Home » Suryadevara rammohan rao » జనవరి 5

   

      టాటాస్ జపాన్ హోండా కార్ల కంపెనీ కొలాబరేషన్ తో ఇండియాలో కార్ల తయారీ ప్రారంభిస్తామనీ లైసెన్స్ ఇవ్వమని భారత ప్రభుత్వాన్ని అడిగితే కంగారేముంది! చూద్దాంలే అనే సమాధానమిచ్చిందట.
   
    ఇంకెలా.....ఎలా ఈ దేశం బాగుపడుతుంది....? దేశ సంపదను పెంచగల వ్యాపార సామర్ధ్యమున్న పెద్ద పారిశ్రామిక వేత్తల మీద సంపద కేంద్రీకృతం కాకూడదనే ఎమ్.ఆర్.టి.పి. చట్టాన్ని అమలు పరుస్తుంది.
   
    ప్రతి ఒక్కరూ వ్యాపార సామర్ధ్యాన్ని, ఎంటర్ ప్రెన్యూర్ ఎబిలిటీని కలిగి ఉండరు.
   
    బొంబాయి మహా నగరానికి ఎలక్ట్రిసిటీ సప్లయ్ చేసేది టాటా ఎలక్ట్రిక్ కంపెనీ బొంబాయి ప్రజలు ఏనాడు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ తో బాధపడగా ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు.
   
    పెద్ద పెద్ద కంపెనీలు మీకు అవసరమైన ఎలక్ట్రిసిటీని మీరే ఉత్పత్తి చేసుకోండని పర్మిషన్ ఇస్తే ఈనాడు దేశంలో ఇంత కరంట్ షార్టేజ్ ఉండేదా....? అలా చేస్తే ప్రభుత్వపు పట్టులోంచి పారిశ్రామిక వేత్తలు జారిపోతారనే భయం. అలా జారిపోతే పార్టీ ఫండ్స్ ఎలా వసూళ్ళు చేసుకోగలం అని వారిబాధ.
   
    అమ్మ పెట్టదు..... అడుక్కు తిననివ్వదు..... పరిశ్రమల్ని జాతీయం చేయటమే గొప్ప సంఘసేవ..... సమాజ సేవ......దేశసేవ అని వారి ఉద్దేశం. పోనీ అలా పెద్ద పరిశ్రమల్ని జాతీయం చేసి ప్రభుత్వరంగ సంస్థలుగా చేసి లాభసాటిగా నిర్వహించగలరా....? ఇండియన్ రైల్వేస్ ని మా కంపెనీకి అప్పగిస్తే, ఇప్పటికన్నా సక్సెస్ ఫుల్ గా, లాభసాటిగా మంచి సౌకర్యాలతో నిర్వహించటమే కాక 25శాతం రైల్వే ఛార్జీలను తగ్గించి నడుపుతామని ఒక కంపెనీ సవాల్ చేసింది.
   
    అమెరికా పెప్సీకోలా, కోకాకోలా భారతదేశ ప్రజలకు ప్రాణాపాయ ఔషధమా....? ఆ రెండు సాఫ్ట్ డ్రింక్స్ లేకపోతే భారత ప్రజలు నాశనమయి పోతారా?
   
    కోకాకోలాని ఇండియాలో నిషేధించి ఇప్పటికి దశాబ్దం దాటిపోయింది. అందుమూలంగా భారత ప్రజలకు ఏదైనా నష్టం వాటిల్లిందా?" లేదు. కాని ఇప్పుడు పెప్సీ కోలాని ఇండియాలోకి అనుమతించారు. అంటే ఏమిటి? దీని భావమేమి తిరుమలేశా? అని ప్రశ్నించుకుంటే సమాధానం ఇట్టే దొరికిపోతుంది.
   
    అది ఇండియాలోకి వస్తే సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేస్తున్న ఇండియన్ కంపెనీలు ఏమయిపోతాయి? వాటిల్లో పనిచేసే లక్షలాది భారతీయులు ఏమయిపోతారు? వాటికి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టిన భారతీయ బ్యాంక్స్ ఏమయిపోతాయి? ఇండియన్ షేర్ హోల్డర్స్ ఏమయిపోతారు?
   
    పోనీ పెప్సీకోలా ఇండియాలోని కేన్సర్ వ్యాధిగ్రస్తులకు వారి జబ్బు నుండి విముక్తి కలిగిస్తుందా! పేద వారికి పెన్నిధిని తెచ్చిపెడుతుందా-? అలా అయితే దాని ఆగమనానికి ఎవరూ అడ్డు చెప్ప కూడదు.
   
    ఏమిటివన్నీ-?
   
    అమెరికా సొమ్ముతో తెగబలిసిన పాకిస్తాన్, ఒళ్ళు పై తెలీకుండా కాశ్మీర్ నాదంటుంది. అస్సాం బోడోల సమస్య తెగి చావదు. పంజాబ్ లో రోజు హత్యలు. శ్రీలంకతో ఎన్నటికీ తెగని చర్చలు-వీటన్నిటినీ మించి బోఫోర్స్....
   
    దేశాభివృద్దికి సమయం ఉందా......
   
    అసలు కేటాయిస్తున్నారా.....?
   
    వీటన్నిటిని తలుచుకొని నేను ప్రతిక్షణం వ్యధ చెందుతుంటాను.
   
    అందుకే దేశ ప్రజలు, రాజకీయనాయకులు ఆలోచించి, ఆచరించదగ్గ ఒక విచిత్రమైన ప్రయోగం చేయాలని ఉంది. ఎందుకూ పనికిరాని, తెగించి ఏదో ఒకటి చేయటానికి వీలు కల్పించని ఈ మంత్రి పదవిలో ఎందుకున్నానో తెలుసా...? అధికారం కోసం-ఆ అధికారం ఎందుకో తెలుసా...? నేననుకొనే ప్రయోగానికి ప్రభుత్వ అండదండలూ, ఆర్ధిక సహాయం అవసరం కనుక.
   
    నాకు ప్రధానమంత్రిని, మా మంత్రివర్గ సహచరుల్ని నా ప్రయోగం సానుకూల పడేందుకు అర్దిస్తాను, ఒప్పిస్తాను. ఒప్పించగలనన్న నమ్మకం కూడా వుంది.
   
    అయితే అందుకు తన దేశం బాగుండాలనే తపన, జిజ్ఞాస వున్న యువతీ యువకులు కావాలి. అలాంటి వారికోసమే నేను అన్వేషిస్తున్నాను.
   
    మంత్రి ఆర్యభట్టు చెప్పటం ఆపి ఆ ఇద్దరికేసి ఆప్టిమిస్టిగా చూసాడు.....
   
    తనపై మంత్రి ఆర్యభట్టుకి అంత నమ్మకం ఎలా కలిసిందన్నదే ఆశ్చర్యం. ఆ నమ్మకం కలిగినందుకు ఆనందం విమల్ ని కొద్దిక్షణాలు ముంచెత్తి వేసింది.
   
    కొద్ది క్షణాలు ఆ ముగ్గురి మధ్య మాటలు లేవు. "నిజంగా ఆ ప్రయోగాన్ని నిర్వహించగలిగితే ప్రపంచ ప్రజ అచ్చెరువొందటం ఖాయం. అది విజయ వంతమయి దేశ ప్రజా ఆచరించగలిగితే, అపార సంపదతో విర్రవీగే అమెరికా, అప్పనంగా అమెరికా నుంచి వచ్చే ఆయుధాలతో కల్లు తాగిన కోతిలా ఎగిరే పాకిస్తాన్, ఇండియాను చిన్న చూపు చూసే మిగతా దేశాలు షాక్ తినటం ఖాయం. అందుకే పార్టీ రహిత, కుల మత రహితమైన ప్రయోగాన్ని ఇజాలకు దూరంగా నిర్వహించాలని ఉంది. అందుకు నువ్వు సిద్దమేనా?" ఆర్యభట్టు విమల్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.
   
    కొద్దిక్షణాల మౌనం తరువాత తనలో రేగుతున్న ఎగ్జట్ మెంట్ ని కంట్రోలు చేసుకుంటూ అంగీకార సూచకంగా తలూపాడు.
   
    "అదెంతటి ప్రమాదకరమయినదయినా....?" ఆర్యభట్టు రెట్టించాడు.
   
    "ప్రయోగాలు ఎప్పుడూ రిస్క్ ల్ని ఎదురుకోక తప్పదు. నాకు చాలా ఆనందంగా వుంది. మీరు మీ ప్రయోగానికి తొలి వ్యక్తిగా నన్నే ఎన్నుకోవటం నిజంగా నా అదృష్టం. నా సర్వస్వం.....చివరకు నా ప్రాణాల్ని సయితం ధారబోసేందుకయినా నేను సిద్దమే" స్థిరంగా అన్నాడు విమల్.
   
    ఆర్యభట్టు కళ్ళలో ఆనందం తొంగి చూసింది. "కుల మతాల గొడవల్ని రేపే అరాచకవాదుల్ని కఠినంగా శిక్షిస్తామని, అన్నిటిని విస్మరించి కష్టించి పనిచేయటమే ఈనాడు మన దేశానికి అవసరమని ఏ రాజకీయ నాయకుడు అనలేడు. ఎందుకంటే ఓట్లు పోతాయని- అవి పోతే ఎలక్షన్స్ లో గెలవమేమో అని-గెలవకపోతే పదవిలోకి రాలేమేమో అని....
   
    కాని అవన్ని మన ప్రయోగంలో నిషిద్దం. దేశభక్తి, పరిమితమైన వ్యక్తిగత స్వార్ధం, శక్తి మేరకు శ్రమించటం మాత్రమే మన ప్రయోగానికి పునాదులు కావాలి. ఇవన్నీ దృష్టిలో వుంచుకొని ఒక గొప్ప ప్రయోగానికి నీవే అంకురార్పణ చేయి. ప్రయోగ ప్రణాళికను సిద్దం చేయి. నువ్వు చెయ్యగలవన్న నమ్మకం నాకుంది. అందుకుగాను నీకు కొంత టైమిస్తాను. దానికి నీవే శాసన కర్తవు. నీ వెనుక నేనుంటాను. ప్రయోగ ఫలితం.....ఐ మీన్ తొలి ఫలితాన్ని, నీవు చూపించవలసిన రోజును ఇప్పుడే నిర్ణయిస్తున్నాను. అది జనవరి 5..."
   
                     *    *    *    *    *
   
    "ఏం మిత్రమా....? నా సెలెక్షన్ సరైనదేనా....?" మంత్రి ఆర్యభట్టు చిరునవ్వుతో తన ఎదురుగా వున్న వ్యక్తిని ప్రశ్నించాడు.
   
    జ్ఞాని మెల్లగా, మృదువుగా గడ్డాన్ని నిమురుకుంటూ ఒకింతసేపు మౌనంగానే వుండిపోయాడు.
   
    "నీ మనిషి విమల్ ని, మేఖలను నీడలా వెంటాడి నాకు కొన్ని వివరాలు అందించాడు.
   
    "నా దేశ సమస్యలకి, తిరోగమన విధానాలకు, పేదరికానికి, నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారాన్ని చెప్పి, ప్రపంచ దేశాల సరసన మనదేశం తల ఎత్తుకు నిలబడేలా చేయాలని వుంది...." అని విమల్ అన్నాడు.
   
    "నాకు చేతనైన చిన్న బిజినెస్ ని నేను ప్రారంభిస్తాను. రాత్రింబవళ్ళు శ్రమించి దాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తాను. ణ ఆడవారా మరికొందరు నిరుద్యోగులకు దారి చూపిస్తాను. నా పరిధిలో నాకు తోచింది, నేను చేయగలిగింది అదొక్కటేనని నా అభిప్రాయం" అని మేఖల అన్నది.
   
    ఆపైన మేఖల తన తమ్ముడితో, విమల్ తన చెల్లెలితో ఓ చోట సమావేశమయ్యారు.
   
    ఇది రౌడీల రాజ్యం- గూండాల భోజ్యం. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి జయం సాధించాలంటే తెలివితేటలు, కార్యదీక్ష, కామన్ సెన్స్, శ్రమ ఎంత ముఖ్యమో భుజబలమూ అంతే ముఖ్యం. అది నాకుంది. మీరుచేసే ప్రయోగాలకు నా పూర్తి రక్షణ, అండదండలుంటాయని అభిరామ్ అన్నాడు. ఒకరు ఇండియాని జపాన్ లా చేయాలని కలలు కంటున్నారు. మరొకరు స్వయం సమృద్దిని సాధించాలని తాపత్రయపడుతున్నారు. ఇంకొకరు ఈ రెంటికి రక్షణ కల్పిస్తానంటున్నారు. ఇక మిగిలిపోయిన నేనేం చేయాలని క్రాంతి తనను తాను ప్రశ్నించుకుంది.
   
    నాకు తెలిసినంతవరకు, నీ మనిషి పరిశీలనా సారాన్ని బట్టి క్రాంతి ఒక ప్రేమ పిసాసి ఆమెకు ఈ మెటీరియలిస్ట్ కి జీవన విధానాల మీద ఆసక్తి లేదు. ప్రేమ, అనురాగం, ఆరాధన, అప్యాయత, అనుబంధాలు అంటే ఆమె త్వరగా రియాక్ట్ అవుతుంది. ప్రపంచం ప్రేమమయం. ఆ ప్రేమలో ఐక్యమై పోవాలనే కలల సుందరి ఆమె. మొరోజోగా వుండే చిరుత పులిలాంటి అభిరామ్ ని ఆమె నవ్వించగలిగింది. మాట్లాడించ గలిగింది.

    సో....ఈ నలుగురు నాలుగు భిన్నమైన మానసిక ప్రవృత్తుల్ని కలిగి వున్నారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra