Home » Mainanpati bhaskar » Buddijeevi

తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అజిత్.
"మీరు మానవత్వం ఉన్నవాళ్ళలా కనబడుతున్నారు. అసలు ఈ మిస్టరీ ఏమిటి? అందరూ అచ్చం ఒకేలా ఎందుకున్నారు? క్లోనింగా?" అన్నాడు.
"సరే సరే" నేను కథంతా చెబుతాను. మధ్యలో ఊ కొట్టడం తప్ప మీరు అడ్డు రాకూడదు. మనకి ఆట్టే టైం లేదు. అయితే ముందుగా కాసేపు మీరు చెవి కోసిన మేకల్లా అరవాలి. మా వాళ్ళు విని సంతోషిస్తారు. ఓకే? రెడీ...వన్...టూ...త్రీ" అని స్విచ్ ఆన్ చేశాడు.
ఊళ్ళో పలు ప్రదేశాల్లో ఉన్న స్పీకర్లు మేలుకున్నాయి. వాటిలోనుంచి హృదయ విదారకంగా ఉన్న కేకలు వినబడటం మొదలెట్టాయి.
"నూట పదకొండు డ్యూటీలోకి వచ్చాడు!" అనుకున్నారు ఆ కేకలు వింటున్న వాళ్ళు. ఆర్తనాదాలు విని గజగజలాడిపోతూ, 'అమ్మో! అధికారులకి కోపం తెప్పించకూడదు!' అని మరోసారి మనసుకి గుర్తుచేసుకున్నారు చాలామంది.
టార్చర్ ఛాంబర్ లో -
'ఇంకా గట్టిగా...' అని సైగ చేశాడు నూట పదకొండు.
ఇంకా పెద్దగా అరవడం మొదలెట్టారు అజిత్, అపురూప.
"నూట పదకొండూ!"
ఛాంబర్ లో ఉన్న ఒక స్పీకర్ లో నుంచి మంద్రంగా ఉన్న ఒక గొంతు వినబడింది. అది నెంబర్ వన్ ది.
"కొత్తగా వచ్చిన వాళ్ళకి వచ్చీ రావడంతోనే విందు భోజనం పెట్టేస్తే ఎలా? ముందు టిఫిన్ తో చాలించు. కాసేపు ఆగి... ఆ తర్వాత పంచభక్ష్య పరవాన్నాలతో విందు భోజనం పెట్టు. ఓకే?" అన్నాడు నెంబర్ వన్. మొత్తటి పులిలా నవ్వుతూ.
బాధని అనుభవిస్తున్నకొద్దీ మనుషులు మొండితేలిపోవచ్చు. కానీ బాధని తప్పనిసరిగా అనుభవించాలని తెలిసి, దానికోసం ఎదురు చూడడమే దుర్భరమైన భయాన్ని కల్గిస్తుంది. ఆ ఊహకే జావకారిపోతారు చాలామంది.
ఆ సైకాలజీ నెంబర్ వన్ కి బాగా తెలుసు.
"యస్సర్!" అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేశాడు నూట పదకొండు. తర్వాత కన్ను గీటి, నవ్వి, కథ చెప్పడం మొదలెట్టాడు.
జమిస్తాన్ డిక్టేటరు షిప్పు కింద ఉన్న దేశం. అక్కడ అసహజమైన సంఘటనలేవో చాలా జరుగుతున్నాయని మిగతా దేశాల్లో పుకార్లు వున్నాయి. కానీ అతి తీవ్రమైన సెన్సార్ నిబంధనల వల్లా, దేశంలోకి వచ్చీ పోయే వారిమీద కఠినమైన ఆంక్షలు వుండడం వల్ల సరైన సమాచారం బయటికి పోదు. డిక్టేటర్ అయిన నెంబర్ వన్ ఏమి చెప్పడానికి ఇష్టపడతాడో అదే ప్రపంచానికి తెలుస్తుంది, లేనిది లేదు.
జమిస్తాన్ దేశంలో బిడ్డలని సృష్టించే హక్కు కేవలం ప్రభుత్వానికి మాత్రమే వుంది. ప్రభుత్వం అంటే డిక్టేటర్ నెంబర్ వన్నే. దేశంలోని పంటల దిగుబడీ, పారిశ్రామిక ఉత్పత్తీ, వనరులూ, వర్షాలూ, మరణాల సంఖ్యా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అతను ప్రతి సంవత్సరం పుట్టవలసిన బిడ్డల సంఖ్య నిర్ణయిస్తాడు. ఆ బిడ్డలు కూడా క్లోనింగ్ పద్ధతిలో పుడతారు.
గ్రీకు భాషలో 'క్లోన్' అంటే "చిన్న కొమ్మ" అని అర్థం. దాన్లో నుంచి వచ్చినదే 'క్లోనింగ్' అనే పదం. దాదాపు చెట్లకు అంటుకట్టడం లాంటి పద్ధతిలో మానవ శిశువులని సృష్టించే విధానం అది.
ఈ క్లోనింగ్ ప్రక్రియకు స్త్రీ పురుషులు ఇద్దరూ వుండాలనీ, సృష్టికార్యం జరగాలనీ నియమంలేదు. స్త్రీ శరీరంలోనుంచి గానీ, పురుషుడి శరీరంలోనుంచి గానీ ఒక కణాన్ని తీస్తారు. అది శరీరంలో ఎ భాగం నుంచి అయినా ఫర్వాలేదు. ఆ కణాన్ని అనేక కణాలుగా వృద్ధి పొందించి, అచ్చు నకలులా, కార్బన్ కాపీలా ఉన్న మరో మనిషికి జన్మ ఇస్తారు.
టెస్ట్ ట్యూబుల్లో పిల్లలని పుట్టించే పద్ధతిని మించిన ప్రక్రియ ఇది. టెస్ట్ ట్యూబ్ బేబీలని సృష్టించాలంటే పురుషుడి స్పెర్మ్, స్త్రీ తాలూకు అండం విధిగా ఉండాలి.
క్లోనింగ్ లో అలాకాదు. స్త్రీ తాలూకు చేతి నుంచి కణం తీసి అచ్చు అలాంటి స్త్రీనే పుట్టించవచ్చు.
పురుషుడి తాలూకు చేతి నుంచో, చెవి నుంచో ఒక కణం తీసి అలాంటి పోలికలతో ఉన్న పురుషుడినే సృష్టించవచ్చు.
జెనెటిక్ ఇంజనీరింగ్ లో సాధించిన ఈ అద్భుత విజయాన్ని డిక్టేటర్ నెంబర్ వన్ తన రాజకీయాలకి బాగా వాడుకున్నాడు. తన శరీరంలోని కణాలనుంచే ప్రజలంతా పుట్టాలని శాసనం చేశాడు. అందరూ తనలాగానే ఉండాలి. మూడు విషయాల్లో తప్ప! జెనెటిక్ కోడ్ కొద్దిగా మార్చి ఆ మూడు భేదాలు సృష్టించాడు.
మొదటిది - డిక్టేటర్ చాలా పైశాచికమైన తెలివి కలవాడు. కానీ, ప్రజలని మాత్రం కావాలనే సగమే డెవెలప్ అయిన మెదళ్లతో పుట్టించాడు. వాళ్ళు తెలివి మీరిపోకుండా.
రెండవది - డిక్టేటరు శారీరకంగా దుర్భలుడు. అయినా ప్రజలను మాత్రం భీముళ్ళలాగా దృఢంగా సృష్టించాడు - గొడ్డులా చాకిరీ చెయ్యడానికి వీలుగా.
చివరగా - ఆ దేశంలో ప్రజలందరూ నపుంసకులుగా పుట్టే ఏర్పాటు చేశాడు.
 ప్రజలు మొగాళ్ళయితే వాళ్ళకోసం ఆడవాళ్ళుండాలి. ఆడవాళ్ళకి శారీరక బలం లేదు. కాబట్టి తిండి దండగ అని డిక్టేటర్ ఉద్దేశ్యం. అందుకని అందరినీ నపుంసకులుగా చేసేశాడు. ఒకే దెబ్బతో రెండు పిట్టలు!
దేశానికంతా మగాడు తనే!
ప్రజలతో ఎవరికీ పేర్లు లేవు. గుర్తుకోసం అందరికీ నెంబర్లు వున్నాయి. అంతే!
ఏ కాలంలో అయినా, పాలకులు కలలు కంటారు తమ ప్రజలంతా అలా ఉండాలని - దున్నపోతుల్లా చెప్పిన పనల్లా చేస్తూ - 'ఇదెందుకు చెయ్యాలి!' అని ఆలోచించే మెదడు లేకుండా వుండాలనీ-
ఆడా మగా రెండూ కాకుండా - అన్యాయం మీదా, అక్రమం మీదా తిరగబడలేని నపుంసకులుగా వుండాలనీ పాలకులెప్పుడూ కోరుకుంటారు. అలాంటి ప్రజ - వాళ్ళకి ఆదర్శం!
అలాంటి ప్రజని జెనెటిక్ ఇంజనీరింగ్ సాయంతో సృష్టించుకోగలిగిన డిక్టేటర్ నెంబర్ వన్ నిజంగా అదృష్టవంతుడు!  
అలాంటి ప్రజల్లో తప్పుబుట్టాడు కేర్ టేకర్ నూట పదకొండు. ఏదో తెలియని జెనెటిక్ లోపంవల్ల, తనుకూడా అందరికీ వున్న పోలికలతోనే పుట్టినా, మెదడు మాత్రం బాగా డెవలప్ అయింది. "చెయ్యి" అనగానే గానుగెద్దులా చేసెయ్యకుండా, 'ఇలా ఎందుకు?' అని తరచి చూసుకునే బుద్ధిమాత్రం కలిగింది.
కానీ అలాంటి స్వతంత్ర్యమైన బుద్ధికలిగి వుండడం ఏదో ఒక రోజున తన కొంప ముంచుతుందని తెలుసు అతనికి. అందుకే పైకి మాత్రం మహా కౄరుడిలా నాటకమాడుతుంటాడు.
అక్కడిదాకా చెప్పేసరికి గొంతు రుద్ధమైపోయింది నూట పదకొండుకి.
అజిత్ కి అతన్ని చూస్తే జాలి వేసింది. "మరి మీరు ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారు. నెంబర్ వన్ వినడా?" అన్నాడు.
తల అడ్డంగా ఆడించాడు నూట పదకొండు. "ఉహు! నేను స్విచ్ ఆన్ చేస్తేనే ఇక్కడి మాటలు ఆయనకి వినబడతాయి. అంత నమ్మకం కలిగేలా ప్రవర్తిస్తాను. యజమాని కళ్ళు గప్పాలంటే ఆయనకీ నమ్మకం కలిగించుకోవాలి మన మీద."
"పిచ్చివాడా!" అని వినపడింది ఒక కంఠస్వరం స్వీకర్ లో నుంచి. అది నెంబర్ వన్ గొంతు. "నీలాంటి సీదా సాదా మనిషికి కూడా తెలిసిపోయిన నీతి సూత్రం నాకు మాత్రం తెలియకుండా ఎలా వుంటుందనుకున్నావ్? నౌఖరు విశ్వాసపాత్రుడో కాదో తెలుసుకోవాలంటే అతన్ని నమ్మేసినట్లు కనిపించాలి యజమాని. అదే చేశాను నేను. నాకే పంగనామాలు పెడదామనుకున్నావా నూట పదకొండూ? అనుభవిస్తావ్!"
వెంటనే లేచి నిలబడి, వాళ్ళని కూడా కుర్చీలలో నుంచి లేవమని సైగ చేశాడు నూట పదకొండు. మెరుపులాగా వెళ్ళి ఒక స్విచ్ నొక్కాడు. అతని ఒక్కడికే తెలిసిన ఒక రహస్య ద్వారం తెరుచుకుంది.
"పారిపోండి! బెస్టాఫ్ లక్!" అన్నాడు నూట పదకొండు. తనకి మృత్యువు ఆసన్నమయిందని అతనికి తెలుసు. అవే అతని చివరి మాటలు.
అపురూప చెయ్యి పట్టుకుని ఒక్క అంగలో గుమ్మం దాటేసి, వెనుదిరిగి చూశాడు అజిత్. ఇప్పటిదాకా వాళ్ళు కూర్చుని ఉన్న కుర్చీలలో లక్ష ఓల్టుల కరెంటు ప్రవహిస్తున్నట్లు మెరుపులు.
స్విచ్ మీద చెయ్యి వేసిన కేర్ టేకర్ చెయ్యి వెనక్కి తీసేసుకోలేక, కరెంటు గజగజలాడిస్తూ వుండగా, వణికిపోతూ, తను ఇన్నాళ్ళూ ఎంతమందినో గురిచేసిన "ఉత్తుత్త చిత్రహింస" తన పట్ల నిజంకాగా వళ్ళంతా మంటలు రేగి మరణించాడు.
లోపంతో ఆ లోకంలో పుట్టి అందరిలా కాకుండా ప్రత్యేకంగా వున్నందుకూ, ఆలోచించే మనసూ, జాలిపడే హృదయం వున్నందుకూ అతన్ని నాశనం చేసేశాడు డిక్టేటరు.
మరొక్క క్షణం అక్కడే వుంటే తామూ అంత భయంకరంగా మరణించి వుండేవాళ్ళమని అర్ధమయింది అపురూపకి.
ఎదురుగానే వాళ్ళ ఎయిర్ కారు కూడా వుంది. దాన్ని కూడా కేర్ టేకర్ కి అప్పగించడానికి అక్కడ నిలిపినట్లున్నారు.
కారుని చూడగానే ప్రాణాలు లేచివచ్చి, 'బతికి పోయాం' అనుకున్నారు.
వాళ్ళిద్దరూ పరిగెత్తి దాన్లో ఎక్కిన మరుక్షణం అది గాలిలోకి లేచింది. కిందనుంచి సైనికులు మిసెల్స్ వదులుతూ వుండడం కనబడింది. కానీ అదృష్టవశాత్తు అప్పటికే అవి తగలనంతదూరం వెళ్ళిపోయారు అజిత్, అపురూప.
అప్పుడు ఆకాశంలో కనబడింది ఫ్లయింగ్ సాసరు. ఇదివరకటిలా వెండిలా మెరవటం లేదు. బంగారంలా, పచ్చగా వుంది ఇప్పుడు అది.
"దాన్ని ఈసారి మిస్ కాకూడదు" అంటూ స్పీడ్ పెంచాడు అజిత్.
ఆ ఫ్లయింగ్ సాసరు అల్లంత దూరంలో నిశ్చలంగా నిలబడి ఉన్నట్లుంది. అసలు కదులుతున్నట్లే అనిపించడం లేదు. అది కనబడుతున్న దూరాన్ని బట్టి ఉజ్జాయింపుగా చూస్తే, రెండు మూడు సెకండ్లలో దాన్ని సమీపించాలి కారు. కానీ అయిదు నిమిషాలయినా అది దగ్గర కావటం లేదు. చిత్రంగా దానిలో కదలికా కనపడటం లేదు.
ఎంతసేపు పోయినా రెండిటిమధ్యా ఒకే దూరం మెయిన్ టెయిన్ అవుతోంది.
కావాలని స్పీడు తగ్గించాడు అజిత్. స్పీడు తగ్గించినా అది దూరం కాలేదు.
'తను భ్రమపడటం లేదుగదా?' అని మొదటిసారిగా అనుమానం వచ్చింది అజిత్ కి.
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కాంతికిరణాలు తనకి భ్రమకి కలిగిస్తున్నాయా?
కానీ అది తూరుపు దిశకాదు పశ్చిమం!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra