Home » D kameshwari » Manasuna Manasai


    'ఓ అదా అర్ధం అయిందిలే...' ఇంకా ఏదో చెప్పేలోగా జయంతి ఇల్లు వచ్చింది- జయంతి డోరు తెరిచి దిగి 'థాంక్స్ ఫర్ ది లిఫ్ట్- గుడ్ నైట్' అంది దివాకర్ వంక చూసి.... 'ఓ నో.... ఇట్స్ మైప్లెజర్, గుడ్ నైట్' అంటూ కారు ముందుకు ఉరికించాడు. 'ఊ... ఏమిటి చెప్పు ఇందాక ఏదో అంటున్నావు'    
    'అబ్బా ఏంలేదు, మా ఆవిడ ఉద్దేశం.... వాళ్ళ అక్కయ్య ఏకాంతం మనం పాడుచేశామని....మీ ఇద్దరూ సరదాగా వెళ్ళకుండా మేం పానకంలో పుడకల్లా ఉన్నామని...' హాస్యంగా అన్నాడు. 'అవునా, అంతేనా' అన్నాడు దమయంతితో.
    'అసలేమిటి మీ ఇద్దరి సంగతి- ఏదో మేం ఇద్దరం లవర్స్ అన్నట్టు మాట్లాడేస్తున్నారు...'
    'లవర్స్ కాకపోయినా అవాలని మా ఆశ, కోరిక....' హాస్యంగా అన్నాడు.
    'ఏడిశావులే.... లేనిపోని ఊహలన్నీ నా బదులు నీవే ఊహించేస్తున్నావు. ఒక లేడీతో  కలిసి కారులో వస్తే ప్రేమించేసి నట్లేనా.... పట్టుమని మా పరిచయం వారం రోజులేనా కాలేదు- ఇలా ఊదరగొడ్తున్నావు... మాకేంలేదు, మధ్యన నీ గోల ఏమిటి?'
    'ఓకే మైబాయ్- టేక్ యువర్ ఓన్ టైమ్. కాని రిజల్ ఫేవరబుల్ గా వుంటే సంతోషిస్తాం- స్నేహాన్ని చుట్టరికంగా మార్చుకుంటే సంతోషిస్తామని చెప్తున్నాను..... ఆపు.... ఆపు మా ఇల్లు దాటిపోయాం!' అన్నాడు కారు డోరు తీస్తూ.
    'ఓకే గుడ్ నైట్' అంటూ బయలుదేరాడు దివాకర్.
    
                                       * * *
    యింటికెళ్ళిన జయంతికి చాలా సేపటివరకు నిద్రపట్టలేదు. ఆసాయంత్రం ఆ పార్టీ, ఖరీదయిన వాతావరణం స్నేహపూరిత పరిచయాలు, జోకులు... ఎంతో బాగ అన్పించింది. తను కోరుకున్న జీవితం యిలాంటిదే. యిలా కారుల్లో తిరుగుతూ పార్టీలకి వెళుతూ, స్నేహితుల మధ్య మనసుకి నచ్చిన వారితో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయాలన్న తన కోరిక తీరుపోతుందా. లోయర్ మిడిల్ క్లాసునుంచి అప్పర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసుకి వెళ్ళలేక మధ్య నలిగిపోతూ ఏ కోరికలు ఆశలు తీరక చాలీ చాలని బతుకులతో వంద రూపాయలు ఖర్చుపెట్టాలంటే పదిసార్లు ఆలోచించే జీవితలుప్ జీతాలు ఎంత తెచ్చుకున్నా అవసరాలకే సరిపోతూ లగ్జరీస్ అందని బతుకులు ఓ టి.వి, స్కూటరు, మిక్సి లాంటి నిత్యావసరాలు తప్ప హోటళ్ళు, పార్టీలు, ఖరీదయిన నగలు, చీరలు, కారులు అందుకోలేని నిస్సహాయత తమది. తనకి అలాంటి జీవితం అక్కరలేదు. యిద్దరూ ఉద్యోగస్థులయి మంచి యిల్లు, కారు, కనీసం వారానికో సారి ఏహోటల్ లో వెళ్ళి తింటూ, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు, పిక్నిక్ లు అలాంటి జెవెఇథమ్ కావాలి. దివాకర్ మరీ శ్రీధర్, రాహుల్ వాళ్ళలా డాలర్లలొ ఐశ్వర్యం మద్య మునిగి తేలకపోయినా తమకంటే మంచి అంతస్థుంది. ఆఫీసరు రేంకు, కారు అది వుంది. ఉషారాణి బాగుంటుంది. వాళ్ళ ఫేమిలీకి డబ్బు వుంది కనక అమెరికా సంబంధం వచ్చింది అదృష్టవంతురాలు. తను మరీ అంత ఆశకి పోలేదు, దివాకర్ లాంటి వాడు చాలు తనకి. తన కోరిక తీరబోతుందేమో. అందుకే యీ పరిచయం కలిగిందేమో. భావిక ఎంత అందంగా, నాజూగ్గా వుంది. మెరిసిపోయే రంగు, తళతళలాడే నగలు, నాజూకయిన వేళ్ళకి, చెవులకి రవ్వల నగలు, అడ్రస్సులు....ఎంత అదృష్టం....! పెట్టి పుట్టడం అంటే అదేనేమో! రాహుల్ ఎంత లక్కి ఎంత అపురూపంగా చేసుకుంటాడో ఆమెని. ఛా.... అసలు తెలుగు వాళ్ళలో మంచి రంగే వుండదు వాళ్ళమధ్య దమయంతి గోపాలకృష్ణ! తను ఎంతో తక్కువ మనుష్యుల్లా కనిపించారు కాని పాపం శ్రీధర్, రాహుల్ వాళ్ళు అందం, పట్టించుకోలేదు. ఎంత సరదాగా గడిపారు. యీ గోపాలకృష్ణ తన రూపంతో ఏం ఇన్ ఫీరియారిటీ ఫీలవడు కాబోలు. అందరితో చనువుగా పూసుకు తిరుగుతాడు. అందరూ అతని కంపెనీ ఎంజాయ్ చేస్తున్నారు కూడా. దమయంతి మొగుడి మాటలకి జోకులకి మురిసిపోతుంది పెద్ద గొప్పగా, ఇంతటి మొగుడ్ని చూసుకుని, పైగా తను చాలా పోగొట్టుకుందని చెప్పడం కూడాను. అదో పిచ్చి మొద్దు. దొరికిన  దానితో సంతృప్తి దానికి, చిన్నప్పటినించి అంతే అది. లైఫ్ లో ఏంబిషన్ అంటూ ఏం లేదు. చాలా సేపు నిద్ర పట్టేవరకూ దివాకర్ తనతో మాట్లాడిన మాటలు, అతని చూపులలో అర్ధాలు అన్నీ తనకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అతనన్నట్టు వారం రోజులకే అతనేం అభిప్రాయం ఏర్పరచుకుంటాడు. యీ పరిచయం పెంచుకోడానికి తను ఏం చెయ్యాలి. మరీ బైటపడిపోయి అతని దృష్టిలో చులకన అయిపోకూడదు. ప్రపోజల్ అతని నించి రావాలిగాని తను అడిగితే లోకువయిపోతుంది. చూద్దాం, కొన్నాళ్ళు పోయాక యీ పరిచయం ఎలా దారితీస్తుందో! ఉషారాణి వుంటే కాస్త చనువుగా దివాకర్ ని నిలదీసి సజస్ట్ చేసేది. ఇంకో పదిహేను రోజులలో వెళ్ళిపోతుంది. యిటు గోపాలకృష్ణకి మిత్రుడైనా తను అతని సాయం ఎలా అడుగుతుంది. చచ్చినా అడగకూడదు. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.
    
                                     * * *
    
    ఆ రాత్రి వాసంతికి నెప్పులు వస్తే నర్సింగ్ హోముకి తీసికెళ్ళారు. తెల్లారి ఆరు గంటలకి పురుడు వచ్చి కొడుకు పుట్టాడు. దమయంతికి ఫోనుచేస్తే వచ్చి నర్సింగ్ హోములు లో కూర్చుంటే పద్మావతి ఇంటికెళ్ళింది పని చూసుకోడానికి. పదిగంటల వేళ వాసంతి "జయంతికి ఫోన్ చేసి చెప్పవే, పాపం అది అలా ఒంటరిగా వుంది. ఈ కబురు చెప్పిరా బ్యాంకుకి వచ్చి వుంటుంది. నేను రమ్మన్నానని చెప్పు' అంది. 'ఆ.... నేనే పదిన్నరకి వెళ్ళి ఫోను చేద్దామనుకున్నాలే....!' అంది దమయంతి. ఆ రోజుకి దమయంతి స్కూలుకి సెలవు పెట్టింది. గోపాలకృష్ణ ఆరోజు సెలవు పెట్టాడు. అతనికి పెళ్ళి తరువాత హైదరాబాదుకి అనుకోకుండా ట్రాన్స్ ఫర్ రావడంతో అతని ఆనందానికి అంతులేదు. దమయంతిని ఉద్యోగం మాన్పించి తీసికెళ్ళి వరంగల్ లోనే ఏదన్నా స్కూలులో ప్రయత్నించాలి. ఏం చెయ్యడం...పాపం ఐదేళ్ళ సర్వీసు పోతుంది. అన్న ఆలోచనలో పడ్డాడు  దమయంతి మాత్రం ఉద్యోగం మానేయడానికి తయారైంది. 'చూద్దాం.... అవసరం అయితే ఓ నెల రెండు నెలల సెలవు పెట్టి ఈ లోగా నేను ట్రాన్స్ ఫర్ కి ప్రయత్నిస్తా అన్నాడు. కాని ఈ లోగానే లక్కీగా అతనికి ట్రాన్స్ ఫర్ రావడంతో సమస్య తీరిపోయింది. దమయంతి ఆస్పత్రిలో కూర్చుంటే అతను ఇంటికెళ్ళి పద్మావతి ఇచ్చిన కాఫీ, టిఫిను, వాసంతికి, పిల్లాడికి కావాల్సిన వేనీళ్ళు, పాలు అవితీసుకు వచ్చాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra