వీళ్ళందరికంటే మీ సాధువులు, బాబాలా గొప్పవాళ్ళా....? కాదు. సర్వసంగ పరిత్యాగులనుకునే మీకు ఏ.సీలు, కార్లు, భవనాలు, సొంత విమానాలూ వగైరా... అందుకే నాకు మీ సాధువుల్నీ, బాబాలనీ చూస్తే రోత..."
    
    "మహదేవ్! వాటీజ్ దిస్?" సీరియస్ గా అడిగాడు అభిరాం.
    
    ఆ సాధువు మహదేవ్ ని అంచనా వేస్తున్నట్లు చూడసాగాడు. అభిరాం మహదేవ్ ని తీసుకొని అక్కన్నుంచి వడివడిగా ముందుకు సాగిపోయాడు.
    
    కొంతదూరం వెళ్ళాక వెనుదిరిగి చూశాడు అభిరాం. ఆ సాధువు మహదేవ్ నే తీక్షణంగా చూస్తున్నాడు. అదే సమయంలో మహదేవ్ ఆ దేవాలయం మెట్లు దిగసాగాడు. అభిరాం మహదేవ్ పై నుంచి సాధువు వైపు దృష్టి మరిల్చాడు. అంతే... తీక్షణంగా అతడు మహదేవ్ వంక చూస్తూ ముందుకు రాబోయి తననే గమనిస్తున్న అభిరాంని చూసి వెనుదిరిగి దేవాలయం వెనుక వైపుకు సాగిపోయాడు.
    
    అభిరాం గబగబా వెళ్ళి మహదేవ్ ని సమీపించాడు.
    
    "ఏమిటి వెనుకబడిపోయావ్?" అభిరాం వైపు చూసి అడిగాడు మహదేవ్.
    
    "నువ్వు మెట్లు దిగుతుండగా నీలో ఏదయినా మార్పు రావటం గమనించావా?" అన్నాడు అభిరాం.
    
    "మెట్లు దిగుతున్నప్పుడా?"
    
    "అవును."
    
    "ఒక్క క్షణం నా తలమీంచి వేడి సెగలాంటిది పయనించినట్లు అనిపించింది" అప్పుడు చూశాడు అభిరాం.... మహదేవ్ తల వెంట్రుకలు అక్కడక్కడా అతి స్వల్పంగా కాలిపోయి వున్నాయి.
    
    "సందేహంలేదు. ఆ సాధువు తాంత్రికుడే! అతనితో నువ్వు ఘర్షణపడి, దూషించినందుకు నీమీద అరత్యుంగ విద్య ప్రయోగించాడు.
    
    అదృష్టవశాత్తు అదే సమయంలో నువ్వు మెట్లు దిగుతూ అతని దృష్టి  పథం నుంచి దిగువకు వచ్చేయడం, అతను ముందుకు రాబోతుండగా, నాకు అనుమానం వచ్చి, అతన్ని చూడటంతో, ఆ సాధువు వెనుదిరగటం వలన అతని కళ్ళల్లోంచి అరత్యుంగ ప్రయోగంవల్ల వచ్చిన అగ్ని కిరణాలు, జస్ట్ నీ తలవెంట్రుకల్ని తాకీ తాకనట్లు వెళ్ళిపోయి నువ్వు బతికిపోయావు" గబగబా చెప్పాడు అభిరాం.
    
    "అరత్యుంగ ప్రయోగమా? అంటే ఏమిటి" తన తలని తడుముకుంటూ అడిగాడు మహదేవ్.
    
    "తంత్రలో అదొక విద్య, ఆ విద్య తెలిసినవాళ్ళు తమ తమ కళ్ళతో ఏ వస్తువునైనా తీక్షణంగా కొంచెంసేపు చూస్తే చాలు ఆ వస్తువు కాలి బూడిదైపోతుంది. ఎండలో భూతద్దం కింద వుంచిన కాగితం కాస్సేపటికి కాలిపోతుంది. అలాగే అరత్యుంగ వుద్య తెలిసిన వ్యక్తుల కళ్ళు ప్రసరించిన అగ్ని కిరణాలు మరింత శక్తివంతంగా తమ లక్ష్యాన్ని కాల్చి వేస్తాయి.
    
    ఈ విషయాన్ని ప్రఖ్యాత పారాభౌతిక శాస్త్రవేత్త 'క్రూక్స్' కూడా ఎన్నో పరిశోధనలు చేసి ఈ విద్య ఉందని నిరూపించాడు అభిరాం.
    
    "నువ్వు ప్రతిదాన్నీ మంత్ర తంతరాలకి అన్వయించి చూస్తావ్. ఇప్పుడు మిట్టమధ్యాహ్నం అవుతుంది. ఒక్కసారిగా దేవాలయం నీడ నుంచి ఎండలోకి రావటంతో నాకలా అనిపించి వుండవచ్చు. దానికి నువ్వు ఏవేవో పేర్లు పెట్టేస్తున్నావ్" అభిరాం మాటలకి చిరునవ్వుతో జవాబిచ్చాడు మహదేవ్.
    
    "నో... ఆ సాధువు నీవైపు తీక్షణంగా చూస్తున్నప్పుడే నువ్వు మెట్లు దిగుతున్నావ్ అదే సమయంలో నీ తలమీంచి వేడి వాయువు పయనించింది. ఇది ఖచ్చితంగా అరత్యుంగ ప్రయోగమే. ఆ సమయంలో నువ్వు మెట్లు దిగుతూ వుండకపోయినా, నేను సాధువుని గమనించక పోయినా, అరత్యుంగ ప్రయోగంవల్ల నువ్వీపాటికి కాలి బూడిదయి ఉండేవాడివి" తన మాటల్ని ఖాతరు చేయని మహదేవ్ వంక కోపమగా చూస్తూ అన్నాడు అభిరాం.

    "సరేలే! ఎందుకంత కోపం?"
    
    "నువ్వనవసరంగా అతనితో గొడవపెట్టుకున్నావ్...." అన్నాడు అభిరాం.
    
    ఆ మాటలకి జవాబేం ఇవ్వలేదు మహదేవ్.
    
    "సాధారణంగా తాంత్రికులు శాంత స్వభావులై వుంటారు. నువ్వా సాహ్డువు జీవనశైలిమీద, అతని అహంమీద దెబ్బకొట్టావ్. అందుకే అతను నీమీద అతి భయంకరమైన అరత్యుంగ ప్రయోగించాడు. మనం తొందరగా ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోదాం" అంటూ కారు డోర్ తీసి కూర్చున్నాడు. మహదేవ్ కూడ కూర్చోగానే కారు కదిలిపోయింది.
    
    కారు లెఫ్ట్ టర్న్ తిరిగి మెయిన్ రోడ్ మీదకు చేరుకుంటుండగా ఈసారి ఆ దేవాలయంవైపు చూశాడు అభిరాం. దూరంగా నుంచుని తమ కారువంకే చూస్తున్న ఆ సాధువు కనిపించాడు.
    
    "అదిగో చూడు ఆ సాధువు మనవంకే చూస్తున్నాడు" మహదేవ్ తో అన్నాడు అభిరాం.
    
    మహదేవ్ అటు తిరిగి చూశాడు. ఇంతలో హఠాత్తుగా ఓ ఆయిల్ టాంకర్ వచ్చి ఆగిందక్కడ. దాంతో ఆ సాధువు కనిపించలేదతనికి.
    
    "హుఁ.... నీదంతా చిత్తభ్రమ" కారు ఆ ప్రదేశాన్ని దాటి సాగిపోతుండగా అన్నాడు మహదేవ్.
    
    "అయితే నా మాట నమ్మనంటావ్?"
    
    "అందులో సందేహమేముంది?"
    
    "అవునులే! ఏదయినా తనదాకావస్తే కాని తెలియదంటారు. నా అభిప్రాయం ప్రకారం ఈరోజు నువ్వు పెద్ద గండం నుంచి బయటపడినట్లే" సీరియస్ గా డ్రైవ్ చేస్తూ అన్నాడు అభిరాం.
    
    "అబ్బా..." కాస్త విసుగ్గా అన్నాడు మహదేవ్.
    
    "మంత్రశక్తులు, మానవాతీతశక్తులు వున్నాయని నిన్ను నమ్మించటానికి నేనీ విధంగా చెప్పటం లేదు."
    
    "ఓకే! అయితే మళ్ళీ అక్కడికే వెళదాం. ఈసారి ఆ సాధువు ఎదుట అతనిక్కావలసినంతసేపు నుంచుంటాను. అతడు నామీద ఏ ప్రయోగం చేస్తాడో చేసుకోమను" ఛాలెంజ్ చేస్తున్నట్లు అన్నాడు మహదేవ్.
    
    "అవసరం లేదు. అక్కడికి మళ్ళీ వెళితే ఖచ్చితంగా నీకు ప్రమాదం జరుగుతుంది" అన్నాడు అభిరాం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra