Home » Yerramsetti sai » Bomma Borusu


    "అసలు నువ్వు మీ ఇంటికి ఎందుకువెళ్ళాలనుకుంటున్నావో చెప్పు!" రాజీ కొస్తున్నట్లు అడిగాడతను.
    "నాకు మీ ప్రవర్తన అసహ్యం కలిగించింది. మీ చేష్టలమూలాన నా మనసుకి శాంతి లేకుండా పోయింది. కొంతకాలంపాటు మీకు దూరంగా ఉంటేనేగాని, మనశ్శాంతిదొరకదు...." స్పష్టంగా మాట్లాడిందామె.
    "నాప్రవర్తన నీకు అసహ్యింకలిగించింది. నిజమే! మరి నీ ప్రవర్తనా నాకు అసహ్యం కలిగిస్తుందేమోనని ఎప్పుడయినా ఆలోచించావా?"
    "మీ మనసుకి మీకు తెలుసు ఎవరి ప్రవర్తన ఎలాంటిదో!"
    "సరే అదలా ఉండనీ! రాత్రితప్పెవరిదంటావ్?"
    "నిస్సందేహంగా మీదే!"
    "నాదా?"
    "మీరు మనస్ఫూర్తిగా అడుగుతున్నారా ఈ ప్రశ్న?"
    "అవును! నా ప్రవర్తనలో నాకేమీ లోపం కనిపించటంలేదు?"
    "అంటే నాదే తప్పంటారా?" దెబ్బతిన్నట్లు చూస్తూ అడిగిందామె.
    "ముమ్మాటికి నీదే తప్పు! నీ కసలు అంత మొండి పట్టుదల ఏమిటి? నేనేమీ కోరరానికోరిక కోరలేదే?"
    "మీరుతాగి వచ్చినప్పుడు ఆ వాసన నాకు వెగటుకలిగిస్తుందని అదివరకే మీతో ఒకటి రెండు సందర్భాల్లో చెప్పాను. అయినాగాని మీరు అలాంటి సమయాల్లోనేనన్న ఎందుకు బలవంతం చేయాలి?"    
    "ఎలాగోలా నువ్వు కొద్దిసేపు ఎందుకు ఎడ్జస్టు అవకూడదు?"
    "అంటే నేను మనిషిగా మీకు కనిపించడంలేదన్నమాట! మీ ఉద్దేశ్యంలో పెళ్ళామంటే ఓ బొమ్మ! ప్రాణం, మనసూ, హృదయం ఏమీలేని ఓ రాయి! ఆ రాయితో మీ ఇష్ట మొచ్చినట్లు మీరు ఆడుకుంటారు. అంతేనా?"
    "నువ్వలాంటి సబ్జెక్టుమీద ఉపన్యాసాలుదంచేయగలవని నాకు తెలుసు. ఇదేమీ బావలాంటివాజమ్మ ఎవరయినా అయితే నీ ఉపన్యాసానికి ముగ్ధుదయిచప్పట్లు కొట్టినిన్ను నెత్తిన పెట్టుకుని పరిచర్యలు చేసే వాడేమో! కానీ నీ దురదృష్ట వశాత్తూ నాక్కొంచెం తెలివితేటలున్నాయ్. నిన్ను సరయిన దారిలోపెట్టగల శక్తి వుంది...."
    "ఇప్పుడు మా బావ సంగతెందుకూ? బావ మీలాంటి సంస్కారం లేని మనిషి మాత్రం కాదు."
    "ఓహో! బావ సంస్కారం మీద ఇప్పుడు మోజు ప్రారంభమయిందన్నమాట! దూరపు కొండలు నునుపని ఊరికే అనలేదు".
    ఆమెకు ఇంక మాట్లాడడం ఇష్టం లేకపోయింది.
    శ్రీనివాసరావ్ కొద్దిక్షణాలు ఆమెవంకే చూస్తూ కూర్చుండిపోయాడు. ఆమె తనంటే ఎందుకింత నిర్లక్ష్యంగా, మొండిగా ప్రవర్తిస్తోందా అని ఆశ్చర్యంగా ఉందతనికి. అలాంటివైఖరి అవలంభించేభార్యను సహించడం ఎవరికయినా కష్టమే! నిజానికి ఆమెను హింసించాలనీ, ఆమె మనసు నొప్పించాలనీ తన అభిమతం కానే కాదు. అసలామెను ఏరికోరి వివాహం చేసుకొన్నదెందుకు? ఆమెను మొదటిచూపులోనే ప్రేమించిందెందుకు? ఆమెచేత అంతగా ఆకర్షింపబడి దగ్గరవాలని తహ తహలాడిందెందుకు? ఆమెనిలా ట్రీట్ చేయడనికా? ఊహూ! కాదు ఆమె సాన్నిధ్యంలో జీవితం ఆనందమయం చేసుకోవాలనీ, ఆమెను పూలల్లో పెట్టి పూజించుకోవాలనీ ఆశించాడతను. ఆమె తనకు దక్కితే ప్రపంచంలో తనింకేమీ కోరుకోడనీ. తనకింకే సుఖమూ అవసరంలేదనీ అనుకున్నాడు. ఆమెను ఓ దేవతగా ఆరాధించి, ఆనందించాలని ఉబలాటపడ్డాడు. కానీ ఇప్పుడేమయింది? ఎందుకిలా జరుగుతోంది? ఆమె తననింత హీనంగా లెక్కలేకుండా ఎందుకు చూస్తోంది? తనను ఓ మృగంలా ప్రవర్తించేందుకు ఎందుకు పురిగొల్పుతోంది? తననెందుకు రెచ్చగొట్టి, హింసించి తను హిసించబడుతోంది? ఎక్కడుంది లోపం? లోపం ఆమెదా? తనదా? ఇద్దరిదీనా?
    ఆ లోపం సరిచేసుకోవడానికి వీల్లేనిదా? జీవితాంతం ఇలాగే ఒకరినొకరు అలక్ష్యపరుస్తూ, నిందించుకుంటూ, వాదించుకుంటూ, దెబ్బలాడుకుంటూ గడపాల్సిందేనా? ఇద్దరూ కలిసి ప్రయత్నించిన సమన్వయం కుదుర్చుకోలేరా?
    "హేమా!" సౌమ్యంగా పిలిచాడతను.
    "ఊ!"  "ఏమిటాలోచిస్తున్నావ్?"
    "......"
    "నీకింకా కోపం పోలేదు కదూ?"
    "...."
    "జరిగిందేదో జరిగిపోయింది. ఆలోచిస్తే రాత్రి సంఘటనలో మనిద్దరిదీ తప్పుందనిపిస్తోంది నాకు? ఏదేమయినా చివరికి నీ పంతమే నెగ్గిందికదా! ఇప్పుడింక మీ ఇంటికివెళ్ళడమెందుకు?"
    "కొద్దిరోజులు ప్రశాంతంగా గడపాలని ఉంది నాకు..."
    అతనామె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. "కోపం అనేది ఎక్కువసేపు వుండకూడదు హేమ! ఎప్పటికప్పుడు చల్లారిపోతేనే అది ఆనందాన్నిస్తుంది ఎంతకీచులాడుకున్నా మనమే మళ్ళీ ఒకటవాలిగాని ఇలా పట్టుదలతో వ్యవహరిస్తే ఎలా?" ప్రాధేయపూర్వకంగా అన్నాడతను.
    "నేనేం శాశ్వతంగా మిమ్మల్ని వదిలిపోవడంలేదుగా! కొద్దిరోజులు మాఇంటి దగ్గర ఉండివస్తానంటున్నాను దీనికోసం మీరింతగా ఆలోచించాల్సిన అవసరమేముందీ?"
    "పోనీ ఓ పనిచెయ్! నీకు అంతగా వెళ్ళాలని ఉంటే కొద్దిరోజులాగు! నేనూ నీతోపాటు వచ్చినిన్ను డ్రాప్ చేసి తిరిగి వస్తాను. ఇలా హఠాత్తుగా, నీదారిన నువ్వు వెళ్ళడంవల్ల మీ వాళ్ళకిగానీ, మరొకరికిగానీ మన విషయాలు అనుమానం కలిగించవచ్చు అది నాకిష్టంలేదు. మన మధ్యనేమయినా అభిప్రాయభేదాలుంటే అవి మన మధ్యేసమసిపోవాలి మరొకరికి తెలీకూడదు..."
    ఆమెకేం చెప్పాలో తెలీడంలేదు. అసలతని మనస్తత్వమే అంతు బట్టటంలేదు. అంతలోనే మంచితనం, అంతలోనే పశుత్వం ఏం చేయాలీ మనిషితో! ఎంతకాలం సహించగలదీ వైరుధ్యం?
    "హేమా! ఎలాగూ నేనాఫీసుకి వెళ్ళటంలేదివాళ! మనం ఏదయినా సినిమా కెళ్దామా?" అడిగాడతను.
    ఆమెకునవ్వాలో ఏడవాలో తెలియటంలేదు. ఇంతవరకూ జరిగిన దంతా అంతతేలికగా తుడిచివేయగలుగుతున్నాడా అతను? ఎలా సాధ్యమవుతుందతనికి? ద్వంద్వ వ్యక్తిత్వం అంటే ఇదేనా? అతనికి సిగ్గులేకపోతే తనకు లేదా? తననో వ్యభిచారిణిలా భావిస్తున్నాడా ఏమిటి అతను?
    "నేనురాను!" కటువుగా అందామె.
    "ఎందుకని?" భుజం మీద చేయివేసి ఆమెను దగ్గరకు లాక్కుంటూ అడిగాడు.
    "నాకు రావాలని లేదు....."
    'ఎందుకని లేదు"
    "ఇంట్లోలేని అన్యోన్యత బయట ఉన్నట్లు ప్రదర్శనలెందుకు?"
    "అందుక్కాదు! కొద్దిసేపయినా మనం ఈ ఆలోచనలనుంచి బయటపడి, మనగొడవలను మర్చిపోవచ్చని!"
    "వద్దండీ! నాకిష్టంలేదు".
    "ప్లీజ్! హేమా! కాదనకు...." బ్రతిమలాడసాగాడతను అతన్నెలా కాదనాలో తెలీడంలేదు. అసలతనిని అర్ధం చేసుకోవడమే చాత కావడంలేదు తనకి.
    "నేనురాలేనండి! నన్ను విసిగించకండి" ఆపేసి అక్కడినుంచి లేచి గదిలోకినడిచిందామె. శ్రీనివాసరావుకి ఏం చేయడానికీ పాలుపోలేదు. ఆమె మీద కోపం అసహ్యంరెండూ కలుగుతున్నాయ్. తను ఇంతగా బ్రతిమాలినా ఆమె తన మొండిపట్టుదలవదలడం లేదంటే ఆమె కెంత పొగరుందో తేలిగ్గా ఊహించవచ్చు. తనొక్కడే పార్కుకివెళ్ళి చాలాసేపు అక్కడేగడిపి అర్దరాత్రికి ఇల్లుచేరుకున్నాడతను. వచ్చేసరికి ఆమెఇంకా మేల్కొనే వుంది.
    "హేమా! ఇంకా నిద్రపోలేదూ?" ఆదుర్దాగా అడిగాడతను. అంతవరకూ ఆమె మీద పేర్కొన్నకోపం మంచులా కరిగిపోయింది.
    "ఊహు!".
    "ఎందుకని? మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు కదూ?" ఆమెను దగ్గరకుతీసుకుంటూ అడిగాడతను. "వదలండి! నామనసు బావుండలేదు!" అతనికి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తూ అందామె.
    "ఊహు! నిన్న బ్రాందీవాసన అన్నావ్! ఇవాళేమో మనసుబావుండలేదంటున్నావు. అసలు నీ ఉద్దేశ్యమేమిటి? సెక్స్ అంటే ఇష్టంలేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావ్?" ఆమెను మరింత దగ్గరకు లాక్కుంటూ అన్నాడతను.
    "ఈరోజుకి వదిలేయండి" బ్రతిమాలుతూ అందామె.
    "ఊహు! ఏమైనా సరే ఇవాళ వదిలేదిలేదు" ఆమెను తనలో ఐక్యం చేసుకోవడానికి ప్రయత్నించసాగాడతను. ఆమె కళ్ళవెంబడినీళ్ళు తిరిగినయ్! "సరే! మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి! మీలాంటిరాతి మనుషులకు కావలసింది ఈ శరీరమే. మనసుతో పనిలేదు. అవతలి వ్యక్తి ఆనందంతో అవసరం లేదు. "కళ్ళు మూసుకుని అతనిచేతుల్లో నిస్సహాయంగా నలిగిపోసాగిందామె. మర్నాడు అతను ఆఫీసుకు సిద్దమవుతూ ఆమెను పిలిచాడు.
    "ఏమిటి?" అతని దగ్గరకొచ్చి అడిగింది ఆమె.
    "నా బట్టలేవీ?" అల్మారాలో వెతుకుతూ అడిగాడతను.
    "అన్నీమాసే ఉన్నాయ్. చాకలిరావడంలేదు."
    "చాకలిరానప్పుడు నువ్వే ఎందుకు ఉతకలేదు...."
    "నాకుసరిగ్గా ఉతకటంరాదని ఊరుకున్నాను".
    "ఉతకటంరాదా?" ఆమె అబద్దంచెబుతోందన్న అనుమానంతో అడిగాడతను."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra