Home » Dr muktevi bharathi » Malli Vachhina Vasantham

 

   "పెళ్ళి చేసుకోను, చేసుకోనూ అని మమ్మల్ని బెదిరిస్తావా - ఆడదానివయ్యాక పెళ్ళి చేసుకోక ఏం చేస్తావూ, దీర్ఘంతీసింది పెద్ద వదిన.
   
    'వదినలూ, అన్నయ్యలూ వినండి. నేను పెళ్ళి చేసుకోను. ఒకవేళ నా ఖర్మకొద్దీ పెళ్ళితోసుకొచ్చేస్తే, అందరూ చేసుకున్నట్టుగా అసలు చేసుకోను వేలు వేలు ఖర్చుచేసి, ఊరందరికీ విందులు చేసి ఉన్ననాలుగు డబ్బులు తగలేయించి నాన్నని వీధిలోకి ఈడ్చను - తెలిసిందా అంది విసురుగా వెళ్ళిపోయింది శారద.
   
    దీనివ్యవహారం చాలా దూరమొచ్చిందనీ, వీలయినంత త్వరలో దీనిపెళ్ళి చేసేయకపోతే ఇది మన చేతికి దక్కదని అన్నలిద్దరూ ఒకనిర్ణయానికొచ్చారు.
       
    'ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో ఎలా వుంచుకున్నారో బాబూ - గుండెలమీద కుంపటి'.
   
    'కాదు మరీ - ఆయనకి నిద్ర ఎలా పడుతోందో'   
   
    "ఏమిటీ - కుంపటి - పొయ్యి - స్టౌ - గాస్ స్టౌవ్ - ఏమిటీ - నన్నేనా అంటున్నారు - అందరూ వినండి - ఇంకొక్కసారి నా పెళ్ళివిషయం ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు నా పెళ్ళి నా యిష్టం - ఎవరైనా మాట్లాడితే ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతా - ఎక్కడో ఉద్యోగం చేసుకుబతుకుతా - అర్ధమయిందా" - శారద లోపల్నుంచి వచ్చి పెద్దగా అరిచింది. అందరూ భయపడిపోయారు ఒక్కసారి.
   
    నరసాపురంలో కొబ్బరితోట తండ్రిచేత అమ్మించాలనీ చెల్లె పెళ్ళికి కొంతడబ్బుతీసిదాచి, తక్కింది వాటాలు వేయాలని తండ్రిని ఒప్పించటానికి వచ్చిన అన్నలిద్దరూ ఏం చేయాలోతోచక ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు.
   
    ఆ తెల్లారి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. శారద చదువు ఆ సంవత్సరం పూర్తయింది.
   
    'అమ్మా - నిన్న బాబాయి ఓ సంబంధం తెచ్చాడు.....అబ్బాయి నేవీలో వున్నాట్ట - మనకిష్టమైతే ఆ సంబంధం చూస్తానన్నాడు 'శారద తండ్రి పేపరు చూస్తూ అన్నాడు.
   
    'నాన్నా మీరు ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి అలసిపోయారు. నా పెళ్ళి విషయం నాకొదిలేయండి. అయినా అలా ముక్కుమోఖం తెలియకుండా ఎక్కడినుంచో ఊడిపడ్డవాళ్ళని నేను చేసుకోను "అంది శారద ఖచ్చితంగా " అంటే - మరి పెళ్ళంటే ఇలాగే జరుగుతుంది. మనకి తెలిసినవాడు, మన ఊళ్ళోవాడు కావాలంటే కుదరద్దూ - అయినా నీ మాటలు నాకేం అర్ధంకావటంలేదు - మొన్న అన్నలు వదినలు ఉన్నారని ఊరుకున్నా. అసలు నీ ఉద్దేశమేమిటి - ఎవర్నిచేసుకోవాలని - నీతో చదువుకున్న వాళ్ళెవరయినా ఉన్నారా. చెప్పుతల్లీ - తీరామేము కుదిర్చాక నువ్వు కాదని పీట్లమీదనుంచి లేచిపోతే, నేను మీనాన్నా ఏనుయ్యోగొయ్యో చూసుకోవలసిందే - కోపంగా అంది శారదతో. శారద పాక పకా నవ్వింది.
   
    "నీ పెళ్ళి చేసి మేము నరసాపురం వెళ్ళిపోదామని. ఇక్కడమాకేం పని. ముసలాళ్ళమిద్దరమూ అక్కడే పడివుంటాము - తండ్రికొంచం గట్టిగా అన్నాడు.
   
    "కాదు నాన్నగారూ - నాకిక్కడ ఉద్యోగం వచ్చిందా. అది వదులుకోను కదా. ఇంక మీరు నరసాపురం వెళ్ళటం. వెళ్ళండి హాయిగా కొబ్బరితోటలు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి - బోల్డు డబ్బులు - డబ్బులు - డబ్బులుంటే ఎన్నయినా చేయచ్చు మన ఊర్లో పెద్ద డాబావేద్దాం. ఇంక డబ్బులు ఎక్కువుంటే ఎయిర్ కండిషన్డ్ చేయిద్దాం. అమ్మకి పాపం, నగలు చాలా తక్కువున్నాయి. పలకసరులలో కూడా రెండువరుసలు అక్క కొడుక్కి బంగారం మొలతాడు చేయించింది కదా! - "శారద విపరీతంగా మాట్లాడేసింది."
   
    "ఏమిటే ఆవాగుడు.....మేంబతికుండగా నీ పెళ్ళి చేస్తామా అని బెంగ" - అంది తల్లి.
   
    "మీ ఆరుగురు పిల్లల్లో ఐదుగురుకి చేసారు కదా.....నాకొక్కదానికి మీరు చెయ్యకపోతే ఏమయింది ......నేనే చేసుకుంటానేమో, చేసుకోనేమో.....ఎవరికి తెలుసు" - శారద విసుగ్గా అంది.
   
    తల్లితండ్రి మాట్లాడలేదు. శారద బయటకెళ్ళింది.
   
    ఆర్నెల్లు తిరక్కుండా రాజారావు, భార్య నరసాపురం వెళ్ళిపోయారు.
   
                                       *    *    *
               
                                           6

   
    ఆ ఇంట్లో పక్కవాటా చిన్నది అద్దెకు తీసుకుంది శారద. తనకేం భయం - దగ్గరలోనే లలిత ఇల్లు. లలిత తనక్లాసుమేటు, ఫ్రెండు - అయినా నెలలో ఏదోపనిమీద తండ్రి వస్తూనే వుంటాడు.
   
    శారదకి పనులు బాగా చేసుకోవటం వచ్చు అంతేకాకుండా ఇరుగుపొరుగుతో స్నేహంగా వుంటుంది. తల్లి తండ్రి నరసాపురం వెళ్ళిపోయినా బెంగగాలేదు. ఆఫీసులో ఉద్యోగం ఉత్సాహంగా వుంది. రకరకాల మనుష్యులు చిత్ర విచిత్రమైన స్వభావాలు - శారదకి లలితస్నేహం కూడా అదివరకటి కన్నా ఎక్కువైంది. రెండేళ్ళలో పరిస్థితులు ఎంతో మారిపోయాయి. తల్లిమరణించింది. కొబ్బరితోట అమ్మే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఊళ్ళువున్న నాన్నని అప్పుడప్పుడు అన్నలూ, అక్కలూ వెళ్ళిచూస్తున్నారు - శారదకే కుదరలేదు వెళ్ళటం - పైగా తన జీవితంలో వచ్చిన మార్పులు తండ్రివిని భరించలేడని కూడా శారదకి తెలుసు.
   
    నరసాపురం ఎక్స్ ప్రెస్ లో బయలుదేరింది శారద. మనసంతా ఇంటిమీదే వుంది. నాన్న టెలిగ్రాం ఎందుకిచ్చినట్టో ఆరోగ్యం ఎట్లావుందో శారద మనసు నరసాపురం వైపు మళ్ళింది. - ఎంత బావుంటుందో! ఎటువైపు చూసినా కొబ్బరితోటలు - పిల్లకాల్వలు - హాయిగా ఈ ప్రశాంతవాతావరణంలో నాన్న ఆరోగ్యంగా వుండాలికదా!.
   
    శారద ఇంట్లో అడుగుపెట్టేసరికి ఇల్లంతా సందడిగా వుంది. 'అత్తోచ్చింది.....అత్తోచ్చిందీ' అరుస్తూ వీధిలో ఆడుకుంటున్న పెద్ద అన్నయ్య పిల్లలు లోపలకి పరిగెత్తారు. కానీ, ఆ ఇంట్లోంచి బయటకి చూడటానికి లోపలికి రమ్మనటానికి ఎవరూ రాలేదు - శారద మనసు చివుక్కుమంది 'అయినా నన్నెవరు రమ్మనాలీ - ఇది నా ఇల్లే - గబగబా లోపలకెళ్ళింది శారద.
   
    'తల్లీ వచ్చావా' రాజారావు వచ్చికూతురు శారదని దగ్గర కూచోపెట్టుకున్నాడు.
   
    'ఎలా వున్నారు నాన్నా' శారదకి ఎందుకో ఏడుపొచ్చింది.
   
    'బావున్నా తల్లీ అందరినీ చూడాలనిపించి టెలిగ్రాములిచ్చా నేను ఉత్తరం రాశాననుకో. నువ్వు జవాబుకూడా రాయవు. అవునా' - శారద తలనిమిరాడు తండ్రి.
   
    'మీ అందరి సంతకాలు కూడా అయితేకానీ తోట అమ్మటం కష్టం - అందుకని నువ్వు కూడా దానిమీద సంతకం చేస్తే ' చిన్నన్నయ్య కాగితాలు అందించాడు.
   
    శారద వాటికేసి చూసి నవ్వింది.
   
    'అందరూ ఏది అంటే అది సరే అన్నయ్యా. అక్కలు'
   
    'వాళ్ళతో పేచీలేదు - పెద్దవదిన వంటింట్లోంచి అంది.
   
    'అంటే పేచీ అంతా నీతోనేనా'
   
    "అంటే - నువ్వు - నీ భర్త, కోర్టులు వ్యవహారాలూ" దీర్ఘంతీసింది వదిన.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra