Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

   

     "పద.... పద.... అసలే వివాహ భోజనంబూ వింతైన వంటకంబూ....మా బావమరిది విందూ.... అహ్హహ్హ నాకే ముందూ...." అంటూ నడిచాడు శ్రీధర్.

    అభీ ముద్ద నోట్టో పెట్టుకుని "మమ్మీ డాడీ సూపర్! మావయ్యని  ఇక్కడే ఉంచేసుకుందాం!" అరిచాడు.
   
    "అరేయ్.... నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నానురా?" కోపంగా అంటూ వెంటపడ్డాడు చందూ.
   
    శ్రీధర్, పూజా నవ్వుతూ ధరణికేసి చూశారు. ధరణి కూడా నవ్వింది.
   
    ఆ నవ్వులో ఎందుకో జీవం లేదు. ఊహ తెలిసీ తెలియని వయసులో తనని మొదటిసారి ఎవరు ముద్దు పెట్టుకున్నారు?
   
    అస్పష్టమైన ఆలోచన్లు, చేపల కదలికలమల్లె.
   
                                                                       2
   
    "ప్రొద్దుట లేచినప్పటినుండీ రాత్రివరకూ మీరు పరుగులూ, ఉరుకులూ పెడ్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తుకోసం అని రొటీన్ సమాధానం యిస్తారు. డబ్బు చాలా అవసరమే కానీ డబ్బు ఒక్కటే భవిష్యత్తా? డబ్బుంటే చాలా? వారి మానసిక స్థితి గురించి ఒక్కసారైనా ఆలోచించారా? వారం పొడుగునా వాళ్ళు మీ ఇంట్లో ఉంటే మీకు పని ఎక్కువ కాబట్టి వాళ్ళని హాస్టళ్లో పారేశారు. శని, ఆదివారాల్లో వాళ్ళమీద మీరు నిల్వచేసిన ప్రేమంతా గుమ్మరించి మళ్ళీ సోమవారం ప్రొద్దుటే జైల్లోకి తోసినట్లుగా రెసిడెన్షియల్ స్కూలుకు తోలేస్తున్నారు. వాళ్ళ మనసుల్లో అమ్మా, నాన్నల గురించి ఏవనుకుంటున్నారో ఊహించగలరా?" అని ఆగి జాన్ అబ్రహం అక్కడ సమావేశమైన తల్లిదండ్రుల్ మొహాలవైపు చూశాడు.
   
    అందరి మొహాల్లో ఒక విధమైన గిల్టీఫీలింగ్ గూడుకట్టుకుని ఉంది.
   
    "అమ్మా నాన్నలు వీక్ ఎండ్స్ లో ఆడుకోవడానికి పనికి వచ్చే బొమ్మలం మాత్రమే మేము' అన్న ఫీలింగ్ వాళ్ళలో డెవలప్ చేస్తున్నారు మీరు. ఆ బొమ్మలకి కీ ఇచ్చి ఆడించి, వినోదించి మళ్ళీ షోకేసులో పెట్టేసినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. తప్పుమీది కాదు! ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్, రెసిడెన్షియల్ హోమ్స్ నేర్పించిన విదేశీ సంస్కృతిది! ఇదివరకు ఇంటికి ఒక్కడు సంపాదిస్తే సరిపోయిన డబ్బు, ఇప్పుడు ఇద్దరు సంపాదించినా సరిపోవడం లేదు. కారణం, మీకుటైంలేక ఆధారపడే ఇస్ స్టాంట్ ఫుడ్స్, రెడీమేడ్ సౌకర్యాలు చాలా ఖరీదు కావడమే! ఈ ఆధునికత వలన పిల్లలకి దూరమై, ఇంటిపనులు శ్రద్దగా చేసుకునే టైంలేక, మీలో ఎంతమంది ఇల్లాళ్ళు మానసిక వత్తిడులకి లోనవుతున్నారో నాకు తెలుసు!" జాన్ అబ్రహం మొదటి వరుసలో కూర్చున్న ధరణివైపు చూశాడు.
   
    "ఏమ్మా? మీరంతా ఏ విధమైన గిల్టీఫీలింగ్ లేకుండానే సోమవారంనాడు పిల్లల్ని బలవంతంగా బండి ఎక్కిస్తున్నారా? ఫస్టు తారీఖునాడు తెచ్చే జీతం ఆ రోజునే కాక నెలంతా మీకు ఆనందాన్నిస్తుందా? పిల్లల్ని తలుచుకోకుండా నిశ్చింతగా ప్రతీ రాత్రీ నిద్రపోతున్నారా?" అడిగాడు ఆయన.
   
    అమాయకంగా చూస్తూ టాటా చెప్పే అభీ, 'నాకు అక్కడ ఎందుకో బాగా లేదమ్మా!' అంటూ ఆ 'ఎందుకో' చెప్పగలిగే శక్తి లేని పూజా జ్ఞాపకం వచ్చారు - ధరణికి.
   
    అందరి బదులూ తను మాట్లాడ్తూ "ఏం చెయ్యమంటారుమరి? మా దగ్గర ఉంచుకొని చదివించాలీ అంటే ఇంట్లో వీళ్ళ గురించి కేర్ తీసుకునే వెనక దిక్కు ఉండాలి. అలాంటి పెద్దవాళ్ళు ఎవరూ లేనప్పుడు, రోజులో చాలాభాగం వాళ్ళని ఒంటరిగా ఇంట్లో వదిలేస్తే వచ్చే అనర్ధాలూ, ఉపద్రవాల ముందు, ఇలా ఎక్కడో అక్కడ రిస్క్ లేకుండా భద్రంగా ఉన్నారులే అనే ఫీలింగ్ నయం కాదా! అందుకే మీరన్నట్లు పిల్లలకు దూరం అవుతున్నామన్న బెంగని భరిస్తూ ఈ ఏర్పాటుకి తలవంచాము. అంతేకానీ మా పిల్లలు మాకు అడ్డు అనే ఉద్దేశం మాత్రం మాకు ఏ కోశానా లేదు!" అంది.
   
    ఆయన నవ్వాడు.
   
    "ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి మీరు నిర్మించుకున్న కొత్త నిబంధనలివి. అభివృద్ధి అనేది కొత్త అవకాశాలతో బాటు కొత్త నిబంధనలు కూడా విధిస్తుంది. నిజమే! కానీ అక్కడ వాళ్ళు మీరు అనుకొన్న విధంగా ఆదర్శప్రాయమైన బాల్యాన్ని గడుపుతున్నారా? మీ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిరావడంవల్ల చెడిపోయే అవకాశాలు ఎక్కువని మీరు భావిస్తున్నారే.... అలాంటి పరిస్థితులు అక్కడ ఉండవా? ఇక్కడ కనీసం సాయంత్రానికైనా అమ్మా, నాన్నలు వస్తారు. అక్కడ అసలు అడ్డూ ఆపూ ఉండదుగా!"
   
    శ్రీధర్ వెంటనే "డిసిప్లేన్ కోసమే కదా అక్కడ ఉంచింది! అక్కడ వాళ్ళు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతారు" అన్నాడు.
   
    "ఆ విషయం మీరు పరిశీలించారా? అక్కడ చైల్డ్ సైకాలజిస్ట్ లూ, సైకియాట్రిస్టు ఎవరైనా ఉండి మీ పిల్లల మానసిక సమస్యల్ని తీర్చి, వాళ్ళని పరిరక్షిస్తున్నారా?"
   
    అక్కడ కూర్చున్న తల్లిదండ్రుల్లో చాలామంది అసహనంగా చూశారు. దైనా సమస్యగా అనిపిస్తే దానిని ఎలా దాటవెయ్యాలా అని మాత్రమే ఆలోచించే సామాన్య ప్రజానీకంలో వాళ్ళూ ఒక భాగం.
   
    "వెనకటి రోజుల్లో ప్రతి ఇంట్లో బామ్మలూ, అమ్మమ్మలూ, తాతయ్యలూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పే సుమతీ శతకాలతోటీ, పురాణగాథలలోని నీతి సూత్రాలతోటీ పిల్లల వినోదం, విజ్ఞానం పొంది పెరిగేవారు! ఓ వయసు వచ్చేవరకూ వాళ్ళ మనసులు అమాయకమైన మొగ్గల్లాగే ఉండేవి. ఇప్పుడు ఆ మొగ్గల్ని మనం స్టార్ టీవీలతోటీ, వీడియో మేగజైన్ లతోటి బలవంతంగా రేకుల్ని విప్పదీస్తున్నాం! అప్పటి ఆ బామ్మలూ, తాతయ్యలముందు ఇప్పటి సైకాలజిస్టులూ, సైకియాట్రిస్టులూ నిలబడలేరని ఘంటాపథంగా నేను చెప్పగలను! మీలో చాలామందికి ఈ ముసలివాడి మాటలు చాదస్తంగా తోచవచ్చు! కానీ ఇవి అక్షర సత్యాలు!" అన్నాడు జాన్ అబ్రహం.
   
    కొడుకు బుక్ లో దొరికిన ప్రేమలేఖ కళ్ళలో మెదిలి తల వంచుకుంది కమల.
   
    పక్క తడిపేసే అలవాటు మానని అభీ గుర్తుకొచ్చి ఆలోచనలో పడింది ధరణి.
   
    తండ్రిని చూసినా దడుసుకొని ఏడుస్తున్న ఆరేళ్ళ కూతురు ప్రియ జ్ఞాపకం వచ్చింది నీలూకి.
   
    తల్లిదండ్రుల దగ్గర కూడా చనువులేక, తమ ఇళ్లకే చుట్టపు చూపుగా వస్తూ-ఆ చిన్నారులు ఎంత మధనపడుతున్నారో ఆ కన్నతల్లులు ఊహించగలరు! కానీ ఏం చెయ్యలేరు.
   
    తల్లులచేత గోరుముద్దలు తింటూ పెరగాల్సిన వయసులో 'గో ఇన్ ఏ లైన్' అనే అదిలింపులతో, బిక్కు బిక్కుమంటూ ప్లేట్స్ పట్టుకుని, దొంగల్లా వెళ్ళడం ఆ చిన్నారుల పాలిట క్రమశిక్షణా లేక కాలం విధిస్తున్న శిక్షా?
   
    "మిమ్మల్ని తప్పుపట్టడం నా అభిమతం కాదు! పిల్లల మనోవికాసం కోసం పెద్దలు ఏం చేస్తే బావుంటుందీ అని సమాలోచన చెయ్యడమే నా ఉద్దేశ్యం" అన్నాడు అబ్రహం.
   
    అందరూ అందుకు అంగీకారంగా తలూపాడు.
   
    "ఆగస్టు పదిహేనున మనం కేవలం జెండా ఎగురవేసి ఇళ్ళకి వెళ్ళిపోవడం కాకుండా, చిన్నారులకోసం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. కనీసం ఆ రోజైనా మనం స్వాతంత్ర్యదినా వేడుకల్లో పాలుపంచుకుని కలిసి మెలిసి గడుపుదాం" అన్నాడు అబ్రహం.
   
    "అందుకు మాకు అంగీకారమే! ఒక్కొక్క ఇంటికి చందా ఎంత ఇవ్వాలో చెప్పండి!" అన్నాడు విశ్వనాథం.
   
    "డబ్బు పే చేసేస్తే సరిపోతుంది. అనుకోకుండా మీరంతా ఇంట్రెస్టు తీసుకుని మీ అభిరుచికి తగ్గట్లుగా వాళ్ళచేత ఫాన్సీడ్రెస్సులు వేయించండి. 'మనమంతా ఒక్కటి' అనే ఫీలింగ్ వాళ్ళలో కలగాలంటే ముందు మీ పెద్దవాళ్ళంతా ఒక్కటిగా కలిసి ఐకమత్యంతో పనిచేస్తూ వాళ్ళకి కనపడాలి!"
   
    "మీరు చెప్పింది నిజం! ఒక్క గొంతుతో అరవడం కన్నా పది గొంతులు అరిస్తే ఏ పనైనా అవుతుంది!" అంది ధరణి-దృఢంగా.
   
    "ఆ సంగతి కాకుల్ని చూస్తే తెలుస్తుంది!" అంది కమల.
   
    "చీమల బారుల క్రమశిక్షణని చూసి నేర్చుకోవాలి!"
   
    "మొత్తానికి క్రిమికీటకాదుల నుండీ, జంతువుల నుండీ మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది అంటారు!" అన్నాడు విశ్వనాథం నవ్వుతూ.
   
    "అవును! కడదాకా ఆశ వదులుకోకపోవడం..... నమ్మకంతో ప్రయత్నించి విజయం సాధించడం ఓ సాలెపురుగూ....చీమా.....పిచ్చుకా మనకు నేర్పిస్తాయి! వాటికి ఆత్మన్యూనతలూ, ఆత్మహత్యా ప్రయత్నాలూ గురించి ఆలోచించే శక్తి ఆ భగవంతుడు ఇవ్వకపోవడం అదృష్టం!" అన్నాడు అబ్రహం.
   
    అందరూ ఆయన మాటలకి చప్పట్లద్వారా హర్షామోదాలు తెలియజేశారు. తరువాత ప్రోగ్రాంకి కావల్సిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకుని సెలవు తీసుకున్నారు.
   
    ఇళ్ళకి వస్తున్నప్పుడు నీలూ ధరణితో "ముసలాయన చెప్పినట్లుగా మన పిల్లలు మనని స్వార్ధపరులు అనుకుంటున్నారంటావా?" అని అడిగింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra