Home » Kommuri venugopala rao » Ardhachandra


    డిక్టేటర్ షిప్ లో అతనికో థ్రిల్ ఉంది. అతన్ని చూసి పెళ్ళాం, పిల్లలు హడలిపోతూ ఉండాలి. అతన్ని చూస్తూనే వాళ్ళు గడగడలాడిపోతూ ఉండాలి. తను ఇంట్లో ఉంటే వాళ్ళకు సింహస్వప్నంలా ఉండాలి. గదుల్లోంచి బయటకు రాకూడదు. తన ఎదుటపడి ఒకటి రెండు మాటల కంటే ఎక్కువగా మాట్లాడకూడదు.
    
    కొరడాను సందర్శించడమయాక అతను ఇరుగుపొరుగు కుటుంబాల గురించి ఆలోచిస్తాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు బోధించే విధానం అతనికి చాలా వికారంగా కనిపిస్తాయి. వాళ్ళందరూ అతని దృష్టిలో దోషులుగా కన్పిస్తారు. వాళ్ళు కనిపించగానే అతని పెదాలమీదకు హేళనతో కూడిన చిరునవ్వు అవతరిస్తుంది. ఆ నవ్వు ఇతఃరులకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది.
    
    అర్ధనారీశ్వరరావు తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకెళ్ళిపోతాడు. ఈ లోపున ఒక్క క్షణం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించడు. రెండు, మూడు ఫోన్లు ఎవరెవరికో చేసి ఊరూ వాడా వినిపించేటట్టు గట్టిగా మాట్లాడతాడు. తర్వాత పనమ్మాయికి ఆ పనులూ, ఈ పనులూ పురమాయించి పెద్దగా అరుస్తూ హంగామా చేస్తాడు. అతని దృష్టిలో పనివాళ్ళు ఖాళీగా ఒక్క నిముషం కూర్చోకూడదు. అలా ఉంటె వాళ్ళని నెత్తికెక్కించుకున్నట్లు పిల్లలకు స్నేహితులు ఉండకూడదు. వాళ్ళు ఎవరితోనూ ఎక్కువగా మూవ్ అనకూడదు.
    
    కాఫీ తాగడం పూర్తిచేసి మొగపిల్లలిద్దరూ పడుకునే గదిముందు నిలబడ్డాడు.
    
    లోపల నిశ్శబ్దంగా ఉంది. అర్ధరాత్రి వరకూ చదువుకుని గాఢ నిద్రలో ఉండి ఉంటారనుకున్నాడు. ఓ నిముషం అలాగే నిలబడి తర్వాత తలుపు తట్టాడు.
    
    సరిగ్గా ఆ సమయానికి పెద్దకొడుకు మహేష్ పక్కమీద విలాసంగా పడుకుని గోల్డ్ ప్లేక్ సిగరెట్ నోట్లో పెట్టుకుని హుషారుగా పొగ వదుల్తున్నాడు. రెండో కొడుకు వినోద్ రాత్రంతా కష్టపడి తన అప్రాప్త మనోహరికి రాసిన ప్రేమలేఖలో తప్పులేమయినా ఉన్నాయేమో చూసుకుంటున్నాడు.
    
    తలుపు దబదబమని చప్పుడయేసరికి ఇద్దరి గుండెలూ దడదడలాడాయి. మహేష్ ఒక్క ఉదుటున లేచి నిలబడి సిగరెట్ నేలమీద నలిపి ఆర్పేసి కిటికీలోంచి వీధిలోకి పడేటట్లుగా లాఘవంగా విసిరేసి మళ్ళీ వచ్చి పక్కమీద పడుకున్నాడు. వినోద్ ప్రేమలేఖను పరుపు క్రిందకు తోసేశాడు.
    
    "నాన్నయి ఉంటాడు. ఆ చప్పుడు ఆయనదే" అన్నాడు వినోద్ చాలా తగ్గుస్వరంతో.
    
    "ఏం చేద్దాం?"
    
    "కాసేపు చూద్దాం. పడుకున్నామానుకుని వెళ్ళిపోతాడేమో?"
    
    "ఆయనా వెళ్ళిపోయేది?"
    
    తలుపు దబదబ చప్పుడవుతూనే వుంది. "లాభం లేదు నువ్వెళ్ళు నేనిప్పుడే సిగరెట్ కాల్చాను. నోరు వాసన వేస్తుంది. పడుకున్నట్టు యాక్షన్ చేస్తాను" అని ఓ పక్కకు తిరిగి కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు మహేష్.
    
    వినోద్ విధిలేక మంచంమీద నుంచి లేచి నిలబడ్డాడు. కాళ్ళు గడగడ వణుకుతున్నాయి. గుండె దడదడమని కొట్టుకుంటుంది.
    
    తండ్రిని చూస్తే ఎందుకంత భయమో తమకే అర్ధంకాదు. ఎంత ధైర్యంగా ఉందామన్నా ఆయన రూపం కనిపిస్తే చాలు ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తాయి.
    
    ఒక చేత్తో తలుపు తీశాడు.
    
    "ఎంతకూ తలుపు తియ్యరేం?" అనడిగాడు అర్ధనారీశ్వరరావు గాద్దిస్తున్నట్టు.
    
    "నాలుగు గంటలదాకా చదువుకుని ఇప్పుడే పడుకున్నాం నాన్నగారూ మంచి నిద్రలో ఉన్నాం నాన్నగారూ వినబడలేదు."
    
    "బాగా చదువుతున్నారా?"
    
    "చదువుతున్నాం నాన్నగారూ"
    
    "ఫ్రెండ్స్ తో ఎక్కువ తిరుగుతున్నారా?"
    
    "లేదు నాన్నగారూ మాకు ఫ్రెండ్సంటే అసహ్యం!"
    
    "నేనెందుకిప్పుడు పిలిచానో తెలుసా?"
    
    "తెలీదు నాన్నగారూ"
    
    "మీ అమ్మా నేనూ కలిసి భువనేశ్వర్ వెళుతున్నాం- పెళ్ళికి అటెండ్ కావటానికి ఇంట్లో మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి."
    
    వినోద్ కి సంతోషంతో ఎగిరి గంతెయ్యాలనిపించింది. అయినా తన భావాలను బయట పదనివ్వకుండా గుంభనంగా ఉండి, "అలాగే నాన్నగారూ" అన్నాడు.
    
    "ఇవేళ రాత్రికే వెళుతున్నాం దేవిని కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండండి"
    
    "అలాగే నాన్నగారూ"
    
    "అంతే" అంటూ అర్ధనారీశ్వరరావు అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.
    
    తలుపు మూసేసి "ఒరేయ్! పెద్దపులి ఊరెడుతోంది" అని అరుస్తూ వినోద్ పక్కమీదకు ఓ దూకు దూకాడు.
    
                                             * * *
    
    అర్ధనారీశ్వరరావు బయటకెళ్ళిపోయాడు. మహేష్, వినోద్ కాలేజీలకు వెళ్ళారు. దేవీప్రియ పుస్తకాలు పట్టుకుని కాలేజీకి బయల్దేరబోతుంది.
    
    హాల్లో ఫోన్ మ్రోగింది.
    
    ఈ మధ్య ఇంట్లో ఫోనెప్పుడు మోగినా గుండె గబగబ కొట్టుకున్నట్టనిపించి శరీరమంతా వణుకుతోంది.
    
    దగ్గరలో తల్లి లేదు. "హలో" అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని.
    
    "నేను..."
    
    "ఏమిటి?" అంది తడబడే గొంతుతో.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra