Home » D kameshwari » Aruna


    
    కేవలం ఇంకో మనిషి తోడు లేదు. స్వయంగా మొదటిసారిచేయడం జంకుతో, సందేహంతో కొన్నిక్షణాలు ఎటూ తేల్చుకోలేకపోయింది. కాని రోగి పరిస్థితి చూశాక ఆపరేషన్ దైవం మీద భారం వేసి చేయడమే ఉత్తమం అని తేల్చుకుంది. ఆపరేషన్ చేయకపోతే రోగిపరిస్థితి విషమించడం ఖాయం: చేతులారా ఓ ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలివేయడంకంటే రిక్స్ తీసుకుని ఆపరేషన్ చేస్తే పేషెంటుని రక్షించవచ్చు ఒకవేళ ఆపరేషన్ ఫెయిలయితే, ఎటూ ఈ కేసు సీరియస్ కనకతను చేయవలసింది చేశానన్న తృప్తి అయినా దక్కుతుంది డాక్టరయి ఉండి రోగి చావుబ్రతుకుల మధ్య నిస్సహాయంగా పడి ఉంటే చేతులు ముడుచుకుని ఏం చేయలేమని అధైర్యపడడం తనవృత్తికే అవమానం ఇకముందు ఇలాంటికేసులు రావచ్చు చేయలేనని చేతులు ముడుచుకుకూర్చోడానికా తను ఇక్కడికివచ్చింది? మరి మేజర్ ఆపరేషన్స్ తనవల్లకానివి పరికరాలు లేనివి ఎలాగూ చేయలేదు.    
    ఎమర్జన్సీ ఆపరేషన్స్ కూడా అటెండవకపోతే ఇంక తనెందుకు ఇక్కడ ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకుంది అరుణ. పరిస్థితి అంతా అర్ధమయ్యేట్టుకరణంగారికి వివరించింది. ఎటూ ప్రాణాపాయస్థితిలో రోగి ఉన్నాడు కనక ఆపరేషన్ చేయకపోతే ఎలాగూ రక్షించలేరు. అందుచేత ఆపరేషన్ చేసి ఫలితం దైవనిర్ణయం మీద ఉంచుతానని చెప్పింది. అందుకు అభ్యంతరం లేకపోతే ఆపరేషన్ చేస్తానని వివరించింది. కరణంగారు అరుణ చెప్పినదానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా వెంటనే ఒప్పేసుకున్నారు. "మీరేం చేస్తారంమా? మా ప్రాప్తం మా అదృష్టం ఎలా ఉందో? దేవుడిమీద భారం వేసి వెంటనే చేసేయండమ్మా" అన్నారు.    
    రోగిని ఆస్పత్రికి చేర్చమని అరుణ గబగబ ఆస్పత్రికి ఆపరేషన్ కి కావలసిన ఏర్పాట్లు చూడడానికి వచ్చింది. టేబిల్ సిద్దంచేసి, కావలసినపరికరాలన్నీ స్టెరిలైజ్ చేసి అన్నీ అందుబాటులో ఉంచుకుంది. అన్నీ చేసుకుంటూంటే అరుణకి గవర్నమెంటు ఆస్పత్రిలో ఆపరేషన్ అంటే చకచక ఎవరిపనులు వాళ్ళు చేసేది గుర్తు వచ్చింది. ఇదే గవర్నమెంటు ఆస్పత్రి అయితే ఆపరేషన్ టైముకి వచ్చిరోగి ఎవరో కూడా చూడనక్కరలేకుండా టేబిల్ మీద అప్పటికే మత్తుఇచ్చి పడుకోబెట్టిన మనిషిని పరపర కోసి వెళ్ళిపోవడమే ఆఖరికి కుట్లు కుట్టడం దగ్గిరనుంచి చేయడానికి అసిస్టెంట్లు ఉంటారు బావగారు అదేగా చెప్పారు? ప్రైవేటు ప్రాక్టీసు అంటే ఇదేగదూ అవస్థ స్టెరిలైజేషన్ దగ్గిరనించి స్వయంగా చూసుకోవాలి. ఏ విషయంలో చిన్న పొరపాటు జరిగినా బాధ్యత తనదే ఇక్కడ కనీసం కాస్త సాయంగా ఉంచుకోవడానికి ఓ నర్సులాంటి వారయినా లేరుతను కాస్త ఎస్టాబ్లిష్ అయ్యాక ఓట్రెయిన్డ్ నర్సుని అప్పాయింట్ చేసుకోవాలి.    
    లేకపోతే ఇలాంటి సమయాల్లో చాలా కష్టం అక్కడికీ వంటవాడు మణికుర్రాడు ఉత్సాహంఉన్నవాడు ఫోర్తు ఫారమ్ వరకు చదివాడు. ఇరవై ఏళ్ల వాడు చాలా ఆసక్తిగా ఉత్సాహంగా అరుణ రోగులని పరీక్షించడం, మందు లీయడం వగైరాలు అన్నీ చూస్తూ మందుల పేర్లన్నీ గుర్తుపెట్టుకుని నేనుకలిపిస్తానమ్మా మందులు అంటూ తయారవుతుంటే, అరుణ వాడికి కాంపౌండర్ ట్రెయినింగ్ ఇచ్చింది. మందుల పేర్లు ఎలాకలిపి ఈయవలసింది వగైరాలు ఓ పది రోజులు చెప్పి బోధపరచింది. అప్పటినించి ఆ వంటేదో వండి పడేసి ఉత్సాహంగా ఆస్పత్రి మందులగదిలో కూర్చుని అరుణచీటీలని చూస్తూ మందులు కలిపి ఈయడం ప్రారంభించాడు కొన్నాళ్ళు దగ్గిరుండి చూసి ఫరవాలేదన్న నమ్మకం కుదిరాక, అరుణ మణి మీద మందులు కలపడం పని పెట్టింది.    
    అదయ్యాక చిన్న చిన్న డ్రెస్సింగ్ లు అవి చేయడం నేర్పమని అన్నీ చేయడానికి సరదాపడే మణిని చిన్న ట్రెయిన్డు నర్స్ గా తయారుచేసింది అరుణ టెంపరేచర్ చూడ్డం ఉదయాన్నే సిరింజ్ లు అవి స్టెరిలైజ్ చేసి పెట్టడం, మందులు కలిపి ఈయడం, డ్రెస్సింగ్ లు, బ్యాండేజీలు కట్టడం అవి మణి ఎంతో ఉత్సాహంగా సంతోషించింది. తను కాస్త నిలదొక్కుకున్నాక ఓ నర్సుని అప్పాయింట్ చేసుకోవాలి అని నిర్ణయించుకుంది అరుణ.        
    రోగిని ఆపరేషన్ టేబిల్ ఎక్కించి స్టెరిలైజ్ చేసిన గౌను గ్లవ్స్ తొడుక్కుంటూంటే అరుణకి కాళ్ళు వణికాయి. ఆ గదిలో మణిమాత్రం ఉన్నాడు. మణిని చేతులు కడుక్కోమని, స్టెరిలైజ్ చేసిన గ్లవ్స్ అవి వేసుకోమని తనుచెప్పిన పరికరాలు అవి అందియ్యడానికి సిద్దంగా ఉంచింది అరుణ.    
    టేబిల్ దగ్గరికి వచ్చి వణుకుతున్న చేతులతో ఓ క్షణం చేతులు జోడించి కళ్ళు మూసుకుని, తన మొదటికేసు జయప్రదం చేయమని మనసారా ప్రార్దించింది దేవుడిని అరుణ.    
    రోగి దగ్గరకు రాగానే అంతవరకు ఉన్న భయం జంకుఅన్నీ పోయాయి ఒక్క సారిగా అరుణకి, ఎన్నో ఆపరేషన్స్ చేసిన అనుభవమున్న డాక్టరులా నిశ్చలంగా నిబ్బరంగా రోగికి మత్తు ఈయడం వెంటనే చకచక చేయవలసిన ఆపరేషన్ చెయ్యడం...... ఏ మాత్రం తొణక్కుండా బెణక్కుండా పూర్తిచేసింది అరుణ.    
    ఆపరేషన్ చేస్తున్నంతసేపూ సర్జన్ గా ఉన్నప్పుడు తన పక్కన అసిస్టెంట్లు డాక్టర్లు, చీఫ్ అందరూ ఉండి పర్యవేక్షిస్తున్నారన్న నిబ్బరంతో ఎలా తడుముకోకుండా చేసేదో ఇప్పుడూ అలాగేపూర్తిచేసింది. అంతా సవ్యంగా జరిగినందుకు కేసు కాంప్లికేటెడ్ కానందుకు ఎంతో సంతోషించింది అరుణ. 'ఆపరేషన్ సక్సెస్' అని గట్టిగా అరవాలనిపించింది. 'వెల్ డన్' అని భుజంతట్టి అభినందించడానికి తన చుట్టూ చీఫ్, డాక్టర్లు ఎవరూ లేనందుకు అరుణ క్షణంలో ఎంతో విచారించింది.    
    ఇప్పుడేగనుక నరసరాజుగారు ఉంటె తన ధైర్యసాహసాలని ఎంతగానో అభినందించి ఉండేవారు. అసలు ఆయనరెండు మూడు సార్లు ఆపరేషన్లు తన చేత చేయించి, దగ్గిర ఉండి చూస్తూ చాలమెచ్చుకున్నారు. "వన్ డే యూ విల్ షైన్ యాజె సర్జన్ ఐయామ్ ష్యూర్ ఆఫ్ దట్" అంటూ తనని అభినందించారు ఆపరేషన్ చేయడానికి కావలసిన ధైర్యం చురుకుదనం, స్కిల్ అవి తనకి బాగా ఉన్నాయని రెండు మూడుసార్లు మెచ్చుకోవడమే కాక ఆపరేషన్ పూర్తిచేసి, కుట్లు కుట్టి డ్రస్ చేసి తృప్తిగా గాలిపీల్చుకుంది. ఆస్పత్రిలోనే బెడ్ వేయించి అక్కడే ఆ కుర్రాడిని ఉంచేందుకు ఏర్పాటు చేసింది అరుణ.    
    కరణంగారు అరుణకి ఎన్ని విధాలుగానో అభినందనలు చెప్పారు. మరుసటిరోజు నుంచి ఊళ్ళో అరుణ చేసిన ఆపరేషన్ గురించి వింతగా చెప్పుకున్నారు. కొందరయితే వచ్చి దండాలు పెట్టారు. తెలిసిన వాళ్ళువచ్చి అభినందించి వెళ్ళారు. సుబ్బారావు అయితే సంతోషం పట్టలేకపోయాడు" ఇక చూడండి మీ పేరు ప్రఖ్యాతులు ఎలా వెలిగిపోతాయో" అన్నాడు.    
    ఈ ఊరుచుట్టుపక్కల ఊళ్ళన్నింటికి ఈ వార్త అందడానికి అట్టేరోజులు పట్టలేదు. చచ్చిపోయే అబ్బాయిని ఆపరేషన్ చేసిబ్రతికించిన డాక్టరుగారి దగ్గరికి రావడానికి ఎవరూ సందేహించలేదు. ఏ చిన్న రోగ మొచ్చినా జాప్యం చేయలేదు. సుబ్బారావు అన్నట్లే రెండు మూడు నెలలలోనే అరుణకి మంచి పేరు వచ్చింది. పేరుతోబాటు డబ్బూరావడం మొదలుపెట్టింది.    
    కరణంగారు బోలెడు డబ్బున్న భూసామి కనక ఆపరేషన్ చేసి కొడుకుని బ్రతికించినందుకు అయిదు వందలు ఇచ్చారు.    
    'ఓ డాక్టరుకి పేరు అన్నది రావడం ఆలస్యం కావచ్చుకానీ, ఒకసారి పేరు వస్తే ఇంక గుండెలమీద చెయ్యి వేసుకుని ఆ డాక్టరు నిశ్చింతగా నిబ్బరంగా ఉండవచ్చు."    
    బావగారు చెప్పిన మాటలు మననం చేసుకుని తృప్తిగా నవ్వుకుంది అరుణ.    
    అరుణ ప్రాక్టీసు పెట్టి ఆరు నెలలయింది ఆ ఊళ్ళో ఇప్పుడింక అరుణకికాలక్షేపం ఎలాగ అన్న బాధ లేదు. తీరుబాటుకి వెతుక్కోవలసివస్తూంది.    
    ఉదయంలేచిన దగ్గరనుంచి కాలకృత్యాలు తీర్చుకుని, టిఫిన్ అది చేసిఎనిమిది గంటలకల్లా ఆస్పత్రి కన్సల్టింగ్ రూములోకి వచ్చి కూర్చుంటే అక్కడ నించి మళ్ళీ ఒంటిగంటలోపల లేవడంకుదరదు. ఒక్కోసారి ఇంకా ఎక్కువకేసులుంటే ఏ రెండుగంటలో అవుతుంది. భోజనంచేసేసరికి తరవాత ఓ గంట పడుకుని లేచి, మరో అరగంట పోస్టులో వచ్చిన పేపరు, మాగజైన్స్ అవి చూస్తుంది.    
    మూడయ్యేసరికి కాఫీ తాగుతూండగానే రుక్కువస్తుంది, పుస్తకాలు పట్టుకుని రుక్కుకి రెగ్యులర్ గా పాఠాలు చెప్పే మాస్టరమ్మ అయింది అరుణ. రుక్కుతోపాటు, ఇంట్లో మణి ఉత్సాహం చూసి వాడికి కూడా చదువుచెప్పడం ఆరంభించింది అరుణ. ఇద్దరిని మరుసటిసంవత్సరం మెట్రిక్ పరీక్షకి కట్టించాలని అరుణ సంకల్పం అరుణ శ్రద్దగా చెప్పడమో, వాళ్ళిద్దరిలో ఉన్న ఉత్సాహమో,  పట్టుదలో కానీ ఇద్దరూ అతి చురుకుగా చదవడం అరుణకిచాలా సంతోషంగానూ, తనశ్రమ ఫలిస్తుందన్న తృప్తిగాను కూడా ఉండేది.    
    వాళ్ళకి ఓ గంట గంటన్నరచదువు చెప్పుతూనే నాలుగున్నరకల్లా మళ్ళీ తయారై బయటికి ఆస్పత్రిగదిలోకి వచ్చికూర్చుంటుంది. మళ్ళీ ఆరు గంటల వరకు పేషెంట్లు తరవాత అలా కాస్తదూరం నడిచిరావడమో, సుబ్బారావుగారి తోటవైపుకి షికారు వెళ్ళి రావడమో ఇంటికి వచ్చి భోజనంచేసి పది గంటలవరకు రేడియో, పుస్తకాలతో కాలక్షేపం ఇదీ స్థూలంగా అరుణ దినచర్య.    
    పల్లెటూరిలో ఎలా ప్రొద్దుపోతుంది. తోచదు అన్నబాధే లేకపోయింది అరుణకి. మొదట ఓ నెల రెండు నెలలు అట్టే పేషంట్సు లేనప్పుడు మాత్రం కాస్తతోచక ఇబ్బందిపడేది అరుణ. తరువాత తరవాతతోచక పోవడం అటుంచి, తీరిక చిక్కుతుందా అనేంత ఊపిరి సలపని పనిఉండసాగింది అరుణకి.    
    సాధారణంగా ఉదయం ఇళ్ళకి వెళ్ళి చూడవలసిన పేషెంట్లని చూసేది అరుణ. పేషంట్లని చూసిరావడానికి వెళ్ళి రావడం కాస్త కష్టమయిన పనేఅయింది. నడిచి వెళ్ళడం కష్టం అలా అని వాళ్ళు పంపే ఏ బండిమీదో వెళ్ళడం చికాకనిపించింది. అందుచేత మరీ కదల్చలేనిరోగులని తప్ప మిగతా అందరిని ఆస్పత్రికి తీసుకురమ్మనేచెప్పేది అరుణ. ఈరోడ్లకి కారు లాభంలేదు ఊళ్ళో అయితే నడిచైనా వెళ్ళవచ్చు. పొరుగూళ్ళు నాలుగైదు మైళ్ళు బండిమీద వెళ్ళిరావడం చాలా శ్రమఅయ్యేది. శ్రమేకాక ఏదన్నా కేసు చూడడానికి పక్క ఊరు వెళ్ళిందంటే మరి ఆ పూటకి ఇంక మిగిలిన వాళ్ళని చూడటం కుదిరేది కాదు. ఈ ప్రోబ్లెమ్ ఎలా సాల్వ్ అవుతుందో అర్ధం కాలేదు అరుణకి, సైకిలింగ్ వచ్చు తనకి. సైకిలయితే ఏ రోడ్డుమీద ఎలాంటి చోటయినా పరవాలేదు. కానీ ఓ ఆడది సైకిలెక్కి తిరుగుతూంటే వింతగా చూస్తారేమో ఈప్రజలు? చూడనీ, రెండు రోజులు కొత్తగా చూస్తారు? చెప్పుకుంటారు తరవాత వాళ్ళే ఊరుకుంటారు. అరుణకి ఈ ఆలోచననచ్చింది కొన్నాళ్ళు సైకిలుతో కాలక్షేపం చేస్తే, కాస్త డబ్బు కూడాక ఏ స్కూటరో కొనుక్కొంటే ఎక్కడికి వెళ్ళి రావాలన్నా ఇబ్బంది ఉండదు. ముందో సైకిల్ కొనుక్కోవాలి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra