Home » Mainanpati bhaskar » Bhama Kalapam

 

    కొంతమంది ఘనులయితే అసలు అప్పులు తిర్చనే తీర్చరు.

 

    అది వింటున్న భరత్ బిగుసుకుపోయాడు.

 

    "అయితే మీరు కూడా అప్పులు తీర్చరా?"

 

    "తప్పు, తప్పు. నేను తిర్చనని అన్నానా? నా డబ్బులు ఎక్కువ రిటర్న్ వచ్చే వ్యాపారాలలో పెడతాను. ఇప్పుడు ఈ హొటల్ కి కావలసిన డబ్బు మాత్రం తక్కువ వడ్డీకి దొరికే చోట తీసుకుంటున్నాను. ఇది చట్టప్రకారం తప్పేమీ కాదు. మీరు అలా శివుడు మూడో కన్ను తెరిచినట్లు తీక్షణంగా చూడనక్కర్లేదు.'

 

    కష్టం మీద నవ్వు మొహం పెట్టాడు భరత్.

 

    "మీకు ఇప్పుడు అర్జెంటు పని ఏమైనా వుందా?" అంది సుదీర.

 

    "అంత అర్జెంటు పనేమీ లేదనుకోండి."

 

    "అయితే, ఒక్కసారి మా తోటకు వెళ్ళి వద్దాం."

 

    "తోట" అని వినబడగానే ఆదుర్దాగా, "నాక్కొంచెం పని........" అనబోయాడు భరత్.

 

    "పనేమీ లేదని ఇప్పుడే అన్నారు" అంది సుదీర గుర్తు చేస్తూ.

 

    "ఏదో నోరు జారి అన్నాను."

 

    "నోరు జారితే కాలు జారినట్లు బాధపడి పోతారేమిటండి! రండి చెబుతాను"

 

    కారు గార్డెన్ దారి పట్టింది. గార్డెన్ చేరేసరికి నాలుగయింది. ఎండ తగ్గు ముఖం పడుతోంది. కొద్దిగా మబ్బులు కమ్మి, చల్లగాలి మొదలయింది.

 

    కాటేజ్ ముందు కారు ఆగగానే, గార్డెన్ తాలూకు మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు.

 

    "గ్రేప్స్ కోశారా?" అంది సుదీర.

 

    "ఇంకో అరగంటలో అయిపోతుంది అమ్మాయిగారూ!"

 

    "ఎవరు కొంటున్నారు?"

 

    "మన మల్లేశం. కలకత్తాకు పంపుతాడట.'

 

    "కలకత్తాలో ఎక్కువ రేటు వుంటే మనమే డైరెక్టుగా పంపోచ్చుగా? మధ్యలో ఈ మల్లేశం ఎందుకూ?"

 

    వ్యాపారం విషయంలో సుదీరకు మొహమాటాలు లేవు.

 

    సుదీర కాటేజ్ లో నుంచి కలకత్తాలోని ఒక పార్టీకి ఫోన్ చేసి రేటెంతో కనుక్కుంది.

 

    "రేపు కోసినవి డైరెక్టుగా కలకత్తా పంపు. లోకల్ గా ఎవరికి అమ్మకు" అంది మేనేజర్ తో.

 

    అతను వినయంగా తల ఉపి వెళ్ళిపోయాడు.

 

    "సో" అని ఒళ్ళు విరుచుకుంది సుదీర. "చాలా బిజీ డే కదూ? మీకు కూడా ట్రబుల్ ఇచ్చాను."

 

    "అబ్బే! అదేం లేదు."

 

    "ఇప్పుడు చెప్పండి ఏమిటి విశేషాలు?"

 

    "సుదీరగారూ" అన్నాడు భరత్. "మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమే."

 

    ఫక్కుమని నవ్వింది.

 

    "పొద్దుటి నుంచి కలిసి తిరుగుతూ వుంటే ఇప్పుడా చెప్పడం. అయినా మీరు చెప్పకముందే  నాకు తెలుసు."

 

    "ఎలా తెలుసు?"

 

    "తెలుసు. అంతే."

 

    తనని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడని వెర్రి వెధవ ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదని సుదీర నమ్మకం.

 

    లేచి, ఫ్రిజ్ లో నుంచి కూల్ డ్రింక్ బాటిల్స్ తీసింది సుదీర. అరల్లో బీరు సీసాలు కూడా కనబడ్డాయి భరత్ కి. పక్కనే ఫోమ్ బెడ్ వుంది. సకలమైన సౌకర్యాలు వున్నాయి కాటేజ్ లో.

 

    "స్నానం చేసి వస్తాను" అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళింది సుదీర. కొద్ది నిమిషాలు తరవాత సోపు పరిమళం అక్కడంతా వ్యాపించింది.

 

    చీర మార్చుకుని వచ్చింది సుదీర. ఆడవాళ్ళని ఎక్స్ రే కళ్ళతో శోధించే అలవాటు భరత్ కి లేదు. కానీ , ఉంటె, సుదీర జాకెట్ లోపల బ్రా వేసుకోలేదన్న సంగతి అతను వెంటనే గమనించి వుండేవాడు.

 

    "చెప్పండి" అంది.

 

    "ఏం చెప్పను?"

 

    "స్వీట్స్ నదింగ్స్ ఏమైనా?"

 

    ,మొహమాటంగా నవ్వాడు భరత్.

 

    కాసేపు అతని మాట కోసం ఎదురు చూసి, సుదీర అన్నది. "నా హాబీస్ టెన్నిస్, స్టాంపులు, పాత నాణేలు కలెక్ట్ చెయ్యడం, పాప్ మ్యూజిక్ , డైమెండ్స్ కలెక్ట్ చెయ్యడం. మరి మీకో?"

 

    "డాన్స్!" అన్నాడు భరత్. "డాన్స్ నా హాబీ, నా వృత్తి. నాప్రాణం! అంతే!"

 

    "స్పోర్ట్సు?"

 

    "ఉహు! ఇంట్రస్టూ లేదు."

 

    "మాన్స్ ఫేవరేట్ స్పోర్ట్స్ అంటారీ, దానిలో కూడా ఇంట్రస్టు లేదా?" అంది నవ్వుతూ.

 

    భరత్ మొహం ఎర్రబడింది.

 

    "నాకు తెలుసు. మీరు అలాంటి వారు కాదని. అందుకనే ఇంత దైర్యంగా ఈ కాటేజ్ కి వచ్చేశాను మీతో.'

 

    ఆమె మాట తీరు మారుతోంది. భరత్ పొద్దుటి నుంచి చూసిన స్మార్ట్ బిజినెస్ ఉమన్ కాదు సుదీర ఇప్పుడు. ఇష్టసఖుడిని చేరిన ఆడపిల్లలా వుంది.

 

    బెరుగ్గా, అసౌకర్యంగా ముడుచుకుపోయి కూర్చున్న భరత్ అంటే మురిపెంగా, ఆటగా వుంది ఆమెకు.

 

    "నేను హెంగ్ సరా? గండ్ సరా?" అంది మళ్ళీ.

 

    "ఏ బాష మీరు మాట్లాడేది?"

 

    "కన్నడం! మీకు కన్నడం వచ్చా?" అంది కావాలనే వత్తు వదిలేస్తూ.

 

    భరత్ మాట్లాడలేదు.

 

    "ఒక జోక్ ఉందండి! ఒకతను బెంగుళూర్ వెళుతూ కన్నడంలో 'ననగె గోత్తిల్లా' అనే ఒక్క మాట మాత్రం నేర్చుకుని వెళ్ళాడట. అంటే 'నాకు తెలియదు' అని అర్ధం. అక్కడ ఎవరు ఏమి అడిగినా 'ననగె గోత్తిల్లా' అనేస్తున్నాడట. ఒకరోజున అతను తెలియక సిటి బస్సులో ఎక్కి ఆడవాళ్ళ సీటులో కూర్చోబోయాదట. కండక్టర్ గద్దిస్తూ "నీవు హెంగ్ సరా? గండ్ సరా?" అని అడిగాడు. అంటే "నువ్వు ఆడా? మగా?"అని అర్ధం! అది తెలియని మనవడు అలవాటుగా ననగె గోత్తిల్లా' అనేశాడట. అలాగే మీరు .......హెంగ్ సరా? గండ్ సరా? మీరు ఆడపిల్లలా సిగ్గు పడిపోతుంటే , నేను మగరాయుడిలా ఫీలవుతున్నాను.'

 

    మనసైన వాడి దగ్గర ఆడపిల్లలు ఎంత అల్లరి చెయ్యగలరో , ఎంత చొరవగా టీజ్ చెయ్యగలరో అర్ధం అయింది భరత్ కి.

 

    "ఇంక వెళ్దామా?" అన్నాడు నెమ్మదిగా.

 

    "ఏం? ఇంటిమీద బెంగ పెట్టుకున్నారా? ఉండండి. మా తోటకి వచ్చిన తరువాత మీకు అతిధి సత్కారాలు చెయ్యకుండా ఎలా పంపుతాను? మా పనివాళ్ళు వంట మొదలెట్టేసి ఉంటారు. తినేసి ఏడు, ఏడున్నరకల్లా బయల్ద్రేరి వెళ్ళిపోదాం" అంది.


    భరత్ ఏదన్నా అభ్యంతరం ఆలోచించేటందుకు ప్రయత్నించే లోపలే , ఉరికే మాట వరసకి అన్నట్లు నాలుగు చినుకులు చిటపటమని పడి ఆగిపోయాయి. గాలి బరువుగా మారింది. మట్టి తడిసిన్ వాసన ఆహ్లాదకరంగా సోకింది.


    కోచేన్ లో వంట మొదలైయినట్లుంది. ఆకలి రేకెత్తించే సువాసనలు.

 

    భరత్ కూడా లేచి మొహం కడుక్కుని రిఫ్రెష్ అయ్యాడు. ఈ లోపల , బిస్కెట్లు, టీ వచ్చాయి. గానుగ చెట్టు కింద చిన్న టేబులు, కుర్చీలు వేసి టీ సర్వ్ చేశాడు హనుమాండ్లు.

 

    టీ తాగిన తరువాత తోట అంతా తిరిగి చూశారు. అక్కడక్కడ పెద్ద పాము పుట్టలు కూడా ఉన్నాయి తోటలో.

 

    కాటేజ్ తిరిగి వస్తూ యధాలాపంగా తన కారు వైపు చూసింది సుదీర. "అరెరే! అంటూ త్వరత్వరగా దగ్గరికెళ్ళి పరిశీలనగా చూసింది. ముందు టైర్ లో గాలి లేదు!


    "మైగాడ్! ఎలాగా ఇప్పుడు? స్పేర్ టైరు కూడా లేదే! ఎలా?" అంది.

 

    "ఎలా?" ఆన్నాడు భరత్ ఆదుర్దాగా.

 

    "ఒకే! సారధికి ఫోన్ చేద్దాం! సిటి నుంచి వేరే కారు పంపిస్తాడు"అంది సుదీర.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra