Home » Yerramsetti sai » Death Chamber


    చంద్రిక ఏమీ మాట్లాడలేదు.
    అతను నోట్ పుస్తకం తీసుకున్నాడు.
    "మీరు ఇప్పుడు ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు?" అడిగాడు.
    "ఎనిమిది చిత్రాలు!"
    "అయితే మీరు బిజీస్టార్ అయిపోయారన్న మాట. మరి మీరు నటించే చిత్రాల్లో హీరోలు ఎవరు?"
    "మరి మీరు సబ్జెక్ట్ ని బట్టి చిత్రాలు అంగీకరిస్తున్నారా?"
    చంద్రిక నవ్వింది. "నేనింకా అంతటి స్థితికి చేరుకోలేదు"
    "మీరు తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు?"
    "ఏమీ చేయను. హాయిగా విశ్రాంతి తీసుకుంటాను?"
    "మీ అభిమాన నటుడెవరు?"
    "నాకు అందరూ అభిమాననటులే! అందరితోనూ నటించే అవకాశాలురావాలని నేను కోరుకుంటున్నాను"
    "మీ హాబీలేమిటో చెప్తారా?"
    "మంచి సినిమాలు చూడటం నవలలు చదవడం!"
    అతని ప్రశ్నలు విసుగుకలిగిస్తున్నాయ్ చంద్రికకు, ఇలాంటి ప్రశ్నలు అన్ని సినిమా పత్రికల్లోనూ చూసింది తను. అందరూ ఈ ప్రశ్నలే కొంచెం మార్పులతో అడుగుతుంటారు.
    అతను వెళ్ళిపోయాక శాంతమ్మను పిలిచింది చంద్రిక. "నాన్నగారేం చేస్తున్నారు" అడిగిందామెని.
    "ఇప్పుడే నిద్రలేచారమ్మా! ఫలహారం తీసుకుంటున్నారు....."
    "ఆయనతో త్వరగా రడీ అవమని చెప్పు. మార్కెట్ కెళ్ళి నేనుబట్టలు కొనుక్కోవాలి!"
    "అలాగేనమ్మా!"
    "నువ్వుకూడా రావాలి మాతో!"
    "సరేనమ్మా"
    ఆమె వెళ్ళిపోయింది.
    మంచి చీరలుకొనుక్కోవాలని, నగలు చేయించుకోవాలనీ ఎప్పటినుంచో అనుకుంటోంది. అయితే వున్న డబ్బులో చాలాభాగం చీరలకు, నగలకు ఖర్చు చేయాల్సివస్తుందని ఆ ఆలోచన మానుకుంది. బాంకులో వున్న మొత్తం అంత ఎక్కువేంకాదు. కానీ ఇప్పుడు మోహన్ గారి పిక్చర్ లో బుక్ అయ్యాక కొంచెం ధైర్యం వచ్చింది. తను జీవిస్తోన్న ఈ గ్లామరస్ ఫీల్డులో విపరీతమయిన అలంకరణలు, ఖరీదయిన దుస్తులు ఎంతో అవసరం.
    జగన్నాధం లాల్చీ, పంచెకట్టుతో తయారయి ఆమె దగ్గర కొచ్చాడు.
    "మార్కెట్ కెళ్ళాలన్నావుగదటమ్మా" అన్నాడు ఆప్యాయంగా.
    "అవున్నాన్నా! నాకు కొన్ని నగలు, చీరలు కావాలి. కొనుక్కోవాలని!"
    "అలాగయితే మరి నేను టాక్సీ తీసుకురానా?"
    "తీసుకురండి! మీరు వచ్చేలోగానేనుకూడా రడీ అవుతాను...." అతను వెళ్ళిపోయాడు.
    అతనిని చూస్తుంటే భయంగా వుంటుంది చంద్రికకు. పూర్తిగా తాగుడికి బానిసయిపోయాడు. రోజూ ఎలాగోలా తంటాలు పడి ఒక బాటిల్ సంపాదించుకోవాల్సిందే.
    డబ్బు విషయంలో ఖండితంగా ఉండడానికి మనసొప్పదు. తనకు మిగిలింది తండ్రి ఒక్కడే. తన తల్లి చనిపోయాక తనకు తల్లీ తండ్రీకూడా అతనే అయాడు. అతనికీ తనంటే ప్రాణం.
    తను అద్దం ముందుకూర్చుని బొట్టుపెట్టుకుంటూంటే తిరిగి వచ్చాడతను.
    "టాక్సీ వచ్చిందమ్మా!"
    "పదండి వెళదాం!" అంటూ బయటికొచ్చిందామె.    
    శాంతమ్మ ఇంటికి తాళంవేసి వాళ్ళకేవెనుకే తనూ వచ్చింది ముగ్గురూ టాక్సీలో ఆ నగరంలో ప్రసిద్ది చెందిననగల దుకాణానికి చేరుకున్నారు. సినీతారలందరూ ఆ షాపులోనే ఎక్కువగా ఆభరణాలు కొనుక్కొంటూంటారు.
    ఖరీదయిన నెక్లెస్ ఒకటి. గాజులు, చెవిరింగ్స్ సెలక్ట్ చేసుకుంది చంద్రిక. ఇంకా చాలారకాల నగలు ఆమెను ఆకర్షించినయ్.
    కానీ వాటిని సొంతం చేసుకోగలిగినంత స్తోమతు తనకు లేదు. డబ్బిచ్చేసి బట్టలషాపు కెళ్ళారు.
    అక్కడ తనకు నచ్చిన చీరలు ఓ అరడజను కొనుక్కుందామె.
    "నీక్కూడా ఏమయినా బట్టలు తీసుకోనా నాన్నా" అంది జగన్నాథంతో.
    "ఊహూ! నాకేమీ వద్దమ్మా! అవసరమయితే నేనేతెచ్చుకుంటానులే" అన్నాడతను.
    అతనలా ఎందుకంటున్నాడో తనకు తెలుసు. తరువాతెప్పుడయినా బట్టలకని తనదగ్గర డబ్బు తీసుకుని అది తన సరదాలకు ఖర్చు చేసుకోవచ్చని అతని ఆలోచన. శాంతమ్మకు కూడా రెండుసాదాచీరలు కొంది చంద్రిక.
    ఇంటికి తిరిగి వచ్చేసరికి బయటగేటు దగ్గర ఓ వ్యక్తి నిలబడి వుండటం కనిపించింది.
    చంద్రికను చూడగానే వినయంగా నమస్కరించాడతను.
    "నా పేరు శ్రీనివాసరావు! మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను...."
    "ఏమిటో చెప్పండి!" అడిగింది చంద్రిక అతని కెదురుగ్గా కూర్చుంటూ.
    "నేను ఇదివరలో ఇద్దరు ఆర్టిస్ట్ ల దగ్గర సెక్రటరీగా పనిచేశాను. తర్వాత ఏవో కారణాలవల్ల నేనే మానేశాననుకోండి. గత రెండేళ్ళుగా ఖాళీగానే వున్నాను. మళ్ళీ అలాంటి అవకాశం ఎక్కడా లభించలేదుకూడా! మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయినా, ఇంకా సెక్రటరీని ఏర్పాటు చేసుకోలేదని తెలిసి ఇక్కడకొచ్చాను. దయచేసి మీరు అంగీకరించారంటే నాకు మరోజన్మ ఇచ్చినవారవుతారు. మీకు ఎంతో రుణపడి వుంటాను. సెక్రటరీగా నేనెంత సమర్ధవంతంగా పనిచేసేవాడినో చెప్పుకుంటే నన్ను నేను పొగుడుకొన్నట్లవుతుంది......"దీనంగా అన్నాడతను.
    చంద్రిక కొద్ది క్షణాలు ఆలోచించింది. తనకు సెక్రటరీ అవసరం చాలావుందిప్పుడు.
    తన కెప్పుడే కాల్ షీట్స్ వున్నవీ, షూటింగ్ వివరాలూ, సినిమాల వివరాలూ అన్నీ చూసుకోవడం తనవల్లకాదు. తనే సెక్రటరీకోసం తనకు తెలిసిన ఒకరిద్దరు డైరెక్టర్లు చెబుదామనుకుంటోంది.
    "ఇంతకుముందు ఎవరిదగ్గర చేశారు?" అడిగిందామె.
    "సరోజినీరాణిగారి దగ్గర ఏడేళ్ళు చేశాను. ఆ తర్వాత మల్లేశ్వరిగారి దగ్గర సంవత్సరం చేశాను. అక్కడినుంచీ ఖాళీగానే వున్నాను".
    "మల్లీశ్వరి గారి దగ్గర ఎందుకు మానేశారు?"
    అతను కొంచెం తడబడ్డాడు.
    "ఆమె నన్ను చాలాసార్లు ఇల్ ట్రీట్ చేశారు. ఒకోసారి నన్ను సెక్రటరీ లాకాక ఫ్యూన్ లా చూసేవారు! అందుకని నేనే రిజైన్ చేశాను!"
    "ఓహో!"
    "ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి నేను. నాకు తాగుడు వగైరా అలవాట్లేవీ లేవు. జీతం ఇంత కావాలనికూడా నేను అడగడంలేదు. మీ ఇష్టం. మీకెంత న్యాయమనితోస్తే అంతే ఇవ్వండి....."
    "సరే ఆలోచించి చెపుతాను! రెండ్రోజులు తర్వాత కనబడండి ఓసారి!" అంది చంద్రిక.
    "థాంక్యూ వెరీమచ్! వస్తానండి! నమస్తే!" అతను నమస్కరించి వెళ్ళిపోయాడు.
    అతనిని తన సెక్రటరీగా నియమించాలనే నిర్ణయించుకుంది చంద్రిక. అలాగే తనకోసం ప్రత్యేకంగా ఓ మేకప్ మాన్ ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ప్రొడక్షన్ వాళ్ళిచ్చే మేకప్ మన్ మీద ఆధారపడడం తనకిష్టంలేదు. వాళ్ళకు తామంటే అంత శ్రద్ద వుండదు.
    మోహన్ చిత్రనిర్మాణం ప్రారంభమయింది.
    ప్రారంభదృశ్యం ప్రేమకుమార్, చంద్రికలమీద చిత్రీకరించారు. అంతకుముందు ఒకటి రెండుసార్లు ప్రేమ్ కుమార్ తో మాట్లాడింది. కానీ ఇప్పటి హోదా అప్పుడు లేదు. అంచేత అతను తనకంతగా విలువ ఇవలేదు. అసలతని సినిమాలో నటించే అవకాశమేరాలేదు. ఎకాఎకీన ఇప్పుడు అతని ప్రక్కన కధానాయికగా నటించడం ఎంతో ఆనందం కలిగిస్తోంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra