చంద్రకాంతేనా అలా మాట్లాడేది అనిపించింది.
"నేనసలు మోడలింగ్ చేయనన్నాను."
"నువ్వు మోడలింగ్ చేయబట్టే యీ రెండు నెలలుగా రెండు పూటలా అన్నం తిన్నాం."
"బట్....సోప్స్ మోడలింగ్ కి....సెక్సీగా....అసంభవం."
"నీ ఇష్టం. అవకాశం వుందని చెప్పాను. ఇది నువ్వు చేస్తే ఇంక జీవితంలో మోడలింగ్ చేయాల్సిన అవసరం వుండకపోవచ్చు. ఏభై వేలు వస్తుంది. ఆ డబ్బుతో మనం కేబుల్ టీవీ స్టార్ట్ చేశామంటే ఇంక ఎవరినీ ఏ విషయానికీ ప్రాధేయపడవలసిన పని వుండదు."
"ఒళ్ళు అమ్ముకున్నంత పనిచేసి సంపాదించడం అవసరమా?"
"మోడలింగ్ అంటే ఒళ్ళు అమ్ముకోవటమా! చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు."
"కాదు.... కానీ....సోప్స్ కి భుజాలు చూపుతూ!"
"తప్పేమిటి? ఎన్నో సబ్బుల యాడ్స్ చూస్తున్నాం. అందులో అసభ్యం ఏముంది? కళా దృష్టితో చూడాలి."
"నీ భార్య అలా సగం దుస్తులు ధరించి కెమెరా ముందు నిలబడితే....అది కళ అని ఒప్పుకోగలవా? ఆ పనిని హర్షించగలవా?"
"కళ ఎప్పుడయినా కళే. నువ్వు సోప్స్ కి మోడలింగ్ చేసినా దానిని కళా దృష్టితో చూడగలిగే విశాలహృదయం నాకుంది."
"బట్....ఈ మోడలింగ్ చేయటం అసంభవం."
"నీ ఇష్టం. నేనేమీ బలవంతపెట్టను. అవకాశం వుంది అని చెబుతున్నాను అంతే! ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటే జీవితంలో కూడా సెటిల్ అవుతాము. లేకుంటే....ఏమవుతామో! నాకు తెలియదు. నిన్ను బలవంతపెట్టను."
"నేను ఛస్తే ఈ మోడలింగ్ చేయను. మొదటిసారి మోడలింగ్ చేయటమే పొరపాటు. ఇప్పుడు సోప్స్ కి....ఇంపాజిబుల్."
"బలవంతం లేదని చెప్పాను కదా! నీ ఇష్టం వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకొని జీవితాంతం దరిద్రం అనుభవించుదాం అంటావో....దీనిని నిచ్చెనగా వాడుకొని పైకి ఎక్కుదాం అంటావో నీ యిష్టానికే వదులుతున్నాను."
"చెప్పాను కదా! చావనైనా చస్తానుకానీ ఈ మోడలింగ్ చేయను."
"నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు .నీ యిష్టం. ఇంకా రెండు రోజులు టైం వుంది. ఈ రెండు రోజులు ప్రశాంతంగా ఆలోచించు. నీ మనసుకు నచ్చిన విషయం నాకు చెప్పు. రెండు రోజుల తరువాత కూడా నువ్వు ఇదే సమాధానం చెబితే అప్పుడే అదే సమయంలో వెళ్ళి వాళ్ళకు ఈ విషయం చెబుతాను. అంత వరకు వాళ్ళతో నువ్వు నో అన్నావని చెప్పను."
"రెండు రోజులు కాదు. రెండు సంవత్సరాల తర్వాత అడిగినా ఇదే జవాబు. ఈ విషయంలో ఇంక ఆలోచనకి తావులేదు. నేను ఆ మోడలింగ్ చేయను. చేయను. చేయను. దట్సాల్."
"నీ ఇష్టం అన్నాను కదా! నేను మాత్రం రెండు రోజులు ఆగుతాను."
ఆ క్షణంలో చంద్రకాంత్ అంటే అసహ్యం అనిపించింది అర్చనకి.
* * * *
"ప్రమీలా!" పిలిచాడు ఉపేంద్ర.
నిమిషం తర్వాత ఆ గదిలోకి వచ్చింది ఒక స్త్రీ.
"ఏం చేస్తున్నావు?" అడిగాడు.
"బట్టలు పుతుకుతున్నాను" చెప్పింది తడిగా వున్న చేతులు పమిటకొంగుకు తుడుచుకుంటూ.
"మిగతా వాళ్ళందరినీ ఒకసారి పిలుచుకురా!" చెప్పాడు ఒళ్ళు విరుచుకుంటూ.
అలాగే అని లోపలికి వెళ్ళి నిమిషం తర్వాత తిరిగి వచ్చింది.
ఆమె వెనుకనే పాల్, షరీఫ్, బాబు, గౌడ్, నరేంద్రలు వచ్చారు.
"ఈ రోజు సాయంకాలం మనం హోంమినిస్టర్, డి జి పి లని మర్డర్ చేసి తిరిగి యిక్కడికే....ఈ ఇంటికే వస్తున్నాము. మనం ఈ ఇంట్లో వుండి ఏదో రహస్య కార్యకలాపాలు చేస్తున్నామనే అభిప్రాయానికి ఈ చుట్టుప్రక్కలున్న జవాబు అనుకోకూడదు."
అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు.
ఉపేంద్ర దృష్టి ప్రమీల వైపు మళ్ళింది.
"ఈ చుట్టుప్రక్కల వున్న కుటుంబాలతో నీకు ఏమైనా పరిచయం వుందా?" అడిగాడు.
ఉంది అన్నట్లుగా తల వూపిందామె.
"మన గురించి బయటి జనాలకి ఏమని చెబుతున్నావు?"
ఒక్కక్షణం తటపటాయించి చెప్పింది "మీరు నా భర్త అని....వీళ్ళలో ఇద్దరు మీ తమ్ముళ్ళని, ముగ్గురు నా తమ్ముళ్ళని ఇక్కడే కాలేజీల్లో చదువుకుంటున్నారని చెబుతున్నాను. మనం అంతా ఒకే కుటుంబం అన్న అభిప్రాయం కలిగించాను. మనం చేసే పనుల మీద ఎవరికీ అనుమానం లేదు."
ఆమె సమాధానానికి తృప్తిగా తలాడించాడు ఉపేంద్ర.
"ఈ రోజు మన మ్యారేజ్ డే అని సాయంకాలం చిన్న ఫంక్షన్ వుందని చుట్టుప్రక్కల నాలుగైదు ఇళ్ళలో వాళ్ళని ఆహ్వానించు. ఈ ఇల్లు కూడా అన్ని ఇళ్ళలాంటిదేనని ఇక్కడ రహస్యమైన కార్యక్రమాలు ఏమీ జరగవనే భావన అందరిలోనూ కలగనివ్వు. ఈ రోజు మర్డర్స్ జరిగిన తరువాత పోలీసులు వూరంతా గాలిస్తారు. ఈ పరిసరాల్లో వున్న వ్యక్తి ఎవరయినా మా కాలనీలో ఒక ఇంట్లో ఐదారుగురు మగవాళ్ళు ఒక స్త్రీ ఒక ఇంట్లో వుంటున్నారు. వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు. వాళ్ళ మీద మాకు అనుమానంగా వుంది అంటూ ఎవరైనా పోలీసులకి హింట్ ఇచ్చారనుకో చాలా ప్రమాదం. అటువంటి అవకాశం ఇక్కడి వ్యక్తులకు ఇవ్వద్దు. అందువల్ల ఒక షామియానా రెంట్ కి తీసుకురండి. అక్కడ అక్కడా కొన్ని లైట్స్ కూడా పెట్టింది. చిన్న ఫంక్షన్ ఎట్మాస్పియర్ క్రియేట్ చేయండి."
అలాగే అన్నట్లు తల వూపారు అందరూ.
"వచ్చే అతిథుల్ని బయటి రెండు గదులలోకే రానివ్వండి. ఈ ఇంటిలోకి ఎవర్ని రానివ్వద్దు మన ముఖ్యమైన కాయితాలు, రివాల్వర్స్, గన్స్ లాంటివన్నీ ఈ గదిలోనే వుంచి లాక్ చేసెయ్యి."
అలాగే అన్నట్లు తలూపింది ప్రమీల.
"ఒకరు ఇక్కడి ఏర్పాట్లు చూడండి .మిగతా వాళ్ళు సాయంకాలం మనం వెళ్ళటానికి కావలసినవన్నీ సిద్ధం చేయండి" అని షరీఫ్ వైపు చూసి "నువ్వు జూబ్లీ బస్ స్టేషన్ కు వెళ్ళు .అక్కడకు నిజామాబాద్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకి ఒక ఎక్స్ ప్రెస్ బస్ వస్తుంది. అందులో మన కొరియన్ ఒక వ్యక్తి వస్తాడు."
"ఇంతకు ముందు నేనా వ్యక్తిని చూసి వుంటానా?" అడిగాడు షరీఫ్.
"లేదు."
"మరి గుర్తుపట్టడం ఎలా?"
"అదే చెబుతున్నాను. అతని భుజానికి ఎరుపు రంగు కాటన్ సంచి ఒకటి వుంటుంది. దానిమీద నల్లని రంగుతో ప్లస్ గుర్తు వుంటుంది. నువ్వు అతని దగ్గరకెళ్ళి మన కోడ్ వర్డ్ చెప్పు. అతను నీకొక కవర్ ఇస్తాడు. అది తీసుకుని ఐదు గంటలలోపు తిరిగిరా! నువ్వు రాగానే మనం నిజాం కాలేజీ గ్రౌండ్స్ కి బయలుదేరుతాం."
అలాగే అన్నట్లుగా తలూపాడు షరీఫ్.
"ఎవరికి చెప్పిన పనిని వాళ్ళు జాగ్రత్తగా చేయండి" ఆజ్ఞాపించినట్లు అన్నాడు.
"మీరింక వెళ్ళవచ్చు" చెప్పాడు.
కొద్ది క్షణాల తరువాత ఆ గదిలో ఉపేంద్ర మాత్రమే మిగిలాడు.
* * * *
సమయం సాయంకాలం ఐదు గంటలు.
ఇంకా రెండు గంటల్లో సంజు ప్రోగ్రాం మొదలవ్వాలి.
ఆమె మ్యూజిక్ యూనిట్ అంతా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ కి వెళ్ళిపోయారు.
తను కూడా బయలుదేరటానికి సిద్ధం అవుతున్నాడు కౌశిక్.
సర్వీస్ రివాల్వర్ ని బుల్లెట్స్ తో లోడ్ చేశాడు. రివాల్వర్ కేస్ లో దాన్ని వుంచాడు.
మరి కొద్దిసేపట్లో బయలుదేరాలి.
ఆ రోజు ఉదయం నుంచీ అతనికి టెన్షన్ గానే వుంది. ప్రోగ్రాం పూర్తి అయ్యేవరకు ఆ టెన్షన్ తప్పదు.
డోరు తీసుకుని లోపలికెళ్ళాడు.
హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటోందామె.
"ఆల్ యూ రెడీ?" అడిగాడు ఆమెను.
"ఆల్ మోస్ట్ రెడీ. కేవలం డ్రస్ ఛేంజ్ చేసుకోవటమే మిగిలింది"
"ఏం డ్రస్ వేసుకుంటున్నారు?"
"నేను తెలుగమ్మాయిని. కాబట్టి చీర కట్టుకుంటాను."
"ఇఫ్ యూడోంట్ మైండ్. మీరు చుడీదార్ వేసుకోవచ్చుగా!"
అంతవరకు అద్దంలో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటున్న ఆమె ఇటు తిరిగింది.
ప్రమాదం అనేది ఎటు నుండి ఏ రూపంలో అయినా రావచ్చు.
భద్రతా ఏర్పాట్లయితే చాలా విస్తృతంగా వున్నాయి.
ఈ రోజు హోంమినిస్టర్ మీదనో, డి జి పి మీదనో హత్యాప్రయత్నం చేయబోతున్నట్లుగా ఇంటెలిజన్స్ రిపోర్ట్స్ లేవు. అందువల్ల ఒకింత ధైర్యంగా వున్నా ఎక్కడో అనుమానం, ఏదో భయం. గదిలో నుండి బయటికి రాబోతూ ఏదో గుర్తురావటంతో తిరిగి గదిలోకి వెళ్ళి బీరువాలో నుండి ఒక ప్యాకెట్ బయటకు తీసి గదిలో నుండి బయటకొచ్చాడు.
సంజు గదిని సమీపించాడు.
తలుపు దగ్గరగా వేసి వుంది.
డోరు మీద చిన్నగా శబ్దం చేశాడు.
"ప్లీజ్ కమీన్" లోపల నుండి సమాధానం వినిపించింది.
అతను ఎందుకలా అడిగాడో అర్ధం కాలేదు.
ఇటుగా చూసిన ఆమెకు అతనిచేతిలో ఒక ప్యాకెట్ కనిపించింది.
అర్ధమయిందామెకు. అందులో చుడీదార్ వుంది. బహుశా తన కోసం కొని వుంటాడు. అందుకే ఆ డ్రస్ వేసుకోమంటున్నాడు. అయినా తన కోసం డ్రస్ కొనవలసిన అవసరం అతనికి ఏముందో అర్ధంకాలేదు.


