Home » Cherukuri ramadevi » Baandhavya Bandhithulu


    "ఒకవిధంగా ఆలోచిస్తే నువ్వే నన్ను క్షమించవలసివస్తుంది. నీకు ఇష్టంలేని పనులు నీచేత చేయించాను. నీలోని ఉద్దేశాలను భ్రమగా అనిపించాను. దీనికంతటికీ ప్రోత్సాహమన్నపేరుతో నిన్ను దాదాపు బలవంతం చేశాను. దీనికంతటికి బాధ్యుణ్ణి నేను. నేనే క్షమాపణ కోరుకోవాలి."
    ".................................."
    "అనూరాధ ఇంకా రాలేదా?"
    "లేదు. ఇక రాదేమో!"
    "అదేం మాట?"
    "ఉన్నదే!"
    "శ్రీనివాస్, నీ కింత విడమర్చి చెప్పినా నీకు అర్ధం కాలేదా? మెడిసిన్ లో నీ పునః ప్రవేశానికి కారకున్ని నేను. నిన్ను పూర్తిగా నమ్మించడానికి ప్రయత్నించింది నేను. నిన్ను హౌస్ సర్జనుగా చెయ్యమని సలహా ఇచ్చింది, సీట్ వచ్చేందుకు ప్రయత్నించింది నేను. ఇందులో అనూరాధ బాద్యత ఏమాత్రం లేదు. ఊరికే నేను ఇస్తున్న ప్రోత్సాహానికి తోడ్పాటుగా తనూ ఉందిగాని ఇందులో పెద్దభాగం నాది. అర్ధం చేసుకో, శ్రీనివాస్."
    "మీరు ఇంతగా చెప్పడం అనవసరం. మీకు అనూరాధ అంటే ఎంత అభిమానమో నాకు తెలియనిదికాదు. ఆమెకోసం మీరీ బాధ్యత నెత్తిన వేసుకుంటున్నారు. ఇందులో మీకు అసలు భాగం లేదనుకోను. కాని మీరు చెయ్యనిదాన్ని చేశారని నమ్మించడానికి ప్రయత్నించకండి."
    "అనూరాధంటే నా కెంత అభిమానమో, నువ్వన్నా అంతే! నా కొడుకు వంటివాడివి. అందుకే నీ అభివృద్దికి ప్రయత్నించాను. నేను చెప్పింది నమ్ము."
    "అనూరాధ మీకు కూతురువంటిదని తెలుసు. మీరు ఆమె కోరిక తీర్చడానికే నాకోసం ప్రయత్నించారు. ఈరోజు కూతురివంటి రాధ సంతోషం కోసమే ఈ బాధ్యత స్వీకరించారు. అప్పుడు రాధ మీ దగ్గిరికి వచ్చి నా విషయం చెప్పి ఉండకపోతే మీరు నాకోసం ప్రయత్నంలోకి దిగేవారుకాదు. మీరీ అనవసరపు బాధ్యత తీసుకునేవారుకాదు!" అన్నాడు శ్రీనివాస్.
    ఎంత చెబుతున్నా అర్ధం చేసుకోని శ్రీనివాస్ ను ఎలా సమాధానపరచాలో తెలియకుండా పోయింది. 'అసలు విషయం చెబితేకాని దారిలోకి రాడు. అది జరిగితే తన ముఖం తిరిగి చూడడు! ప్చ్! ఎంత విషమ పరిస్థితి! తను చేసిన పని ఎంతవరకు దారితీసింది! అతని జీవితంలోకి ప్రవేశించిఉండకపోతే కనీసం స్నేహితులుగానయినా ఉండేవారు!'
    ఆయన మౌనం చూచి "మిమ్మల్ని అన్నిటిలో ఇంతగా నిరుత్సాహ పరుస్తున్నందుకు క్షమించండి. ఇంక ఈ విషయాలు మాట్లాడడంవల్ల ప్రయోజనం లేదు!" నిష్కర్షగా చెప్పాడు.
    "అనూరాధ విషయంలో నువ్వు ఉద్దేశ్యం మార్చుకోవడం మంచిది. నువ్వు ఏదో కోపంతో, నిన్ను బలవంతంగా నెట్టిందన్న అపోహతో ఆమెకు దూరం కావాలనుకుంటున్నావు. నిజంగా నువ్వు రాధను మరిచిపోగలననుకుంటున్నావా? నా మాట విని ఈ గొడవ తేలికగా జరిగిపోనీ! ఏ పురుషుడయినా తన భార్యను, తను ప్రప్రథమంగా జీవితంలో అన్ని సుఖాలు అనుభవించిన స్త్రీని, స్త్రీ అన్న పదానికి అర్ధం చెప్పిన ఆడదాన్ని మరిచిపోగలగటం నిజంగా తేలిక అయిన పనా? అందులో ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు! స్వర్గంలా సాగిపోతున్న సంసారాన్ని చెడగొట్టకు. అనూరాధకు అన్యాయం చెయ్యకు!"
    "మీకు రాధపైగల వాత్సల్యానికి ముగ్ధుణ్ణి అవుతున్నాను. కాని దయ చేసి ఇంక ఆ విషయం ప్రస్తావించకండి."
    నిజంగా నిస్పృహ చెందారు కృష్ణమూర్తిగారు, జీవితంలో మొదటి సారిగా. తాము అనుకున్న పని ఎదురుతిరిగింది. ఎంత ప్రయత్నించినా సానుకూల పరచలేకపోయారు!
    "నిజమే. నీ స్వవిషయాలు మాట్లాడడం తప్పే. జోక్యం కలిగించుకోవడం అంతకన్నా తప్పే. కాని ఆ పనిచేశాను. నీ ఈ మనోవ్యథకు కాదనుకున్నా నేను కారకుడనే! అందుకు కారణంకూడా ఉంది. శ్రీనివాస్, నీతో చెప్పకూడ దనుకున్న కొన్ని విషయాలు చెబుతాను. అలా కూర్చో! నేను చెప్పడం పూర్తి అయ్యేదాకా ఆవేశపడకు. అంతా విన్నాక సావకాశంగా ఆలోచించేందుకు, న్యాయా న్యాయాలు, తప్పొప్పులు నిర్ణయించేందుకు తగిన ప్రయత్నం చెయ్యి" అన్నారు.
    'అంత ఉపోద్ఘాతంతో, అంత మ్లానవదనంతో చెప్పబోయేదేమిటా?' అని ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్.
    "మన ఇద్దరిలో సుపరిచితంగా కనుపిస్తున్న పోలికల్ని చూస్తే నీకేమనిపించింది?"
    "మనిషినిపోలిన మనుషులుంటా రన్నది నిజమేనని. అయినా దీనికీ, మీరు చెప్పబోయేదానికీ సంబంధం ఏమిటో బోధపడటంలేదు."
    "నా కేమనిపించిందో తెలుసా? నీలాంటి కొడుకే ఉంటే ... నువ్వే నా కొడుకై ఉంటే ..." ఆయన కళ్ళల్లో గోచరిస్తున్న బాధతో కూడిన వాత్సల్యాన్ని చూస్తూ ఉంటే అతనికి అర్ధంకాని అనుభూతి కలిగింది.
    "ఆరోజు అనుకోకుండా కలిగిన ఆలోచన, అనుభూతి నిజమయ్యాయి. నిజంగా నా కొడుకుని. నాకు తెలియకుండా పుట్టి పెరిగి నాఅంత అయిన నువ్వు నిజంగా నా కొడుకుని!"
    అర్ధంకానట్లు చూచాడు. ఆ చూపులో 'ఈయనకేమయినా మతి భ్రమించిందేమో?' అన్న అనుమానం పొడచూపకపోలేదు.
    "నమ్మలేకపోతున్నావు కదూ. కాని ఇది అక్షరాలా నిజం! నీకు తెలియకుండా, నీకేమిటి, లోకంలో ఎవరికీ తెలియకుండా ఉండేటట్లుగా ప్రవర్తించి సహాయపడ్డారు మీ నాన్నగారు. మీ అమ్మ నాకు మేనత్తకూతురు. ఒకరోజు ఒంటరిగా నాతో ఉండడానికి తోసుకువచ్చిన క్షణాలే ఈరోజు ఈ బాధకు మూలం. చిన్నతనంలో, యౌవనంలో అడుగుపెడుతూన్న నేను అభం, శుభం ఏమీ ఎరగని సావిత్రిని..... నా మూలంగా జరిగిందీ పొరపాటు! అందుకు మూలంగా ఉద్భవించావు నువ్వు. నాకీ సంగతి ఈమధ్యనే తెలిసింది మీ అమ్మద్వారా. నువ్వీసారి మెడిసిన్ లో చేరడానికి, వెనక్కి రావడానికి, నీ ఈ వ్యథకు కారకున్ని నేను. నీమీది వాత్సల్యమే నిన్ను ప్రోత్సహింపచేసింది. నీకు దగ్గిర కావాలన్న కాంక్షే నిన్ను డాక్టర్ని చెయ్యాలని కోరింది. ఇందులో అనూరాధ బాధ్యత ఏమీలేదు, కేవలం నిన్ను ప్రేమించడంతప్ప, నీ జీవితంలో భాగం పంచుకోవడంతప్ప. అనూరాధను క్షమించు. వెంటనే తీసుకువచ్చెయ్యి." ఆవేదనతో ఆయన కంఠం పూడుకు పోతూంది. అంతవరకు ఆయన కళ్ళెత్తి శ్రీనివాస్ ముఖాన్ని చూచేందుకు కూడా సాహసించలేదు! అధోవదనుడైన ఆయన హృదయావేదన ఆయన కళ్ళల్లో ప్రతిబింబిస్తూంది.
    శ్రీనివాస్ మనస్సు పరిస్థితి వర్ణనాతీతం! తేరుకుంటున్న అతని ఆవేదన రెట్టింపయింది. ముఖం తెల్లగా పాలిపోయింది. కొలుకులు ఎర్రపడ్డాయి. కోపంతో కనుబొమలు ముడిపడ్డాయి. కొద్ధిక్షణలు అతని మనస్సు మూగబోయింది! మౌనంగా, బొమ్మలా ఒక మాట, పలుకు ఏమీ లేకుండా కూర్చుండి పోయిన అతన్ని చూస్తూ "ఇప్పటికైనా ఇది నా బాధ్యత అని గ్రహించు. ఈ విషయం నీకు తెలియపరచకూడదని విశ్వప్రయత్నం చేశాను. కాని నువ్వు చేస్తున్న పని చెయ్యిదాటిపోతూ ఉంటే, ఇది పెదవి దాటక తప్పలేదు. ఒక తండ్రి కొడుకును వేడకూడనివి వేడుకుంటున్నాను. క్షమించు శ్రీనివాస్, క్షమించు."
    "ప్లీజ్ గెటౌట్, డాక్టర్!"శ్రీనివాస్ కంఠంలో అంతకుముందున్న గౌరవం, లక్ష్యం అన్ని తుడిచిపెట్టుకుపోయాయి!
    "శ్రీనివాస్!"
    "ప్లీజ్ .... నాచేత మరొకసారి చెప్పించుకోకండి!" తలుపు తీసి పట్టు కున్నాడు. కృష్ణమూర్తిగారు గడప దాటగానే దఢాలున తలుపులు మూసుకున్నాయి. నుదుటి చెమట తుడుచుకుంటూ కుర్చీలో వాలాడు. అతని మృదుహృదయంలో ఆలోచనలు ఉప్పెనలా ఎగిరిపడుతున్నాయి.
    'ఏమిటిది? .... ఇదంతా నిజమా? తను నిజంగా మాధవరావుగారి కొడుకు కాడా? ఇంత రహస్యంగా ఈ విషయం ఎలా దాచారు? తను పెళ్ళికాక పూర్వం పుట్టిన చట్టవిరుద్ధమయిన బిడ్డా? ఈ విషయం లోకమంతా తెలుసుకుని ఉంటే ఎంతహీనంగా చూచేవారు! తనంటే ఎంత విలవ లేకుండా పోయేది! ఈ విషయాలు నాన్నకు తెలిసే సహించారా? అమ్మను అంత అభిమానంగా చూచేవారు, ఇదంతా తెలిసేనా? తను తండ్రిగా భావిస్తున్న పుణ్యపురుషుడు తనకు ఏమీకారు! ఎటువంటి బాంధవ్యమూ లేదు! జన్మకారకులు ఈనాటి మనస్తాపానికి కారకులు!
    'ఏమిటి ఇదంతా? ఎందుకిలా జరగాలి? ఇన్నేళ్ళుగా మరుగునపడ్డ ఈ విషయం తనకు ఇప్పుడెందుకు తెలియాలి? ఛ, తన బ్రతుక్కి అర్ధం లేదు! తన జన్మకు పవిత్రత లేదు. దేనికయితే వెలలేని విలవ ఇస్తామో దానిని కోల్పోయిన స్త్రీ తన తల్లా? ఆడదాన్ని అనుభవించడంతప్ప, తరవాత అతీ గతీ పట్టించుకోని మగవాడు తన తండ్రా! ఛీ, ఇదంతా అబద్దమయితే ఎంత బాగుండును!....తను అందరిలా బ్రతకలేనివాడు. దీన్ని ఎలా మరిచిపోగలడు?....
    'తను ఎవరో, తన విషయాలు తెలిస్తే రాధ తన్ని మామూలుగా గౌరవించి అభిమానించగలదా? ఇన్నేళ్ళుగా దాచిన ఈ విషయం అమ్మ కృష్ణమూర్తిగారికి ఎందుకు చెప్పాలి? తనేం ఆటబొమ్మా ఎవరు ఎలా చెబితే అలా చెయ్యడానికి? తనవారెవరూ తనకు ఉపకారం చెయ్యలేదు, ఏదో ఒక అపకారంతప్ప. నిజంగా ఏ అపకారం చెయ్యని అనూరాధనా తను శిక్షిస్తున్నది? అనూ దగ్గిరికి వెళ్ళాలి. ఒక్కసారి ఆమె హృదయంలో తలదాచుకుని, ఆమె సన్నిధిలో తన మనస్తాపాన్ని మరిచిపోవాలి!'....అతనికి అనూరాధను వదిలి రెండునెలలు దాటిందన్న సంగతి, ఆమె లేని లోపము మొదటిసారిగా తెలిశాయి.
    'అమ్మా, నాన్న లేని నిన్ను సంతోషపెట్టడానికి ప్రాక్టీసు ప్రారంభించాను. నాకు చేతగాని పని అని అంతగా విడమరిచి చెప్పినా, నువ్వు తిరిగి నన్నీ రొంపిలోకి ఎందుకు దింపాలని ప్రయత్నించావు? నీ కోరిక తీరనప్పుడు నాతో చెప్పక, కృష్ణమూర్తిగారితో ఎందుకు చెప్పాలి? నేను వినలేని విషయాలు చెప్పి నా విలవని పోగొట్టావు!' అతని హృదయం నిశ్శబ్దంగా రోదించింది. 'నా నమ్మకాల్ని నాశనం చేశావు! నాలో పేర్కొంటున్న అసహ్యానికి కారకురాలివయ్యావు. అసహ్యంతో నిండిపోతున్న నా మనస్సును నేనడ్డలేను"

                                *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra