Home » Gullapalli sundaramma » Athani Lakshyam


    'శాంతా ' అరుస్తూ చెయ్యెత్తాడు రామం.
    'అబ్బ . ఏవన్నాననండి. మీకంత ఆవేశం?' తగ్గింది శాంత.
    'ఇంకా ఏమనాలి....నిజం చెప్పాలంటే సుధ వద్ద మనమే తిండికి చేరాం తెలిసిందా. ఈ కంపెనీ కంతా హక్కు దార్రాలు సుధ. సుధ వద్ద పనిచేసే జీతగాళ్ళం మనమంతానూ. అందువల్ల ఇక మీదనన్నా నీ నోరు అదుపులో వుంచుకో. తెలిసిందా?'
    'ఏమో. ఈ కుంబకోణాలన్నీ మాకేం తెలుసూ...' నిజంగానే శాంతకి ఈ వివరాలన్నీ తెలియచెప్పలేదన్న సంగతి అప్పటి వరకూ గుర్తురాని రామం, అయితే ఈ తప్పు తనదే అనుకుని కాస్త శాంతించాడు.
    'అంటే నీకీ సంగతులేవీ తెలియవన్న మాట.... అంతేనా' సావధానంగా అడిగాడు.
    'మీరెప్పుడన్నా చేపితేగా? ఎంతసేపూ తప్పులు బట్టడం తప్పా. అయితే ఈ కంపెనీ మావయ్యదన్నమాట...' అంది శాంత సర్దుకుంటూ.
    'కాదు మా బాబయ్య ఆ కంపెనీ లో వో చిన్న ఉద్యోగం లో వుండగా యజమాని తన స్వదేశం వెళ్ళిపోతూ అమ్మకం పెట్టాడు. సరిగ్గా ఆ సమీప కాలం లోనే వచ్చిన మా అత్తయ్య తన వజ్రాల నగలు వగైరా లన్నీ అమ్మించి బలవంతంగా మా బాబాయి చేత ఆ కంపెనీ ని కొనిపించింది. ఆవిడ హృదయం మంచిది , మా అదృష్టమూ బాగుంది గనక ఒకటికి పదింతలుగా వర్ధిల్లిందా కంపెనీ.'
    'అబ్బా అయితే మీ అత్తయ్య కి అంత అనుభవం వుందన్న మాట.'
    'సరిపోయింది. ఆరోజుల్లో ఈ కంపెనీ అభివృద్ధి కొచ్చే టంతవరకూ లెక్చరర్ గా పనిచేసి కుటుంబానికి సాయపడ్డది అవిడేగా. ఎం.ఎ ప్యాసయిందావిడ.'
    'ఎవరూ? ఈ అత్తయ్య గారే?'
    'ఆ అదొక్కటే కాదు. ఇంకా ఎన్నెన్నో ఉపయోగకరమైన చేతి పనులన్నీ వచ్చు నావిడకి. ముఖ్యంగా ఒక్క క్షణం కూడా కాలాన్ని వృధా చెయ్యదు. ఇప్పుడు తెలిసిందా. అంతరంగ సౌందర్యమంటే ఏమిటోనూ.'
    'ఆ, పైపై అందాల్ని పరికరాల్తో ఎవ్వరైనా దిద్దుకోగల్రు కానీ, అమ్మో? ఈ అంతరంగిక సౌందర్యం అలవరచుకోవాలంటే చాలా పాటుపడాలి.' అ ఇబ్బంది నంతా చూపుల్లో తెలియ పరుస్తూ అంది శాంత.
    'ఆ అదీ అసల్సంగతి . అందువల్ల ఇక మీదనన్నా కాస్త నువ్వూ ప్రయత్నించావంటే, కొన్నాళ్ళ తరవాత కన్నా--'
    'నిజమే, అయితే ఏ మొహం పెట్టుకు వెళ్లి అడగడం అని--'
    'మా అత్తయ్య గొప్ప గుణం నీకు తెలియదు. మధ్యాహ్నం పూట సుధ కి చదువూ, మిగతా చేతి పన్లూ చెప్తున్నప్పుడు నువ్వూ వెళ్ళావంటే ఎంతో ఉత్సాహంగా నేర్పుతుంది.
    'మీరు చేపుదురు ఆవిడ తోటీ....' గునిసింది.
    'అలా చెప్పడమే తప్పు. నువ్వే అడిగితె ఆవిడకీ తృప్తిగా వుంటుంది.' అంటూ లేచాడు అవలించు కుంటూ రామం. అతను పడుక్కున్న వెంటనే హాయిగా నిద్రపోయాడు. అయితే జానకి, సుధలకూ, తనకూ అలవాట్ల లో వున్న తారతమ్యాన్ని తూచి చూసుకుంటూన్న శాంత కి ఆలోచనలతో ఎంతసేపటి కి నిద్ర పట్టలేదు.
    ఆ మర్నాట్నుంచి  శాంతలో కొంత మార్పుని గుర్తించారు . ఇంట్లో వారందరూ. ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుతూ, తిండి కాఫీ వగైరాలప్పుడు తప్ప మిగతా వేళంతా శృంగారించుకోవడం లోనూ నిద్ర పోతుండడం తోనూ గడిపెస్తుండే శాంత యిప్పుడు ఒక్క రాత్రి వేళ పడుక్కుందుకు తప్ప మిగతా రోజంతా నలుగురి తోటీ ఎంతో కలియకలుపుగా తిరుగుతుంది.
    'మీ సుధతో పాటు నాక్కూడా కాలక్షేపానికేవన్నా నేర్పుదురూ పిన్ని గారూ' అని చనువుగా అడిగేసింది ఒకరోజు.
    'దానికేం ఎవరికన్నా నేర్పాలంటే నాకెంతో సరదా అసలు' అంది సంతోషంగా జానకి.
    'నాకసలు ఏవీ రాదు సుమండీ? అక్షరాల దగ్గర్నుంచీ చదువూ, సూదిలో దారం గుచ్చడం దగ్గర్నుంచీ కుట్లూ నేర్పాల్సిందే సుమండీ? తరువాత మీ ఇష్టం' అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది శాంత.
    'అయితే మరీ మంచిది. అసలిలా మొదట్నుంచీ నేర్పడమే సుళువు కూడా?' అని శాంత కి ఉత్సాహం కల్గించి తల్లీ, కూతురు ఎవరికీ వీలున్నప్పుడు వారు అన్నీ నేర్పుతుండేవారు శాంతకి.
    కుట్టుపనుల మాటెలా వున్నా, ఇంగ్లీషు లో మాట్లాడం రావాలని ఏంతో సరదా పడుతున్న శాంత పట్టుదలతో , శ్రద్దగా చదువుతూ ఏడాది కల్లా బాగా మాట్లాడ్డమే గాకుండా, రాయడం , చదవడం లో మంచి ప్రవేశం సంపాదించుకుంది.
    'నీ పుణ్యాన్ని మా ఆవిణ్ణి ఒక మనిషిని చేశావమ్మా , అత్తా' అంటూ ఎంతో సంతోషించాడు రామం. శాంత నా పాటిదానిగా చేసి రామాన్ని ఆనందపరచగల్గినందుకు జానక్కి కూడా ఎంతో తృప్తిగా ఉంది.
    'అబ్బబ్బ? ఒక్క రుమాలల్లెందుకే ఇన్నాళ్ళయితే ఎలాగక్కా.' అంటూ శాంతమో చనువుగా మందలించింది ఒకసారి సుధ.
    'నిజమే సుధా. అదేం అదృష్టమో గానీ ఎంత చురుకుతనం తెచ్చుకుందాం అనుకున్నా, ఎక్కడలేని నిద్ర ముంచు కొస్తుంది తమాషాగా.' అంది కళ్ళు నులుముకుంటూ బద్దకంగా శాంత.
    'ఇహనేం అయితే ఇక ఆరుమాలలా ఆపేసి బేబీ స్వెట్టర్' నేర్పావే సుధా' అంది ఆనందంతో జానకి. ఆరోజు నుంచీ రోజుకో రకంగా పువ్వులు పెట్టి, సుధ, శాంతనలంకరిస్తుంటే, పూటకో రుచి వండి ఎంతో ఆదరంతో వడ్డిస్తుంది జానకి. 'అన్నీ సవ్యంగా జరిపించు తల్లీ' అనుకుంటూ ఆ లలితాంబని అహర్ణిశలూ ప్రార్ధించుకున్నారు పార్వతమ్మ గారు.
    కాలం చల్లగా సాగి పోతుంది.
    'సుధ కి ఇల్లు కదలడం ఇంతవరకూ అలవాట్లేక పోయినా కొంత ముదాలోచనతో పట్టుదలగా రఘు సుధని పి.యు.సి కి ఎంతో ప్రయత్నం మీద కాలేజీ లోనే చేర్చినందువల్ల తప్పని సరిగా కార్లో వెళ్లి వస్తూ వుండేది. అంతేకాదు దాంతో పాటు రఘు వాడుకున్న వైద్య గ్రంధాల్ని కూడా చదువుతూ, రఘు నడిగి తన సందేహాల్ని తీర్చుకుంటూ వుండేది. అ కారణంగా వైద్య విషయాల్లో సుదకి బాగా అలవాటు పడడం వల్ల , శాంత కు నెలలైన కొద్దీ పాటించవలసిన విషయాల్ని గురించి తెలియ జెపుతూ వుండేది. శాంత బిడ్డ తల్లయినాక కూడా, పాపని పెంచే విధానాలన్నీ చక్కగా సలహాలిస్తూ , వీలున్నంత వరకూ తనూ స్వయంగా చేస్తూ వుండేది.
    'ఏవిటి సుధా. మహా అనుభవం వున్నదాన్లా ఇష్టం వచ్చిన మందులూ, పద్దతులూ, ఏకరువు పెడుతూ వుంటావ్' అని సుధని మందలించి అనుభవం గల లేడీ డాక్టరు వద్దకు పరిశోధనార్ధం పంపుతుండెవరు పార్వతమ్మ గారు. ఆ డాక్టర్లూ సరిగ్గా, సుధ చెప్పిన పద్ధతుల్నే చెప్పడం చూసి ఆశ్చర్య పోతుండేది శాంత.
    'సుధా, నువ్వు నిజంగా డాక్టరయ్యావంటే -- ' అంటూ సుధని శాంత పొగుడుతుంటే' నిజం అక్కయ్యా. నాకూ అలా అవాలని ఎంతో సరదా. అయినా దేనికన్నా అదృష్టవంటూ ఒకటుండోద్దూ!' అని తన తీరని లోపాన్ని గురించి బాధ పడుతుండేది సుధ.
    అయితే రఘు మాత్రం అలా ఎన్నడూ నిరాశ పడడం లేదు సరి కదా, ఈ పరీక్ష రాయడం అవడం తోనే సుదకి వైద్యం చేయించేస్తే దైవం అనుగ్రహించి సుధ కాలు సరిపోయిందంటే , మళ్ళీ కాలేజీ లు తీసేసరికి సుధాని మెడిసెన్ కి చేర్పించోచ్చు-- అని మొండి ధైర్యంతో వుంటున్నాడు. శిధిల వీణను మ్రోగించడం తోనే నేర్పు చూపించగలగడం ....అన్న సుధ మాట అతని లక్ష్యా నికొక ఊనుకోలుగా పని చేస్తుంది. ఎందుకూ ఉపయోగం లేదని అందరూ అనుకుంటుండే సుధ జీవితాన్ని, అన్ని విధాల నిండుతనం గా జరిగేటట్టు తను చెయ్యగల్గాలి. ఇదే అతని పట్టుదల.
    అందుకే, జానకి ప్రోద్బలం కొద్దీ సుధ పరిస్థితి కొప్పుకుని చేసుకుంటారనుకున్న కొన్ని కొన్ని సంబంధాల్ని శర్మ గారు వాకబు చేయించినట్టూ, అందులో ఒకటి రెండు సమ్మంధాలు డబ్బు మీది మమకారం కొద్దీ , ఒప్పుకునే టట్టున్నట్టూ విన్న రఘు--
    'ఏవిటత్తయ్యా ? సుదకి పెళ్లి చేసెయ్యాలని చాలా ఆత్రుత పడుతున్నావట . ఏవంత తొందరోచ్చిందనీ.' అని తిన్నగా జానకి నే అడిగేశాడు రఘు.
    'తొందర పడడం అంటే-- ఎప్పటి కన్నా చెయ్యాల్సిందే గదా ననీ'-- చేతుల్నలుపు కుంటూ నాన్చింది జానకి.
    'నువ్వు కూడా ఈ ధోరణి లో మాట్లాడ్డం నాకేమీ నచ్చడం లేదత్తయ్యా. రాత్రి ఎలాగో భోజనం చెయ్యాలిగదా నని, ఆ భోజనం ఇప్పుడే చేసెయ్యగలవా చెప్పూ.'
    'అలా అనకు బాబూ. సుధకీ పంతొమ్మిది కావస్తున్నాయిగా.'
    'అయితే మాత్రం ఒక్క పెళ్ళి తప్పితే, మనం చెయ్యాల్సిన పన్లు వేరే ఏవీ లేవా, అని.'
    'లేకేం. ఎన్నెన్నో వున్నాయి. అయితే సుదకి చెయ్యదగ్గది ఇదొక్కటే....' జానకి గొంతుక జీరపడింది.
    'మీ క్కోపం వచ్చినా సరే గాని మీరంతా సుధ మీద ఎంతో సానుభూతి పరితాపం చూపుతున్నాం అనుకుంటూ, అన్ని విధాల దాన్ని నిరుత్సాహ పరుస్తూ దాని మనసు పాడు చేస్తున్నారు. దానికున్న ఆ లోపాన్ని ఏవిధంగా నన్నా తీర్చగల్గుతామేమోనని ప్రయత్నించడం పోయి ఇదా మనం చెయ్యాల్సిన సహాయం.'
    'ఏం చేయ్యమన్నావ్ బాబూ' ఇదంటే మా చేతులో పని గానీ --
    'ఉండత్తయ్యా , నేనొక్క మాటడుగుతాను. మా కందరికీ కూడా సుధ విషయమై కొంత బాధ్యతా , అభిమానం , వుందన్న నమ్మకం నీకుందా?' సూటిగా అడిగాడు రఘు.
    'ఎంతమాట బాబూ, నాకా విశ్వాసం పరిపూర్ణంగా వుంది.'
    'అయితే దాని పూచీ మామీద వుంచి కొన్నాళ్ళ వరకూ , అంటే నే చెప్పేవరకూ నువ్విటు వంటి ప్రయత్నా;లేవీ చెయ్యెద్దు తెలిసిందా?'
    'సరి నీ ఇష్ట ప్రకారం అలాగే బాబూ.'
    'అత్తయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం అంటే నేను మెడికల్ కాలేజీ లో చేరిన కొత్తల్లో , సుధ పుట్టుకప్పటి వివరాలు కొన్ని నిన్నడిగి రాసుకున్నాను గుర్తుందా నీకూ.'
    ఉందన్నట్టు తలాడించింది జానకి.
    నాకు బాగా పరిచయం వున్న ఒక పెద్ద డాక్టరు అన్న ఒకాయన అదే టైము లో ఆ ప్రాంతాల్లో డాక్టరు గా పని చేసినట్టు తెలిసొస్తుంది. ఆ వివరాల్ని గురించి తెల్సుకుందుకే ఈ డాక్టరు తో కూడా నేను రెండు మూడు సార్లు రాయవెల్లూరు వెళ్ళడం జరుతుత కూడా. ఆ వివరాలే గనక సరిగ్గా తెల్సు కో గల్గితే అంటే సుధకీ పరిస్థితి పుట్టుకలోనే వుందో, తరవాత ఏర్పడిందో ఆ వివరాల్ని బట్టి సుధ కాలు బాగు చెయ్యడం లోని నమ్మకం, సులువూ రెండూ విశదమై పోతాయన్న మాట.'
    'ఏదో బాబూ ఆ భగవంతుడే నీ ప్రయత్నానికి జయం కూర్చాలి' అంది నెమ్మదిగా జానకి.
    'దైవ సహాయం మాటలా వుంచి, కాస్త ఈ విషయాలన్నీ నేను తెల్సు కుని వో నిర్ణయాన్ని కొచ్చే వరకూ ప్రస్తుతం మీరు ఇటువంటి గొడవలు చెయ్యకుండా వున్నారంటే నాకెంతో సహపడ్డ వారవుతారు తెలిసిందా.'
    'అలాగే బాబూ' నా తెలివి తక్కువ తనంతో నీకిబ్బంది కల్గించానో ఏమిటో.' అంది నొచ్చుకుంటూ జానకి.
    నిజానికి జానకి కూడా కొన్ని సదుపాయాల్నుద్దేశించే ఈ ప్రయత్నం ప్రారంభించిందని చెప్పాలి. ఎందుకంటె, ఎంతెంత దూరాన్నుంచో, ఎందరెందరో పెద్ద మనుషులు రఘుకి తమ కూతుళ్ల నివ్వాలన్న అభిలాష తో తరచూ వస్తుండడం, పాపం అలా వచ్చిన వారిలో అటు వద్దని చెప్పలేక, ఇటు మాటా ఇవ్వలేక పార్వతమ్మా. శర్మ గార్లు ఇబ్బంది పడుతూన్నందువల్ల అందులోనూ రాజమ్మ , దత్తు గార్లు చేస్తున్న వత్తిడి మరీ ఇబ్బంది కలిగిస్తున్నందువల్లా, తను పెంద్రాళే సుదకి పెళ్లి చేసేస్తే, అటు రఘుకి, సందిగ్ధావస్థ తప్పుతుంది. ఇటు పెద్ద వాళ్ళూ నిరాఘాటంగా సంబంధాల్ని గురించి ప్రయత్నాలూ చేసుకుందుకు వీలుగా వుంటుందన్న భావంతో ఇలా తలపెట్టింది. అయితే ఇప్పుడు రఘు తను స్వయంగా నే ఇంత సుచిరంగా చెప్పడంతో ఆ ప్రయత్నాలంతటితో విరమించేసుకుంది జానకి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra