Home » Yarlagadda sarojani devi » కావేరి

    ముందుగా చూసి నాగులుని గుర్తు పట్టలేకపోయాడు. ఈ మధ్య అసలు కలవలేదు. కలిసి కూడా చాలా కాలమయింది. అదయినా కావేరీకి తనకి వివాహమని లగ్నం పెట్టుకున్న తరువాత రెండవ ఆట సినిమాకి వస్తే ఎంతో మర్యాద చేశాడు నాగులు!

    ఆ రోజు కలవటమే! మరలా కలవలేదు! నాగులు బాగా వళ్ళు చేయటం, క్రింద పెదవి కనిపించకుండా మీసాలు పెంచటం, ఖరీదుగల బట్టల్లో ఎంతో హుందాగా వున్నాడు.

    సైకిల్ ని ఆపి స్టాండు వేశాడు వినాయకం!

    "ఈమధ్య బొత్తిగా కనిపించటం లేదేమిటి బాబుగారూ?"

    అనడిగాడు నాగులు!

    "ఏదో టైంలో వచ్చి వెళుతుంటాను."

    "మీకు అదే లగ్నానికి పెళ్ళి అయిందని తెలిసిందండీ?"

    "అవును!..."

    "అమ్మాయిగారికి సినిమాపిచ్చి వుందని నాకూ తెలుసు! అందుకే సినిమా వాల్ పోస్టర్సు, సినిమా పాటల పుస్తకాలూ తెచ్చి యిస్తుండేవాడిని! యింట్లోనుంచి లేచి వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతుందని అనుకోలేదు!..." అన్నాడు నాగులు ఎంతో విచారంగా!

    "ఏం చేస్తాం?...కావేరీకి ఆ బుడ్డి పుట్టింది!....వంటరిగా వెళ్ళి అక్కడ ఎన్ని బాధలు పడుతున్నదో?"

    "మీరింకా అమ్మాయిగారిని మరిచిపోలేదా బాబుగారూ?"

    "ఎలా మరువగాలను? చిన్నప్పటినుంచీ ఒకేచోట వుండి పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం! కాబోయే భార్యా భర్తలుగా నమోదుఅయిపోయాం ఇంతలోనే ఇలా చేస్తుందని అనుకోలేదు!"

    "ఈ విషయం ఆలస్యంగా తెలిసింది నాకు! పరామర్సకి వస్తే మీరు మరింత బాధపడతారని రాలేకపోయాను."

    వినాయకం ఏం మాట్లాడలేకపోయాడు. కావేరీతో తను గడిపిన రోజులను గుర్తు చేసుకోసాగాడు.

    "మీరేమీ అనుకోనంటే మీకొక విషయం చెప్పాలనిపించింది. అందుకే పిలిచాను!...అన్యదా భావించవలదు!...."

    "నేనేమీ అనుకోను! చెప్పు నాగులూ!"

    స్కూటర్ బాగ్ లోనుంచి ఒక ప్రముఖ సినీవారపత్రికను, మరి కొన్ని వారపత్రికలు తీసి సీటుమీద వుంచి ముందుగా సినీవారపత్రిక పేజీలు తిప్పి ఓ పేజీ దగ్గిర ఆగి మడతపెట్టి వినాయకం చేతికి ఇచ్చాడు చూడమని!

    ఆ పేజీనిండా రకరకాల దుస్తులుతోను, ఆధునీకంగా వుండి కెమెరాకి ఫోజులిస్తున్న కావేరీని "కావ్యశ్రీ" గా తొలిసారిగా నూతన నటిని తెరకి పరిచయం చేస్తున్న నిర్మాత వేలాయుధం."

    అన్న పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడివున్నది. సినిమా షూటింగ్ వివరాలు, నటి కావ్యశ్రీని గురించిన పరిచయం వ్రాయబడివుంది అదంతా చదవాలన్న ఉత్సుకత కలిగింది వినాయకానికి.

    రకరకాల దుస్తులతో ఎంతో అందంగా వుంది వినాయకం కళ్ళకి కావేరీ!

    "మొత్తంమీద తన కోరిక నెరవేర్చుకుంది అమ్మాయిగారు! సినీఫీల్డులో యింత త్వరగా హీరోయిన్ గా రావటం చాలా గొప్ప అదృష్టం. అందునా వేలాయుధం సినిమాలంటే జనం పడిచస్తారు. ఎన్ని సంవత్సరాలయినా ఆ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్సు తప్ప తక్కువ కలక్షన్సు ఎప్పుడూ వుండవు! అలాంటి ఆయన సినిమాల్లో నటించుతున్నదంటే? ఈ సరికే ఎన్నో సినిమాల్లో బుక్ అయిపోయి బిజీగా వుండివుంటారు అమ్మాయిగారు.

    అమ్మాయిగారి కోసమయినా మద్రాసు వెళ్ళాలి! మీరు కూడా వస్తారా బాబుగారూ? యిద్దరం వెళ్దాం?"

    "ఇద్దరం వెళ్ళే సంగతి తరువాత చెప్పుతానుగాని ఈపత్రిక నేను తీసుకెళతాను. చదివి ఈసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి యిస్తాను!" అన్నాడు మడతపెడుతూ!

    "ఈ పత్రికల్లో కూడా అమ్మాయిగారి ఫోటోలు వేశారు. కావాలంటే యివి కూడా తీసుకెళ్ళండి. నాకు అవసరం లేదు!"

    అని అవి కూడా మడత పెట్టి వినాయకనైకి యిచ్చాడు.

    వాటినన్నింటినీ చేతి సంచిలో పెట్టుకుని సైకిల్ కి తగిలించుకుని నాగులు దగ్గిర సెలవు తీసుకుని బయలుదేరాడు.

    కొంతదూరం వచ్చిన తరువాత సైకిల్ ని ఆపాడు. ఎవరూ లేనిచోట కొంతసేపు కూర్చుని కావేరి ఫోటోలు చూడాలని, కావేరి గురించి ఏం వ్రాశారో చదవాలనిపించి అటూ యిటు చూశాడు.

    అది ప్రధాన రహదారి కావటం వలన ఎవరో ఒకరు వెళ్ళటం రావటం జరగటంతో, యిక్కడయితే లాభం లేదనుకుని సరాసరి తన గ్రామం వచ్చి యింటికి వెళ్ళకుండా పొలం వెళ్ళి ఎవరికీ తను కనిపించకుండా వుండేలా కూర్చుని సంచిలో నుంచి పుస్తకాలు తీశాడు. ముందుగా నాగులు చూపించిన పత్రిక తెరిచి కావేరి ఫోటోలున్న పేజీ తీసి పదే పదే ఆ ఫోటోలను చూసుకున్నాడు. తనను గురించి వ్రాసినదంతా చదివి చిన్నగా నిట్టూర్చాడు. మిగతా పత్రికల్లో ఏం వ్రాశారో చదివాడు! ఇంత ఎక్కువగా రాయలేదు గాని వ్రాసింది కొంచెం అయినా, "కావేరి గొప్ప నటీమణి అవుతుందని, అవగలదని!" అంటూ క్లుప్తంగా వ్రాసి వుంది.

    "ఒక్కతే వెళ్ళిందా? లేక ఇంకెవరయినా తోడు వున్నారా?" అన్న సందేహం కలిగింది.

    ఒక్క దానికేం తెలుసు?...నాటకాలు వేయించిన ఆ మాస్టారే తీసుకెళ్ళివుంటాడు. వాడికే తెలుసు సినిమాల సంగతి!

    అని సమాధానపడ్డాడు బాధతోనే! కావేరీని దాదాపు అందరూ మరిచిపోయారు.

    పరంధామయ్య సుభద్రమ్మలయితే తమ కూతురు చనిపోయిందన్నట్లుగానే భావించుకుని, ఆ శోకం నుంచి యిప్పుడిప్పుడే తేరుకున్నట్లుగా నాలుగు గోడల మధ్య నుంచి వెలుపలికి వచ్చి గాలి పీల్చుకోసాగారు....తనయితే సుబ్బులుతో కాపురం చేస్తున్నాడేగాని కావేరి గుండెల్లో నిలిచిపోయింది. మరిచిపోవాలని ప్రయత్నించి విఫలుడై పోయాడు.

    అందునా సుబ్బులు ఎత్తిపొడుపు మాటలు! తను పరధ్యాన్నంగా వుంటే చాలు!

    "కావేరి గుర్తు వచ్చినట్లున్నదే?..."

    తను మాట్లాడకపోతే మరలా అంటుంది.

    "అవునులే!...ఎలా మరిచిపోతారు? దానికి స్నో, పౌడర్లు, పుస్తకాలు తెచ్చిచ్చేవాళ్ళయ్యే!....సైకిల్ మీద స్కూలుకి సినిమాలకి తీసుకెళ్ళి తిరిగి తిరిగి తెలవారుఝాముకి వచ్చే వారయ్యే?...చిన్నప్పటినుంచీ ఒక మంచంలో పడుకుని, ఒక కంచంలో తిన్నవాళ్ళయ్యే! మరిచిపోవటం సాధ్యమా?"

    ఆ సూటీపోటీ మాటలు భరించలేక తనులేచి దూరంగా వెళ్ళిపోతే చాలు! వలవలా ఏడ్చేస్తూ ఎత్తుకునేది దండకం!

    "అది పోతూ పోతూ నిన్ను గూడా తీసుకెళ్ళవలసింది. నిన్ను నా పాలిత పడవేసిపోయింది. లోకం కోసం న్నను పెళ్ళి చేసుకున్నావు గాని నన్ను సుఖ పెట్టటానికా? దాన్ని తలుచుకుంటూ జపం చేయటమే నీ పని అయిపోయింది!"

    సుబ్బులు ఎందుకు ఏడుస్తున్న దోనని భయంతో వంట యింటిలో నుంచి పరిగెత్తుకు వచ్చేది కామాక్షమ్మ.

    "ఏం జరిగింది రా వినాయకం?"

    అని కొడుకునయిన తననే అడిగేది గాని కోడలిని అడిగేది కాదు! కొడుకే లోకువ అయిపోయాడు ఈ మధ్య! కోడలిని ఏమయినా అంటే పుట్టింటికి వెళ్ళిపోతానంటుందేమోనన్న భయం! కూతురిని వెనుక వేసుకుని వెంకయ్య సీతమ్మ తన మీద యుద్ధం ప్రకటించుతారేమోనన్న హడల్!
 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra