Home » Kommanapalli ganapathi rao » Goruvechani Suridu

    "మరో గంటన్నరలో న్యూయార్క్ నుంచి ఫోను చేస్తాడు సీగల్. "యూ ఆర్ రైట్ మిస్ కృషి చౌదరీ లేబరేటర్స్ వాళ్ళు లైసెన్సు కోసం అప్లయ్ చేసారు తప్ప ఇంకా లైసెన్సు పొందలేదు...    
    అంతే...    
    ఆమె పిడికిలి బిగుసుకుంది...    
    రామనాథచౌదరి ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు కోట్ల మంది ప్రజల్ని మోసగించడానికి సిద్దపడ్డాడు - లేనిది వుందని భ్రమింపచేస్తూ...    
    చేతికి చిక్కిన ఓ మారణాయుధాన్ని సంధించడానికి సిద్దమైంది కృషి.    
    కేవలం ఇరవై నాలుగుగంటల వ్యవధిలో...    
    ఇంకా పాతికేళ్ళ వయసైనా లేని కృషి ఎలాంటి సంచలనానికి కారణమైందీ అంటే చౌదరీ లేబరేటరీస్ పబ్లిక్ ఇష్యూ నిజాయితీ శంకించకూడదూ అంటే అమెరికా దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్స్ వుందో లేదో స్పష్టం చేయాలని.    
    పత్రికా ముఖంగా రామనాథచౌదరిని ఛాలెంజ్ చేసింది ఒక కోటీశ్వరుడి మనుమరాలు ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ కావడంతో మొత్తం పత్రికలు కవర్ చేసాయా వార్తని...తేలు కుట్టిన దొంగలా వుండిపోయాడు రామనాథచౌదరి.    
    పత్రికల్లో వచ్చిన వార్తకి కంపెనీ ప్రమోటర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో షేర్స్ కోసం అప్లయి చేయబోయిన జనం వెనక్కి తగ్గడమే గాక కొందరు స్టాక్ ఎక్స్ చేంజ్ బ్రోకర్సు న్యాయబద్దమైన జవాబు నర్దిస్తూ కోర్టుకి వెళ్ళారు....స్టే ఇవ్వబడింది ఇష్యూపై.    
    మరుసటి రోజు లోక్ సభలో ఫైనాన్స్ మినిస్టర్ని ఇదే విషయంపై నిలదీశారు ప్రతిపక్ష సభ్యులు...ఈ మధ్య కాలంలో దేశాన్ని అట్టుడికించిన స్కామ్స్  గురించి, బ్యూరో క్రాట్స్ వైఫల్యం గురించి ఊటంకిస్తూ ఇలాంటి విషయాల్ని తరచి చూడాల్సిన SECURITIES AND EXCHANGE BOARD OF INDIA చైర్మన్ మీద చర్య తీసుకోవాలని కేకలు పెట్టారు.    
    జరిగిన తప్పిదాన్ని అంగీకరించాడు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి...అంతే గాకుండా FDA లైసెన్స్ కోసం అప్లయ్ చేయటమే జరిగింది తప్ప చౌదరీ లేబ్స్ యింకా లైసెన్సు పొందలేదని తెలియచేస్తూ ఆ కంపెనీ మీద చర్యతో బాటు ప్రభుత్వంలో వారికి సహకరించిన అధికారుల్ని శిక్షించడం జరుగుతుందని హామీ యిచ్చాడు...దేశం మొత్తం చర్చించుకున్న సమస్య ఇది.    
    కృషి దెబ్బకి కంపించిపోయాడు చౌదరి. అది కాదు, కోట్లనష్టంతో ఆడదాన్ని చిన్న  చూపు చూడకూడదన్న సత్యాన్ని తెలుసుకున్న తొలి అనుభవమది.    
                              *    *    *    *    
    ఏప్రిల్ పదిహేనో తేదీ
    సాయంకాలం ఆరుగంటలు కావస్తూంది.    
    యూనివర్శిటీ ఆడిటోరియం విద్యార్ధులూ, పత్రికా విలేకర్లతో సందడిగా వుంది.    
    ఒక అరుదైన పోటీని తిలకించాలనే సంకల్పంతో నగర ప్రజలూ ఆరోజు అక్కడికి చేరుకున్నారు.    
    "డియర్ ఫ్రెండ్స్" ఢిల్లీ నుంచి క్విజ్ మాస్టరుగా వచ్చిన సత్యేంద్రబసు ప్రేక్షకుల్ని చూస్తూ అన్నాడు "దిసీజె రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్....ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఇద్దరిలో ఒకరైన మిస్ కృషి పుట్టింది కోటీశ్వరుల వంశంలో, పెరిగింది చదివింది స్టేట్స్ లో... రెండో వ్యక్తి మిస్టర్ విశ్వనాథ్...ఇక్కడ క్విజ్ కాంపిటీషన్స్ లో తరచుగా పార్టిసిపేట్ చేసే వ్యక్తి. "నౌ" వేదికపై కూర్చున్న ఇద్దరు పార్టిసిపెంట్స్ తో అన్నాడు. "సరిగ్గా మరో ఐదు నిముషాల్లో అంటే ఆరుగంటల పదిహేను నిముషాలకి పోటీ ప్రారంభమవుతుంది పోటీ గడువు అరవై నిముషాలు...ప్రశ్న అడిగేక జవాబు చెప్పడానికి యివ్వబడే గడువు పది సెకండ్లు మాత్రమే. ముందుగా ప్రశ్నలు అడిగేది మిస్ కృషి.   
    కృషి వెంటనే జోక్యం చేసుకుంది "లేడీస్ ఫస్టన్న సూత్రాన్ని మీరు ఫాలో అవ్వనక్కరలేదు. కావాలంటే విశ్వనాథ్ నే ప్రారంభించమనండి."    
    అప్పటికే అయిదు లక్షల రూపాయల చెక్కుని సత్యేంద్రబసు కిచ్చిన విస్సు అవహేళనగా అన్నాడు "క్విజ్ కాంపిటీషన్స్ అంటే అనుభవం లేని మిస్ కృషి ప్రారంభించడమే న్యాయమనుకుంటాను."    
    ఇక్కడ విస్సు కావాలని జాలి ప్రదర్శిస్తున్నట్టు మాట్లాడ్డం ఆమెకు నచ్చలేదు.    
    ఓ కాయిన్ గాలిలోకి ఎగరవేయబోతూ సత్యేంద్ర చూశాడు కృషి వేపు "టాస్" అందామె.    
    "హెడ్" అన్నాడు విస్సు తనకున్నది 'హెడ్' అన్న భావంతో వ్యంగ్యంగా తన తలవేపు వేలిని చూపిస్తూ.    
    ఆడిటోరియంలో కలకలం మొదలయింది.    
    'హెడ్' అన్నాడు సత్యేంద్రబసు కాయిన్ ఎగరేశాక ఫలితాన్ని నిర్ధారిస్తూ "ఇప్పుడు పోటీ ప్రారంభించాల్సింది మిస్టర్ విశ్వనాథ్" తన చైర్ లో కూర్చుంటూ "అరగంట గడువులో మీరు అడగాల్సింది సరిగ్గా ఇరవై అయిదు ప్రశ్నలు...ప్రశ్న అడగ్గానే పది సెకండ్ల లోగా జవాబు రానపుడు మీరే జవాబు చెప్పేయాలి. ఒక్కో జవాబుకి పది మార్కులు అరగంట తర్వాత మిస్ కృషి ఎంత స్కోర్ చేసిందీ చెబుతాను" రిస్టువాచ్ చూసుకుంటూ "స్టార్ట్" అన్నాడు.    
    రెండు సెకండ్ల విరామం...    
    తనకున్న మైండ్ పవర్ గురించి చాలా ధీమాని వ్యక్తం చేసిన కృషిని మొత్తం ఆ సబ్జక్టులోనే ప్రశ్నలడిగి కంగారు పెట్టాలనిపించిందేమో గొంతు సవరించుకుంటూ ప్రారంభించాడు విస్సు.    
    "మిస్ కృషి - అమెరికాకి చెందిన మొదటి ప్రామినెంట్ సైకాలజిస్ట్ ఎవరు. అతడు సైకాలజీ పై మొదట రాసిన గ్రంథమేది"   
    "విలియమ్ జేమ్స్... 1890 లో సైకలజీ గురించి అతడు రాసిన గ్రంథం పేరు ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ"    
    "సంగీతం మెదడుపై కలిగించే రసాయనిక ప్రభావం ఏమిటి"    
    "స్టేన్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ఫార్మకాలజిస్ట్ డాక్టర్ అప్రమ్ గోల్డు స్టిన్ థియరీ ప్రకారం యిష్టమైన సంగీతం విన్నప్పుడు మెదడు ఎండో ర్ఫిన్స్ వంటి రసాయనాన్ని విడుదల చేసి, ఆనందదాయకమైన ఆలోచనల్ని రేపుతుంది."    
    "రైట్...ఒకప్పటి సినీ నటుడైన మాజీ అమెరికా ప్రెసిడెంటు రోనాల్డ్ రీగన్ పై ఓ సినిమా ప్రభావంతో ఒక వ్యక్తి తుపాకీ పేల్చి గాయపరిచాడు. ఆ వ్యక్తిపేరు, ఆ సినిమా పేరు చెప్పండి"    
    "1981 మార్చి ముప్పయ్యో తేదీన రీగన్ గుండెల్లోకి బుల్లెట్ ని షూట్ చేసిన ఆ వ్యక్తి పేరు జాన్ హింక్లే. ఆ వ్యక్తిని ప్రభావితం చేసిన ఏంటీ హీరో పాత్ర వున్న ఆ సినిమా పేరు టాక్సీ డ్రైవర్."    
    "రైట్....పసికందు పుట్టుకలో ముందు తలమాత్రమే ఎందుకు వస్తుంది."        
    "గ్రేవిటేషనల్ ఫోర్స్" టక్కున చెప్పింది కృషి "గర్భంలో వున్న బిడ్డ తల బరువు మిగతా భాగాల కన్నా ఎక్కువ వుండటంతోనూ మొత్తం పొడవులో తల నాలోగో వంతు ఆక్రమించడంతోనూ ప్రసవంలో ముందు తలే బయటికి వస్తుంది"    
    "నైస్ మిస్ కృషి....సగటున మగాడి మెదడు బరువు మూడు పౌండ్లయితే స్త్రీ మెదడు బరువు రెండు పౌండ్లు మాత్రమే అంటే మెదడు విషయంలో మగాడికన్నా స్త్రీ తక్కువని మీరు అంగీకరిస్తారా"    
    "లేదు" విస్సు గొంతులోని ఎగతాళికి జవాబుగా తనూ వ్యంగ్యంగా అంది "మెదడు బరువుకి మేధస్సుకి సంబంధం లేదు మిస్టర్ విశ్వనాథ్. మనిషి శరీర పరిమాణాన్నిబట్టి మెదడు నిర్ణయించబడుతుంది. సహజంగా మగాడి శరీరం కాస్త భారీగా వుంటుంది కాబట్టి అదే నిష్పత్తిలో మెదడు పరిణామం వుంటుంది. అలానే స్త్రీలలో కూడా..."    
    "స్ప్లెండిడ్" కృషి తను అనుకున్నంత బలహీనురాలు కాదని బోధపడిన విస్సు కాస్త జటిలమైన ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. "తలకి గాయమైన మగాడిలో సెక్స్ లో ఆసక్తి తగ్గే అవకాశముందని నిరూపించిన బ్రెయిన్ రిసెర్చర్ ఎవరు."    
    స్తబ్దంగా వుండిపోయింది. విస్సు పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి. ఒకటీ, రెండు పది సెకండ్లు గడిచాయి.    
    క్విజ్ మాస్టర్ బజర్ మోగించగానే చెప్పాడు విస్సు.    
    "మాసాచు సెట్స్ జనరల్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ విలియమ్ క్రోలీ." కృషిని తదేకంగా చూస్తూ అడిగాడు నిన్ను "మనిషి తొలిసారిగా వినేది ఎప్పుడు"    
    "తల్లి గర్భంలో పిండంగా రూపుదిద్దుకున్న ఇరవై వారాలకి అంటుంది సైన్స్"    
    "రైట్....సెన్సాఫ్ స్మెల్ మగాళ్ళకన్నా స్త్రీలలోనే ఎక్కువంటుంది కారణం?"    
    "స్త్రీలలో వుండే హార్మోన్ ఈస్ట్రోజన్ స్థాయిని బట్టి ఘ్రాణశక్తి నిర్ణయించబడుతుంది. మగాళ్ళకన్నా స్త్రీలు అధిక ఘ్రాణశక్తీ కలిగి వుండటానికి కారణం ఈస్ట్రోజన్ అంటుంది సైన్స్."    
    "ఊరగాయలు ఐస్ క్రీముల్లాంటి చిత్రమైన కాంబినేషన్స్ ఎన్నుకుంటుంటారు గర్భవతులైన స్త్రీలు. కారణం చెప్పండి"    
    "గర్భం ధరించిన స్త్రీ కన్నా గర్భవతి కాని స్త్రీకి రెండు వేల రెట్ల ఘ్రాణశక్తి ఎక్కువంటుంది సైన్స్. గర్భవతులైన స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయి చాలా దారుణంగా పడిపోతుంది కాబట్టి ఘ్రాణశక్తి తగ్గిపోతుంది. నాలుక చిత్రమైన రుచుల్ని కోరుకుంటుంది."        
    "సంతానంలో ఏ బిడ్డ ఐక్యూ రీత్యా వున్నతుడవుతాడు."    
    "మిచిగాన్ సైకాలజిస్ట్ రాబర్ట్ బి జాజన్ థియరీ ప్రకారం అందరిలో పెద్ద పిల్లాడే 'IQ' రీత్యా బెటరుగా వుంటాడు. కారణం అతడి కన్నా పెద్ద పిల్లలు ఆ యింటిలో వుండరు కాబట్టి పెద్దల ఆలోచనల సరళితోనూ, తెలివితోనూ ఎక్కువగా సంపర్కం వుంటుంది కాబట్టి."    
    'బాప్ రే' అనుకున్నాడు విస్సు. ఆదిలో పెద్ద స్పందన లేకపోయినా కృషికి అనుకూలంగా విద్యార్ధులు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు వున్నట్టుండి.    
    కృషిని ఇబ్బంది పెట్టాలీ అంటే యిది కాదు పద్దతి అనుకున్నాడేమో టక్కున అడిగాడు "హరికథా పితామహుడైన ఆదిబట్ట నారాయణ దాసు పుట్టింది ఏ వూర్లో."    
    "శ్రీకాకులం జిల్లాల్లోని అజ్జాడ గ్రామంలో"    
    ఇబ్బందిగా చూశాడు విస్సు....ఎక్కడో అమెరికాలో చదివి తిరిగి వచ్చిన కృషి ఇలా తెలుగు రాష్ట్రంలోని పల్లెటూర్ల గురించి మాట్లాడడం బొత్తిగా నచ్చడం లేదు.    
    "ఎన్ సైక్లోపిడియా అన్నది మౌలికంగా ఏ భాషకి చెందిన పదం"    
    "అది గ్రీక్ పదం....దానికి అర్ధం జ్ఞానచక్రం"    
    "తమలపాకులలో వున్న విటమిన్లు?"    
    'ఎ', 'సి' విటమిన్లతో బాటు ప్రోటీన్లు. కాల్షియం, భాస్వరం కూడా వున్నాయి."    
    "తమలపాకులకి దారుణంగా అలవాటుపడి ఓ దశలో డబ్బుల్లేక రాజముద్రికని, కిరీటాన్ని తాకట్టు పెట్టి తమలపాకుల్ని తెప్పించుకున్న రాజెవరు..."    
    "పదకొండో శతాబ్దంలో కాశ్మీరుని పరిపాలించిన రాజు అనంత"            
    "తల స్నానానికి షాంపు వాడుతుంటారుగా అసలు షాంపూ అనే పదానికి మూలం ఏమిటి."    
    క్షణం ఆగి చెప్పింది కృషి "జుట్టుని పాయలుగా విడదీసి కలిపి రుద్ది దువ్వే ప్రక్రియని 'చంప్' నా అంటారు హిందీలో....షాంపూ అనే పదానికి మూలం ఈ చంప్ నాయే    
    క్రమంగా సహనాన్ని కోల్పోతున్నాడు విస్సు.    
    "భారత జాతీయ పతాకంలోని అశోకచక్రంలో ఎన్ని గీతలుంటాయి."
    "ఇరవై నాలుగు"    
    "పందులు సాధారణంగా ఎంత కాలం గర్భంతో వుంటాయి."    
    "మూడు నెలల మూడు వారాల మూడు రోజులు."        
    "తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హీ ఆజాద్ దూరంగా అన్న నినాదాన్నిచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు."    
    "సుభాష్ చంద్రబోస్."    
    "ప్రతి చిన్న విషయానికీ కళ్ళనీళ్ళు పెట్టుకునే స్త్రీల కళ్ళల్లో ఆ నీళ్ళు రావటానికి కారణమైన గ్రంథులేవి"    
    "కన్నీళ్ళన్నవి కేవలం ఆడవాళ్ళకి పరిమితం కాదు మిస్టర్ విస్సు - ఓడే స్థితి వస్తే మగాడికి కన్నీళ్ళు తిరుగుతుంటాయి" విస్సు ప్రస్తుత స్థితి నుద్దేశించి మాట్లాడుతున్నట్టుగా అంది "కమింగ్ టుది పాయింట్ - కన్నీళ్ళు రావటానికి కారణమైన గ్రంథులు లాకైమల్ గ్లేండ్స్."    
    "టిగ్రెనియాభాష ఏ దేశానికి చెందింది."    
    "ఇథియోపియా..."    
    "స్వామి వివేకానంద అసలు పేరు"    
    నిశ్శబ్దం...గుర్తు చేసుకునే ప్రయత్నం చేసినా స్ఫురించక పోవడంతో "పాస్" అంది కృషి.    
    "నరేంద్రనాథ్ దత్తా" అన్నాడు విస్సు.    
    కృషిలో ఏ సంచలనమూ లేదు. చాలా మామూలుగా వుంది అంటే - గెలిచే తీరుతానన్న నమ్మకమా.    
    "నువ్వటే" సీరియస్ గా అన్నాడు కృషిని చూస్తూ "పువ్వులాంటి వయసు నవ్వులంటిన సొగసు రువ్వి నా యెదపాయను పర్వులెత్తావటే - నువ్వటే". క్షణం ఆగి "ఇది మీ గురించి నేను భావుకంగా మాట్లాడ్డం కాదు మిస్ కృషీ.... ఓ ప్రముఖ జానపద గీతం ఇది...రాసిందెవరో చెప్పండి."    
    "బాపిరాజు" చెప్పేసింది కృషి నిశ్చలంగా.    
    విస్సు నుదుట స్వేదం పేరుకుంది.   
    "మొదటి రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ గ్రహీత ఎవరు"    
    "విశ్వనాథన్ ఆనంద్"        
    "పృధ్వీ క్షిపణి రూపశిల్పి ఎవరు"    
    "డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్"    
    "నిద్రపోయేటప్పుడు పాము ఎందుకు కళ్ళు మూయదు."    
    "అవాక్కయి చూసింది కృషి."    
    పది సెకండ్లు గడుస్తూండగా బజర్ మోగడంతో చెప్పాడు విస్సు "పాము నిద్ర పోయేటప్పుడు కళ్ళు మూయదు - దానికి రెప్పలు లేవు కాబట్టి"    
    పాతిక ప్రశ్నలు పూర్తయిన సూచనగా పైకి లేచిన సత్యేంద్రబసు మైక్ లో అనౌన్స్ చేశాడు. "మిస్టర్ విశ్వనాథ్ నిబంధనల మేరకు అడిగిన ప్రశ్నలు ఇరవై అయిదు. అందులో మిస్ కృషి చెప్పలేక పోయిన జవాబులు మూడు మాత్రమే. సో....హెర్ స్కోర్ యీజ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ."   
    ఆడిటోరియం కరతాళధ్వనులతో ప్రతిధ్వనిస్తూండగా అన్నాడు సత్యేంద్ర "నౌ దిసీజ్ ద టర్మ్స్ ఆఫ్ మిస్ కృషి ప్లీజ్ స్టార్ట్ మిస్ కృషి"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra