మామూలుగా అయితే అక్కగొంతులోని ఆర్ద్రత బావురుమంటూ గుండెలవిసేలా ఏడ్చేవాడే కాని కన్నీళ్ళు సైతం ఆవిరైన అంతిమ క్షణాలాయె.....నెమ్మదిగా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆమె లోతు కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు.....ఏ భాష్యాన్ని చెప్పలేక పెదవులు అదురుతున్నా గాని ఈ రెండురోజులూ అమ్మెంత కలవరపడింది అర్ధమైపోయింది. ప్రశ్నలు కావు.....చితికిపోతున్న్ శరీరం ఇంకెంత కాలం నేనుండేది అంటూ చెబుతున్న కోట్ల జవాబుల్లా అమ్మ కంపించిపోయింది. అమ్మా......అమ్మా...... ఎందుకే......
    
    రెండురోజుల నా దూరాన్ని భరించలేని నువ్వు రేపు శాశ్వతంగా కనుమరుగైతే ఎలా తట్టుకోగలవమ్మా.....చావుపోయివుంటే ఇప్పుడు నీకు కనిపించేవాడు కాదమ్మా చెరిగిపోతున్న ఈ నుదుటి గీతలు నువ్వు వెదుక్కోవాల్సింది కడుపుకోతను కాదే. ఉరికొయ్యకు వేలాడుతున్న వానచుక్క లాంటినన్ను మన్నించిమరచిపోవే పిచ్చితల్లి.
    
    "న్నా.....న్నా....."పిలిచింది ఆర్తిగా-ఆర్ద్రంగా.....మళ్ళీ వినిపించని పిలుపు అనిపించిందేమో కృష్ణ కంటినుంచి ఓ నీటి బొట్టురాలిపడింది. "మీ....అక్క.....తప్పుచేసినా" అమ్మరొప్పుతోంది గుండె లోయలతుఫానుని గొంతుదాకామరల్చలేనట్టు. "నాకోసం......నీకోసం...... నాన్నా.....ఏతల్లి అంగీకరించనిదే. కాని ఏం చేస్తాం! కన్నానేకాని మీకు కడుపు నిండా అన్నమయినా పెట్టగలిగానా.....బ్రతికివున్నానే కాని ఎంతకాలం బ్రతుకుతానో చెప్పగలనా....నా ముద్దుల తండ్రీ...నేను కాలేక నా ఒంట్లో రక్తాన్ని పాలుగామార్చుకోగలిగే శక్తి వున్నా మీ కడుపునింపుతూ రాలిపోయేదాన్నికదమ్మా...."
    
    మంచుపొరలావున్న మగతచెరిగి ఇప్పుడే రూపుదిద్దుకున్న కొత్త వ్యక్తిగా పైకిలేచాడు. తనుతీసుకొచ్చిన పాకెట్స్ సంగతి అప్పుడే గుర్తుకొచ్చినట్టు ఉత్సాహంగా విప్పాడు. రెండు పేకెట్స్ నిండా అన్నం అదే అక్కని వ్యభిచారిగా మార్చింది. తనని ప్రపంచానికి దూరంగా నెడుతున్నది కూడా.
    
    "అక్కా తీసుకో ఇది..కాదు తినెయ్.....కావాలంటే ఇంకా తెస్తాను.....తేగలను.....మరేం....." ఉద్విగ్నంగా చెబుతుంటే నిర్విన్నురాలై అక్క పార్వతి ఆ స్థితిలో కూడా. "నేను దొంగతనం చేయలేదక్కా!" తనను అనుమానిస్తున్నట్టు చూస్తోంది అక్క అలా చూడడం నచ్చలేదు.
    
    "బ్రతుకోడ్చి..అలా అనరేమో కదూ.....చెమటోడ్చి సంపాదించిన డబ్బుతోకొన్నది.....అవును....అమ్మా నువ్వు కూడా.... "నిన్నకాకమొన్నటి దాకా పసిపిల్లాడు.....మగాడైపోయాడు. మొనగాడిలాగా ధైర్యం చెబుతున్నాడు.
    
    కాదంటే అలిగిపోతాడేమో..అందుకుంది పార్వతి. ఆర్తిగా తింటూ అమ్మకి నాన్నలా గోరుముద్దలు తినిపిస్తున్న కృష్ణని ఆశ్చర్యంగా చూస్తోంది.
    
    "చాలు నాన్నా" తల్లి వారిస్తున్నా వినడంలేదు కృష్ణ ఇంతకుమించి ఒక అవకాశంరాదన్నట్టు బ్రతిమాలి తినిపించాలనుకున్నాడు. "అలా అనకూడదమ్మా.....ఇది నా తొలి సంపాదనతోతెచ్చిన అన్నం...." కళ్ళనుంచి నీళ్ళు రాలుతున్నాయన్న విషయం మరిచి ఉన్మాదిలా నవ్వేస్తున్నాడు "అయినా మీ కెవరున్నారే....నేనేగా మగదిక్కుని కదమ్మా....మరి మీ మంచి చెడులుచూడాల్సింది నేనేకదే...."
    
    "అంటే....." తల్లి అబ్బురంగా అడిగింది "ఈ రెండు రోజులు-"
    
    "చావాలని....." అసంకల్పితంగా నోరుజారేడు...."వెళ్ళలేదమ్మా.....చావులాంటిజీవితం మీద గెలవాలని వెళ్ళాను. అంతే. గెలిచేసానే.....మనకిక ఏ లోటూ వుండదు.....ముఖ్యంగా మీ యిద్దరికీ అలాంటి ఏర్పాట్లు చేసాను....."
    
    "అంటే......నువ్వు చదువు మాని ఉద్యోగంలో చేరావా నాన్నా" విస్మయంగా అడిగింది.
    
    "అదేమిట్రా..."
    
    "అసలు చదువెందుకే...." టక్కున ప్రశ్నించాడు.
    
    "బ్రతకటానికేగా....అసలు బ్రతుకెందుకు.......మిమ్మల్ని బ్రతికించుకోవటానికేగా అదే-అదే నేనుచేస్తున్నది కూడా....."
    
    కృష్ణ చెబుతున్నది స్పష్టంగా అర్ధంకావడంలేదు. అయినా శోకంలోనుంచి తేరుకుని తత్తరపాటుతో అడిగింది సీతమ్మ "ఎక్కడ..రెండు రోజుల క్రిందట వెళ్ళినవాడివి.....యికరావేమో అనుకున్నవాడివి.....యింతలోనే యిదంతా ఎలా సాధించావురా....."
    
    "నీబిడ్డనమ్మా...." తల్లిని పొదివిపట్టుకున్నాడు కృష్ణ "ఆలస్యంగా ఈ యింటిగురించి అర్ధం చేసుకున్నవాడ్ని అందుకే.. .."
    
    "అందుకే....."
    
    గొంతుదాటని పెనుగులాట కృష్ణని ఎంత కలవరపరుస్తూందని అయినా ఉత్సాహాన్నే అభినయించాడు "చాలాదూరం వెళ్ళిపోతున్నాను, "అవాక్కయినట్టు చూసింది సీతమ్మ.... "దూరం అంటే" పార్వతి అడిగింది కూడా "మీరు రాకూడనంత దూరం....అయినా నేను వెళ్ళుతున్నది మీ కోసమే అయితే మీరక్కడి కెందుకురావడం...."    

 

    "ఎంతదూరం నాన్నా....." ఫకాల్న నవ్వాడు "సూర్యుడి కిరణాలు చొచ్చుకు రానంత దూరం అమ్మ గొంతు, అక్క పిలుపు వినిపించత దూరం."
    
    ఏ అపశృతి ధ్వనించిందో తమ్ముడి భుజాన్ని పట్టుకుని నిలదీసింది పార్వతి. "నువ్వు మాని సరిగా చెప్పు."
    
    విసురుగా విదిలించుకున్నాడు "మగాడన్నాక లక్ష వ్యవహారాలుంటాయక్కా అవన్నీ ఆడవాళ్ళకి చెప్పాలా-సంపాదించింది తిని వూరికే వుండలేక మీ యక్ష ప్రశ్నలేమిటి-" ఆవేశంగా లోపలి గదిలోకివెళ్ళిపోయాడు.
    
    నిజానికి అది కోపం కాదు. అక్క ప్రశ్నలని జవాబు చెప్పలేని పిరికితనం. గుండె నిండా పాతుకుని వున్న దుఖానికి గండిపడినట్టు కళ్ళనుంచి నీళ్ళుధారగా వర్షిస్తున్నాయి. అరగంటగడిచింది. గంటన్నరయ్యింది. ప్రపంచాన్ని చుట్టిన చీకటి ఆ యింటిలో రెట్టింపుగా మారింది. వచ్చింది ఒంటరిగాగడపడానికి కాదనుకున్నాడో లేక తను అంతసేపూ పిచ్చిగా ప్రవర్తించినట్టు నిర్ధారణ చేసుకున్నాడు-గది దాటి బయటికొచ్చాడు. మంచంపై అమ్మ నిద్రపోవడంలేదు. మగతగాకళ్ళు మూసుకుని వుంది. అక్క కూర్చునే వుంది చీకటిలోకి చూస్తూ.
    
    రేపు....రేపు.....కాదు.....ఎల్లుండి ఈ సమయానికి తనకథ ముగిసి పోతుంది. అమ్మ,అక్క యిద్దరూ తనకోసం గుండె అవిసేలా ఏడుస్తారు. గంట....... రెండు గంటలు.......వారంరోజులు.....ఓసంవత్సరం.....ఆ తర్వాత మరిచిపోతారు..... మర్చిపోయిన వాళ్ళ కోసం జీవితాంతం కుమిలిపోతుంటారా.....అలా అయితే అమ్మానాన్న కోసం యిప్పటిదాకా ఏడవాలిగా.
    
    "పడుకో అక్కా....." రహస్యంలా అన్నాడు అక్క చెవిలో.....క్షణం చూసింది రెప్పలార్పకుండా.... మరుక్షణం అతడి రెక్కపట్టుకుని లోపలిగదిలోకి లాక్కుపోయింది. వెంటనే అడగలేదు.....అడిగేదేమోకాని దుఃఖం ఆమె గొంతుకడ్డం పడుతున్నట్టు పెనుగులాడింది రెండు క్షణాలపాటు. "ఒరేయ్....నేను కులటనే అలా మారింది అన్ని మార్గాలూ మూసుకుపోయాకనేరా.....నిన్ను దక్కించుకోటానికి..నేను చేసింది తప్పే అయితే ఆ తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకోకు కిట్టూ!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra