Home » Kommanapalli ganapathi rao » Pranaya Prabamdham


    
    "మాట్లాడు ప్రబంధా! నేను నీకు అమ్మలాంటిదాన్నికదూ?"
    
    ప్రబంధ జవాబు చెప్పలేదు. పుస్తకాలను దూరంగా గిరాటేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
    
    "కొండమీది కోతినయినా తెప్పించి యివ్వగల తండ్రికి ముద్దుల కూతురివై యిలా ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చోవడం నాకు నచ్చలేదు. చెప్పమ్మా!"
    
    అసలు అహంకారిగా బ్రతకడమే తప్ప ఆమాత్రం ఆత్మీయతనైనా రుచి చూసే అవకాశం ఆమెకి దక్కి వుంటేగా? అందుకే సౌదామిని అడుగుతుంటే ప్రబంధకి కళ్ళనీళ్ళు పర్యంతమైపోయింది.
    
    "పిచ్చిపిల్లా! నిన్నెవరయినా అవమానించారా? చెప్పు?"
    
    "అదికాదు ఆంటీ... ఎందుకో వివరంగా చెప్పటానికి అహం అడ్డువస్తూంది "నేను యూనివర్శిటీకి ఇక వెళ్ళదల్చుకోలేదు"
    
    ఎందుకు? ఏమైందమ్మా?" సాధ్యమయినంత ఎక్కువ ఆర్ద్రతని గొంతులో నింపుకుంటూ రెచ్చగొట్టించామె. "ఈ రాష్ట్రానికి యువరాణివి నువ్వు నీకంత కష్టమేమొచ్చింది?"
    
    "నిజానికి అది కష్టం కాదు. నేను తట్టుకోలేని అవమానం."
    
    "ఎవరు?" రోషంగా అడిగిందామె "ఎవరు అంత సాహసం చేసింది?"
    
    "నిజానికి అది అవమానం కూడా కాదు."
    
    "పిచ్చితల్లీ!" నెమ్మదిగా విషయాన్ని రాబట్టాలనే ప్రయత్నంలో తొలి అస్త్రాన్ని సంధించింది "ఒకప్పుడు నేనూ నీ అంత అందగత్తెనే. కాలేజీలో అబ్బాయిలు నా పరిచయంకోసం వెంపర్లాడేవారు. అవమానం అంటే మనసు నిలదీసి నలుగురి మధ్య తిట్టడం మాత్రమే కాదు. మన ఉనికిని పట్టించుకోకపోవడం కూడా బహుశా అలాంటి స్థితి నీకు ఎదురైవుంటుంది."
    
    విభ్రమంగా చూసింది ప్రబంధ.
    
    "నేను చెప్పింది నిజమే కదూ?"
    
    తల పంకించింది అవునన్నట్టుగా.
    
    "అయితే క్షమించకూడదు."
    
    "ఏం చేయాలి?"
    
    "మనమేమితి అన్నది అవతల వ్యక్తికి తెలియచెప్పాలి."
    
    యూనివర్శిటీ స్థాయికి ఎదిగిన ఆడపిల్ల అయినా, చాలా చాలా చదివి చాలా విషయాలు తెలుసుకున్నా జెవెఇథనైకి సంబంధించిన అవగాహన అంతగా లేని ప్రబంధ, సౌదామిని మాటలకి ఎంత కదిలిందీ అంటే సిగ్గువదిలి మొత్తం చెప్పింది తల వంచుకునే.
    
    అంతా విన్న సౌదామిని అంది. "అంటే ఆ రోజు పోటీలో నిన్ను ముద్దు పెట్టుకోటానికి తిరస్కరించినవాడు ఇప్పుడు మరో అమ్మాయి వెంట పడుతున్నాడు. అది నలుగురూ గుర్తించి నానా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. సహజమే నీ స్థాయిలో నేనుంటే నీలాగే రియాక్టయ్యేదాన్ని అసలు నీ గురించి ఏమనుకుంటున్నాడు ఆదిత్య అనే ఆ వ్యక్తి?" సీరియస్ గా చూసింది సౌదామిని.
    
    "అమ్మాయిలపట్ల అలాంటి ఆసక్తి ప్రదర్శించే అలవాటు లేనివాడు అదే నియమం అందరి దగ్గరా పాటించాలి కాని మరో అమ్మాయివెంటపడి తెలివీ, అంతస్తు వున్న నిన్ను కాదంటున్నాడూ అంటే, అతనికెన్ని గుండెలుండాలి?" క్షణం ఆగింది సౌదామిని. "దీనికంతటికీ నాకు ఒకటే కారణం కనిపిస్తుంది ప్రబంధా. నిన్ను మానసికంగా గాయపరచాలని ప్రణయ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తూంది"
    
    ప్రతి పదంలోనూ ప్రబంధ అహాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం మర్చిపోలేదు సౌదామిని.
    
    "నాకు తెలుసమ్మా! నువ్వు కావాలీ అంటే కోట్లమంది అబ్బాయిలు క్యూ కట్టి నిలబడే అర్హతలు నీకుండగా, నువ్వు ఆ వ్యక్తిగురించే ఆలోచిస్తున్నావు" అంటే, బహుశా నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నావు"
    
    "లేదు" ఠక్కున అంది ప్రబంధ.
    
    "లేనప్పుడు అతడెలా పోతేనేం?"
    
    ఆమె జవాబు చెప్పలేకపోయింది.
    
    'నువ్వు పసిపిల్లవి ప్రబంధా! నువ్వు చెప్పటానికి సందేహిస్తున్నా ఆదిత్యని నీకు తెలియకుండా నువ్వు ప్రేమిస్తున్నావు. అది ప్రేమ అనే విషయం నీకు తెలిసింది ప్రణయకి అతడు సన్నిహితుడౌతున్నాడన్న సత్యం తెలిశాక కాదనకు. నీలాగే నీ వయసులో వున్న నేను మీ నాన్న గురించి ఆలోచించి ఆలస్యంగా అతడిని సాధించుకున్న ఆడదాన్ని నేను కూడా".
    
    ప్రబంధ నిశ్శబ్దంగా వింటూంది.
    
    "నిజానికి నువ్వున్న స్థాయికి నువ్వు కావాలీ అనుకుంటే ఆదిత్య అనే శాల్తీకి అడ్రసు లేకుండా చేయగలవు. కాని నీ ఉద్దేశం అదికాదు. అందుకే అతడిగురించి మధనపడుతున్నావు. ఇది సహజమే ప్రబంధా! నీ అంత అసాధారణమైన అందగత్తెని ముద్దు పెట్టుకునే అవకాశం వున్నా కాదన్నాడు" అంటే, అతడు గొప్ప సంస్కారవంతుడూ, గుణవంతుడూ అయ్యుంటాడు. అదే నీకు అతఃడిలో నచ్చిన తొలివిషయం అయ్యుంటుంది అవునా?"
    
    హిప్నాటిక్ సజెషన్ లా తన మనసులో ఆదిత్య రూపాన్ని నింపుతుంటే ఆలోచనల్లోకి జారిపోయింది ప్రబంధ.
    
    నిజమే! ఆదిత్య అందంగా వుంటాడు. ఎదురుపడిన ఒకటి రెండుసార్లు సభ్యతగా తల వంచుకుని వెళ్ళిపోయాడు. అయినా తనలో ఏమీ తక్కువని? ప్రణయ తనకన్నా ఎందులో ఎక్కువని?
    
    అందరూ అనుకుంటున్నది తనూ అనుకుంటూందన్న అత్యం ఆమె మరిచిపోయిందా క్షణంలో.
    
    "ప్రబంధా! ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా పెద్దశాపం లేదమ్మా! అందులో నీలాంటిదానికి తిరస్కారభావం ప్రదర్శించే అలాంటివాళ్ళను క్షమించి వదిలి పెట్టకూడదు."
    
    "ఏం చేయాలి?" మార్గదర్శకురాలిలా కనిపిస్తున్న సౌదామినిని అడిగింది ప్రబంధ ఆత్రంగా.
    
    "ఉన్న మార్గాలు రెండే! ఒకటి, నీకు దక్కని ఆదిత్య మరెవరికీ దక్కకుండా అంతం చేయడం"
    
    "వద్దు" కంగారుగా అంది ప్రబంధ.
    
    "చూశావా, దొరికిపోయావు!" ఆప్యాయంగా ప్రబంధని దగ్గరకు తీసుకుంది సౌదామిని "ప్రేమించినప్పుడే అవతలి వ్యక్తికి ఆపద రాకూడదని ఏ ఆడపిల్లయినా కోరుకుంటుంది ప్రబంధా! కాబట్టి మొదటి మార్గాన్ని పక్కకు పెట్టేసి రెండో మార్గంలో అతడిని చేజిక్కించుకోవాలి."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra