"అబద్ధం చెప్పటమనే ప్రసక్తే లేదు" అందామె దృడంగా.
"అయితే నువ్వే డిఫెన్స్ లాయర్ వి అనుకుని __ చెప్పు. ఎలా వాదిస్తావో?"
"నూతిదగ్గర సిగరెట్ పీకెలు ఎలావచ్చాయి?" లాయర్ లా అడిగింది.
"సర్వోత్తమరావు, చిరంజీవి అనే వాళ్ళిద్దరూ__ నాటకం ఆడటం కోసం అక్కడ జల్లేరు. అయితే సుశీల మరణానికీ, ఈ సిగరెట్ పీకెలకిఅసలు సంబంధం లేదు. ఆమె మరణం అంతకుముందే సంభవించింది. "
"ఆ మాటకొస్తే 'సాయంత్రం ఆరింటికి సత్రం దగ్గర కలుసుకో" అని ఉత్తరం వ్రాసి ఆమె హాండ్ బ్యాగ్ లో పెట్టింది కూడా మీ ఇద్దరేగా ."
"కోర్టు దాన్ని నమ్మాలని రూలేం లేదు. చిరంజీవి నిజంగా నిర్దోషి కాని పక్షంలో నిజంగానే ఆ సాయంత్రం ఆరింటికి అతడు సుశీల్ని సత్రం దగ్గర కలుసుకున్నాడేమో!"
ఆమె అదిరిపోయి"ఈ ఆర్గ్యుమెంట్దారుణం" అంది.
"కోర్టుకి దారుణాలూ __ దర్భణాలు అని వుండవమ్మాయ్. చెవులే వుంటాయి. ప్రతిదీ 'ఫై, మాఫేసీ' నిరూపించాల్సిందే! మనం ఈ కేసు టేకఫ్ చెయ్యగానే ప్రాసిక్యూషన్ ఏ పునాది మీద వాదన మొదలు పెడుతుందో తెలుసా 'చిరంజీవికి సుశీల ముందే తెలుసు ముందే తెలుసు ఆమెని వదిలించుకోవటానికి ప్లాన్ వేసేడు. డానికి సర్వోత్తమరావు అనే అయన సాయం తీసుకున్నాడు' అని అడ్డంగా వాదిస్తుంది."
"కానీ 'సాయంత్రం ఆరింటికి రా' అన్న ఉత్తరం మీరు వ్రాసిందేగా?"
"నా సాక్ష్యాన్ని కోర్టు నమ్మాలని రూల్ లేదు. నేను డిఫెన్స్ లాయర్ని. అతడు నా మేనకోడలకి కాబోయే భర్త.
"అంటే సాయంత్రం ఆరింటికి వాళ్ళిద్దరూ కల్సుకున్నారంతావా?"
"పాత స్నేహితులు.... కలుసుకుని వుండొచ్చు. ఘర్షణ కూడా జరిగి వుండవచ్చు. అందుకే 'అమ్మయ్య__వదిలించుకున్నాను' అని అతడు డైరీలో వ్రాసుకుని వుండవచ్చు" అని ఆగి నెమ్మదిగా,"ఇదంతా నేను చెప్తుంది కాదు ప్రాసిక్యూషన్ వాదిస్తుంది ఇలా" అన్నాడు.
ఆమె అర్ధమైనట్టు తలూపింది.
ఒకక్షణంచేతి గొళ్ళవైపూ __ వాటికి వేసిన పాలిష్ వైపూ చూసుకుంటూ మౌనంగా వుండి __ ఆ తరువాత నెమ్మదిగా అన్నది. "ఆ సాయంత్రం చిరంజీవి సుశీల్ని కలుసుకోలేదు అంకుల్."
"ఎలా చెప్పగలవు?"
"ఆ సాయంత్రం ఆరింటికి అతడు సత్రం దగ్గరలేడు."
"మరెక్కడ వున్నాడు?"
"అద్దెకు తీసుకున్న కారులో..... అమ్మేసిన మెడల్స్ తో __ హొటల్ ఎషియాలో నాకు డిన్నర్ ఇస్తున్నాడు. 'పోర్క్ మధ్యలో కత్తిపెడ్తే ఏమవుతుంది.' అని అక్కడ వెయిటర్ ని అడిగాడు. 'ఐ లవ్యూ సర్' అని అతడనగానే హొటల్ కప్పు ఎగిరిపోయేలా 'హుర్రే .... హుర్రె ' అని అరిచాడు. అరిచాడు వీటన్నిటికీ మనకి సాక్ష్యులున్నాయి."
సర్వోత్తమరావు విభ్రాంతితోఅర్చన మోహం వైపు బ్లాంక్ గా చూసేడు. కొంచెం సేపటికి తెప్పరిల్లి "అవునుకదూ" అన్నాడు. మళ్ళీ సాలోచనగా "ప్రసిక్యూటర్ వాళ్ళుఇంకో పాయింటు లేవదీయొచ్చుఅమ్మాయ్" అన్నాడు. "చిరంజీవి కధనం ప్రకారం అతడు తన గదిలో మామూలుగా పడుకుని వుండగా __ ఓ అర్దరాత్రి పూట దారాసింగ్ వచ్చిలేపాడు."
"అవును. అదే జరిగి వుండవచ్చు."
"ఎలా? చిరంజీవి డైరీలో సుశీల గురించీ__ ఆమెని వదిలించుకోవటం గురించీ వ్రాసుకున్న్డు కదా."
"ఆ విషయం నేనూ అలోచించాను" అంటూ హ్యండ్ బ్యాగ్ లోంచి కాగితాలు తీసింది అర్చన. చిరంజీవి డైరీలోంచి చింపిన కాగితాలు అవి.
"సుశీల్ని నేను వదిలించుకున్నాను! అని చిరంజీవి ఎప్పుడు వ్రాసుకున్నాడు? తేదీ చూడుంకుల్. సుశీల మరణానికి నేలరోజుల ముందు వ్రాసుకున్నాడు." అని కాగితాలు అతడికిందిమ్చి కుర్చీ వెనక్కీవాలింది.
ఆ గదిలో కొంచెంసేపు గాడమైనా నిశ్చబ్ధం తాండవించింది. డైరీ పేజీలు చదవటం పూర్తీచేసి సర్వోత్తమరావు తలెత్తాడు. ఆమె అయన మోహంవైపు అత్రుతగా చూస్తూంది. అయన నెమ్మదిగా నవ్వి "నిన్ను 'లా' చదివించకుండా డాక్టరీ చదివించటంలో నేనెంత తప్పు చేసెనో అర్ధమవుతూందమ్మాయ్" అన్నాడు.
ఆయనేమంటాడో అని ఆత్రంగా చూస్తున్న అర్చన మోహం ఈ మాటలకి సంతోషంతో వెలిగిపోయింది.
"అప్పుడే ఏముంది అంకుల్__ ఇంకొక్క విషయం చెపితే నువ్వు ఎగిరి గంతెస్తావ్?" అంది వుత్సాహంగా.
"గంతు వెయ్యలేనుగానీ అదేమిటో చెప్పు.
"సుశీలని రేఫ్ చేసినవాడి మెడలోంచి ఒక రాగిబిళ్ళ జారిపడింది. దానిమీద లంగర్ బొమ్మ వుంది. నీకు తెలుసా అంకుల్ ఆడేవారు వేసుకుంటారో ....."
"ఉహూ"
"ఓడల మీద తిరిగేవాళ్ళు వేసుకుంటారు. ఓబులేసు ఫకీరు. వాడికి ఓడ అంటే ఎలా వుంటు౦దో కూడా తెలీదు. సుశీలని రేఫ్ చేసింది ఎవడో ఓడ కళాసి! ఆ లోకాలిటీలో వాడిని పట్టుకోవటం పోలీసులకి పెద్ద కష్టం కాదు" అని చెప్పటం ఆపింది.
"అద్భుతం __ నిజంగా నీ తెలివితేటలు అద్భుతం అమ్మాయ్! అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ! ఈ ఆధారాలతో ప్రాసిక్యూషన్ వాదనని ముక్కలు ముక్కలుగా విరగోట్టేయ్యవచ్చు. చిరంజీవి బైటపడ్తాడా, లేదా అన్నది తరువాత కానీ, రేపు బెయిల్ తప్పక దొరుకుతుంది. చాలా కష్టపడ్డావు . కంగ్రాట్స్ ...."
ఆమె సోఫాలోంచి లేచి, చిరునవ్వుతో " థాంక్స్ అంకుల్" అంది.
* * * *


