Home » D kameshwari » Geethopadesam


    "అది నీకు అనవసరం. అది తీసుకెళ్లి వాళ్లు చెప్పిన పాన్ షాపులో ఎవరూ సూడనపుడు యిచ్చి నీ పాటికి నీవు వెళ్లిపోవాలి. ఆడే నీకీయాల్సిన డబ్బులు యిస్తాడు. ప్యాకెట్టు ఇచ్చేటపుడు షాపులో ఎవరూ లేనపుడు, చుట్టుపక్కల ఎవరూ చూడనపుడు చుట్టూ మామూలుగా గమనించి ఏ చాక్లెట్లో, సోడానో కొనుక్కుంటూ ఈ ప్యాకెట్ వారికి అందించేయాలి. వాడు కూల్ డ్రింక్ డబ్బులు తీసుకుంటూ నీ గుప్పిట్లో వాడిచ్చే డబ్బు పెట్టేస్తాడు చిల్లర ఇచ్చినట్లు. అర్థమైందా? రేపు నిన్ను తీసికెళ్లి చూపిస్తా. భయపడకూడదు, గాభరా పడకూడదు. మామూలుగా ఎల్లి యిచ్చేసి ఎల్లిపోవడమే. చాక్లెట్లో, బిస్కెట్లో కొనుక్కున్నావని అందరూ అనుకోవాలి."
    "ఏట్రా యిది? వింటే భయంగా వుంది. ఆ ప్యాకెట్ లో ఏముంటుంది?"
    "ఏమో! నాకూ తెలీదు. వాళ్లిమ్మన్న చోట యిస్తే డబ్బు రెండొందలు యిస్తామన్నారు. డబ్బులొస్తాయని వప్పుకున్నాను. నీకు కావల్సింది డబ్బు. మిగతాది అనవసరం. సరేనా, చేయగలవా? భయమైతే సెప్పు. చిన్న పుస్తకం సైజు ప్యాకెట్టు అంతే!"
    "లేదు లేదు, సేత్తాను. డబ్బు కావాలి నాకు."
    "సరే, రేపు చూపిస్తా... ఓ పది నిమిషాలు ముందు బయలుదేరాలి స్కూల్ కి."

                                                  *  *  *

    వారం గడిచింది. పనిలో చేరిన రోజు రెండొందలు చేతిలో పడగానే రాజ్యాలు దక్కినంత సంబరపడిపోయాడు.
    "తల్లికి ఒక నూరు రూపాయలు చేతిలో పెట్టాడు."
    "ఏడవిరా ఈ డబ్బులు?" ఆశ్చర్యం, ఆనందంతో పాటు అనుమానంగా అడిగింది.
    "అమ్మా, మా స్కూల్లో ఎనిమిదో క్లాస్ చదివే అబ్బాయికి లెక్కలు నెలరోజులు చెప్పా. వాడికి బోలెడు డబ్బుంది. వంద రూపాయలు ఇచ్చాడీవేళ సంతోషంగా. వెంకటేశు చెప్పిన పాఠం వల్లెవేశాడు.
    "మా నాయనే, మా బాబే... నీవే ఉంచుకోరా, చెప్పులు అరిగి పోయాయన్నావు గదరా! కొనుక్కో" అంది ప్రేమగా.
    "అందుకేనా ఈ మధ్య ఆలీసెంగా వస్తున్నావు... పోనీలే నాలుగు డబ్బులు సంపాదించుకో నీ కర్సులకి ఉంటుంది" అంది సంబరంగా.
    ఆ తల్లి సంబరం మరో మూడు రోజులకే ముక్కలయింది.
    ఆ రోజు సాయంకాలం వీధరుగు మీద కూర్చుని యిరుగమ్మతో కబుర్లాడుకుంటూ ఉల్లిపాయలు తరుక్కుంటుంటే పక్కింటి పన్నెండేళ్ల చంటిగాడు వగుర్చుకుంటూ వచ్చాడు. "అత్తోయ్... మీ సత్తిబాబుని పోలీసులట్టికెళ్లారు. లాక్కుంటూ జీపెక్కించి తీసుకుపోయారు..." గాభరాగా చెప్పాడు.
    చంటిగాడు చెప్పింది అర్థం కావడానికి వరమ్మకి నిమిషం పట్టి అయోమయంగా "ఏట్రా, ఏటంటన్నావు? సత్తిబాబుని పోలీసులెందుకు పట్టుకెళ్లారు?"
    ఒక్క ఉదుటన లేచి "ఏమయిందిరా, ఎందుకు తీసుకుపోయార్రా? ఏదన్నా గొడవ చేశాడా? స్కూల్లో గొడవా? మొహం ఎర్రబడిపోయి కలవరపడిపోతూ అడిగింది. "తెలీదత్తా! బజారుకాడనించి జీపులో తీసుకుపోతంటే మేమంతా చూశాం."
    "ఓరి నాయనో, నా కొడుకో, సత్తిబాబూ..." గుండెలు బాదుకుంటూ పరిగెత్తిపోతుంటే పక్కింటి పెద్దమ్మ చెయ్యిపట్టి లాగి "ఉండే అలా ఎక్కడికి పోతావు? ఏడికి తీసుకుపోయారో? మగాళ్లని తోడు తీసుకెళ్లవే" అంటూ ఇరుగు పొరుగు ఇద్దరిని పిలిచి అప్పగించి, చంటిగాడు చెప్పినవైపు చెపుతూ ఆటో ఎక్కారంతా.
    "బాబూ, ఇన్ స్పెక్టరు బాబూ.. నా కొడుకేం సేసాడని పోలీసులట్టుకొచ్చారు?" అంటూ బోరున ఏడుస్తూ ఇన్ స్పెక్టరు కాళ్ల మీద పడింది వరమ్మ.
    "లే అమ్మా... లే ముందు. అలా కాళ్లు పట్టుకోకూడదు. నీ కొడుకు చిన్నపిల్లాడు, అమాయకుడనుకున్నావా? ఆడు డ్రగ్స్ దందా మొదలుపెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికాడు. ఊరికే వాడ్ని తీసుకొచ్చి జైల్లో పడేయడం మాకేం సరదా అనుకున్నావా?" అంతా తెల్లబోయారు. వరమ్మకయితే ఒక్క ముక్క అర్థం కాలేదు.
    "ఏటి బాబూ, ఏటి సేసాడు?"
    ఇన్ స్పెక్టరు పక్కనున్న పోలీసు వంక "అర్థమయ్యేట్టు చెప్పు వాళ్లకి" అన్నాడు. పోలేసు విడమర్చి చెప్పాడు.
    "నీ కొడుకు మాదకద్రవ్యాలు, అంటే మత్తుమందు, లక్షలు ఖరీదు చేసే మందులు దొంగతనంగా సప్లయ్ చేస్తుంటే పట్టుకున్నారు. అదంతా పెద్ద ముఠా. ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ల పేకెట్లు ఎక్కడికి పంపాలో, ఇలాంటివాళ్ల చేత ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులకి చిక్కకుండా ఆ పాన్ షాపులకి పంపిస్తే, వాళ్లు వాళ్లు అవన్నీ తరువాత కలెక్ట్ చేసుకుంటారు. పిల్లల స్కూలు బ్యాగులో గప్ చుప్ గా పంపి, ఇలాంటి వాళ్లకి వంద రెండొందలు వీళ్ల చేతిలో పెడతారు. పేదోళ్ల పిల్లలు వంద రూపాయలొస్తాయని ఇలాంటి పనులు సంతోషంగా చేసి డబ్బులు తీసుకుంటారు. ఈ మధ్య ఈ డ్రగ్స్ రాకెట్టు ఎక్కువగా సప్లయ్ చేస్తుందని కబురు అంది... చాలా చోట్ల మఫ్టీలో పోలీసులని అన్నిచోట్లా పెట్టాం. ఇలా కిళ్లీ కొట్ల దగ్గర జరుగుతుందని కబురంది నిఘా పెట్టాం. ఉదయం నుంచి ముగ్గురిని పట్టుకున్నాం. నీ కొడుకు ఇందులో వున్నాడు. దొరికిపోయాడీవేళ..." విడమర్చి చెప్పాడు.
    "ఏట్రా సత్తిగా... ఏట్రా నిజమేనా? ఎందుకురా యిలాంటి పనులు సేశావు? రెండుసార్లు రెండొందలు చేతిలో పెట్టి బాబూ! పిల్లలకి సదువు చెపితే యిచ్చారంటే నిజమనుకున్న... ఎందుకురా యిలాంటి ఎదవ పని సేసావు?" ఏడుస్తూ అంది.
    సత్తిబాబు వలవల కన్నీళ్లు కారుస్తూ "నాకేటీ తెలవదే అమ్మా, ఆ ప్యాకెట్టు చెప్పిన చోట యిస్తే రెండొందలు ఇస్తామన్నారు. మన వెంకటేశుని అడిగితే తీసుకెళ్లాడే. ఆ ప్యాకెట్టులో ఏముందో మాకేం తెలీదు. డబ్బులొస్తాయని ఆశపడ్డానే. ఇదంతా నాకేం తెలీదే. రెండుసార్లు ఇచ్చానంతే!"
    "బాబూ! ఆడికేం తెలుస్తాది యిదంతా నేరం అని. నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని తెలీక సేసాడు. ఆడ్ని ఒగ్గేయండి బాబూ! యింకెప్పుడూ సేయడు. మీకు దండం పెడతా." మళ్లీ కాళ్లు పట్టుకొంది.
    "చూడమ్మా! వదిలిపెట్టడం మా చేతుల్లో పనిగాదు. వీళ్లందరినీ కోర్టులో ప్రవేశపెట్టాలి. వీళ్లంతా చిన్నచేపలని మాకు తెలుసు. పాన్ షాపువాడికి ఇలాంటి పిల్లలు అందరూ పావులవుతారు. అసలు వాళ్లు బయటపడరు. ఆ ముఠాని పట్టుకోవాలి, అది మా పని. ఇదంతా కోర్టు వ్యవహారం. మా చేతిలో ఏమీ లేదు. "రేపు కోర్టుకి రండి. ఈ పిల్లలకి ఏం తెలీదని మాకు తెలుసు. అసలు ముఠా దొరకరు. బలయ్యేది మధ్యవాళ్లు. మొదటి తప్పుగా జడ్జిగారు వీళ్లకి పెద్దశిక్ష వేయకపోవచ్చు. రేపొచ్చి జడ్జిగారికి మొరపెట్టుకోండి" ఇన్ స్పెక్టరు దయగా అన్నాడు.

                                                                                   *  *  *

    "చూడమ్మా, ఏడ్చి ఏం లాభం లేదు. సత్తిబాబు ఎంతో తెలివిగా చదువుకుంటూ పైకి వస్తాడనుకున్నాను. కాస్త డబ్బులకి ఆశపడి చిక్కుల్లో పడ్డాడు. వీడు అందులో చేరి వారం రోజులే అయింది కనుక, మొదటి తప్పు కనుక జడ్జి దయతలచి శిక్ష వేయకపోవచ్చు. రేపు కోర్టులో ప్రవేశపెట్టేవరకూ ఏం చెయ్యలేం. ఈ రాత్రి వాడు రిమాండ్ లో ఉండక తప్పదు. వీడితో వెంకటేశు కూడా వున్నాడుగా. ధైర్యంగా వుండు, ఏడ్చి లాభం లేదు. ఇదిగో నీ మొగుడిలాంటి తాగుబోతులు ఇంటిపని పట్టించుకోకపోవడంతో పిల్లలు డబ్బులకి ఆశపడి, ఇలాంటి పనులు చేయడానికి ముందుకెళతారు. ఉన్నంతలో పిల్లలని కాస్త చదివించుకో. బాగుపడే తల్లిదండ్రులుంటే పిల్లలు ఇలాంటి పనులు చేయరు. ముందు ఈ తాగుబోతు తండ్రులందరినీ జైల్లో పడేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. స్కూల్ లో లెక్కల మాస్టారు సత్తిబాబు గురించి విని ఇంటికొచ్చి ఏడుస్తున్న వరమ్మకి ధైర్యం చెబుతూ అన్నాడు.
    "ఆడే తిన్నగుంటే నాకీ తిప్పలెందుకు సారూ.... ఆడన్న సదుకుని పైకి వస్తే నా కట్టాలు గట్టెక్కుతాయి అనుకున్నా..." అంటూ ఏడుస్తూ అంది.
    "నీవు ధైర్యంగా వుండు, రేపు నేనూ కోర్టుకి వచ్చి సత్తిబాబు మంచి పిల్లాడు, చక్కగా చదువుకుంటాడు, తెలీక తప్పు చేశాడని జడ్జిగారి దగ్గర చెపుతా, ధైర్యంగా వుండు, జేబులోంచి ఓ వంద రూపాయలు ఆమె చేతికిచ్చి చుట్టూ మూగి వున్న జనాన్ని చూస్తూ "చూశారుగా మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకి మంచిచెడ్డ చెప్పి, కష్టపడి చదివించుకోవాలి." అందరికీ చెప్తూ మాస్టారు 'నేరం ఒకరిది, శిక్ష మరొకరిది...' అనుకుంటూ రేపటి ఉదయం కోసం ఆశగా ఎదురుచూడడం మినహా చేయగలిగింది లేదని ఆయనకి తెలుసు.

                                                             ('వంశీ' రచయితల కొత్త కథలు, ప్రచురణ - జూలై 2018)

                                               *  *  *  *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra