గర్భగుడి
    
    "ఏవిటే నువ్వనేది?"నిశ్చేష్టురాలై చూస్తూ అంది మంజుల.
    నిర్లక్ష్యంగా చూస్తూ "అవునమ్మా నాకిష్టం లేదు" మొండిగా అంది తనూజ.
    "ఏవిటే ఇష్టంలేదు?"
    "పిల్లల్ని కనడం, పెంచడం, బాధ్యతలు.... కష్టాలూ... ఇవన్నీ నాకిష్టంలేదు."
    "మరి పెళ్ళేందుకు చేసుకున్నావు?'
    "పెళ్ళి చేసుకున్నది నాకోసం, పిల్లల్ని కనడం కోసం కాదు. పిల్లల్ని కనడం కర్తవ్యం అన్నట్లు మాట్లాదతారేం."
    'అవును, కర్తవ్యమే. అందుకే నోర్మూసుకుని కూర్చోమనేది. పిచ్చిపిచ్చి గా మాట్లాడకుండా వెళ్ళి పడుకో. అసలే వాంతులతో బాగా నీరసంగా ఉన్నావు."
    మంజుల అక్కడి నుంచి వెళ్ళబోతుంటే 'అందుకే....అందుకే ఈ వాంతులు వేవిళ్ళు ఉంటాయనే నాకసహ్యం. మా కాలేజీలో పెద్ద పోట్టేసుకుని తిరిగేవాళ్ళ ని చూసి ఏడిపించే వాళ్ళం. నవ్వుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు నేను కూడా అలా పెద్దపోట్టేసుకుని తిరగాలా?" ఛీ...ఛీ.... " అంటూ గట్టిగా అరుస్తూ వికారంగా మొహం పెట్టింది తనూజ.
    మంజుల కూతురి వైపు విచిత్రంగా చూసింది. ఇది చిన్నపిల్లా, పెద్ద పిల్లా అమాయకురాలా, మూర్ఖురాలా? ఏం మాట్లాడుతోంది? ఉదయాన్నే "అమ్మా నాకు ఒంట్లో బాగోలేదు. ఏం తినాలనిపించడం లేదు. తింటే వాంతి అవుతోంది." అని ఫోన్ చేస్తే గాభరా పడుతూ వెళ్ళి కూతుర్ని తీసుకొచ్చి డాక్టర్ కి చూపించింది.
    పెళ్ళయిన నాలుగేళ్ల కి తనూజ తల్లి కాబోతోందన్న శుభవార్త చెప్పింది డాక్టర్. ఆ వార్తా విని పొంగిపోతుందని సంతోషంతో ఎగిరి గంతులేస్తుందని సిగ్గు దొంతరల మధ్య సెలయేరులా సుళ్ళు తిరుగుతుందని, "అమ్మా నాకు సిగ్గేసొంది. రాహుల్ కి డాడీకి నువ్వే చెప్పు ఈ శుభవార్త" అంటుందని ఆశించింది. కాని హాస్పిటల్ నుంచి రావడమే మొహం ముటముటలాడించుకుంటూ వచ్చింది. వస్తూనే "ఈ ప్రెగ్నెన్సీ నాకొద్దు ....అబార్షన్ చేయించుకుంటాను" అంది.
    ఆ మాట వినగానే ముందు తెల్లబోయింది మంజుల. పెళ్ళి అయిన దగ్గర్నించీ ఇంకా గర్భం రాలేదు నేనీ జన్మలో తల్లి నవుతానా? అంటూ బెంగ పెట్టేసుకుని డాక్టర్ల చుట్టూ నోములూ వ్రతాలు చేస్తూ స్వాముల వార్ల చుట్టూ తిరిగే ఆడవాళ్ళని చూసింది కానీ... ఇదేంటి ఇదిలా మాట్లాడుతోంది. దీనికేం పిచ్చి పట్టిందా? అనుకుని ఆశ్చర్యంగా చూసింది. ఆవిడ ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా మొండిగా , "నాకీ కడుపు రావడం, పిల్లలు పుట్టడం ఇష్టం లేదు" అంటుంటే ఏం సమాధానం చెప్పాలో ఆమెకి అర్ధంకాలేదు.
    ప్రతి ఏడాది తనూజ అత్తగారు ఈ ఏడాదన్నా మాకు మనవడినిస్తావా తనూజా? అని ఆశగా అడగడం, తనూజ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనిస్తున్నా సిగ్గనుకుంది. చిన్నవాళ్ళు కదా.... కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అగారేమో, ఏవన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో అనుకుంది కానీ ఇప్పుడు ఈ పిల్ల ధోరణి చూస్తుంటే ఏదో కావాలనే పిల్లలు కలక్కుండా తాత్సారం చేసినట్టుంది అనిపిస్తోంది. కూతురి పెంకితనం, ఆధునిక పోకడలూ, తెలిసింది కాబట్టి మంజుల కూతురి మాటలు పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా తేలిగ్గా "తప్పు తల్లీ! ఇన్నాళ్ళ కి తల్లి కాబోతూ ఏమిటా మాటలు? వేవిళ్ళు ఎన్ని రోజులుంటాయి? మూడోనెల దాటగానే తగ్గిపోతాయి. ఈమాత్రానికే పిల్లలు వద్దనుకుంటారా ఎవరన్నా? మేమంతా కనలేడూ?" అంది.
    "మీకంటే తెలివి లేదు. పిల్లల్ని కనడం కోసమే పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీరంతా. అందుకే కన్నారు. కానీ నావల్ల కాదు. నాకు ఈకడుపులూ, పిల్లలూ వాళ్ళని పెంచడాలూ, వాళ్ళ ఉచ్చలు, ఉమ్ములు, రోగాలూ, రోష్టులు, ఈ టెన్షన్ నేను భరించలేను. ఇప్పుడు హాయిగా ఉన్నదాన్ని కష్టాలు కొని తెచ్చుకోలేను రేపు అబార్షన్ చేయించుకుంటానంతే" విసురుగా అంది తనూజ.
    ఆవిడ రెప్పవేయకుండా కూతుర్నే చూడసాగింది. ఒక్కతే కూతురని అడిగింది అట, పాడింది పాటగా పెంచారు. కోరుకున్న ప్రతిదీ క్షణాల్లో అమర్చాడు తండ్రి. ఆఖరికి ప్రేమించిన వాడిని తప్ప ఇంకెవర్ని పెళ్ళి చేసుకోనని చెబితే కులం లోనూ, అంతస్తు లోనూ కూడా సరితూగని వారైనా పిల్లాడు బాగున్నాడని, మంచి ఉద్యోగం ఉందని అతనికే ఇచ్చి ఆడంబరంగా పెళ్ళి చేశారు. అల్లరి, గారభం , పెంకితనం వీటితో మొన్నమొన్నటి దాకా తన చేతుల్లో పెరిగి, తన చేతి ముద్దలు తిన్న కూతురు హటాత్తుగా పెద్దదై, ఓ ఇంటి కోడలిగా, ఒక వ్యక్తికీ భార్యగా వెళ్ళడం ఇంకా విచిత్రంగా ఏదో అద్భుతంగా అనిపించింది. అలాగే ఇప్పుడు ఈ చిన్నారి తల్లి, ఓ చిన్నారికి తల్లి కాబోతోందంటే ఆ అనుభూతి వర్ణించటానికి మంజులకి భాష లభించలేదు. ఇప్పుడు కూడా తనూజ అన్నమాటలు చిన్నపిల్ల చేష్టలు గానూ, పెంకి మాటలు గానూ అర్ధం చేసుకుని కొట్టి పారేయడానికి ప్రయత్నిస్తోంది.
    అందుకే "తనూ! నువ్వింకా చిన్నపిల్లవి కాదు. ఊరికే గొడవ చేయకుండా వెళ్ళి పడుకోమ్మా, నీకేదన్నా పుల్లటి పదార్ధం పెట్టనా?" అంది.
    "పులుపూ వద్దు, తీపి వద్దు. నాకేం వద్దు. ఈ దరిద్రం వద్దు....అబార్షన్...."
    "తనూ" గట్టిగా మందలింపుగా అరిచింది "ఏవిటే ఆ మాటలు? నీకేం పిచ్చా?"
    "అవును పిచ్చే నువ్వేమైనా అనుకో మమ్మీ! రానురానూ పెద్ద పొట్ట వస్తుంది. ఆ పోట్టేసుకుని ఆఫీసు కెళ్ళాలంటే నాకసహ్యం. నన్ను చూసి అందరూ నవ్వుతారు. నిక్ నేమ్స్ పెడతారు. అమ్మో.... ఊహిస్తుంటేనే కంపరం పుడుతోంది. నాకీ ప్రెగ్నెన్సీ వద్దు"
    "అబార్షన్ చేయించుకుని మీ అత్తగారికి , మామగారికి ఏం సమాధానం చెప్తావు?"
    "వాళ్ళకేంటి సమాధానం చెప్పేది....నా ఇష్టం"
    "కాదమ్మా....కొన్ని విషయాల్లోనే నీ ఇష్టం చెలామణీ అవుతుంది... పాపం నాలుగేళ్ల నుంచి వంశోద్దారకుడి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడీ వార్త తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. అలాంటి వాళ్ళ సంతోషాన్ని నాశనం చేస్తావా?"
    "వాళ్ళ సంతోషం కోసం నేను దుఃఖం ఎందుకు కొని తెచ్చుకోవాలి మమ్మీ."
    "నీకు దుఃఖం ఎందుకే. పిల్లలు లేనివాళ్ళు లేరు మొర్రో అని గుళ్ళూ, గోపురాలూ తిరుగుతుంటే నువ్విట్లా మాట్లాడతావు. మాతృత్వం స్త్రీకి వరం తెలుసా!"
    "ఆ ....తెలియకేం?" వెటకారంగా అంది తనూజ.
    "మాతృత్వం వరం. సంసారం స్వర్గం, ఇల్లే వైకుంఠం , అమ్మా...ఇవన్నీ చాలా పాత చింతకాయ పచ్చడి స్లొగన్స్. దయచేసి నా దగ్గర మాట్లాడకు. మీకు వరం అయితే నా దృష్టి లో అది శాపం. నా స్వేచ్చను హరించే శాపం. నాకు మాత్రం ఈ వరాలు వద్దు. ఏం వద్దు. నేను రేపే వెళ్ళి అబార్షన్ చేయమని  డాక్టర్ని అడుగుతాను. ఛీ...ఛీ.... పెళ్ళిచేసుకుంటే చాలు .... పిల్లలని ప్రాణం తీస్తారు. మీ పెద్దవాళ్ళు. వేరే పనీపాటా లేదు. అక్కడికి మేం మీకు పిల్లల్ని కనడానికి పెళ్ళిళ్ళు చేసుకునంట్టు . నేను పెళ్ళి చేసుకున్నది పిల్లల్ని కనడానికి కాదు. నేను జీవితాన్ని అనుభవించడానికి. ఆనందించడానికి తెలిసిందా.?"
    మ్రాన్పడి చూసింది మంజుల. నిజంగానే దీనికి పిచ్చి పట్టింది. అని నిర్దారించుకుంది. స్వరంలో కొంచెం కాఠిన్యాన్ని నింపుకుని "తనూ!నాకు తెలియదు సాయంత్రం మీ ఆయనొచ్చాక మీరూ, మీరూ నిర్ణయించుకోండి. ప్రస్తుతం నేనుచేప్పినట్టు విను. అంతే.... చదవేస్తే ఉన్న మతి పోయినట్లు తయారవుతున్నావు. మొగుడు కావాలి... కానీ పిల్లలోద్దు... రేపు అబార్షన్ చేయించుకున్నాక మళ్ళీ మొగుడి పక్కలో పడుకోకు" అంది.
    'అమ్మా! అసహ్యంగా మాట్లాడకు" కోపంగా అరిచింది తనూజ.
    "ఏం నువ్వు అసహ్యంగా ప్రవర్తించగా లేనిది నేను అసహ్యంగా మాట్లాడితే తప్పా. కడుపోద్దు, పిల్లలోద్దు , మొగుడు కావాలి.... ఇదేనా మీ ఆధునికత? ఇదేనా మీ ఫెమినిజం? మేమూ మీలా అనుకుని ఉంటె మీరేక్కడుండేవాళ్ళు. అన్నీ వెధవాలోచనలు" విసవిసా వంటగదిలోకి వెళ్ళిపోయింది మంజుల.
    తల్లి అలా విసురుగా వెళ్ళి పోవడంతో తనూజ కి ఒళ్ళు మండిపోయింది. ఈవిడ ఉద్దేశం ? పిల్లల్ని కనడం తనిష్టం. కనాలనిపిస్తే కంటుంది. లేదంటే మానుతుంది. వీళ్ళ నిర్భంధం ఏంటి? పిల్లల్ని కనే విషయంలో తనకేం స్వాతంత్ర్యం, స్వేచ్చా లేదా? వీళ్ళు కనమంటే కనాలా? ఈ వాంతులు , ఈ వికారాలు ఈ బాధలు ఇవన్నీ వీళ్ళు అనుభవిస్తారా? తనేగా అనుభవించాలి. మనవడు కావాలిట... మనవడు. అందులో కూడా నిర్ణయాలు వాళ్ళవే? ఏం మనవరాలు ఎండుకొద్దు? హు..చస్తే కనకూడదు. వాళ్ళ వంశం నిలపడం కోసం తను తోమ్మిది నెలలు భారం మోస్తూ కదలలేక కదులుతూ, నడవలేక నడుస్తూ అసహ్యం గా కాళ్ళీడుచుకుంటూ నడుస్తూ ఆఫీసు కెళ్ళాలా? కొలీగ్స్, ఫ్రెండ్స్ చూస్తె ఏమనుకుంటారు? నో... ఎట్టి పరిస్థితుల్లో తను కనదు గాక కనదు. తీవ్రంగా నిశ్చయించు కుంది తనూజ.
    కొన్ని నిమిషాలకి మంజుల గ్లాసుడు నీళ్ళలో నిమ్మకాయరసం పిండిరెండుచెంచాల తేనే కలిపి తీసుకొచ్చింది. "ఇదిగో ఇది తాగు. వికారం తగ్గుతుంది.అంటూ గ్లాసు తనూజ చేతికివ్వబోయింది.
    "నాకొద్దు" మొహం తిప్పుకుంది తనూజ.    

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra