Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    "సంగీత విద్వాంసుడి సంగతి తెలియదుకాని పక్కవీధిలో ఉంటోన్న కేబరే డాన్సర్ యింట్లో ఏదో గొడవ జరిగినట్లుగా వుంది. వివరాలు తెలియవు." అని చెప్పాడు ఒక పెద్దమనిషి.
    కేబరేడాన్సర్ అనగానే దేవకి గుర్తొచ్చింది సోమనాధ్ కి. వెంటనే అక్కడికి వెళ్ళాడు. నిర్జనంగా వుందా యిల్లు. ఇంటిబయట రోడ్డుమీదే కారు పార్క్ చేసుకుని లోపలికెళ్ళాడు. ఇంట్లో జనం యెవ్వరూ లేరు. ఒక స్టూలుమీద నడివయసు స్త్రీ కూర్చుని బెదురుగా చూస్తూంది. భాగవతార్ గురించి అడగాలనుకున్న సోమనాధ్ మొదట దేవకి సంగతి తెలుసుకోవాలనుకుని, "కేబరే డాన్సర్ దేవకి గారుండేది ఇక్కడేనా?" అని అడిగాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు. అలాగే బెదురు చూపులు చూస్తూ కూర్చుంది. అంతలో మఫ్టీలో వున్న ఇద్దరు పోలీసులు సోమనాధ్ ని చెరో వైపు చేతులు పట్టుకుని-
    "మిస్టర్! మీరు మాతో పోలీస్ స్టేషన్ కి రావాలి" అన్నారు.
    "నేనా! పోలీస్ స్టేషన్ కా? ఎందుకు?" అడిగాడు సోమనాధ్. వాళ్ళు తమ ఐడెంటిటీ కార్డ్సు చూపించి, "ప్లీజ్! స్టేషన్ కి రండి అక్కడ ఇనస్పెక్టర్ గారితో మాట్లాడితే మీకే అన్ని విషయాలు తెలుస్తాయి" అని పక్కసందులో పార్క్ చేసిన జీప్ లో ఎక్కించుకోబోతూంటే, "నాకారు...." అన్నాడు సోమనాధ్.
    "దాన్నక్కడే వొదిలేయండి. ఎవరూ ఎత్తుకుపోరు." నవ్వుతూ అన్నాడు మఫ్టీలో వున్న పోలీసు.
    పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.కి తన విజిటింగ్ కార్డు చూపించాడు సోమనాధ్.
    "కూర్చోండి. మీకు తెలిసినంతవరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మాతో సహకరించండి" మర్యాదగా అన్నాడు ఎస్.ఐ. కూర్చున్నాడు సోమనాధ్. అడగటం మొదలుపెట్టాడు ఎస్.ఐ.
    "ఇంత మారుమూల ఈ ఇంటికెందుకొచ్చారు మీరు?
    "భాగవతార్ గారి కొక విషయం చెప్పాలని."
    "భాగవతార్ కి, ఈ యింటికి ఏం సంబంధం?"
    "అది నాకు తెలియదు."
    "పోనీ మీకు, భాగవతార్ గారికి ఏం సంబంధం?"
    "ఆయన ణా క్లయింట్."
    "ఆయనతో మీరు చెప్పాలనుకున్న విషయమేమిటి?" తటపటాయించాడు సోమనాధ్.
    "నిజం చెప్పండి ప్లీజ్! మనం పరస్పరం సహకారంతో మన పనులు సాగించుకోవాలి."
    "ఆయన భార్య అని ఆయన భ్రమపడుతోన్న వ్యక్తి ఆయన భార్య కాదని చెప్పడానికొచ్చాను."
    "వాట్!"
    "నీడమీదకి వైటొచ్చింది. మనిషి స్పష్టంగా కనిపించింది. ఆమె మృదుల- కాదు."
    ఎస్.ఐ. రెండు చేతులతో తలపట్టుకుని "కాస్త అర్ధమయ్యేలా చెప్పండి ప్లీజ్!" అన్నాడు.
    మంచినీళ్ళు తెప్పించుకుని తాగాడు సోమనాధ్. క్లుప్తంగా జరిగింది చెప్పి, "మా టి.వి. సెట్ లో లోపం కారణంగా చాలా దారుణమైన పొరపాటు జరిగిపోయింది. వెంటనేవెళ్ళి భాగవతార్ కి ఈ విషయం చెప్పకపోతే ఆయన ఏం చేస్తాడోనని ఆదుర్దాగా వుంది. అందుకు నేనే కారణమని బాధగానూ వుంది. హోటల్ నాగార్జునలో భాగవతార్ ఇక్కడికొచ్చారని చెపితే వచ్చాను" అన్నాడు.
    ఎస్.ఐ. నవ్వి "బాగుంది, మీ ప్రైవేట్ డిటెక్టివ్ ల పని. భాగవతార్ ఇక్కడి కొచ్చినట్లు, ఇక్కణ్నుంచి ఎయిర్ పోర్టుకి వెళ్ళినట్లు తెలిసింది" అని, సోమనాధ్ కి షేక్ హేండ్ ఇచ్చి పంపేసాడు.
    భాగవతార్ కారు రాజభూషణం ఇంటిముందు ఆగింది. గేటుదగ్గిర ఘూర్ఖాకి భాగవతార్ బాగా తెలుసు కనక సలాం చేసి గేటు తెరిచాడు. అంతకుముందు రాజభూషణం మనుష్యులు తీసుకొచ్చింది భాగవతార్ భార్యని ఘూర్ఖాకి తెలియదు. అలాంటి విషయాలు అతను పట్టించుకోడు. కాంపౌండులో కారు పార్క్ చేసి, పరిగెడుతూన్నట్టుగా లోపలికి నడిచాడు. రాజభూషణం ప్రైవేట్ రూమ్స్ అతనికి తెలుసు. కాని అటు వెళుతూండగానే రాజభూషణం మనుష్యులు అడ్డుపడి "ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు" అన్నారు. "నేను వెళ్ళి తీరతాను." ఖండితంగా అన్నాడు భాగవతార్. అనడమే కాదు లోపలికి తోసుకుని వెళ్ళబోయాడు. రాజభూషణం మనుష్యులు అతన్ని చెరో రెక్క పట్టుకుని ఇవతలికి ఈడ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా, "మృదులా" అని అరుస్తూ వాళ్ళని తోసుకుని లోపలికెళ్ళబోయాడు. 
    భాగవతార్ రాజభూషణం స్నేహితుడని అందరికీ తెలుసు. ఆ మొహమాటంతో కొంచెం సంకోచించారు రాజభూషణం మనుష్యులు. కాని భాగవతార్ పిచ్చివాడిలా అరిచి గోలచెయ్యడంతో ఇద్దరూ కలిసి భాగవతార్ ని చావబాదారు. ఆ దెబ్బలు బాధ భరిస్తూనే, "మృదులా" అని అరుస్తూ లోపలికి పోవడానికి ప్రయత్నించాడు భాగవతార్. రాజభూషణం మనుష్యులు అతన్ని బయటి కీడ్చుకొచ్చి మరింత బాదారు. ఒక్కొక్క దెబ్బ వంటిమీద పడుతున్నప్పుడల్లా శక్తి అంతా కూడదీసుకుని "మృదులా" అని అరుస్తూనే వున్నాడు భాగవతార్.
    రాజభూషణాన్ని నగ్నంగా మంచానికి కట్టేసి, గది బయటికొచ్చి గది తలుపులు బయటినుంచి వేసేసింది మృదుల. ముందా యింటిలోంచి బయటపడాలని త్వరగా నడుస్తోంటే, "మృదులా" అనే కేక వినబడింది. చటుక్కున ఆగిపోయింది. అది భాగవతార్ గొంతు. భాగవతార్ ఇక్కడికెప్పుడొచ్చాడు? ఎందుకొచ్చాడు? తనని చూసి పిలుస్తున్నాడా? కొంపదీసి కథల్లోలాగ అతడే రాజభూషణానికి సాయం చెయ్యాలనుకోవడం లేదు కదా! చుట్టూ చూసింది. భాగవతార్ కనపళ్ళేదు. మళ్ళీ వినిపించింది. "మృదులా" అని, మళ్ళీ.... మళ్ళీ.... మళ్ళీ.... ఆ పిలుపు మామూలుగా లేదు. దీనంగా, ఆవేదన నిండిన స్వరంతో పిలుస్తున్నట్లుగా వుంది. ఎలుగెత్తి పిలుస్తోన్న ఆ స్వరం రాను రాను క్షీణించడం కూడా గమనించింది మృదుల. ధ్వని వినవచ్చిన వైపుగా నడిచింది. ఒక గదినుంచి మరో గది దాటుకుంటూ ముందు వరండాలోకి వచ్చేసరికి రాజభూషణం మనుష్యుల చేతుల్లో చావు దెబ్బలు తింటూ కుప్పకూలిపోయి, "మృదులా" అని అరుస్తోన్న భాగవతార్ కనిపించాడు. భాగవతార్ కి మృదుల కనపడలేదు. దెబ్బలతో అతడి కళ్ళు రెండూ వుబ్బిపోయి, కళ్ళముందు చీకట్లు అలుముకున్నాయి. ఆ దృశ్యం చూడగానే పట్టరాని ఆవేశం చేలరేగింది మృదులలో. తను నేర్చుకున్న జూడో విన్యాసంతో గాల్లోకెగిరి, రాజభూషణం మనుష్యుల నిద్దర్ని రెండు కాళ్ళతోనూ తన్నింది. ఎదురు చూడని యీ తాకిడికి వాళ్ళిద్దరూ చెరోవైపున దబ్బున కూలబడ్డారు. వాళ్ళకి మళ్ళా లేచే అవకాశం యివ్వకుండా అరచేతిని కత్తిలా చేసి ఇద్దరినీ మెడల మీద కొట్టింది. సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళ కళ్ళు మూతలు పడిపోయాయి. భాగవతార్ ని చెయ్యిపట్టుకు లేవదీసి, "నడవ గలవా? నేనాసరా వుంటాను. ఎలాగో కాంపౌండ్ దాటితే ఏదేనా టాక్సీ చూసుకోవచ్చు." 
    ఉబ్బిపోయి, నీళ్ళు కారుతూన్న కళ్ళను విప్పి చూడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు భాగవతార్. తన పక్కన వున్నది మృదుల అని, రాజభూషణం గూండాలని మృదుల ఒక్కర్తే ఎదుర్కొని క్రింద పడేసిందని అప్పటికీ నమ్మలేకపోతున్నాడు భాగవతార్. చావు దెబ్బలు తిన్న అతని శరీరంలో మనసు అదుపు తప్పుతోంది.
    "నిన్ను, వాళ్ళూ- వాళ్ళు, నిన్ను-" అంటూ అస్పష్టంగా ఏదో గొణిగాడు. అతని అవస్థకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మృదులకి. తనకోసమే- తనను కాపాడటం కోసమే భాగవతార్ ఇక్కడికొచ్చి యీ హింస అంతా భరించాడని గ్రహించే సరికి మనసు ద్రవించింది. అతని భుజాలు చుట్టూ చెయ్యి చుట్టి లేవదీసి నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చింది. కాంపౌండ్ లో పార్క్ చేసిన భాగవతార్ కారుని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. భాగవతార్ జేబులోంచి కారు తాళం చెవులు తీసుకుని, భాగవతార్ ని కారు వెనక సీట్లో పడుకోబెట్టి, కారు స్టార్టుచేసుకుని ప్రయివేట్ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళింది. డాక్టర్ తో మాట్లాడి, భాగవతార్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి, జరిగింది మహావీర్ కి తెలియపర్చాలని సోమనాధ్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ కార్యాలయానికి ఫోన్ చేసింది.
                            o    o    o
    ఏం చెయ్యాలో పాలుపోక మధనపడుతున్నాడు సోమనాధ్. మహావీర్ నవ్వుతూ, "మధ్యలో భాగవతార్ కోసం బాధపడుతున్నావేమిటి? భార్యని అనుమానించి, ఆమె పైన నిన్ను డిటెక్టివ్ గా నియమించిన ఆ పెద్దమనిషి ఏమైపోతాడు?" అన్నాడు.
    "నీకు తెలియదు. అతడిదొక చిత్రమైన వ్యక్తిత్వం. మొదట భార్యననుమానించిన మాట నిజమే. ఆమె దగ్గిర్నుంచి విడాకులు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సాక్ష్యాధారాలకోసం నన్ను సంప్రదించినట్లు చెప్పాడు. తీరా ఆ మధ్య మృదుల తనంతట తనే భాగవతార్ ని వొదిలి వెళ్ళిపోయింది. ఈయనగారు దేవదాసులా తయారయ్యాడు. "ఎలాగైనా మృదుల జాడ కనిపెట్ట" మంటూ నా దగ్గిరకొచ్చాడు. అతడి వాలకం చూస్తె మృదులని హత్యచేస్తాడా- లేక ఆత్మహత్య చేసుకుంటాడా- అని అనుమానం కలిగింది. వీడియోలో మృదుల ఎవరితో కనిపించిందో అతడి దగ్గిరకేవెళ్ళి వుంటుందేమోనని తోచింది నాకు. అతడెవరో తెలుసుకుందామనే కేసెట్ మళ్ళీ ప్లే చేసి చూసుకుంటున్నాను. ఇంతలో నువ్వొచ్చి, నా టి.వి. సెట్ లోని బేండ్స్ ఎడ్జెస్ట్ చేసావు అసలు విషయం బయటపడింది. ఈ విషయం వెంటనే అతనికి తెలియపర్చకపోతే ఏ అఘాయిత్యం చేస్తాడో అని భయంగా వుంది."  

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra