Home » Mallik » చిత్రం భళారే విచిత్రం

    "అయితే బాగుందన్నమాట!"
    "ముక్కులే కాదు మీ బుర్రలు కూడా బద్దలవుతాయ్" గంభీరంగా ఓ గొంతు పలికింది.
    ఉలిక్కిపడి తలెత్తి చూసాడు రాయుడు.
    ఎదురుగా ప్రళయకాల రుద్రుడిలా గోపి.
    అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయ. అతని నొసలుమీద ముంగుర్ల చుట్ట టకటకా టకటకా కంపించసాగింది.
    గోపి ఆ కంపించే ముంగర్ల చుట్టని లటక్కున చేత్తో పట్టి ఆపి హుంకరించాడు.
    "ఏయ్! నువ్వు ఎందుకొచ్చావ్ ఇక్కడికి?" అంటూ సంతానం రెండడుగులు ముందుకు వేసాడు.
    గోపి ఏం మాట్లాడకుండా సంతానం గూబ పగిలేలా ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి సంతానం గిరిగిరగిరా తిరుగుతూ వెళ్ళి గోడకు కొట్టుకుని ఆగిపోయాడు.
    "ఏయ్ ఏంటీ దౌర్జన్యం?" అంటూ రాయుడు కుర్చీలోంచి దిగ్గున లేచాడు.
    "దౌర్జన్యం నీదా నాదా? ఒంటరిగా కనిపించిన ప్రతి ఆడదాన్నీ బలవంతం చేస్తావ్... దౌర్జన్యం నీదా నాదా?"
    అప్పుడే చేతిలో పాలగ్లాసుతో మహాలక్ష్మమ్మ వచ్చింది.
    ఆమె గోపి అన్న మాటలు విననే వింది.
    అంతే... ఆమె చేతిలోంచి పాలగ్లాసు నేలమీదికి జారి పడిపోయింది.
    ఆమె అలానే గుమ్మం దగ్గర కుప్పకూలిపోయింది.
    రాయుడు నోటిమీద చేత్తో కొట్టుకున్నాడు.
    "హవ్వ.... హవ్వ... నేను ఆడపిల్లల్ని బలవంతం చేస్తానా? అంత అన్యాయంగా మాట్లాడకు." అన్నాడు రాయుడు.
    "హు? అన్యాయం. ఎవరిదీ అన్యాయం? ఒంటరిగా ఉన్న రాధని బలవంతం చెయ్యడం అన్యాయం కాదా? రాధ చీరని చింపెయ్యడం అన్యాయం కాదా" అరుస్తూ అన్నాడు గోపి.
    "రాధా? రాధెవరూ? అసలు ఆ పేరుగలవాళ్ళు ఈ పేటలో వున్నారనే నాకు తెలీదు" అమాయకంగా అన్నాడు రాయుడు.
    "రాధ నా భార్య" గర్జించాడు గోపి. అలా గర్జించడంవల్ల పొరపోయి అతనికి దగ్గొచ్చేసింది.
    "ఓహో అలాగా? మంచిది మంచిది" అన్నాడు రాయుడు.
    గోపి అతని ప్రవర్తన సహించలేకపోయాడు.
    "ఒరేయ్ రాయుడూ"
    గోపి రాయుడు పైకండువాని మెడచుట్టూవేసి ఒక్క లాగు లాగాడు.
    ఆ దెబ్బకి రాయుడు తూలి నేలమీద బోర్లా పడ్డాడు.
    గోపీ రాయుడు వీపుమీద కాలువేసి గట్టిగా తొక్కాడు.
    "హమ్మోయ్" అన్నాడు రాయుడు.
    ఆ తర్వాత రాయుడు తలని రెండుచేతుల్తో పట్టుకుని నేలకేసి గట్టిగా కొట్టాడు.
    "బాబోయ్" అన్నాడు రాయుడు.
    ఆ తర్వాత రాయుడిని నేలమీంచి లేపి పిచ్చికొట్టుడు కొట్టాడు.
    ఆ దెబ్బకి రాయుడు వేస్కున్న లాల్చీ మొత్తం పీలికలు అయిపోయింది. అతని రెండు కళ్ళ చుట్టూ రెండు నల్లని చక్రాలు ఏర్పడ్డాయి.
    "హు. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళినట్లు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తాను!"
    అని గోపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
    గోపి అలా వెళ్ళిపోయాడో లేదో మహాలక్ష్మమ్మ ఆరున్నొక్క రాగం ఎత్తుకుంది.
    "ఓ..."
    రాగాలాపన చేస్తున్న భార్యను చూసిన రాయుడు ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు.
    "ఆహా... ఓహో నువ్వెంతటి పతివ్రతవే... నాకు దెబ్బలు తగిలాయని ఏడుస్తున్నావా?" మహాలక్ష్మమ్మ వీపు నిమురుస్తూ అన్నాడు రాయుడు.
    "నేను అందుకు ఏడవట్లేదు ఓర్నాయ్ నో..." రాగం స్థాయి పెంచింది మహాలక్ష్మమ్మ .
    "మరి ఇంకెందుకు ఏడుస్తున్నావ్?" అడిగాడు రాయుడు.
    "ఆ  గోపిగాడు మీకు మరో నాలుగు తగల్నివ్వలేదనేమోనండి బాబుగారూ" అన్నాడు సంతానం.
    "ఒరేయ్ సంతానం! నువ్వు మా మాటలమధ్య దూరావో నీ డిప్ప చీరేస్తా" పళ్ళునూర్తూ అన్నాడు రాయుడు.
    "పోనీ నేను బ్రాంచాఫీసుకు పోనా?"
    "అక్కడికెళ్ళావంటే కాళ్ళు విరగ్గొడతా. ఒక్కడే నోరుమూస్కుని పడుండు. నువ్వు ఇక్కడ బ్రాంచాఫీసుల విషయం ఎత్తానంటే నీ నాలుక పీకేస్తా?"
    "అలగేనయ్యా"
    "చెప్పవే ఎందుకేడుస్తున్నావ్?" భార్యని చికాకుగా అడిగాడు రాయుడు.
    "పాలు ఒలికిపోయాయండీ. ఉహూ ఉహూ" కుమిలిపోతూ అంది మహాలక్ష్మమ్మ.
    "అబ్బ. పోతే పోయాయ్ లే. గ్లాసుడు పాలేకదా?"
    "ఇవి గ్లాసుడు పాలుకదండీ నిండు జీవితం అండీ. పాలలాంటి నా జీవితం మాయమర్మాల బురదలో పడి మలినమై పోయాయండీ. శ్రీరామచంద్రుడని అనుకున్నా మీరు శ్రీకృష్ణుడి రంగులో తేలారండి. ఉహూ... ఉహూ"
    "ఒరేయ్ గోపీ! మా చల్లని కాపురంలో నిప్పులు పోసిన నిన్నేం చేస్తానో చూడ్రా." రంకెవేశాడు రాయుడు.

                                                                       22
    రాధ తండ్రి నారాయణరావు న్యూస్ పేపర్ చూస్తూ భార్యని పిలిచాడు.
    "ఏమేవ్."
    "ఓయ్." అని పలికి, గదిలోకి వచ్చింది కామాక్షమ్మ.
    "నాకు ఓ కప్పు కాఫీ తెచ్చిపెడతావా?" అడిగాడు.
    "ఖళ్..." దగ్గింది కామాక్షి.
    "త్వరగా తేవాలి!"
    "ఖళ్... ఖళ్"
    "ఏంటి సమాధానం చెప్పవేం?" అన్నాడు నారాయణరావు చికాకుగా చూస్తూ.
    "ఎందుకు చెప్పలేదూ. ఇప్పుడే ఖళ్... చెప్పాను కదండీ.... ఖాళ ఖళ్-"
    "ఎక్కడ చెప్పావే!!" ఆశ్చర్యంగా అన్నాడు నారాయణరావు.
    అక్కడే ఓ మూల కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్న సుబ్రమణ్యం కిలకిలా నవ్వాడు.
    నాన్నా నువ్వు కాఫీతెమ్మంటే అమ్మ ఖళ్ అని అన్లేదూ? అంటే అలాగే అని అర్థం ఒక్కొక్కప్పుడు అమ్మ అలానే దగ్గుల్తో సమాధానం చెప్పేస్తూ ఉంటుంది."
    "ఓహో అలాగా? అలాగయితే నేను కాఫీతెమ్మంటే ఖళ్ ఖళ్ అని అంది. అంటే అలాగే అలాగే అని అర్ధమా? హిహి!" నవ్వుతూ అన్నాడు నారాయణరావు.
    "అంతేకదా మరి. ఆడవారి మాటలకూ అర్థాలే వేరులేలాగా అమ్మగారి దగ్గులకు అర్థాలే వేరులే అని మనం అనుకోవాలి" అన్నాడు సుబ్రమణ్యం.
    "అయినా వచ్చి ఇంతకాలమయినా మీకు ఇంకా నా దగ్గులు అలవాటుకాకపోతే ఎలాగండీ? ఖళ్? ఆ? ఖళ్ ఖళ్??" చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ప్రశ్నించింది కామాక్షమ్మ.
    "సరేగానీ. నాకు కాఫీ ఇచ్చేదేమైన వుందా?" అడిగాడు నారాయణరావు.
    "ఖళ్" అనేసి లోపలికి వెళ్ళింది కామాక్షమ్మ.
    నారాయణరావు తల పంకించి ముసిముసిగా నవ్వాడు.
    కామాక్షమ్మ కాఫీ తెచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని జుర్రేసి నారాయణరావు "ఇంకేమిటోయ్ విశేషాలూ?" అని భార్యని అడిగాడు.
    "ఏముంటాయి ఖళ్?"అంది కామాక్షమ్మ .
    "నేను  చెప్తాను" హఠాత్తుగా మొహాన్ని గంభీరంగా మారుస్తూ అన్నాడు సుబ్రమణ్యం చంకలక్రింది కర్రలని సర్దుకుంటూ.
    "ఖళ్?" అడిగింది కామాక్షమ్మ.
    "ఏంట్రా అది?" నారాయణరావు కూడా అడిగాడు.
    సుబ్రమణ్యం మొహాన్ని మరింత గంభీరంగా మార్చాడు.
    "తల్లిదండ్రులకి పిల్లలకీ మధ్యన ఉన్నబంధం అతి పవిత్రమైనది. ఆ బంధానికి గంగానదికున్నంత పవిత్రత ఉంది. చెట్టుకీ కాయకీ మధ్య ఉన్న అనుబంధం అంత పటిష్టమైనది ఆ బంధం. దానిని తెంచడం ఎవరితరమూ కాదు" అన్నాడు.
    "సరే. నువ్వు చెప్పాల్సిందేదో త్వరగా చెప్పేడు" విసుగ్గా బుర్రగోక్కుంటూ అన్నాడు నారాయణరావు.
    "చెప్పేదేదో త్వరగా చెప్పరా. ఖళ్. సన్నాసీ ఖళ్ ఖళ్" అంది కామాక్షమ్మ.
    సుబ్రమణ్యం ఇంటి కప్పువంక చూస్తూ భారంగా అన్నాడు.
    "వద్దమ్మా వద్దు. ఈ ప్రవాహాన్ని ఆపకు. నన్ను చెప్పనియ్ అమ్మా."
    దీర్ఘంగా నిట్టూర్చాడు సుబ్రమణ్యం. ఆ నిట్టూర్పు గాలికి నారాయణరావు చేతిలోని న్యూస్ పేపర్ సర్ ర్ మని ఎగిరిపోయింది.
    "ఆ. ఇందాక ఏమన్నానూ? తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్యన ఉన్న బంధం పవిత్రమైనది అని అన్నానుకదూ."
    "హబ్బా...!" బాధగా జుట్టుపీక్కుంటూ అన్నాడు నారాయణరావు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra