Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

  

       "నిజమే కానీ, తక్కువ ధరల చీరలద్వారా మనం జనంలో విపరీతంగా పాపులర్ అవుతాం. మనకేమీ నష్టం లేకుండా కొందరికి సేవచేసిన వాళ్ళమవుతాం. ఏమతఃరం విజయవంతమయినా ఇక మనల్ని ఎవరూ ఆపలేరు."
   
    "సరే, నీ ఇష్టం" అన్నాడాయన క్లుప్తంగా. "నాక్కావల్సిందల్లా నా ఖర్చులకి సరిపోయేవన్ని డివిడెండ్లు రావటమే" నవ్వాడు.
   
    రవితేజ కూడా నవ్వి - "తప్పకుండా" అన్నాడు. శర్మ వెళ్ళిపోయాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయానికి అదే గది బయట తన గదిలో ప్రియంవద ఎవరికో ఫోన్ ప్రయత్నిస్తూంది. అవతలివ్యక్తి ఫోన్ లోకి రాగానే "అయిదు నిముషాల నుంచి ప్రయత్నిస్తున్నాను" అంది.
   
    "ఏమిటి సంగతి!"
   
    "ఈ రోజు ఆఫీసులో ఆలస్యం అయ్యేట్టూ వుంది."
   
    "ఎందుకూ?"
   
    "రవి ఏదో పని వుందన్నారు, ఇంటికి ఆలస్యంగా వస్తాను."
   
    "ఎంతసేపవ్వొచ్చు రావటానికి?"
   
    "ఎనిమిదవొచ్చేమో-"
   
    "వీలయితే ఇంకో గంట ఆలస్యంగా రా."
   
    ఫోన్ కట్ అయింది.
   
                             *    *    *
   
    దాదాపు రెండు గంటలసేపు రవి ఊపిరి సలపనంత పనిలో మునిగిపోయాడు. ఒక్కసారి డైరెక్టర్లు పథకాన్ని వప్పుకున్నాక అతడు మరి ఆలస్యం చేయదల్చుకోలేదు. పోటీదార్లు కూడా ఈ పథకం గురించి ఆలోచించే లోపులో తాము మార్కెట్ లోకి వెళ్ళిపోవటం ఉత్తమ వ్యాపారస్థుల లక్షణం మొత్తం అన్ని డిపార్ట్ మెంట్ ల వాళ్ళనీ చక్రాలమీద పరుగెత్తించాడు.
   
    ఒంటిగంట అయ్యేసరికి అనుకున్న పనులన్నీ పూర్తి చేశాడు. ఇక లంచ్ తీసుకుందామనుకుంటూ వుండగా ఫోన్ మోగింది.
   
    "హలో, ఎవరూ?"
   
    "నేను మీ శ్రేయోభిలాషిని."
   
    అతడు మొహం చిట్లించి "ఏం కావాలి?" అని అడిగాడు.
   
    "నాకేమీ అవసరంలేదు. మీకే అవసరమైన విషయాన్ని ఒకదాన్ని చెపుదామని ఫోన్ చేశాను".
   
    "ఏమిటది?"
   
    "నిన్న రాత్రి మీ శ్రీమతిగారు కార్తీకమాసం పిక్నిక్ అని బయల్దేరారు."
   
    "అవును, అయితే.."
   
    "ఇరవైమంది ఆడవాళ్ళూ, పదిమంది మొగవాళ్ళు చాలా హుషారుగా వెళ్ళారు. అఫ్ కోర్స్, అందరూ పెళ్ళయినవాళ్ళూ, దంపతులే అనుకోండి. పాపం మీ భార్య ఒక్కతే భర్త లేకుండా వచ్చింది. అయినా ఆమెకి అదంతా సమస్య కాలేదు. సుధాకర్ అని ఆ బ్యాచ్ లోనే ఒక కుర్రవాడు కూడా వున్నాడు. రాత్రంతా పేకాట, తుళ్ళింతలూ, జోకులూ... నిజంగా మీరు రాకపోవటం..."
   
    "వాట్ నాన్సెన్స్ యువార్ టాకింగ్".
   
    "పెద్దగా శృతిమించలేదు.....అందరూ వున్నారు కాబట్టి! సాయంత్రం తిరిగొస్తారు బహుశ! ఈ పరిచయం పెద్దది కాకుండా చూసుకోవటం.....భర్తగా మీ బాధ్యత. శ్రేయోభిలాషిగా హెచ్చరించటం నా బాధ్యత."
   
    ఫోన్ పెట్టేసి, కుర్చీలో చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు రవితేజ.
   
    అవతలివ్యక్తి మాటలే అతని చెవుల్లో మార్మోగుతున్నాయి.
   
    ఇంతలో తలుపు తెరుచుకుని ప్రియంవద వచ్చింది. "ప్రొద్దున్నించి మీరు చాలా బిజీగా వున్నారు. అందుకే రాలేదు మీ కోసం" అంది. కేక్ పెట్టింది బల్లమీద "...మెనీ హాపీ రిటర్న్స్."
   
    "నా మూడ్ ఏమీ బాగోలేదు ప్రియంవదా! డిస్టర్బ్ చేయకు" ఆమె ముఖం వాడిపోయింది. "సారీ సర్" అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక అతడు బాధపడ్డాడు - అలా ఎందుకు అన్నానా అని. కానీ దానిగురించి ఎక్కువ ఆలోచించలేదు. అతడికి ఎందుకో ఇంటికి వెళ్ళాలని వుంది. ఇంటర్ కమ్ లో ప్రియంవదతో ఒక గంటలో వస్తానని చెప్పి, బయలుదేరాడు.
   
    కార్లో వస్తూ అతడు ఆలోచించాడు.
   
    ఎవరీ సుధాకర్? తనకి తెలిసిన వాళ్ళలో ఎవరూ లేరు. బహుశా వచ్చిన ఆడవాళ్ళలో ఎవరికో తమ్ముడై వుండాలి. సాధారణంగా ఇలాటివాళ్ళే ఇంత సమయాన్ని వృధా పర్చటానికి వీలుగా వుంటారు.
   
    తన భార్య తప్పు చేస్తుందా లేదా అని అతడు ఆలోచించటంలేదు. ఆవిడ ఆ యువకుడితో కాస్త చనువుగా మాట్లాడి వుండవచ్చు. దాన్ని చూసి ఎవరో తనకి ఫోన్ చేసి వుండవచ్చు లేదా, తన దగ్గిర దొరకని 'దగ్గిరతనం' అతడి దగ్గిర దొరికి వుండవచ్చు. అది కొంతకాలానికి శారీరకమయినదిగా మారవచ్చు లేదా, స్నేహంతో ఆగిపోవచ్చు ఇవేమీ ఆలోచించటం లేదు అతడు.
   
    తన దగ్గిర లేనిది ఆ సుధాకర్ లో ఏం చూసిందా? అని ఆలోచిస్తున్నాడు. డబ్బు సంపాదించటంలో ఇల్లు పట్టకుండా తిరిగే భర్త నిర్లక్ష్యంచేస్తూ వుంటే, తినటం తప్ప మరేపనీ లేక ఇంట్లో ఏమీ తోచని కొందరు ఆడవాళ్ళు....సరీగ్గా ఆ సమయంలో మరొక యువకుడు కాస్త చనువుగా మాట్లాడితే అదే ప్రేమనుకుని, భర్త దగ్గిర దొరకని ఆప్యాయత ఆ చీకట్లో అతడి దగ్గిర పొందాలని అనుకోవటం- కొన్ని కుటుంబాల్లో జరుగుతూ వుంటుందని అతడు కథలుగా విన్నాడు. ఇప్పుడు తనుకూడా ఆ కుటుంబాల్లో ఒకడుగా అయిపోతున్నాడా?
   
    అతడికి ప్రియంవద వ్రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి. ".....పదహారేళ్ళ అమ్మాయి మాటకారి అబ్బాయంటే ముచ్చట పడుతుంది-"అని ముచ్చట పడటానికి వయసుతో సంబంధం లేదని తన భార్య నిరూపించింది. ఇక మధ్యాహ్నం పూట వాళ్ళు ఒకరికొకరు ఫోన్ లు చేసుకుని గంటల హరబడి మాట్లాడుకోవటం ప్రారంభం కావొచ్చు.
   
    అతడి మనసు వాసిలేటింగ్ గా వుంది. అది మేల్ ఈగో క్లాష్. కావాలనుకుంటే తను సుధాకర్ కంటే వందరెట్లు ముచ్చటగా మాట్లాడగలడు. కానీ జీవితాంతం మాట్లాడటం వేరు. ఒక కార్తీక పౌర్ణమి రోజు రెండు గంటలు మాట్లాడటం వేరు.
   
    అకస్మాత్తుగా అతడికి మబ్బులు విడిపోతున్నట్టు అనిపించింది. తను మాత్రం చేసిందేమిటి- అన్న ఆలోచన రాగానే!......ఒకామె తనకు ఉత్తరం వ్రాసిన విషయం తన భార్యకు చెప్పలేదు. పైగా పిచ్చివాడిలా ఒక మధ్యాహ్నమంతా ఆ తాజ్ రిసెప్షన్ దగ్గిర తిరిగాడు. మరొక అమ్మాయి అర్దరాత్రి ఫోన్ చేస్తే అదొక మధురానుభూతిగా రాత్రంగా నిద్రపోలేదు.
   
    అలాటి తనకి, తన భార్యని నిలదీసే హక్కు ఏముంది? ఒకే పని యిద్దరు చేసినప్పుడు ఒకరిది తప్పు, మరొకరిది ఒప్పు ఎలా అవుతుంది? తమా జీవితాల్లో ఎలాగూ పరస్పర ఆకర్షణ లేనప్పుడు, ఆమె తనకున్న చిన్న పరిధిలో ఆనందించటానికి ప్రయత్నిస్తే అందులో తప్పేముంది?
   
    ఈ రకమైన ఆలోచన వచ్చేసరికి అతడు మామూలుగా అయిపోయాడు. ఇది వేదాంతమా, చేతకానితనమూ కాదు. అవతలి వైపునుంచి ఆలోచించటం వేదాంతంకన్నా గొప్పది. అతడు దైవాంశ సంభూతుడేమీ కాదు. కానీ నిజాయితీగా ఆలోచించగలగటం దైవాంశ కన్నా గొప్ప విషయం.
   
    అతడు కారు వెనక్కి తిప్పి ఆఫీసుకి వెళ్ళిపోదామా అనుకున్నాడు కానీ అప్పటికే ఇల్లు రావటంవల్ల కాస్త రిఫ్రెష్ అయి వెళ్ళవచ్చుకదా అని కారు ఇంటిలోకే పోనిచ్చాడు.
   
    బయట తోటమాలి చెట్లకి నీళ్ళు పోస్తున్నాడు. వంటమనిషి వరండాలోనే కనిపిస్తే, ఒక కప్పు టీ తన గదిలోకి తీసుకురమ్మని చెప్పి, ముందు హాలులోకి ప్రవేశించాడు.
   
    పక్క పక్క సోఫాల్లో కూర్చొని వున్నారు తన భార్యా, అతడు మాధవి ముందుకు చేయిసాచి ఆసక్తిగా అతడు చెప్పేది వింటూంది. అతడు ఆమె చెయ్యిచూసి భవిష్యత్తు చెపుతున్నట్టున్నాడు! ఒక చేత్తో ఆమె చేతిని పట్టుకుని, మరొక చూపుడు వేలుతో గీతల్ని వివవరిస్తున్నాడు. ఎందుకో రవి మనసు ఆ దృశ్యాన్ని చూడగానే చివుక్కుమంది. మళ్ళీ అంతలోనే 'ఇదేమిటి - ఇపుడేగా ఇంత ఆలోచించాను దీని గురించి' అనుకున్నాడు.
   
    అంతలో రవిని చూసి మాధవి లేచి నిలబడి, "రండి, రండి" అంది. "ఈయన సుధాకర్ అని మన వనజ తమ్ముడు."
   
    "హలో" అన్నాడు రవి. వనజ భర్తకి పొగాకు వ్యాపారం వుంది. బాగా డబ్బున్నవాళ్ళు సుధాకర్ మొహంలో అదోరకమైన తత్తరపాటుని గమనించాడు అతడు. వేళకాని వేళలో తన రాకని అతడు వూహించి వుండడు.
   
    "హలో" అన్నాడు అతడు.
   
    "ఏం చేస్తూ వుంటారు మీరు-"
   
    "చదువు పూర్తిచేసి ప్రస్తుతం ఖాళీగా వున్నాను."
   
    ఒక యువకుడి నుంచి వచ్చే జవాబుల్లో అన్నిటికన్నా హీనమైన జవాబు అది. ప్రస్తుతం ఖాళీగా వున్నానన్నది.
   
    "ఆయన బాగా జ్యోతిష్యం చెపుతారు" అంది మాధవి. "ఉండండి ఇద్దరికీ 'టీ' తీసుకొస్తాను" అని లోపలికి వెళ్ళింది.
   
    "జ్యోతిష్యం అంటే పామిస్ట్రీనా? ఆస్ట్రాలజీయా?" భార్య లోపలి వెళ్ళాక అడిగాడు - సోఫాలోకి వెనక్కి జారబడుతూ.
   
    "పా..... పామిస్ట్రీ".
   
    "ఏదీ, నాకు చెప్పండి. మేము ఒక కొత్త స్కీమ్ పెట్టబోతున్నాం. మా భవిష్యత్తంతా దానిమీదే ఆధారపడి వుంటుంది. దాంట్లో మేము సక్సెస్ అవుతామా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra