తనగదిలో చాలాసేపు కూర్చున్నాడు - పని అట్టే ఎలాగా లేదు - ఇవాళ అసలేలేదు.
    బయట నినాదాలు ట్రాముల రొదనీ. బస్సుల శబ్దాన్నీ అధిగమించి ఆఫీసులోకి వొస్తున్నాయి. ఆఫీసులోనించి ఎవ్వరూ బయటికి వెళ్ళడం లేదు. అందరి ముఖాల్లోనూ ఆతృత కనిపిస్తోంది...
    "ఇంతవరకూమన ఫ్యాక్టరీలో స్ట్రైక్ లేదు..." అంది ఏదో పనిమీద లోపలికి వచ్చిన స్టెల్లా.
    "ఇది మీకూ కొత్తగానే ఉందా?" అన్నాడు గోపాలం.
    విచిత్రమైన ఈ పరిస్థితిలో ఆమె ఎంతో దగ్గర అయిన స్నేహితురాలిలాగ కనిపిస్తోంది తనకి...
    "అవును... ఇప్పటిదాకా ఎక్కడ ఇలాగ స్లోగన్స్ విన్నా మనకి కాదనే ధైర్యంలో వాటి శక్తి తెలిసేది కాదు...మరేం అలాగ వున్నారు?
    నవ్వి. "నాకేం? బాగానే వున్నాను?" అన్నాడు. కాని, అతనికి కొంచెం తలనొప్పిగా ఉంది.
    "కాఫీ పంపిస్తాను- తాగండి" అంది స్టెల్లా
    "ఎలాగ?- బయట...
    "ఎమర్జెన్సీ లకిలోపల నెస్కాఫీ మిల్కూ ఉన్నాయి.... నా దగ్గర ఆస్ప్రో వుంది..."
    ఆమె వెళ్ళిపోయింది. కాని, చాలాసేపు అతనామెని గురించే ఆలోచనల్లో ఉండిపోయాడు. పెళ్ళికి ముందూ, తరవాతా ఆమెలో ఏమీ భేదం లేదు.... తనమీద ఆమెకి ఉన్న అభిమానం అప్పటిలాగే కాదు.... కాలంలో ఎక్కువైంది. ఇక్కడ తనకి ఉన్న నిజమైన స్నేహితుల్లో ఆమె ముఖ్యమైనది.
    బేరర్ కాఫీ, ఆస్ప్రో తెచ్చాడు. మాత్రలు మింగి కాఫీ తాగి చుట్టూ చూశాడు గోపాలం.
    ఎందుకో హటాత్తుగా అతని కనిపించింది- ఈ గది ఒక జెయిలు అని. ఇల్లూ మరొక జెయిలు. తన జీవితం ఈ రెండు కారాగారాల మధ్యన...ఎవరు తనని బంధీ చేశారు.
    బయట నినాదాలు తగ్గేయి. మళ్ళీ క్రమంగా ప్రశాంతత వస్తోంది.
    ఎంత ప్రయత్నించినా అతని విచిత్రమైన భావన కరిగిపోవడం లేదు- తన నెవరో జెయిల్లో పెట్టేశారు....కనిపించని గొలుసుల్తో కట్టేసి. తన అంతరంగాన్ని ఈ చిన్న చిన్న గదుల్లో కదలనీయకుండా కట్టేశారు!
    ఎవరు?
    ఎదురుగా ఉన్న టెలిఫోను గంట విని నాలుగైదుసార్లు రింగ్ విన్నాక ఎత్తి, "హల్లో" అన్నాడు గోపాలం నీరసంగా.
    "మిస్టర్ గోపాల్?"
    "అవును"
    "నేను - రామానంద్! జ్ఞాపకంవున్నానా?"
    రెండు నిమిషాలో, ఎంతసేపో, అతనికి నిస్పృహలాటి నీరసం వచ్చేసింది.
    "హల్లో?.... హల్లో?... గోపాల్!"
    కష్టంగా కూడదీసుకుని, "సారీ- ఎక్కన్నించి మీరు మాట్లాడుతున్నారు?" అన్నాడు గోపాలం.
    "ఆఫీసు నుంచి- ఆడిటర్ జనరల్ ఆఫీసు తెలుసా?- అక్కణ్ణించి... నా కేకవిని ఆశ్చర్యపడ్డారా?"
    "ఆఁ..."
    "చాలాకాలంనించి మీకోసం ప్రయత్నించేను - కొత్త డైరెక్టరీ వచ్చేక మీ పేరు చూశాను. ఎలాగ ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు?"
    ఎంతో ఆనందం - జీవితానందం, ఉత్సుకత, ప్రతిధ్వనిస్తూన్న రామానందం గొంతుక టెలిఫోన్ ద్వారా గోపాలాన్ని వివశుడిగా చేస్తోంది..... గతంనించి ఒక కంఠస్వరం...
    "ఆఫీసు ఫెయిర్లీ ప్లేసులో - ఉండడం కామక్ స్ట్రేట్ లో..."
    రామానంద్ నవ్వి- "మూర్ఖత్వం నాదే... డైరెక్టరీలో మీ వివరాలు ఉండనే ఉన్నాయి. టెలిఫోన్ మీద ఏం మాట్లాడతాము? - ఒకసారి త్వరలోనే కలుసుకోవాలి - ఏం?" అన్నాడు.
    "అవును -" అన్నాడు గోపాలం.
    "నా అడ్రస్ నోట్ చేసుకోండి -" అని. భవానీపూర్ లో ఒక అడ్రసుచెప్పి, "హరీష్ ముఖర్జీ పార్కు దగ్గర పోస్టు బాక్సు ఉంటుంది....అక్కణ్ణించి ఎడమకి తిరిగితే మూడో గేటు. రెండో ఫ్లోరు, నాలుగో ఫ్లాటు....రాసుకున్నారా?"
    "ఆఁ..."
    "ఎప్పుడు వస్తారు?"
    "త్వరలోనే-"
    "అలాగ బాగుండదు- ఈ ఆదివారం రండి. శ్రీమతితో సహా. లంచికి వచ్చేయండి....ఏం?"
    "అలాగే - కాని వసంత ఆదివారాలు క్లబ్ లో ఉంటుంది"    
    "గాడ్! - కనీసం మీరైనా రండి.... శ్రీమతి గారితో మరీ మరీ చెప్పండి. శశిరేఖ చాలాసార్లు అనుకుంది.....ఆదివారం తప్పకరండి. ఏం?"
    "అలాగే..."
    నెమ్మదిగా ఫోన్ క్రేడిల్ లో పెట్టేశాడు గోపాలం. మరీ నీరసించినట్టుంది అతనికి. అనుకోని ఈ పునః పరిచయం ఈ రోజు......మళ్ళీ శశిరేఖ ఇన్నాళ్ళు ప్రయత్నించాక, ఈనాడు..... రామా నంద్!
    ఖదయే దాకా ఎలాగో గడిపి, తిన్నగా ఇంటికి చేరాడు. స్నానం చేసి కాఫీ తాగి ఏంచెయ్యాలో ఆలోచిస్తూంటే వసంత నిద్ర లేచి వొచ్చింది.
    "తలనొప్పి ఎలాగ వుంది?" అంది ఎదురుగా కూర్చుని.
    అతను కొంచెం ఆశ్చర్యపడి, "నీ కెలాగ తెలుసు?" అన్నాడు.
    "ఎలాగ ఉంది?"
    "తగ్గింది- నీ కెలాగ తెలిసింది?"
    "గూఢచారుల ద్వారాను?" అంది నవ్వుతూ. వసంత.
    కాఫీ తాగుతూ వసంత అతన్ని చూసి, "ఆఫీసులో చాలా గందరగోళంగా ఉందిటగా?" అంది.
    "ఆఁ....లేజర్..."
    "అవును...."
    హటాత్తుగా అతనికి రామానంద్ జ్ఞాపకం వచ్చాడు- వెనువెంటనే అతనికి ఒక ఆలోచన వొచ్చింది.
    "ఆదివారం ఫ్రీగా వుంటారా?"
    "ఆఁ-ఏం?"
    "నా పాత ఫ్రెండు రామానంద్ - ఆడిట్ ఎకౌంట్స్ లో ఉంటున్నాడు- ఫోన్ చేశాడు లంచ్ కి రమ్మని..."
    "ఎవర్నో!"
    "మనల్ని"
    "ఏమన్నావు?"
    చిన్న అబద్ధం పెద్ద పాపంగా కనిపించలేదు గోపాలానికి.
    "నిన్నడిగి చెప్తానన్నాను"
    మళ్ళీ కప్పులో కాఫీపోసుకుని తాగసాగింది వసంత.
    "రామానంద్ ఎవరు?"
    "విశాఖపట్నంలో తెలుసును...
    "ఎలాగ?"
    ఎలాగ? ఇక్కడ ఏ అబద్ధం ఆడినా పాపం లేదని తెలుసును గోపాలానికి...కాని, దాని వల్ల ప్రయోజనమూ లేదని తెలుసును.
    "అతను - శశిరేఖని పెళ్ళిచేసుకున్నాడు"
    తేరిపార చూసింది వసంత. అతను ఆమె ముఖంలోకి చూద్దామనుకున్నాడు- కాని కళ్ళు దింపుకున్నాడు.
    "శశిరేఖ ఇక్కడే వుందా?"
    "ఆఁ...."
    "ఆమెని నువ్వు మరిచిపోలేదుగాదూ?"
    సామాన్యంగా అడిగింది వసంత. కాని ఆ మాటల్లో, తన-తను జీవిత రహస్యం ఉన్న సంగతి అతనికి తట్టలేదు- రొదగా ఉన్న ఆపరిస్థితుల్లో.
    "ఆమె నాకు - స్నేహితురాలు"
    "నిజం చెప్పు గోపాలం.
    నిజం...ఏమిటి నిజం?- శశిరేఖని తాను నిజంగానే మరిచిపోలేదనా? ఆమెకోపం ఆతృతగా ఈ మహానగరంలో నెలలనించి తాను చూస్తున్నాడనా?.... తనని దూరంగా చేసిన వసంత దూరమైపోయిన శశిరేఖని మళ్ళీ దగ్గరికి తెచ్చిందనా? ఏమిటి నిజం? తాను విష వలయాల్లో చిక్కుకున్నాడని తప్ప?
    "నిజం చెప్పినా నీకు అర్ధం అవదు వసంతా!"
    తేలిగ్గా నవ్వింది వసంత. "సినిమా స్క్రిప్టు లాగ ఉంది గోపాల్!- నిజం చెప్పిచూడు, నీకే తెలుస్తుంది!"
    "తప్పుగా ఆలోచిస్తున్నావు వసంతా!....ఆమె పెళ్ళిచేసుకుని సుఖంగా ఉంది....అప్పటి పరిస్థితులు వేరు- అంత నీతిలేని మనిషిని కాదు," అన్నాడు గోపాలం కొంచెం కోపంగా.
    చిరునవ్వు ముఖంనించి పోనీకుండా, "అవును- పరిస్థితులు మారిపోయాయి.....ఆమె దూరం ఐ పోయింది.... నీ నీతి నిజంగానే నీ శరీరాన్ని అదుపులో పెట్టగలదు.... కాని. గోపాలం- నీ మనస్సుని ఎవరాపుతారు?- కనిపించని నీ ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి- నాకు తప్ప?" అంది వసంత.
    కోపంగా లేచి నిలబడ్డాడు గోపాలం. నిశ్చలంగా ఆమె అక్కడ కూర్చుని, తనని ఆడించి ఆడుకుంటుందనే భావం ఆ క్షణంలో మరీ బలపడింది.
    ఉప్పొంగిన కోపంతో అతను ఆమె దగ్గరగా వచ్చాడు- చెయ్యి ఎత్తి, మరుక్షణం సర్దుకుని ఆమె రెండు భుజాలూ పట్టుకొని ." ఉన్న కల్మషం నీలోనే- నీ మనస్సులోనే నిలిచివుంది వసంతా! శశిరేఖని అనే హక్కు నీకేం వుంది? కనీసం, ఆమె చరిత్రనీ-"
    తెలివి వచ్చినట్టు ఆగిపోయాడు. అతని కోపం మళ్ళీ అవధుల్లోకి వొచ్చింది.
    వసంత చిరునవ్వుతో, "చెప్పు గోపాలం!" అంది.
    "ఏమీలేదు-"
    ఆమెనించి చేతులుతీసి డ్రాయింగ్ రూమ్ కి వెళ్ళి కూర్చున్నాడు గోపాలం. టేబిల్ మీద తన ఉత్తరం చూసి వణుకుతున్న చేతుల్తో తీశాడు.
    ముందర ఉత్తరంలో ఏముందో అతనికి కనిపించలేదు. క్రమంగా తెలిసింది- రెండేళ్ళ కిందట రాసిన సర్వీస్ కమీషన్ పరీక్షల ఫలితాల ప్రకారం, తనకి అప్పర్ డివిజన్ గుమాస్తా ఉద్యోగం ఇవ్వడానికి ఆఫర్!
    నిస్పృహగా ఉత్తరం కిందని పడేశాడు.
    ఏం పనిచేశాడు ఇవాళ! వసంతని కొట్టేంత పని....ఎన్నడూ లేనిది...
    చాలాసేపు అతను సోఫాలో కూర్చుని ఆలోచిస్తూనే ఉండిపోయాడు. వసంత మాటల్లో చాలా నిజం ఉందనే నిజం ముళ్ళమల్లే గుచ్చుకుంటూంది.... ఆమె ఎంత బాధపడుతూ ఉంటుందని!
    సుమారు గంటసేపటి తరవాత వసంత వచ్చి అతని పక్కన కూర్చుని "సారీ, గోపాలం.... నేనన్న మాటలు మరిచిపో -" అంది.
    తెల్లబోయి చూశాడు గోపాలం..." తొందరపడ్డాను వసంతా..."
    "కాదులే - తొందరలో నూ నిజమే చెప్పావు....ఎన్ని అబద్ధాల పూతలదో మనస్సుని దాచగలం?....ఆదివారం నేనూ వస్తాను. అతనికి చెప్పు" అంది వసంత లేచి, లోపలికి వెడుతూ.
    అతనికి మరీ ఆశ్చర్యంగా ఉంది. ఏమి జరుగుతూందో ఆలోచించేస్థితి దాటిపోయింది. ఆమె ఆలోచనలు ఏమిటో అంతు దొరకడం లేదు.
    ఆరాత్రి భోజనాల దగ్గర సంభాషణ సాగలేదు. రాత్రి చాలా ఆలశ్యం అయేదాకా వసంత ఏదో పుస్తకం చదువుతోంది. ఆమెని గురించి ఆలోచిస్తూ. అతనికి నిద్రపట్టలేదు.

                                   *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra