్కడ ఈ ఇంట్లో నేను లేనప్పుడు వచ్చి రెండ్రోజులున్నాడుట. వాడేందుకు వచ్చాడో అడిగి తెలుసుకోవాలనుకున్నాను కానీ పనిమనిషి కేం తెలుస్తుందిలే అని ఊరుకున్నాను.
    అయితే వాడిక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చేడు? ఇంటి తాళం ఎక్కడిది వాడికి!
    ఒక తాళం చెవి నాదగ్గరుంది. రెండోది మా శ్రీమతి దగ్గరుంది. నా తాళం నా దగ్గర జాగ్రత్తగానే ఉంది. తమ్ముడికి తాళం శ్రీమతి దగ్గరే దొరికి వుండాలి. అయితే శ్రీమతి తమ్ముడికి తాళం ఇచ్చి వుండాలి. అయితే ఆ సంగతి నా కెందుకు చెప్పలేదు? అందులో దాచవలసినాదేముంది? వాడి కేదో పని  వుండి ఈ ఊరురాదల్చుకుంటే ....
    నేనూరిలో లేనప్పుడే వాడిక్కడికి వచ్చాడు. శ్యామల ఆత్మహత్య వాడిక్కడుండగానే చేసుకుంది. ఆ తర్వాత వాడు ఇక్కడ్నించి వెళ్ళిపోయాడు.
    బాగా ఆలోచిస్తుంటే తమ్ముడికీ, ఆ ఉత్తరానికీ, శ్రీమతికీ, తాళం చెవికీ, శ్యామల ఆత్మహత్య కీ సంబంధముందనిపించ సాగింది. ఇంకా అలోచించే సరికి ఒక్కటనిపించింది. శ్యామల దుష్ట స్వభావం గురించి శ్రీమతికి తెలిసి, తమ్ముణ్ణి పిలిపించి, బాగా బుద్ది చెప్పి, నేను వేసిన పధకం ప్రకారం ఆమెను హత్య చేయవలసిందిగా తమ్ముడికి చెప్పిందేమో!
    అయితే ఆ హత్య నేను చేయబోతున్నానని తెలిసి కూడా శ్రీమతి తమ్ముణ్ణి కెందుకు పురికోల్పోంది?
    ఉత్తరం పొరపాటున పోస్టు చేసిన సంగతి గుర్తెరిగి నేనిక్కడికి వస్తానని ఆమె గ్రహించి ఉండాలి. ఆసమయంలో నన్నక్కడ ఆపి- తమ్ముణ్ణిక్కడికి పంపించి శ్యామలను హత్య చేయించింది. ఎందుకంటె తన భర్త హత్య కేసులో ఇరుక్కునే ప్రమాదం లేకుండా చేయాలన్నది ఆమె సంకల్పం!కానీ ఎందుకో నాకు తృప్తి కలగటం లేదు.
    మర్నాడు శ్రీమతి కో ఉత్తరం రాసి పోస్టు చేశాను. ఆ మర్నాడు రాత్రికి వాళ్ళ ఊరు వెళ్ళాను. ఈసారి నన్ను చూసి శ్రీమతి చాలా ఆశ్చర్య పోయింది. మాకిద్దరికీ ఏకాంతం లభించగానే ఆమెను ముద్దులతో నింపేశాను. నిజంగానే నాకు కసిగా ఉంది. అయితే .....
    నా కళ్ళకు ఆమె జాకెట్లోంచి ఏదో ఉత్తరం కనబడింది. అదేమిటని అడిగాను. ఆ కవరు తీసి నా కందించి , "మీరు రాసిన ఉత్తరమే !" అంది శ్రీమతి. ఇంకా కవరైనా చింపలేదు.
    "ఇంకా చదవలేదా?"
    "చదవడం కంటే గుండెల్లో పదిలపరచుకోవడమే నాకు ఆనందం" అంది శ్రీమతి తడుముకోకుండా.
    నా ఆలోచనలు వేరే పోతున్నాయి. శ్యామల కూడా భర్త ఉత్తరాలు వెంటనే చదవదు. విసుగని నాతొ అంటుంది.  అదే ఆమె కొంప ముంచింది. అలాగే -- శ్రీమతి కూడా .....
    నేనేదో పధకం వేసుకు వస్తే , హటాత్తుగా నా ఆలోచనలు మరోదారి తొక్కాయి. మర్నాడు మావగారిల్లు బాగా సర్వే  చేశాను. శ్రీమతి పడకగది నానుకునే ఒక కొట్టు గది ఉంది. ఆగది నానుకుని మరోగది ఉంది. ఆ గది ముఖద్వారం ఒక సందులోకి ఉంది. ఎవరైనా అందులో ఇండిపెండెంటుగా ఉండవచ్చు. అందులో ఒకతను అద్దె కుంటున్నాడు. అద్దె టంచనుగా ఇచ్చేస్తాడు. కానీ నెలలో అన్ని రోజులూ ఇక్కడుండడు. అతను వ్యాపారస్తుడు. పేరు రమణరావు.
    
                                      7
    రమణరావు ఆఫీసులో ఎంక్వైరీ చేశాక అతను అప్పుడప్పుడు నా శ్రీమతి ఊరిలో మా మామగారింట్లో ఉంటూంటాడని తెలిసింది. ఇప్పుడు నాకు అన్నీ తెలిసిపోయాయి.
    రమణరావుకీ నా భార్యకు సంబంధముంది. నేను శ్యామలను కలుసుకున్నట్లే వాడు శ్రీమతిని కలుసుకుంటున్నాడు. శ్యామల చదవని ఉత్తరం నేను చదవగలిగిన రీతి లోనే రమణరావు నా ఉత్తరం చదివాడు.
    21 వ తేదీ నా భార్య దగ్గరకు పోవాలని వాడికి మనసయింది. లేదాశ్రీమతే కబురు పెట్టి వుంటుంది. నేనిక్కడుంటున్నానో , లేనో తెలుసుకుని రోజీ ద్యాన్సులో నన్నిరికించి, నా భార్య దగ్గరకు పోవాలనుకున్నాడు. విజయవంతంగా వాడి పధకం నెరవేరింది.
    అయితే అనుకోకుండా వాడికి నా ఉత్తరం దొరికింది. వాణ్ణి శ్యామల బ్లాకు మెయిల్ చేస్తోంది. వాడు ఈ ఉత్తరం సహాయంతో తమ్ముణ్ణి కలుసుకున్నాడు. శ్రీమతి దగ్గర తాళం తీసుకున్నాడు. శ్యామల దొరికేలా చేస్తానని తమ్ముణ్ణి మభ్యపెట్టి రెండ్రోజుల పాటు ఏం చేయాలో వాడికి చెప్పాడు. పాలలో విషం తనే కలిపి ఉంటాడు. నాల్రోజుల పాటు నన్నిక్కడ ఆపమని శ్రీమతి ని కోరి ఉంటాడు. శ్యామల వ్రాసిన ఉత్తరం పొరబాటున నా గదిలో పడిపోయి వుంటుంది. దాని విషయం అతడు మర్చిపోయి ఉంటాడు.
    ఆరోజు క్లబ్ లో 24 గంటలు నిద్రపోయేలా నన్ను చేసిన రమణరావు - శ్రీమతికి నేను రాబోతున్న విషయం చెప్పి వుండాలి. అందుకే ఆమె అప్పుడు ఆశ్చర్య పడలేదు.
    శ్యామల హత్య కేసు ఇప్పుడు పువ్వులా విడిపోయింది. కానీ ఇందులో ఏమీ నేను పైకి చెప్పలేను. నా పరువుకి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. మవగారంటే నాకు చాలా భయం. అయన తన పలుకుబడితో ఏమైనా సాధించగలడు. హత్య కేసు రుజువు కాదు సరిగదా -- నన్ను పిచ్చివాడిని రుజువు చేస్తాడు.
    నా భార్య ఉత్తమ ఇల్లాలనీ, ఆమెను పాడు చేయబోతొందనీ భావించి, శ్యామలను హత్య చేయాలనుకున్నాను. అన్నీ తెలిసే నా భార్య నేమీ చేయలేకపోతున్నాను.
    ఇప్పుడు బాధపడడటం అనవసరం. నాది తప్పుడు ప్రవర్తన అయినప్పుడు శ్రీమతిని నేను వేలెత్తి ఎలా చూపించగలను? నేను పొరబాటుగా ఇంతకాలం ప్రవర్తించాను. అదిప్పుడు దిద్దుకుని శ్రీమతి పొరపాటు కూడా దిద్దాలి.
    అంతేకాదు శ్యామల హత్య గురించి నాదగ్గర ఉన్న ఆధారాలతో ఈ కధంతా ఊహించాను. నా ఊహ నిజమన్న నమ్మకం నాకుంది. కానీ రుజువు చేయడానికి ప్రయత్నించడం లేదు. అందుకు కేవలం భయమొక్కటే కారణం కాదు. నా ఊహ పొరబాటేమోనన్న భ్రాంతి కనీసం కొంత మనశ్శాంతి నైనా లభిస్తుంది.
    ఆ తర్వాత ఒంటరిగా శ్రీమతిని పుట్టింటికి పంపించే పొరపాటు మాత్రం చేయలేదు నేను.


                                   *** 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra