నవ్వుతూ అంది. "ఇది నిజం పిచ్చే! నాలో ప్రేమ అనేది ఇంకిపోకుండా వున్నన్ని రోజులు నన్ను కాక మరెవరిని ప్రేమించను వేణూ! నా ప్రేమవాహిని నిర్మలంగా నిశ్చలంగా నిబ్బరంగా సదా నీవేపే ఒడుదుడుకులు లేకుండా ప్రవహిస్తూనే వుంటుంది. ఇప్పుడేకాదు ఎప్పటికీని నిన్నే ప్రేమిస్తూ వుంటాను నేను."
    ఆ చేతిని అలాగే తీసుకుని మృదువుగా మల్లెపూవుని తాకినట్టు ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
    "నిజంగా నేను ధన్యుడిని విరజా! నిజం! దేవత అనుగ్రహించిన మానవుడు ధన్యుడు కాక మరేమవుతాడు? నిజం విరజా! ఆనందంలో నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో చూడు" ఆమె చేతిని గుండెలపై ఆనించుకుంటూ అన్నాడు.
    "నా మనస్సు ఉప్పొంగిపోతోంది. ఆనందాన్ని పట్టలేక పోతున్నాను విరజా! ఏం చేయాలి?"
    ఒక విధమైన చిత్తవృత్తి కలవాళ్ళు దుఃఖాన్ని కానీ అణచుకోలేరు. భరించలేరు. వారు దాని తాకిడికి తట్టుకోవాలంటే ఆలంబనం కావాలి.
    ఏమీ జవాబు ఇవ్వకుండా మెల్లిగా మందహాసం చేసింది. శుక్లాష్టమిన నడిరేయిని చందమామ వెలిగినట్టు.
    "అలా నవ్వకు విరజా! నీ నవ్వులన్నీ నా గుండెల్లో కూర్చుని ప్రతిసెకనూ మార్మోగుతూ నన్ను నిద్రకు దూరం చేస్తున్నాయ్. సదా నీ స్మరణే! అనుక్షణం నీ ఆలోచనే! నిదురపోయినా.... పోకున్నా, మేలుకున్నా.... ఏ పనిలో మునిగిపోయినా మనసు నిండా నీవే నిండుకుని నన్ను నిలువనీయకుండా వున్నావ్. నిజంగా నువ్వన్నట్టు పిచ్చెక్కితే ఎంత బావుంటుంది విరజా."
    మౌనంగా చిరునవ్వు నవ్వుతూ ఉదయిస్తున్న సూర్యుడు కమల పత్రములమీద కాంతుల్ని విరజిమ్ముతున్నట్టు అతని ముఖంలోకి చూస్తూ కూర్చుంది.
    "అలా చూడకు విరజా! నేను నిలువలేను. నా మనస్సు వశం తప్పుతోందా అనిపిస్తోంది.... ఎలా విరజా నిన్ను విడచి ఉండటం. రోజూ ఉదయం ఓ గంట ఓ గంట సాయంత్రం ఓ గంట నీ సాన్నిధ్యంలో అంతేనా నీ ప్రియుడికి భాగ్యం. సదా నా సన్నిధిలో నీవూ, నీ సాన్నిధ్యంలో నేనూ వుండే అదృష్టం లేదా? ఆ అవకాశమే రాదా? చెప్పు విరజా__. ఇక ఎప్పుడూ ఇంతేనా? కలుసుకున్నప్పుడల్లా కళ్ళనీళ్ళు నింపుకోవటం మళ్ళీ కలుసుకునేవరకూ ఆలోచనల్లో మునిగిపోవటం ఇదేనా నేను నా అదృష్టమనుకో వలసింది. మాట్లాడవేం విరజా!
    ప్రశాంతమైన వదనంతో నిర్మలత్వాన్ని సూచించే గొంతుకతో మెల్లిగా అంది.
    "ఎవరో ఉర్దూ కవి రాశాడు. నీవు నా దగ్గర ఉంటే నీవే నా ప్రపంచమనుకుంటాను. నీవు దూరంగా వుంటే ప్రపంచమంతా నీవే నిండియుంటావు.
    ఆమె మాటలని పూర్తి కానివ్వకుండానే ఉద్రేకంతో వణుకుతున్న గొంతుకతో అన్నాడు.
    "కవిత్వాల జోలికి వెళ్ళొద్దు__ఈ కవులు ఉపమానాలతో మనస్సులకి పైపై మలాం వేస్తారు. కానీ నిజమైన మనస్సున వెల్లడించరు. మలాం వేస్తారు కానీ నిజమైన మనస్సుని వెల్లడించరు. వాస్తవికతను తెలుపలేని కవిత్వం ఎందుకు? కల్పనతో మురిసో వాళ్ళుంటారంటే వాళ్ళ విషయం మనకెందుకు?"
    సహజమైన చిరునవ్వును చెదరనీయకుండా అంది. "లేదు వేణూ! ఉర్దు పారశీక కవిత్వం నీవు విని వుండవు. వాటిలో అతిశయోక్తులు అనేవి వెతికినా కనిపించవు. అంతరంగ చిత్రణ అనంతరంగ చిత్రణ తప్ప అందులో మరేమీ లేదు__"
    నిష్కర్షగా మాటలతో పని లేదన్నట్లు అన్నాడు. "పోనీలే! కవిత్వం విషయాలు మనకెందుకు? అవి రాసిన వాడిని బ్రతికించవు. తమని అమ్మేవాడిని తప్ప ఇంకొకర్ని బాగు చేయవు. నా మాటకి జవాబు చెప్పు_నావద్దే నా ఇంట్లోనే ఎప్పుడుంటావ్?"
    ఆమె ఆ ప్రశ్నకి జవాబివ్వలేదు.
    "సంఘానికి భయపడుతున్నావ్ కదూ? ఛీ__ఛీ__ఏం సంఘం? ఏం ప్రపంచం?"
    చిరాకుగా ఒక సెకను తర్వాత అన్నాడు. "నీవు నా యింటిలోనే పుట్టి వుండరాదా విరజా! అలా అయుంటే ఎంత బావుండేది? అయినా అంత అదృష్టవంతుడినా నేను...."
    అయిదారు సెకన్లు లోకానికి ఎదురుగా తిరిగాయ్.
    "లోకాన్ని నీవు కాదన్నా నేను లోకాన్ని కాదన్నా ఆదిలో మనలో మనకీ కొరతగానే వుంటుంది. మనసు బాధిస్తూనే వుంటుంది. అదేదో కించగానే వుంటుంది. ఈ ప్రపంచంలో జన్మించడమే దోషం. పుట్టినా మనసున్న మనిషిగా మానవత్వానికి దగ్గరగా పుట్టడం మరీదోషం. అయినా అదంతా గ్రహచారం__పోనీ నీ మనసులోని మాట చెప్పు విరజా! మళ్ళీ జన్మ అనేది వుంటే ఆ జన్మలో నీవు నా దగ్గరకు వచ్చేందుకై జన్మిస్తావు కదూ__" మనసులోని ఆశంతా వుట్టిపడేట్లు అడిగాడు.
    మనిషిలో ఉత్సాహాన్ని కలిగించే విషయాలు ఏవైనా వుంటే అవి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో వాటికి రెట్టింపు ఆనందం కలిగించింది ఆమెలో.
    "తప్పక వేణూ! అంతకంటే నాకు కావలసింది ఏముంది? పునర్జన్మ అంటూ వుంటే తప్పక నేను మీ ఇంటికే వస్తాను. ఈ జీవన కలశంలో అమృతం చిలికిన దేవుడివి నీవు. నిన్ను....నిన్ను ఈ జన్మలో విడిచి వుండటమే దురదృష్టకరం. ఇంక యింకో జన్మలోనైనా నీవద్దకు రాకుండా వుండగలనా?"
    మగవారికి ఆశ అధికం! విషయాన్ని విపులీకరించే వరకూ వూరు కాదు అతని హృదయం.
    "మా ఇంట్లో పుట్టటమంటే మా యింటిలోనే పుట్టకూడదు విరజా! అలాగైనా మనం వేరవుతాం. అందుకే ఎక్కడో పుట్టి పుట్టిన అనతికాలం కాలంలోనే నావద్దకు రావాలి."
    గలగలా నవ్వింది. చుక్కలు సిగ్గుపడేట్టు. "వేణూ! వేణూ! నేను నీతో వుండాలి. నేను నీకు కావాలి! అంతే కదా దాని అర్ధం, వచ్చే జన్మలో నేను నీదాన్నే వేణూ!"
    పరమ సంతోషంతో మృదువైన ఆమె అంగుళుల్ని ముద్దిడుకుంటూ అన్నాడు.
    "రా విరజా.... విరజా.... ఒక జన్మ అబ్బ? ఎంతకాలం? ఒక నెలకాదు, ఒకరోజుకాదు. ఒక సంవత్సరంకాదు__ ఇంకా ఇంకా ఇప్పుడప్పుడని కాదు. ఒక జన్మ_ ఒక జన్మ_అబ్బ! ఎంతదూరం ఎంతకాలం!"
    ఒక్క క్షణం ఆగి ప్రేమగా చూస్తూ అన్నాడు.
    "నీవు నాకు కావాలి విరజా!"
    ప్రేమ ఉట్టిపడే కంఠంతో అతడనే ఒక్కొక్క మాట ఆమె హృదయాన్ని చీల్చివేస్తోంది.
    ఎంతటి ప్రణయజీవి! మనస్సంతా అక్షర రూపంలో నివేదిస్తున్నాడు. కాదనే ఊహ పుట్టడంలేదు. కాదనగల గుండెలేదు, శక్తిలేదు.
    వియోగాన్ని అనుభవిస్తూ విరహాన్ని అనుభవిస్తూ భరిస్తూ ఎన్నాళ్ళు యిలా జీవించాలి? భగవాన్ మనిషిని నిలువునా దహించే పరీక్షపై పరీక్ష ఎందుకిలా కల్పిస్తున్నావ్?
    నా మనసు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఏనాడో విచిత్రమైన సంజీవిని మంత్రంలో ఒక్కొక్క ముక్కనే అతుక్కుంటూన్న ఈ సమయంలో మళ్ళీ భూకంపం కలిగింపబోకు భగవాన్."
    చేయిని బలంగా వూపుతూ "పలుకవేం విరజా! నా మాటలు రుచించటంలేదా? విసుగ్గా ఉందా? చెప్పవేం విరజా!"
    ఏ దేశములోనైనా ఎంతటి విషాద పరిస్థితులలోనైనా యెంతటి విపత్కర పరిస్థితిలోనైనా ఎలాంటి చిక్కులలోనైనా తేలిగ్గా హాయిగా ఉన్నట్టు మనసు లోలోపలే మండిపోతున్నా నవ్వేయగల శక్తిని భగవంతుడిచ్చాడు స్త్రీలకి.
    "లేదు వేణూ! నీ మాటకి విసుగొచ్చిన రోజున జీవితం మరుక్షణంలోనే ముగుస్తుంది. వెన్నెలలోని చల్లదనం నదీ మధ్యలోని యిసుకలోని ఆర్ద్రత.... పాలుపోసే వారి వెన్నులోని మెత్తదనం కలమాగిన తానీషా మామిడిపండులోని నిషా.... నీ మనసు నీ మాటలు ఎప్పుడూ నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఒకేవిధమైన ప్రభావం కలిగివుంటాయ్.... అవి కాలాన్నిబట్టి పరిస్థితుల్నిబట్టి మారేవికావు...."
    "చాలా సంతోషం విరజా! నా మనస్సుని అర్ధం చేసుకున్నావు. అంతకంటే నాకు కావలసిందేమీ లేదు. చెప్పు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు? నీవు నాకే కావాలి విరజా, నా మనసు సదా నీవద్దే ఉండాలని తపిస్తోంది. నాలోని అణువణువుకూ నీవే కావాలని ఆరాట పడుతోంది.... చెప్పు విరజా! నా సన్నిధికి ఎప్పుడు వస్తావు.
    అతని మాటను దాటవేస్తూ అంది.
    "తపస్సు చెయ్ వేణూ! దేవతలు ఊరికే అనుగ్రహిస్తారా?"
    "నా తపస్సు చాల్లేదా?"
    "లేదు నీ తపస్సు చాలదు? ఇంకా ఇంకా చెయ్....
    "అబ్బ పదేళ్ళ తపస్సు చాల్లేదా? ఈ నెల రెండు నెలలనుంచి చేసే తపస్సుకంటే యెన్నో రెట్లు ఎక్కువే అదీ చాల్లేదా? జవాబు చెప్పు విరజా! మౌనం వద్దు అని నన్ను వేధించినంతగా మరేదీ వేధించదు."
    "లేదు వేణు! మౌనం కాదు. నీ మనసు తెలుసుకుంటున్నాను. యింకా యింకా దీర్ఘంగా గాఢంగా సాగాలి మన స్నేహం. వెనుకటి జన్మలో మనమెవరిమో, ఎంత సన్నిహితంగా మెలిగామో, ఆ జన్మనుండి ఎంత పుణ్యం సంపాదించుకున్నామో, ఈ జన్మలో యింతటి సన్నిహితం సాధ్యమైంది. వచ్చే జన్మలో విడిగా బతకటం అసలు.... నీవే నేనూ నేనే నీవు అంతే!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra