తొమ్మిది దాటేక వొచ్చింది వసంత. ఎవరో డ్రాప్ చేశారు ఆమెని.
    "హల్లో!" అంది లోపలికి వస్తూనే,
    "ఎక్కడికి వెళ్ళేవు?" అన్నాడు కోపం దాచుకుని.
    "సినీమాకి....మెట్రోలో ఇవాళే లాస్ట్ డే."
    "ఎవరితో?"
    "నీకు తెలీదు-"
    "నా కెందుకు ఫోన్ చెయ్యలేదు? నేనూవచ్చే వాడిని"
    నువ్వురావని నాకు తెలుసును మ్యూజికల్స్ నీకు పడవు"
    చాలా ఉత్సాహంగా వుంది వసంత. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వొచ్చింది.
    "పద - భోజనం చేద్దాం, ఆకలి వేస్తూంది."
    "నువ్వు తిను నాకాకలి లేదు" అన్నాడు గోపాలం.
    నవ్వింది వసంత. "ఎందుకు ఆకలిలేదు" -పద"
    లేవదీసి అతన్ని టేబిల్ దగ్గరకి తీసికెళ్ళి కూర్చోబెట్టింది. అతను కాదనలేకపోయాడు.
    భోజనం చేస్తున్నంతసేపూ అతను నిశ్శబ్ధంగానే ఉండడానికి ప్రయత్నించాడు- ఆమె అలాగ ఉండనీయలేదు.
    "వెళ్ళి ఎలా జరిగింది?"
    "బాగానే"
    "నాన్నగారిని చూశావా?"
    "లేదు"
    మద్రాసు వెళ్ళిపోయారా?"
    "ఆఁ"
    "లలిత ఎలావుంది? రమ్మని చెప్పేవా?"
    "చెప్పేను"
    "ఏమంది?"
    "నువ్వొచ్చి పిలిస్తే వస్తానంది"
    చిన్న నవ్వు నవ్వి, "ఎప్పుడు వెడదాం?" అంది వసంత.
    "ఎక్కడికి?"
    "లలితను తీసుకురావడానికి"
    ఆ మాటలలో ప్రతిధ్వనించిన హేళన గుర్తించి అతనేమీ జవాబు ఇవ్వలేదు.
    కొంచెం సేపు నడిచి వద్దామని బయటికి వెళ్ళబోయాడు గోపాలం. "ఆగు నేనూ వొస్తాను" అని మరో ఐదు నిమిషాల్లో చీర కట్టుకుని వొచ్చింది.
    అటు నిజామ్ పేలస్ దాకా నడిచి చౌరంగే రోడ్డుకి నడిచారు. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమె అతని చెయ్యి పట్టుకుని నడవసాగింది, అతను అభ్యంతర పెట్టలేదు.
    పార్క్ స్ట్రీట్ లోంచి నడిచి ఇంటికి చేరారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయి మాట్లాడలేదు ఒక్కసారీ.
    ఇంటికి చేరాక అతను పుస్తకం తీసి చదువసాగేడు - ఆమె చాలాసేపు ఏదో ఉత్తరం రాసి రాసి వొచ్చి పడుకుంది:
    అరగంట దాటాక "దీపం తీసే - నిద్దర రావడం లేదు" అంది వసంత.
    దీపం ఆర్పి," నీతో మాట్లాడాలి" అన్నాడు.
    "తెలివిగానే ఉన్నాను- చెప్పు" అంది వసంత.
    "క్లబ్ డే ఎలాగ జరిగింది?"
    "వండ్రఫుల్ గా -"
    "నీకు సెకెండ్ ప్రయిజు వొచ్చిందా?"
    "అవును"
    "నాతో చెప్పలేదేం?"
    "అంత గొప్ప విషయం కాదని."
    "ఆరోజు పోటీ చెయ్యనన్నావు"
    "అవును- అలాగా అనిపించింది"
    "మరి?"
    "వాళ్ళందరూ ప్రెస్ చేశారు"
    "ఎవరువాళ్ళు?"
    "ఏం ప్రశ్నలు నీవి? - ముఖర్జీ, అతని భార్య, మాధుర్స్ ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి,"
    "ఇంకా..."
    "రాయ్- సెక్రటరీ..."
    "ఎం చేత పోటేచేశావా?"
    "ఆఁ"
    "ఫస్ట్ ఎవరి కొచ్చింది?"
    "నమితా సేన్ - నువ్వు చూశావు - జ్ఞాపకం వుందా?"
    ఎప్పుడు చూశాను?"
    "జ్ఞాపకం లేదు- నేనే పరిచయం చేశాను."
    "నాకు జ్ఞాపకం లేదు"
    "నిద్రపో - ఇంక"
    "నిన్న రాత్రి ఎవరొచ్చారు?"
    "ఎవరో ఫ్రెండ్స్ - ఏం?"
    "ఏమీ లేదు- చాలా సిగరెట్లు కాల్చేరని"
    "అవును - ప్రకాశ్ తెగతాగుతాడు సిగిరెట్లు-డర్టీ"
    "ఎవరతను?"
    "ఫ్రెండు - నాకు నిద్దరవొస్తోంది"
    "నిన్నరాత్రి నిద్రరాలేదా? - ఉదయం దాక నిద్రపోయావు?" లేచి కూర్చుంది వసంత.
    "ఆ ప్రశ్నకి వేరే అర్ధం ఉంది- అదేనా నువ్వడగడం?"
    'నీకు తెలుసును."
    "గోపాలం! స్పష్టంగా అడుగు చెప్తాను. అవును- నిన్న చాలాసేపటిదాకా ప్రకాశ్ తో మాట్లాడాను, ఆ తరవాత నిజంగానే నిద్దర రాలేదు. తెలిసిందా?"
    "ఆఁ బోధపడింది."
    ఆమె  మంచినీళ్ళు తాగి వొచ్చి పడుకుంది, ఆ చీకటిలో అతనికి కనిపించలేదు. లేకపోతే ఆ రక్త నయనాలూ, వాటిలోని ఆర్ద్రతా కనిపించేవి. అతని ఆలోచనల్లో- తనమీద తనకి కలిగిన జాలిలో ఆమెతో అతనింక మాట్లాడలేదు. లేకపోతే ఆమె హృదయంలో నిలిచిపోయిన మాటలన్నీ ప్రవాహంలాగా వచ్చి ఉండేవి.
    అతను ఆలశ్యంగా నిద్రపోయాడు. ఒక సారి వదినని శశిరేఖ గురించి అసలు అడగని మాట జ్ఞాపకం వొచ్చింది. ఆ తరవాత నిద్రకష్టం మీద వొచ్చింది.
    ఆ తరవాత మూడు నాలుగు రోజులు ఆమె అతనితో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. అతనూ మండుతూన్న ఆలోచనల్లో ఆమెతో మాట్లాడలేదు. ఆమె ఎనిమిది తరవాత లేచేది-అతను తొమ్మిదికి వెళ్ళి రాత్రి తొమ్మిది తరవాత వొచ్చేవాడు.
    నాలుగోరోజు సాయంత్రం శేఖర్ కనిపించాడు హఠాత్తుగా, గోపాలం సాయంత్రం టీ కోసం నీరాకి వెళ్ళాడు- అక్కడికే వొచ్చి కనిపించాడు శేఖర్.
    గోపాలాన్ని చూసి, శేఖర్ సంతోషంగా వొచ్చి అతని పక్కన కూర్చుని, "ఈ మధ్య అసలు కనిపించడమే లేదేం?" అన్నాడు,
    "ఆమాటే నిన్నూ అడగొచ్చు"    
    ఇద్దరూ ఈ పాతజోక్ కి నవ్వుకున్నాక, "ఏమిటి విశేషాలు? నీ ఫేక్టరీ ఎలాగ ఉంది?" అన్నాడు.
    "గొప్పగా ఉంది, వొచ్చే జనవరికి ఐపోవాలి..... కిందటి వారం నేను వొచ్చాను-నువ్వు మీ చెల్లెలి పెళ్ళికి వెళ్ళేవని చెప్పింది వసంత"    
    "ఎప్పుడు వొచ్చావు?"
    "లక్ష్మివారం రాత్రి- మళ్ళీవొద్దామనుకున్నాను- కానీ, పడలేదు, ప్రకాశ్, నేనూ చాలా సేపు మాట్లాడేం. వసంతని అర్దరాత్రి దాకా కూర్చోబెట్టేం- ఇటుపైని తరుచువొస్తాను. అక్కడ ఎరెక్షన్ అంతా ప్రకాశ్ చూసుకుంటాడు."
    అతని మాటలు వినబడ్డం లేదు గోపాలానికి-తన ధోరణికి అంత కోపం వసంతకి ఎందుకు వొచ్చినదో అతనికి అర్ధంఐంది-భగవాన్! ....ఏం చేశాను! అనుకున్నాడు.
    కాఫీ తాగడం ముగించి. తిన్నగా ఇంటికి వెడదామని అనిపించింది- కానీ. కాలేజీకే వెళ్ళేడు గోపాలం, ఇంటికి చేరుకునే సరికి ఎనిమిధైంది.
    రికార్డు వింటోంది వసంత. అతని రాక గమనించి. పాడుతోన్న రికార్డు ఐపోగానే ఆపేసింది.
    "ఆపేశావేం?" అన్నాడు గోపాలం.
    "నీకు నచ్చవు..." అంది వసంత.
    అతను వెళ్ళి మళ్ళా పెట్టేడు గ్రామ్. ఏదో ఇంగ్లీషు రికార్డు- లాంగ్ ప్లే.
    నెమ్మదిగా వసంత పక్కని కూర్చుని. "చాలా కోపంగా ఉందా?" అన్నాడు.
    "అవును-"
    "సారీ-పొరపాటునాదే. నువ్వు అంతా నిజం చెప్పక సగం నిజం ఎందుకు చెప్పేవు?"
    అర్ధం కానట్టు చూసింది అతని వేపు.
    "శేఖర్ కనిపించాడు సాయంత్రం వసంతా! వాళ్ళిద్దరూ వొచ్చారని ఎందుకు చెప్పలేదు?"
    ఆమె ఏమీ అనలేదు.
    "కూడని పని నువ్వు చెయ్యవని నాకు తెలుసును... కాని- అనవసరంగా ఎందుకు అనుమానం కలిగించేవు?...
    నిశితంగా అతని కళ్ళలోకి చూసింది వసంత
    "నీకు అనుమానం ఎందుకు కలగాలి?"
    "సామాన్య మానవుణ్ణి కనక..."
    "అదే కారణం నా పనికీ-నీకు ఎప్పటికే అర్ధంకాదు"
    చేతుల్లోకి తీసుకున్నాడు. "ఆమె ఎదురు చెప్పలేదు.
    "క్షమించు."
    ఆమె ఏమీ అనలేదు- చాలా సేపటిదాకా

                                   24

    ఈ సారి వసంత మళ్ళీ పూర్వపురోజులు. ఇంట్లోకి తేలేదు. నిశ్శబ్దాల చీకట్లు నిరంతరం ఇంట్లో కాపురం చెయ్యక పోయినా, ఆమెలో ఏదో నిర్లిప్తం అతను గమనించకపోలేదు. అవసరం ఉన్నప్పుడు ఆమె అతనితో మాట్లాడుతుంది. అతన్ని తప్పించుకుని తిరగదు. అతను రమ్మంటే వాక్ కి కాని సినీమాకు గాని- వొస్తుంది. లాలిస్తే అడ్డు చెప్పదు కాని. ఆమె ప్రవర్తనలో జీవంలేదు యాంత్రికంగా నవ్వుతుంది....జీవం లేదు ఆమెలో.
    పది రోజులు చాలా ప్రయత్నించాడు గోపాలం.
    "ఎందుకలాగ బాధపడతావు?"
    "నేను బాధపడడం లేదు"
    "మరెందుకా ఉదాసీనం?"
    అర్ధంకానట్టు చూస్తుందామె- అతనిలో నించి ఎక్కడికో.
    "నేను తప్పుగా ప్రవర్తించానని ఒప్పుకున్నాను. క్షమించమన్నాను..."
    "ఆ మాట ఆలోచించడం లేదు నేను"
    "మరి?"
    "ఏమిటో నాకూ తెలీదు గోపాలం ... తెలిస్తే చెప్తాను"
    "డాక్టర్ని చూడు"
    "చూసేడు ఏమీలేదు"    
    అతనికి అర్ధం అవలేదు. నిద్రిస్తోన్న ఆమె భావాలని ఎలాగ లేపడం? దాచుకున్న  ఆమె ఆలోచనల్ని అంతరాంతరాల లోపలినుంచి తన వెలుగులోకి ఎలాగ తేవడం?
    చాలా రోజులు ఆమె ఎక్కడికీ వెళ్ళలేదు.
    అతనూ ప్రయత్నించి ప్రయత్నించి నిరాశ చేసుకున్నాడు. ఆమెలో ఏదో విచిత్రమైన మార్పువొచ్చిందని అతనికి తెలుసును. పూర్వపు కోపం లేదు. ఆ చురుకు లేదు.
    ఈ ప్రవర్తన తనకి బాధ అప్పటిలాగ కలిగించని మాట నిజమే. కాని, నెల, రెండు నెలల్లో తన సంతోషం సందేహంగా, ఆతృతగా, బాధగా, వేదనగా - భయంగా మారింది.
    జూలైలో డార్జిలింగ్ వెళ్ళనంది. వెంకట్రామ్ ఒక్కరూ వెళ్లారు. ఆయన ఎంత బ్రతిమిలాడినా ఒక్కవారం కూడా అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు వసంత.
    క్రమంగా అతనిలోనూ ఒక రకమైన విరక్తి పుట్టి పెరగసాగింది. నాలుగు నెలల తరవాత ఒకరోజు ఆమె సాయంత్రం ఎక్కడికో వెళ్ళడానికి తయారవడం గమనించి కొంచెం ఆశ్చర్యపడ్డాడు.
    ఆ రోజు ఆమె చాలా కులాసాగా వుంది. చీకటి రోజులు పోయాయనీ, ఏదో విచిత్రమైన మానసిక క్రమ పరిణామంలో మళ్ళా వసంత మారిందని అనుకున్నాడు గోపాలం.
    ఆమె అతనితో చెప్పకుండానే టాక్సీ తీసుకుని వెళ్ళి రాత్రి వొచ్చింది, ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి.
    ఆ మార్పు ఒక్క వారమే- ఆ తరవాత మళ్ళీ సుమారు పూర్వపు రోజులకే వొచ్చేసింది. అతను ఇందులో తాను చెయ్యగలిగేదేమీ లేదని. ఆమెని ఏమీ అడగలేదు, ఈ కొత్త నిజంతో సరిపెట్టుకున్నాడు.
    పరీక్షలు ఇంక నెలకన్న లేవు దీక్షగా చదువు తున్నాడు. లా డిగ్రీ ఎలాగైనా తీసుకోవాలనే దీక్ష అతని ఆకాంక్షకి ఆకారం ఇచ్చింది.
    ఆమె మళ్ళీ సాయంత్రాలు క్లబ్ కి వెళ్ళడం ప్రారంభించింది - ఒక్కొక్కరోజు చాలా ఉత్సాహంగా వొచ్చేది.
    ఒకరోజు సాయంత్రం పెద్దకవరు - ఫోటో స్టూడియో నించి వొచ్చింది. అతను చదువు కుంటున్నాడు. ఒకసారి కవరు పరీక్షగా చూసి అలాగే పెట్టేశాడు.
    ఆమె వొచ్చేక అది చూసి, "ఎప్పుడు వొచ్చాయి" అంది.
    "సాయంత్రం నువ్వెళ్ళిపోయాక"
    ఆతృతగా విప్పింది.
    అతను పుస్తకం చదువుతున్నాడు. కొంచెం నిమిషాల తరువాత ఆమె ఒక పెద్ద ప్రింటు అతని ముఖానికి ఎదురుగా, పుస్తకం మీద పెట్టి, "ఈమె చాలా బాగుంటుంది కదూ?" అంది.
    అతను పరిశీలించి "బాగుంది" అన్నాడు.
    "ఎవరో తెలుసా?"
    "తెలీదు"
    ఫోటో తీసుకుని, "నమిత... నేను చెప్పలా? నా మీద పోటీగెలిచిన అమ్మాయి" అంది వసంత.
    నిజానికి వసంత కన్న నమిత ఏమీ అందంగా లేదనిపించింది అతనికి, కాని, ఏమీ అనలేదు, మళ్ళీ చదువుకోవడం ప్రారంభించాడు.
    "మిగిలిన ఫోటోలు చూడు."
    ఆమె అతని ప్రక్కనే నిలబడి మిగిలిన ఫోటోలు చూపెట్టింది. వసంతది రెండు మూడు రాయ్ తో కరచాలనం- ఒకటి. బుకే అందిస్తూ ఎవరో....నమితా, వసంతా కలిసి ఒకటి.    
    "గుడ్-బాగున్నాయి" అన్నాడు.
    ఆమె వాటిని మళ్ళీ కవర్లో పెట్టేసింది. ఏదో జరుగుతుందని ఆశపడి అది జరగని నిరాశ పడినట్టు కనిపించింది అతనికి- పుస్తకంనించి తల ఎత్తిన నిమిషాల్లో.
    ఆ సంఘటన అతను పూర్తిగా మరిచిపోయాడు.

                                                        *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra