"అయ్యగారు పిలుస్తున్నారమ్మా!" పిచ్చయ్య వచ్చిచెప్పాడు. ఆమె లేచింది. కాని అతడు లేవలేదు. "రా! రవీ!" "మర్యాద కాదు. పిలిచింది నిన్ను. నేనోచ్చానని చెప్పు. ఆయన పిల్చాకవస్తాను". "నో ఫార్మాలిటీస్! యూ కెన్ కం రవీ!" "అలా జొరబడటం సభ్యత కాదు. ఆయన ముందుగా నీతో ఏదైనా మాట్లాడాలనుకోవచ్చు". "అబ్బ. నీకు చెప్పాలంటే ఆ దేవుడు దిగి రావాలి" విసుగ్గా అంది మహతి. "ఈ దేవికి చేతగానిది ఆ దేవుడు ఏం చెయ్యగలడు!" అమాంతంగా అతడ్ని కౌగిలించుకోవాలనిపించింది ఆమెకు. పిచ్చయ్య ఇంకా డోర్ తెరిచిపట్టుకొని నిల్చునే ఉండటాన్ని చూసింది మహతి. లేచిలోపలకు వెళ్ళింది. గది గడపలోనే నిలిచిపోయి ఆశ్చర్యంగా చూసింది. "వచ్చే శుక్రవారం తీసుకురండి. అంతవరకూ ఈ మందులు వాడండి" "శుక్రవారం ఆయనిక్కడకొస్తాడా?" నుదుటి మీద తెల్లటి బ్యాండేజి ఉన్న యువతి ఉద్రేకంగా అడిగింది. "ప్రయత్నం చేస్తానమ్మా" ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నింపాదిగా జవాబుగా చెప్పాడు డాక్టర్ పరశురాం. "అట్లంటే కుదర్దు. తప్పకుండా తీసుకురావాలి. ఆ రౌడీలు ఆయన్ను ఏం చేశారో ఏమో? నాకు భయంగా ఉంది". "దేవయానీ! డాక్టరు గారు చెప్తున్నారుగా? ఆయనమాట విను" అంటూఆమె రెక్క పట్టుకొన్నాడు ఆమె పక్కనే ఉన్న పెద్దమనిషి. "మధ్యలో నువెవడివయ్యా?" ఆ యువతి అతడిచేతిని విదిలించికొట్టింది. "అవునమ్మా, నా మాట నమ్ము. మీ వారిని తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్తున్నాగా? నువు ధైర్యంగా ఉండు" పరశురాం ఆమె భుజంతడుతూ అన్నాడు.    
    "మిమ్మల్ని నమ్మిపోతున్నా! ఊ మరి!" ఆమె దీనంగా జాలిగా పరశురాం కేసి చూసింది. పక్కనే ఉన్నాయనపై పంచ తలకు చుట్టుకున్నాడు. ఆమె రెక్క పట్టుకొని బయటికి తీసుకెళ్ళాడు. పరశురాం పెద్దగా నిట్టూర్చి కుర్చీలో జారగిలపడ్డాడు. ఎదురుగానిల్చుని ఉన్న మహాతిని చూశాడు. "హల్లో! బేబీ! అక్కడే నిలబడిపోయావేమిటి? రా! రా! ఇలా వచ్చి కూర్చో!". డోర్ పక్కన చెక్కిన శిల్పంలా నిలబడిపోయిన మహాతిని పరిశీలనగా చూస్తూ అన్నాడు పరశురాం. ఆమె కలలో నడుస్తున్నట్లు నడిచి వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. "ఏమిటలా ఉన్నావ్ బేబీ? అతడు రాలేదా?" మహతి తలవిదిలించుకుంది. కనురెప్పలు టపటపలాడించింది. "మాట్లాడవేం మహతీ? అతను రానన్నాడా?" "ఆమె----అదే-----ఇప్పుడెళ్ళినామె...." "పేరు దేవయాని. కొత్తగావచ్చిన పేషెంటు. ఈ కేసుందనే మిమ్మల్ని ఆలస్యంగా రమ్మంది". "ఆమెకు ఏమైంది అంకుల్?" మహతికి వళ్ళంతా చెమట్లు పడుతున్నాయ్. "అమ్నేషియా...." "తలకు తగిలినదెబ్బకు గతాన్నిమర్చిపోయిందా? ఆమె శీలాన్ని కాపాడాం అనుకున్నాం. కాని మతేపోయిందా?" అంటున్న మహతికళ్ళల్లో గిర్రుననీళ్ళు తిరిగాయి. "మహతీ!" పరశురాం ఖంగారుగా లేచాడు. మహతి భుజాన్ని పట్టుకొని కుదుపుతూ" ఆమె నీకు తెలుసా?" అని అడిగాడు పరశురాం. "తెలుసు...." "ఎలా?" "ఏం చెప్పమంటారు అంకుల్? చాలా ఘోరం జరిగిపోయింది" మహతి ఆగి కళ్ళు తుడుచుకోసాగింది. "ఏం జరిగింది మహతీ?" "మొన్నరాత్రి....నేనూ....అతనూ" ఆమె చెప్పడం పూర్తిచేసేసరికి గోడగడియారం ఏడుగంటలు కొట్టింది. ఆమె వీపుమీద ఎవరోచరిచినట్లు త్రుళ్ళిపడింది. అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది---అతను బయటకూర్చున్నాడన్న విషయం. పరశురాం మహతినే పరిశీలనగా చూస్తున్నాడు.    
    "అంకుల్, అతను బయటకూర్చున్నాడు--" అంటూ గాభరాగా లేచినిలబడింది. "యూ ఫూలిష్ గరల్. రెండుసార్లు అడిగాను. ఆమాటేచెప్పలేదు. త్వరగా వెళ్ళి పిల్చుకొనిరా!" మందలించాడు పరశురాం. "ఏమిటో మరచిపోయాను" తనకుతానే చెప్పుకుంటున్నట్టుగా అనుకుంటూ డోర్ దగ్గరకువచ్చింది. "సారీ! వెరీ వెరీ సారీ! రవీ, అంకుల్ పిలుస్తున్నారు" డోర్ తెరుస్తూనే క్షమాపణ చెప్పుకొంటూ బయటకువచ్చింది మహతిదాదాపు పరిగెత్తుతున్నట్టుగా. ఖాళీ కుర్చీ ఆమె ముఖంలోకి బోసిగా చూసింది. మహతి వెయిటింగురూమంతా కలియజూసింది. ఎవరూ లేరు. రవి ఎక్కడ? ఏమయ్యాడు? మహతికి మూర్చవచ్చినంతపనైంది. గిర్రున తిరిగి ప్రొఫెసర్ గదిలోకి గాభరాగా పరుగు తీసింది. "అంకుల్! రవి లేడు. వెళ్ళిపోయాడు" గాభరాగా అంది మహతి. "ఎక్కడికెళ్తాడమ్మా? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. సరిగా చూడు" అంటూ ప్రొఫెసర్ పరశురాం గదిలో నుంచి బయటకు వచ్చాడు. మహతి కీ ఇచ్చిన బొమ్మలా పరశురాంను అనుసరించింది. ఇంటిముందున్న లాన్ లో చూశారు. పొట్టి కొబ్బరిచెట్లమధ్య ఉన్న గార్డెన్ చైర్స్ లో చూశారు. అక్కడ రవి కన్పించలేదు. ఇద్దరూ గేటుదాకా వచ్చి బయటకు చూశారు. రవి జాడ లేదు. "అంకుల్! ఇంక వెదకటం అనవసరం. కారు కూడా లేదు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఫూలిష్ గా ప్రవర్తించాను. నాతోపాటే రమ్మన్నాను గదిలోకి. కాని ఆ ఫూల్ ఫార్మాలిటీస్ అనీ, సభ్యత అనీ, నువు పిల్చేదాకా రాననీ భీష్మించుకుని కూర్చున్నాడు. కుర్చీకి అతుక్కుపోయాడు". ఏమిటేమిటో మాట్లాడేస్తున్న మహాతిని నివారించాడు పరశురాం. "ఊరికే వర్రీకాకు బేబీ! మళ్ళీ పిల్చుకురావచ్చులే. ఇంతలోకే మునిగిపోయిందేమీ లేదు". "మళ్ళీ  పిల్చుకురవడం నువ్వనుకున్నంత తేలికకాదు అంకుల్. అతడ్ని తీసుకొచ్చే సరికి నా తల ప్రాణం తోకకువచ్చింది. అదేకిరణ్ అయితే....." పరశురాం బిగ్గరగా నవ్వసాగాడు. "అంకుల్, మీరలా నవ్వకండి. నాకసలే గాభరాగా ఉంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra