Home » Yamini saraswathi novels » Madyataragati Manishi


    పరంధామయ్యగారి ఏకైక పుత్రిక జయంతి. ఎలిమెంటరీ స్కూలు చదువు పూర్తి చేసింది. అప్సరసలా ఉంటుంది. కళ్ళు తిరిగిపోయే సౌందర్యం ఆమెది.
    ఫోటో తెచ్చి చూపాడు పరంధామయ్య.
    ఇంత అందంగా ఉన్న అమ్మాయి అయితేనే అబ్బాయిగారిని తన కొంగున ముడివేసుకోగలదు అనుకున్న రమణ మాణిక్యమ్మతో ఆ సంబంధానికి తన అంగీకారం తెలిపాడు.
    మాణిక్యమ్మగారికి కూడా జయంతి చాలా నచ్చింది.
    కోటేరు వేసినట్లున్న ఆ ముక్కుతీరు, విచ్చుకున్న కలువల్లాంటి కనులు, చిన్న పెదాలు, మొనతేలిన గడ్డం, చక్కని నుదురు, జయంతి అందానికి మెరుగులు దిద్దాయి.
    చంద్రం కూడా ఓకే అన్నాడు.
    "ఇక అబ్బాయి వచ్చి అమ్మాయిని చూస్తే అన్ని మాట్లాడుకోవచ్చు" అన్నాడు పరంధామయ్య.
    "అలాగే, అన్నగారూ! అబ్బాయినీ, రమణనీ మంచిరోజు చూసి పంపుతాను" అంది మాణిక్యమ్మ.
    "నీవూ వచ్చి చూసుకోవమ్మ కోడల్ని" అన్నారాయన.
    నవ్వింది మాణిక్యమ్మ. "అన్నగారూ! చంద్రానికి నచ్చితే అంతేచాలు. కలకాలం కాపురం చెయ్యవలసినవాడు వాడు. పెద్దలమీద నింద వేయకుండా వాళ్ళకై వాళ్ళు ఎన్నుకుని పెళ్ళి చేసుకుంటే తర్వాత మనబాధ్యత అంటూ ఉండదు. మన తప్పూ ఉండదు. అయినా అపరంజి బొమ్మలా ఉంది అమ్మాయి. ఇక నే వచ్చి చూడవలసిన అవసరం లేదు. అబ్బాయయినా అమ్మాయి చూడటానికే వస్తున్నాడు" అంది.
    ఆమె విచక్షణకి, దూరపు చూపుకి చాలా సంతోషించాడు పరంధామయ్య.
    తర్వాత మంచిరోజు చూసుకుని చంద్రం, రమణ ఇద్దరూ వెళ్లారు. ఆయన చేసిన స్వాగత సత్కారాలు చూసి రమణ ఇది అన్నివిధాలా తగిన సంబంధం అనుకున్నాడు. పరంధామయ్యగారి కుమారుడు సురేష్ తో మాట్లాడాక రమణ మనస్సు ఇంకా తేలికయింది. ఈ సాంప్రదాయబద్ధమైన సంబంధం చంద్రాన్ని సక్రమ మార్గంలో పెడుతుందనుకున్నాడు.
    నిజంగా జయంతిని చూడగానే చంద్రానికీ మతిపోయినట్లయింది. ఆ లావణ్యం, ఆ సౌకుమార్యం అతన్ని అమితంగా ఆకర్షించాయి. విషాన్ని వెదజల్లే అందాన్ని మాత్రమే చూసిన చంద్రానికి అమృతోపమానమైన జయంతి అందం వెన్నెలసోనలాగా కనిపించింది.
    ఇంత సౌందర్యవతి తన భార్య కాబోవటం తన పూర్వజన్మ సుకృతంగా భావించాడు చంద్రం.
    పూర్తి అంగీకారాలు తెలిపాక ముహూర్తాలు పెట్టించి తెలుపుతామన్నారు పరంధామయ్యగారు.
    పరంధామయ్యగారు పెట్టిన కొత్తవస్త్రాలు కట్టుకుని పెళ్ళికొడుకుల్లా వచ్చిన ఇద్దర్నీ చూసి మాణిక్యమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి.


                           *    *    *    


    "మంగీ!"
    మంగమ్మ బదులు పలకకుండా ఏడవసాగింది.
    "ఛీ! ఛీ! నాకు ఏడుపన్నా, ఏడ్చేవాళ్ళన్నా అసహ్యం ఏడవకు"
    "ఏడవకుండా ఏంచేయను? నిన్ను నమ్ముకున్నను. నాం మొగుడికి తెలిసినా నా కాపురం చెడిపోయినా ఫరవాలేదనుకున్నాను. ఇప్పుడు నీవు పెళ్ళిచేసుకుంటూ నన్ను దూరం చేస్తూంటే నాకు ఏడుపు కాక ఇంకేముంది?"
    "నీకోసం పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతానని చెప్పానా? పెళ్ళి చేసుకుంటున్నాను కాబట్టే ఒక వేళ నీ మొగుడికి తెలిసినా నీ బ్రతుకు చెడిపోకుండా ఉండటానికి ఎకరం మాగాణి వ్రాసి ఇచ్చాను."
    "నాకు ఆస్తి కావాలా? కాయకష్టం చేసుకున్నా నా బ్రతుకు వెళ్ళమారిపోతుంది. కానీ, నీ వల్ల నన్నా నా కడుపున ఓ కాయ కాస్తే ఆ బాబుని చూసుకుని జీవితం వెళ్ళమార్చుకుందామనుకున్నాను. నా ఆశ నిరాశే అయింది."
    "మంగా! అవన్నీ వ్యర్ధమైన ఆశలు. ఫలితంలేని కోరికలు. ఇప్పటికే నేను చాలామంది దృష్టిలో పడ్డాను. ఎవరయినా చూచాయగా చెప్పారో ఏమో మా అమ్మ నా పెళ్ళి జరిగితీరాలని పట్టుపట్టింది. రమణ చూపు ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన సంబంధాలు ఎప్పటికయినా తాత్కాలికమయినవే, శాశ్వతం కావాలనుకోవటం అవివేకం."
    మంగమ్మ మళ్ళీ ఏడవ సాగింది.
    చంద్రం లేచి నించున్నాడు వెళ్ళిపోవటానికి.
    అతని కాళ్ళకు పెనవేసుకుని "చంద్రయ్యా! నా బ్రతుకులో ఆనందమంటే ఏమిటో, సుఖమంటే ఏమిటో చూపించావు. నా కంట నీరు తిరిగితే కదిలి పోయేవాడివి, మృగంలా ఉండేదాన్ని నన్ను మనిషిని చేశావు. పసుపులా ప్రవర్తించే నాకు నడక నేర్పావు. మొరటుదాన్ని నాకు మాట మరియాదా నేర్పినావు. ఈ రోజు మన ఎడబాటుకు నేను ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా వెళుతున్నారా? చంద్రా! చంద్రా! నన్ను చూడు. నా మనసుని చూడు నీవు సేద తీరిన ఈ గుండెలు నీ వియోగానికి ఎలా ఎగిరెగిరి పడుతున్నాయో చూడు. ఈ చూపు చివరి చూపు చెయ్యవద్దు. మళ్ళీ ఒక్కసారి - ఒక్కసారయినా నీ అనుగ్రహం నా మీద పొర్లిపారనీ" అని ఏడవసాగింది.
    చంద్రానికి గతమంతా ఒక్కసారి కళ్ళముందు తిరిగింది. తమ ప్రేమలూ తమ విహారాలూ అన్ని గుర్తుకొచ్చాయి. మంగను తనెంత సంస్కరించిందీ అవగతమయింది. 'మొరటు మొగలిపువ్వు అయింది అనుకున్నాడు ఒక్కక్షణం అతని మనస్సు మంగపై తిరిగింది.
    అంతలో తన సంసారం, కుటుంబ పరువు ప్రతిష్టలు, తన పెళ్ళి కాబోయే భార్య జయంతి కళ్ళముందే మెదిలినవి.
    ముఖ్యంగా జయంతి గుర్తుకురాగానే అతని మనస్సు పరవశించింది.
    అనాఘ్రాత పుష్పసౌందర్యానికీ, వాడిన పూవు పరిమళానికీ ఎంత తేడా! అనుకున్నాడు.
    జయంతి చుట్టూ పరిభ్రమిస్తూన్న మనస్సు మంగని పూర్తిగా మరిచిపోయింది.
    "మంగా! ఇక వాదాలతో, వడ్డింపులతో నా మనస్సుని ఏమీ చేయలేవు. ఇంటి యజమానిగా నా బాధ్యత నాకుంది. నిజంగా నీవు నాకు ఎంతో మంచి కంపెనీ ఇచ్చావు కాదనను. అదినేనూ మరిచిపోలేదు. అందుకే నీకు బ్రతుకు తెరువు చూపించాను. అంతటితో మన సంబంధం తీరిపోయిందని అనను కానీ, మనం విడిపోవాలి. తప్పదు కానీ ఒక్కమాట చెపుతున్నాను. విను. నీ మనసైన వేళలో నిన్ను చూడటానికి నా కభ్యంతరంలేదు."
    గది దాటి బయటికి పోబోతున్న అతనితో "చంద్రం! ఇక నీ ఇంటి చాకిరికి ఇంకెవరినయినా చూసుకో! చేతికందిన స్వర్గం చేజారిపోయి ఎదురుగా ఉండి ఉవ్విళ్ళూరిస్తూ ఉంటే చూస్తూ ఉండటానికి నా మనస్సు బండకాదు, గుండె" అంది.
    చంద్రం బయటికి వెళ్ళిపోయాడు.
    మరో అయిదు నిమిషాలకి బయటికి వచ్చిన మంగమ్మకి రమణతో మాట్లాడుతున్న చంద్రం కనిపించాడు. రమణకు జంకిన మంగమ్మ ముఖం తప్పించాలని అనుకుంది కానీ, రమణ చూడనే చూశాడు. జరగవలసింది జరిగిపోయాక ముఖం తప్పించుకుని వెళ్ళినా ఫలితం లేదనుకున్న మంగ చకచకా వాళ్ళ ముందే ఇంటికి వెళ్ళిపోయింది.
    ఇంజన్ రూములోనుంచి ముందు బయటికి వచ్చిన చంద్రాన్ని తర్వాత వచ్చిన మంగనీ చూసిన రమణ మనస్సుకి 'ఛీ!' అనిపించింది.
    అసహ్యంగా తన వేపు చూస్తున్న రమణని చూసి, "రమణా! అంతగా అసహ్యించుకోవద్దు. మనిషన్న తర్వాత తప్పు చేయకుండా పోడు. కానీ, చేసిన తప్పు దిద్దుకుంటున్న వ్యక్తికి ఇంకా అసహ్యించుకోవద్దు. యవ్వనంలో జారిన కాలుని మెల్లమెల్లగా తీసుకుంటున్నాను" అన్నాడు చంద్రం.
    "అత్తవారింటికి వెళ్ళే అమ్మాయి కొందరి వద్దా సెలవు తీసుకున్నట్టుగా వివాహానికి ముందు అందరి వీడ్కోలూ తీసుకుంటున్నావన్న మాట! అదే నిజమయితే చాలా సంతోషం. కానీ. విషపు గాలులు మళ్ళీ వీచకుండా చూసుకోవాలి మరి" అన్నాడు రమణ.
    రెట్టించి వాదించలేదు చంద్రం.
    మెల్లగా ఇంటి ముఖం పట్టాడు.


                                                        4


    వైశాఖ శుద్ధ పంచమి బుధవారం నాకు మేషలగ్నపుష్కరాంశలో శుభ ముహూర్తాన్ని నిశ్చయించి పంపినాడు పరంధామయ్యగారు.
    ముహూర్తం ఇంకా ఇరవై అయిదు రోజులు ఉంది.
    ఆ రోజు ఉదయం చంద్రం టిఫిన్, కాపీ ముగించుకుని, పొలం వేపు వెళ్ళాలని యాతరవుతున్నాడు. ఆ సమయానికే వరిమళ్ళ వేపు వెళ్ళి వచ్చిన రమణ టిఫిన్ తీసుకోవటానికి వంటింటిలోకి వచ్చాడు.
    వేడి వేడి ఇడ్లీ, సాంబారుప్లేటు రమణ ముందు ఉంచింది. వంట మనిషి హనుమాయమ్మ. టిఫిన్ ప్లేటు ముందుకి లాక్కున్నాడు రమణ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra