Home » Yerramsetti sai » Death Chamber


    ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన ఇంతవరకూ తనకు కలుగలేదు. అంత ఆసక్తి కూడాలేదు.
    "అసలు మీరెప్పుడో మంచిఇల్లు కొనుక్కోవాల్సింది. ఇంకా అద్దె ఇళ్ళల్లో గడిపే అవసరం మీ కేమిటి? మీరు వెంటనే రండి? ఇక్కడి ఇల్లు చూద్దురుగాని! మీకు నచ్చితే ఓనర్స్ తో మాట్లాడదాం!" అంది సరోజిని.
    "సరే!" అనాసక్తితోనే వప్పుకుంది చంద్రిక.
    కొత్తగా కట్టినకట్టడమే అది. చాలా ఆధునికంగా కూడా వుంది.
    అయితే నలభైలక్షల రూపాయలకు తక్కువయితే ఇవనని ఖండితంగా చెప్పేశాడు యజమాని.
    ఆరోజే రాత కోతలన్నీ పూర్తయిపోయినయ్. రెండురోజుల తర్వాత ఆ ఇంట్లోకి మారిపోయింది చంద్రిక. ఇంట్లోదిగిన మర్నాడే ఓ చిత్రంలో ఆమెనటనకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బహుమతి లభించినట్లు వార్త వచ్చింది.
    సరిగ్గా అప్పుడే ఆ సంవత్సరం ఉత్తమ నటి అవార్డ్ కూడా వచ్చింది.
    దాని వెంటనే సన్మానాలూ, సభలూ క్షణం తీరికదొరకడం లేదు.
    అన్ని పత్రికల్లోనూ తన ఫోటోలే! తనకు ప్రశంసలే!
    కౌశల్ చిత్రంలో నటించడానికి ఆ యూనిట్ తో పాటు అవుడ్దోర్ షూటింగ్ కి బయల్దేరింది చంద్రిక.
    కౌశల్, తనూ, డైరెక్టరూ, మరో కొత్త హీరోయిన్ రాధిక కలసి ఒకే కారులో కూర్చున్నారు. తన పక్కనే కూర్చున్న చంద్రికతో ఏవేవో కబుర్లు చెప్పసాగాడు కౌశల్. మద్రాస్ కి దగ్గరలోనే వుంది లొకేషన్. సాయంత్రం అయిదు గంటలకల్లా అందరూ అక్కడికి చేరుకున్నారు.
    అక్కడున్న పల్లెలోనే మరికొన్ని గుడిసెలు నిర్మించి సెట్టింగ్ లా ఏర్పాటు చేశాడు ఆర్ట్ డైరెక్టర్.
    ఆ ఊరి పెద్ద పెంకుటింట్లో ముఖ్యమయిన ఆర్టిస్టులకు బస ఏర్పాటు చేశారు.
    మిగతా వారంతా ఆ గుడిసెల్లో నే మకాం.
    ఆ కొద్ది రోజుల్లోనూ కౌశల్ ని అతి సమీపంగా పరిశీలించే అవకాశం ఏర్పడింది చంద్రికకు.
    అతను మంచి వ్యక్తిలానే కనిపించాడు. కానీ బొత్తిగా సహనం లేదు.
    చిన్న విషయనికి కూడా కోపం తెచ్చుకునే అతని మనస్తత్వం అందరికీ చికాకుగానే వుండేది.
    కెమెరామెన్ నుంచీ ప్రొడక్షన్ ఆఫీస్ బాయ్ వరకూ అందరూ అతనికి దూరంగా వుండాలని కోరుకునేవారే!
    అతనికి వున్న పేకాట, రేసుల పిచ్చి గురించి కూడా వింది తను. అయితే ఇన్ని దుర్గుణాలున్నా అతనిలోని ఒకే ఒక సుగుణం చంద్రికను ఆకర్షించింది. అది నిర్మొహమాటంగా, కపటం లేకుండా అతను మాట్లాడేతీరు. అలా మనసులో వున్నదున్నట్లు చెప్పడం సినిమాఫీల్డులో ఎవరికీ సాధ్యంకాదు. చాలామంది గమనించింది తను. చివరకు తను కూడా ఎన్నోసార్లు చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయేది.
    వారం రోజులు షూటింగు జరిగాక ఓ రోజు అతనికీ డైరెక్టరుకీ ఏదో విషయంలో అభిప్రాయభేదాలొచ్చాయి. వెంటనే డైరెక్టర్ని ఆ చిత్రం నుంచి తొలగించేశాడు కౌశల్.
    డైరెక్టర్ తోపాటు కెమెరామెన్ కూడా ఆ చిత్రానికి పనిచేయడం విరమించుకున్నాడు.
    దాంతో షూటింగ్ కి అంతరాయంకలిగింది. చంద్రికకు అతని మూర్ఖత్వం చూస్తే జాలేసింది. ఓ పక్క అతను ఎన్నో ఆర్ధికమైన ఇబ్బందులలో వున్నాడు. ఎంతో కష్టంమీద మళ్ళీ చిత్రం ప్రారంభించాడు. ఇప్పుడు ఇది కూడా ఆగిపోతే అతనింకకోలుకోవడం కష్టం.
    ఆమె వూహించినట్లే ఆ చిత్రం అక్కడితో ఆగిపోయింది. కెమెరామెన్, డైరెక్టరూ తమ తమ యూనియన్ ద్వారా ఈ చిత్రానికి మరొకరు పనిచేయకుండా అలజడి ప్రారంభించారు.
    మిగతా యూనిట్ అంతా షూటింగ్ ఆపి వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    "మీరు ఈ విషయాన్ని తేలిగ్గానే తీసుకోవడం బావుండలేదు." ఆ సాయంత్రం కౌశల్ తనదగ్గర కొచ్చినప్పుడు అంది చంద్రిక.
    "ఏమో చంద్రిక గారూ! నాకు మొదటి నుంచీ అలవాటైపోయింది. ఏ విషయమయినా సరే, ఎంతప్రాణం మీది కొచ్చినాసరే భయపడను. అది క్లిష్టమయిన కొద్దీ నాలో మొండితనం పెరిగిపోతూంటుంది.
    ఈ మొండితనం మూలాన జీవితమంతా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా నన్ను నేను నిగ్రహించుకోవడం సాధ్యం కావడం లేదు. బహుశా ఈజీవితం ఇలా అంతం కావలసిందేననుకుంటాను" నవ్వుతూ అన్నాడతను.
    "కానీ మీ లోపం తెలిసికూడా సరిదిద్దుకోకపోవడంమంచిది కాదు" చొరవగా అందామె.
    అతను ఆమె మాటలకు వెంటనే జవాబివ్వలేదు. కొద్దిసేపు ఆలోచిస్తూవుండిపోయాడు.
    "ఇప్పుడీ చిత్రం ఆగిపోవటంవల్ల నష్టం మీ ఒక్కరికే కాదు. ఇందులో వర్క్ చేస్తున్న అందరికీ నూ మరి మీ లోపం వల్ల ఇంత మందికి నష్టం కలిగించడం భావ్యమా చెప్పండి!"
    చాలాసేపు ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేయసాగాడతను.
    "ఇంతకూ నన్నేం చేయమంటారో చెప్పండి" తిరిగి ఆమె దగ్గరకొచ్చి అడిగాడు.
    "ఏమో! ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ మళ్ళీ షూటింగు ప్రారంభమయేలా చేయండి" నవ్వుతూ అంది చంద్రిక.
    "సరే! నేను మద్రాస్ వెళుతున్నానిప్పుడే! రేపే షూటింగు ప్రారంభమవుతుంది."
    అక్కడనుంచి వెళ్ళిపోయాడతను. ఓ అరగంటలో అతను కార్లో వెళ్ళిపోవడం కనిపించిందామెకు.
    ఆ రాత్రికే తిరిగి వచ్చేశాడు కౌశల్. చంద్రికకు అప్పుడే నిద్ర పడుతూండగా తలుపు తట్టాడు అతను. లేచి తలుపు తీసింది చంద్రిక.
    "నిద్రపోయారా? సారీ! మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనుకున్నాను గానీ చేయకపోతే నాకు మనశ్శాంతి దొరికేటట్లు కనిపించలేదు.
    "ఫరవాలేదులేండి. నేనూ ఇప్పుడే పడుకున్నాను. ఇంతకూ ఏమయింది మీరు వెళ్ళినపని?" అడిగింది చంద్రిక.
    "ఓ.కే. అయింది రేపు ఉదయంనుంచీ షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది" ఉత్సాహంగా చెప్పాడతను.
    "అబ్బ! పెద్ద సమస్య పరిష్కారమైపోయింది" చిరునవ్వుతో అంది చంద్రిక.
    "తమాషా చూశారా! నేనువెళ్ళేటప్పటికే వాళ్ళు రాజీకి సిద్దంగా వున్నారు. నాదీ, డైరెక్టరుదీ ఇద్దరినీ తప్పుందని ఇద్దరమూ వప్పుకున్నాం"
    "మరి వాళ్ళు కూడా వచ్చేశారా?"
    "కెమెరామెన్ రేపొద్దున్న కల్లా వచ్చేస్తాడు. డైరెక్టరు వచ్చేశాడు"
    "పోనీండి! ఆర్టిస్టులందరికీ భయంగా వుంది సినిమా పూర్తవుతుందోలేదోనని! ముఖ్యంగారాధ మరీనూ! రాకరాక వచ్చిన యీ అవకాశం పోతుందేమోనండీ అంటూ ఒకటే ఇది."
    అతను నవ్వాడు.
    "ఏదేమైనా నేను మీకు థాంక్స్ చెప్పాలి!"
    "ఎందుకు?"
    "మీరు పొద్దున్న పాఠాలు చెప్పకపోతే ఈ పని జరిగి వుండేదికాదు."
    "ఓహో! అలాగయితే ఆ పాఠం చెప్పినందుకు ట్యూషన్ ఫీజు కట్టండి."
    అతను ఓ నిముషం ఆలోచించాడు.
    "సరే! ఈ పిక్చర్ కి వచ్చేప్రాఫిట్ లో సగం మీది! ఏమంటారు?" అన్నాడు సీరియస్ గా.
    చంద్రిక ఆశ్చర్యపోయింది.
    "బావుంది. నేనుసరదాగా మాట్లాడితే అలా సీరియస్ అయిపోతారేం?"
    "మీరు సరదాకే అన్నారేమోగాని దాని వెనుక నిజం వుంది. ఎందుకో మొట్టమొదటిసారి నేను నా మనసు మార్చుకున్నాను ఇవాళ! మీలో ఏం శక్తి వుందో తెలీదుగానీ ఇంతవరకూ ఏనాడూ ఎవరిమాటా వినలేదునేను!"
    చంద్రికకు అతనిమాటలు ఎంతో ఆనందం కలిగించినయ్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra