"ఆవిడా పోయింది" అంటూ అక్కణ్నుంచి కదిలేదు. స్పూర్తితోకలసి వీధిలోకి వచ్చాక. "ఇప్పుడేం చెయ్యాలిక" అని అడిగాడు స్వగాతంలా.
"రాత్రంతా ప్రయాణంలో వున్నావ్ కదా, గెడ్డం, గీసుకుని స్నానం చేసి కోర్టుకెళ్ళమే" అన్నాడు స్పూర్తి.
"వెళుతున్నది అత్తవారింటికి కాదు గురూ, జైలుకి... డానికి గెడ్డం గీసుకోవడం కూడా ఎందుకు _ అదో దండగ" అన్నాడు.
చిరంజీవి "నువ్వు స్నానంచేసి, ఆ నల్ల కోటు వేసుకుని కోర్టుకిరా."
స్పూర్తి ఆశ్చర్యంగా "ఎందుకు" అని అడిగాడు.
"నా వైపు వాదించటానికి."
"ఏం నువ్వు సవ్యంగా బైటపడడం ఇష్టం లేదా?"
ఈ పరిస్థితుల్లో ప్రసిద్ద క్రిమినల్ లాయరు సర్వోత్తమారావుగారు స్వయంగా వచ్చి వాదించినా నేను బైటపడనుగానీ __ నువ్వే రా ఛాన్సు తీసుకుందాం."
"మరి నువ్వేం చేస్తావ్"
"తోమ్మిదవోస్తూంది ఇంకో గంట టైముంది. ఆ సుశీల గదీ __ముసలమ్మ ఇల్లూ వెతుకుతాను. చూద్దాం. ఏ పెట్టెలో ఏసామానుందో."
9
గడియారం తిమ్మిదిన్నర కొట్టింది. సర్వోత్తమారావు కోర్టుకి వెళ్ళిపోయాడు.
అర్చన వెళ్ళలేదు.
చిరంజీవి నిర్దోషిని మనసు చెబుతుంది. కానీ రక్షించటం ఎలా? కోర్టు ఎలా నమ్ముతుంది?
ఏమీ తోచలేదు. శారీరకంగా కన్నా,మానసికంగా బాగా క్రుంగిపోయి వుంది.
ఆమె లేచి కిటికీ దగ్గరకి వెళ్ళి తలుపు తెరచిబైత తోటలోకి చూసింది. గేటు దగ్గర గూర్ఘా కనబడలేదు. రామయ్యని పిలిచి రామయ్యని పిలిచి అతడి సంగతి అడిగింది.
రెండ్రోజులు సెలవు పెట్టాడమ్మా" అని చెప్పేసి వేళ్ళాపోతూ ఆగి, "కొంచెం హార్లిక్స్ తీసుకుంటారా?" అని డిగాడు.
ఆమె తలూపింది, అతడు వెళ్ళి తీసుకొచ్చాడు.
అందుకుంటూ "రంగమ్మఏది? అని అడిగింది. ఆమె కంఠంఆమెకే నీరసంగా ధ్వనిస్తూంది.
"వెచ్చాలు తీసుకురావటానికి పచారు కొట్టుకు వెళ్ళింది." అని, ఖాళీ కప్పు తీసుకుని అతడు వెళ్ళిపోయాడు.
గదిలో నిశ్శబ్దం అలుముకుంది.
కరెంటు పోయినట్టుంది, ఎయిర్ కండిషనర్ పని చెయ్యటం లేదు. ఉన్నట్టుంది ఆ గదిలో శిఇన్యత వ్యాపించినట్టయింది.
ఆ కారణంగా ఆమె వెన్ను ఒక్కసారి జలదరించినట్టయింది.
ఆ గదిలో ఎవరో పొంచినట్టూ__ తనని అనుక్షణం గమనిస్తూన్నట్టూ భావన. ఆమె గదిలోంచిబైటకొచ్చింది. వరండాలో ఎవరూ లేరు. క్రింద హాలు కూడా నిర్మానుష్యంగా వుంది.
ఆ నిశ్శబ్దంగా భంగపరుస్తూ గది కంపిమ్చేలా టెలిఫోన్ మోగింది. ఆమె రిసీవర్ అందుకుని "హలో" అంది.
"నేనమ్మా" అయన కంఠం అందోళణంగా పలికింది అవతల్నుంచి.
"ఏమైందంకుల్"
"చిరంజీవి ఏమయ్యాడోతెలియటం లేదు. ఇప్పటివరకూ కోర్టుకె రాలేదు."
ఆమె విస్తుపోతూ గడియారం వంక చూసింది. పది నిముషాలుతక్కువ పది.
అవతల్నుంచి సర్వోత్తమఠంరావు కంఠం కోపంగా వినిపిస్తూంది. అందులో నిస్సహాయత కూడా ద్వనిస్తూంది. '_ఏమయ్యాడు ఇతను? ఇదేమన్నా కోర్టు అనుకున్నాడా_ ఆటలనుకున్నడా? అందులోనూ 'లా' చదివినవాడు.'
"ఇప్పుడేం చెయ్యాలి అంకుల్?" అమీ తావుచానట్టూ అడిగింది.
"అదే నేనూ ఆలోచిస్తున్నాను ..... ఇంకో పదినిముషాలు ఆగి ఫోన్ చేస్తాను మళ్ళీ."
ఆమె ఫోన్ పెట్టేసింది.
ఎక్కడున్నాడు చిరంజీవి? ఏం చేస్తున్నాడు?? కోర్తుకున్నా ముఖ్యమైనా పని ఏముంది! ఇప్పుడిక కోర్టు వారెంటు ఇస్తుంది....! పోలీసులు అతడి కోసం వెతకుక్కలా పడతారు...! చేతులకి సంకెళ్ళు వేసి తీసుకేళ్తారు......! ఇదంతా అతడికి తెలీదూ? తెలిసీ ఇంత బాధ్యాటారహితంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు?
అసలెక్కడున్నాడు??
* * * *
ఒక క్షణం తటపటాయించింది తలుపు తెరచి లోపలి ప్రవేశించాడు చిరంజీవి. లోపల గది ఘోరంగా వుంది. ఒక మూల కుక్క పడుకుని వుంది ఇంకో మూల ఎవరో వంటకోసం రాళ్ళు పెర్చుకున్నారు.
ముసలమ్మా చచ్చిపోవటంతో ఆ గది బిచ్చగాళ్ళ సొత్తు అయినట్టుంది __ తామే వారసుల్లా దాన్ని స్వంతం చేసుకున్నట్టున్నారు.
ఆ గదిలో సామానులేమీ లేవు. అన్నీ ఎప్పుడో ఎవరికీ దక్కినవి వరు తీసుకుపోయారు.
దాని పక్క గది సుశీలది.
రెండింటికీ మధ్య తలుపు వుంది. అది అట్నుంచి గడియవేసుకుంది.
వెనుక పెరటివైపు తలుపు లాగి చూసేడు. లూజుగానే వుంది.
తనని ఎవరూ బైట రోడ్డుమీదనుంచి గమనించటంలేదని ధ్రువపరచుకుని వెనుదిరిగి అతడు తలుపుని బలంగా భుజంతావు కొట్టాడు.
గడియ ఊడుతూంది.
అయితే అతనానుకొన్నట్టూ లోపలిగది కాళీగాలేదు, అందులో ఒక ఫకీరులాటి వ్యక్టి నిద్రపోతున్నాడు. తలుపు చప్పుడకు అదిరిపడి కళ్ళు విప్పి __గడియ విరుగుతున్నదని గ్రహించి __ వెనుకవైపు తలుపుతీసి పిల్లిలా జారుకున్నాడు.


