Home » Balabhadrapatruni ramani » Madhuramaina Otami


    "హాయ్!" అంటూ ప్రేమ్ చనువుగా పలకరించాడు.
    
    ఆమె జవాబుగా "హలో" అంది.
    
    "పరిస్థితి యిదీ అని నాకు ఫోన్ చెయ్యొచ్చుగా?" అన్నాడు.
    
    ఆప్యాయతో, నిష్టూరమో ఆమెకి తెలీలేదు.
    
    "నాకు చాలా బోర్ గా వుంది ధృతీ! రేపట్నుంచీ ఆఫీసుకి వస్తున్నట్లేనా?" అడిగాడు.
    
    "ఇంకా ఆలోచించలేదు" కాస్త విసుగ్గా చెప్పిందామె.

    ధృతి అలా మాట్లాడటం సుభద్రకి నచ్చినట్లు లేదు. "వస్తుంది నాయనా! ఇప్పటికే రెండు రోజులైంది ఆఫీసు మానేసి నేనూ, మా రవీ మార్చి మార్చి ఆయన దగ్గర వుంటాములే" అనేసింది.
    
    "వెరీగుడ్! వెళ్ళొస్తానండీ!" అంటూ అతను రెండు చేతులు జోడించి సుభద్రకు నమస్కారం పెట్టాడు.

    సుభద్ర మొహం వెలిగిపోయింది.
    
    అతన్ని వాకిలిదాకా సాగనంపడానికి వచ్చిన ధృతిని అడిగి, సీతారామయ్యగారున్న హాస్పిటల్ పేరూ, వార్డు నెంబరూ కనుక్కున్నాడు.
    
    'పాపం నిజంగానే ఆదుర్దాపడి చూడానికి వచ్చుంటాడు. అనవసరంగా పెడసరంగా మాట్లాడాను అనుకుని- "థాంక్స్ ! మీరు చాలా శ్రమ తీసుకున్నారు" అంది.
    
    "మీకోసం చేసే ఏ పని నాకు శ్రమ అనిపించదు ధృతి" అని వెళ్ళిపోయాడతను.
    
    అతను వెళ్ళిపోయాక ధృతి అతని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ సుభద్రా, కృతీ అతని గురించీ, అతని వినయం గురించీ, గొప్పతనం గురించీ అదేపనిగా పొగుడుతూనే వున్నారు. నవీన్ చేసే సహాయాలన్నింటినీ స్వీకరించడం తప్ప సుభద్రా ఎప్పుడూ అంతగా పొగడలేదు. అతను ఒక్కసారి చూడటానికి రాగానే అంతగా పొంగిపోవడం ఎందుకో తెలియనంతటి అవివేకి కాదు ధృతి. గొప్పింటి పిల్లాడు కారేసుకుని, కూతురికోసం వచ్చాడన్న విషయం ఆ మధ్యతరగతి గృహిణికి చాలా ఊరటగా వుంది. కృతికి గొప్ప 'థ్రిల్' లా వుంది.
    
    మరునాడు ధృతి హాస్పిటల్ కి వెళ్ళేసరికే అనూహ్యమైన విషయాలు జరిగిపోయాయి. సీతారామయ్య ఆ వార్డులో లేడు. అక్కడి నర్స్ స్పెషల్ రూంకి మార్చినట్లు చెప్పింది.
    
    ధృతి వెళ్ళేసరికి ఆయన కులాసాగా కూర్చుని ప్రేమ్ తో కబుర్లు చెప్తున్నాడు. ఆయన కూడా నిన్నటిలా బెంబేలుగా లేడు! చాలా ఉత్సాహంగా, ఒక్కసారిగా యవ్వనం వచ్చినవాడిలా నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు. పక్కన టేబుల్ మీద పండ్లూ, హార్లిక్స్, గ్లూకోజ్ అన్నీ బుట్టనిండుగా వున్నాయి.
    
    కూతుర్ని చూడగానే చేటంత మొహం చేసుకుని- "అమ్మాయ్! ఈయన నిజంగా దేవుడమ్మా ఆ నరకంలాంటి జనరల్ వార్డులోంచి తెచ్చి ఇక్కడ పడేశారు. ప్రాణానికి హాయిగా వుంది" అన్నాడు.
    
    ప్రేమ్ నవ్వి- "మీరు దేనికీ ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లూ చేశాను. స్పెషల్ నర్సుకి కూడా ఫోన్ చేశాను. మీ అమ్మాయి ఆపరేషన్ అవగానే ఉద్యోగానికి వెళ్ళిపోవాలిగదా!" అంటున్నాడు.
    
    ధృతికి ఎందుకో అరికాలిమంట నెత్తికెక్కింది. "ఇవన్నీ ఎందుకు చేశారు ప్రేమ్?" అంది కటువుగా.
    
    "ఎందుకంటే ఆ నరకంలో వుంటే ఆరోగ్యంగా వుండేవాళ్ళు కూడా నిమిషాల్లో జబ్బుపడిపోతారు కాబట్టి" అన్నాడు.
    
    "నిజం చెప్పావు బాబూ!" అన్నాడు సీతారామయ్య.
    
    ధృతి ఏమీ మాట్లాడకుండా తండ్రికి అన్నం తినిపించసాగింది.
    
    "సాయంత్రం ఇంక నవీన్ రానవసరం లేదు. స్పెషల్ రూమ్ కాబట్టి అమ్మ కూడా వుండచ్చు" అన్నాడాయన.
    
    "నవీన్ ఎవరు?" అడిగాడు ప్రేమ్.
    
    ధృతి చెప్పబోయింది. ఇంతలో సీతారామయ్య అందుకుని- "మాకు తెలిసినవాళ్ళ అబ్బాయి. చిన్నతనం నుంచీ మా ఇంట్లో చాలా చేరిక...." అన్నాడు.
    
    ప్రేమ్ తేలిగ్గా "ఓ.....ఇంక రానవసరం లేదులెండి. నేను ఫోన్ చేస్తూనే వుంటాను. ఏమైనా కావలిస్తే నన్ను అడగండి" అన్నాడు.
    
    ధృతి ఇంకా తండ్రి మాటలనుంచి తేరుకోలేదు. నవీన్ చిన్నతనం నుండీ తనమీద ఆధారపడి, తమ ఇల్లు పట్టుకుని వేళ్ళాడుతున్నాడన్న భావం వచ్చేటట్లుగా వుంది ఆ చెప్పడం అలా కాకుండా "మా అమ్మాయి స్నేహితుడు. మాకు అన్నివిధాలా సాయంచేసే ఆప్తుడు" అని చెబితే బావుండేది అనుకుంది.
    
    కష్టాల్లో వున్నప్పుడు అందరి మొహాలు జాలిగా, నిజాయితీగా కనిపిస్తాడు. కాస్త కష్టాల్లోంచి తేరుకుని, సుఖాలకి అలవాటు పడగానే పరదాలోంచి అసలు మొహాలు బయటపడతాయి. సూక్తి వుండనే వుంది. నిద్రలో అందరి మొహాలు నిజాయితీగానే వుంటాయి. మేల్కొన్నప్పుడే వాటిలోని అసలు గుణాలు బయటపడేది అని.
    
    ప్రేమ్ సీతారామయ్యగారితో వినయంగా మాట్లాడి, ఆయన్ని విపరీతంగా సంతోషపెట్టి శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
    
                                                                 * * *
    
    ధృతి ఆలోచిస్తూ అడుగులు వేస్తోంది. తను బయల్దేరుతుంటే తల్లి "ఎక్కడికి నవీన్ దగ్గరకేనా?" అని ముఖం చిట్లించుకుని అడిగింది. తను 'ఔను' అనగానే, "ఆ అబ్బాయివస్తే ఏం చెప్పమంటావు?" అంది అదోలా ముఖం పెట్టుకుని ధృతికి తిక్కగా అనిపించింది. మాట్లాడకుండా ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. ప్రేమ్ మీద వీళ్ళు ఆకస్మికంగా ఇంత అభిమానం ఎలా చూపిస్తున్నారూ! అదే అతనూ నవీన్ లాంటి బీదవాడైతే ఇలా ప్రవర్తించేవారా? ప్రేమ్ చాలా ధనవంతుడు. అతను ఈ మాత్రం సహాయం చెయ్యడం అతని శక్తికిమించిన పనేంకాదు! కానీ నవీన్ మాత్రం సహాయం చెయ్యడం అతని శక్తికిమించిన పనేంకాదు! కానీ నవీన్ మాత్రం చాలాసార్లు అతని శక్తికి మించినవి కూడా వీళ్ళకోసం కష్టపడి చేశాడు. తను బస్ పాస్ కొనుక్కోవడం మానేసి, కృతికి ట్యూషన్ ఫీజుకట్టాడు. తను పరీక్ష ఫీజు కట్టడం మానేసి ధృతి తల్లికి మందులు కొన్న సంఘటనలున్నాయి. అటువంటి వాటిముందు ప్రేమ్ చేసేవన్నీ గడ్డిపోచలతో సమానం. ప్రేమ్ హోదా, డబ్బూ, ఇవన్నీ వీళ్ళకి కన్నుల పండువుగా వున్నాయి. అతను తమ కూతురంటే ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నాడనీ, ఇంకా ముందుకెళ్ళి పెళ్ళి కూడా చేసుకుంటాడనీ వీళ్ళ ఆశ! ప్రతివాళ్ళూ కోరికలని పెంచుకునేముందు అవి మనకి ఎంత దూరంలో వున్నాయి అని ఆలోచిస్తే ఎంత బావుంటుందీ! అయినవాళ్ళు చేస్తున్న తప్పులు గమనించి నిశ్శబ్దంగా ఊరుకోవడాన్ని మించిన శిక్షలేదు. నవీన్ అంటే తల్లి నిరసన చూపించడం కొత్తకాదు. కానీ ప్రేమ్ పరిచయం అయ్యాకా.....మరీ.....రాజుని చూసిన తంటలా మారింది పరిస్థితి. ఈ ఆలోచనలతోనే ఆమె నవీన్ ఇల్లు చేరింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra