పరీక్షలు అంటే ఎంతో భయం-నైట్ మేర్ అనుకో, వచ్చేవికావు ఆ లెక్కలు-ఆ సైన్సూ అంతే-భయంనాకు మొదటీ నుంచీరాదూ-అదీ అంతే అయిందికానీ సారధీ!-తెలుగు ఇంగ్లీషులో మాత్రం రెండువందల యాభైమంది విద్యార్ధుల్లో ఎప్పుడూ మొదటిమార్కునాదే.
    
    చివరికి యస్.యస్.యల్.సి. తప్పినా మొదటి మార్కూ మాత్రం వాటిలో నాదే.
    
    తర్వాతే వేరే చోటు ప్రైవేటు చెప్పించుకుని తర్వాత పరీక్షల్లోనే పాసయ్యాను.
    
    తర్వాత మళ్ళీ కాలేజీతెరిచే వరకూ ఆ నాలుగు నెలలూ హాయిగా మళ్ళీ స్వగ్రామంలో అచ్చమైననీరు, గాలీ, తిండి అంటే తెలుసుకున్నాను-నాన్నగారి వెంట పొలాలన్నీ తిరిగేవాడిని.    

 

    కాలేజీలు తెరిచారు. పి.యు.సి లో లెక్కలకి భయపడి గ్రూప్ మార్చుకున్నాను.
    
    బయాలాజికల్ సైన్సు తీసుకున్నాను, కానీ ఆ కప్పులు కోయటం-కాక్రోచ్-అబ్బ ఇప్పటికీ నాకు వెగటువేస్తోంది. అలాగే కోర్సు ముగించాను అప్పుడు చాలా విశ్రాంతిగా ఉండేది.
    
    మంచిమంచి పుస్తకాల చదివాను. అప్పుడే 'భారతి' లానతి పత్రికల్ని నిజంగా చదవటం ఎలాగో నేర్చుకున్నాను.
    
    గేయాలువ్రాసేవాడిని-తొట్టతొలుతగానా రచన భారతిలోపడటం చూసి నాలోపొంగిన సంతోషం-అర్ధం చేసుకోసారధీ! చెప్పటానికి నోరు రావటంలేదు.
    
    "పొగడ్తలు చాలించుకుని ముందుకథ చెప్పేసేయ్"    

 

    "ఏం నిద్రవస్తుందా? అలాగనుకుంటే ఎలా-వప్పుకున్నాక భరించుకుని తీరాలి."
    
    "ఈకాఫీ ఋణం తీరిపోయింది-గట్టిగా మాట్లాడితే నీవే బాకీ అవుతావేమో"
    
    నవ్విలేచి వెళ్ళి ఫ్లాస్కులోని కాఫీ మరి కొంచెంవంచుకుని తెచ్చాడు. అందిస్తూ 'ఇంకో డోసుకు ఉండనీ'
    
    మళ్ళీ చెప్పసాగాడు.
    
    "ఆరోజుల్లో పి.యు.సిలో జరిగిన సంఘటనేనా జీవితాన్ని మార్చివేసింది-కెమిస్ట్రీ లెక్చరర్ గారు పాఠం చెపుతున్నారు. నిద్రవస్తుంటే బెంచిమీద తలవాల్చిపడుకున్నాను. శ్రద్దగా చూస్తే తప్ప నిద్రపోయేది తెలియదు. ఎలాగో ఓ అమ్మాయి అది గమనించింది. అంతటితో ఊరుకోకుండా ఓ పెన్సిల్ స్కెచ్ వేసింది 'పాఠం వింటే పరవశతం' అని శీర్షికకూడా పెట్టింది.
    
    ఆ అమ్మాయి అందరికీ చూపింది.
    
    ఒకఅమ్మాయి నవ్వాపుకోలేకనవ్వింది. లెక్చరర్ గారు నిలబెట్టిఅడగటం- వాస్తవంబయట పడటం-నన్ను లేపటం-చివాట్లు తినటం-ఏం జరిగిందో అర్ధం కాక బిత్తర చూపులు చూస్తున్న నన్ను, ఆవిడని ఆయన కోపగించుకుని బయటికి పొమ్మనటం క్షణంలో జరిగిపోయాయి-ఉపాధ్యాయులకి ప్రత్యుత్తరం చెప్పటం నా జీవితంలోనే లేదు. మౌనంగా తలవంచుకుని బయటికి వచ్చాను.
    
    "సారీ" అంది బయటికి వచ్చాక.
    
    ఇంకానిద్ర వదలనికళ్ళతో చూశాను "ఎందుకన్నట్టు?"    

 

    "మీనిద్రకి భంగం చేశాను కదా" నవ్వుతూ అంది-
    
    నాకూనవ్వొచ్చింది.
    
    మెల్లిగా గార్డెన్ వేపుకి దారి తీస్తూ అంది.
    
    "వస్తారా?"
    
    ఆ మత్తుతో అలాగే వెళ్ళికూర్చున్నాను. మౌనంగా ఏదో చూస్తున్నాను. ఓ పది నిమిషాలు గడిచాయి. పిలిచి మెల్లిగా చేతికి ఓ పేపరు ఇచ్చింది చూశాను.
    
    మళ్ళీ ఓ స్కెచ్'
    
    'నిద్రమత్తువదలని కళ్ళు!'
    
    ఎంత అందంగా వుంది ఆ స్కెచ్.
    
    ఆ మత్తులో అలా వున్నావా అనిపించింది.
    
    ఆ అందంనాలో వుందో-
    
    ఆమెచేతిలో వుందో-    

 

    అర్ధంకాలేదు-
    
    అభినందనలు తెలిపాను-
    
    "చిత్రలేఖనం అంటే నాకు ప్రాణం.....మాఇంట్లో అందరు తిడతారు-చదువువదిలి ఇలా చేస్తుంటానని అప్పుడప్పుడూ కోపగించుకుంటారు కూడా" అంది.
    
    "నాకుచిత్రలేఖనం అంటే చాలా ఇష్టం......కానీ డ్రాయింగ్ క్లాసుకి వెళ్ళిందిలేదు. నేను సదారోగిని ఆ మేష్టారు దృష్టిలో......ఎప్పుడు ఏదో సాకుతో పారిపోయేవాడిని-అయి నా నేర్పే ప్రజ్ఞవంతుడైతే ఏదైనా సులభంగా నేర్చుకోవచ్చు" అన్నాను.
    
    "మనం ఇద్దరమూ కలిసి ప్రాక్టీసు చేద్దామా?" అంది.  

 

    ఆ సుముహూర్తంలో ప్రారంభించాం. ఆ కోర్సు అయిపోయింది బి.ఎ.లో సైన్సుకి పూర్తిగాసస్తి చెప్పి ఎకనామిక్స్, తెలుగు తీసుకున్నాను.....నా సోమరితనానికి తగినట్టుగా వుంటాయి లెమ్మని.....ఆమెకూడా అదే గ్రూపులో చేరింది. ఈనాటి వరకూ మాకుచదువు కన్నా సాధనలోనే ఎక్కువ కాలం గడిచిపోతోంది- ఈ నాడు మీరు మెచ్చుకునేంత ఆర్టిస్ట్ ని కావటానికి కారణం ఆవిడే!
    
    స్నేహంతో మొదలైన మాజంట ఈనాడు ప్రేమవరకూ పెరిగింది.  

 

    ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల్ని పోగొట్టు నాకు దిక్కు ఆవిడే అయింది. ఈ సంవత్సరం 'లాంగ్వేజెస్' పాసు కావటానికి తగిన కృషి చేయించింది ఆవిడే-ఇక వచ్చే సంవత్సరం ఇలాగే వుంటే డిగ్రీ దక్కదనీ-పెళ్ళి చేసుకుందామని-ఇద్దరం కలిసి చదువుదామనీ పోరు పెడుతోంది.    

    ఇక అది తేల్చాల్సింది నీవీ సారధీ నేనేం చేయాలో నాకు తెలియదు. నీవెలా చెబితేనేనెలా చేస్తాను"
    
    ఏకబిగిన కథ అంతా విన్న సారధికి కొంచెం కొంచెం అర్ధం అయింది.
    
    "ఆ అమ్మాయి మీనాక్షే కదా?" అనడిగాడు.
    
    "ఇంకా అర్ధం కాలేదా?"    

 

    "అయిందికాబట్టే- సరే ఇకపోతే మీరు పెళ్ళిచేసుకున్నా మీ చదువుకి భంగం రాదు-అది నా నమ్మకమే కాదు ఎవర్ని అడిగినా చెపుతారు- కానీ ఆవిడ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి కదా? ఆస్తిపాస్తులు లేని నిన్ను......."    

 

    అర్దోక్తిలో ఆపాడు.    

 

    "అవన్నీ తాను చూసుకుంటుందట- కావలసిందల్లా ఒక్క నా అంగీకారమేనట"
    
    "సరేఅయితే ఇంకేం పెళ్ళి మేనెల్లోనే కానీ"
    
    "కానీ"
    
    "ఇంకేమిటో?"
    
    "పెళ్లయ్యాక ఇలా దూరదూరంగా విడివిడిగా వుండనివ్వరు కదా.....వాళ్ళింట్లోనే వుండి చదువుసాగించాల్సి వుంటుంది.....అది"
    
    "అదీ ఆమెనే అడగాల్సింది"
    
    "లక్షణంగారాజపూజితంగా జరుగుతుంది అంటుంది ఏం చెప్పను?"
    
    "చెప్పేందుకేముంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కగా నొక్క కూతురు ఆడినట్లు ఆడాల్సిందే......"
    
    "సరే! నీ మాటని కాదనే ధైర్యం లేదునాకు"
    
    అంతవరకూ బయటనుంచుని అతని అంగీకారం వస్తుందారాదా? అని ఎదురుచూస్తోన్న మీనాక్షి లోపలికి వచ్చేసింది.
    
    హఠాత్తుగా ఆమె రావటంతో సంభాషణముందుకీ సాగలేదు.
    
    సారధిలేస్తూ అన్నాడు "రెండవ సినిమా వదిలేసమయం అయింది. నేవెళతా మధూ!"
    
    తలవూపాడు మధురం. అతనికి తెలుసు ఎంత రాత్రయినా ఇంటికివెళ్ళందే సారధికి నిద్ర రాదని. సారధి వెళ్ళాక మధుకి దగ్గరగా వస్తూ అంది మీనాక్షి.
    
    "కొందరికి కొందరి మీద ఎనలేనిగురి.....పోనీ భగవంతుడునాపైన చక్కగా దయచూశాడు"
    
    తడబడుతున్న ఆమె మాటలని సరిచేస్తూ అన్నాడు.
    
    "నీవు దిద్దుకున్న చిత్రాన్ని చిత్రకారుడినీ నీవాడినిచేసేదాంట్లో చిత్రం ఏముంది మీనా!"
    
    ఏమి జవాబు చెప్పకుండా మౌనంగా అతని చేయితన చేతిలోనికి తీసుకుని నిమురుతూ కూర్చుంది.
    
    'రాసారధీ'
    
    "వచ్చి కుర్చీలో కూర్చుని అన్నాడు.
    
    'ఎలా వున్నా రొదినా?'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra