Home » Mainanpati bhaskar » రౌడీరాజ్యం


    దాని మీద 'అఖిల్' అని తన పేరు టైప్ చేసి వుంది నీటుగా.

    నీర్జావైపు చూశాడు అతను. ఆమె యింకా ఫోన్లో మాట్లాడుతూనే వుంది.

    ఇంతవరకూ అతను నీర్జాని అంత దగ్గర్నుంచి అంత సావకాశంగా ఎప్పుడూ చూడలేదు.

    ఆమె మొహంలో ఉన్న ప్రతిరేఖా కూడా 'పొగరు' అనిపించేటంత లెవెల్లో ఉండే ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రస్పుటం చేస్తోంది. చెప్పలేనంత గ్లామరస్ గా ఉంది నీర్జా. ఆమెది ఒరిజినల్ అందం. దానికి ఎవరో ఎక్స్ పర్ట్ బ్యూటీషియన్ అత్యంత శ్రద్ధాశక్తులతో దిద్దిన మెరుగులు. ఉండవలసిన స్థానంలో లేదు ఆమె పమిట. కొద్దిగా పక్కకి తొలగి ఉంది. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని వుందామె. అందంగా కనబడుతున్నాయి సన్నగా ఉన్న ఆమె భుజాలు.

    నీర్జా మాట్లాడటం పూర్తయ్యింది. ఫోన్ పెట్టేసింది. ఒకసారి పమిట అంతా తీసేసి రెండుచేతులతో పట్టుకుని ఒక్కక్షణం ఆగి మళ్ళీ సరిగ్గా వేసుకుంది.

    అప్పుడు చూసింది అఖిల్ వేపు సూటిగా, ఆరోపణగా.

    'రోడ్డుమీద ఉన్నవాడిని నిన్ను తీసుకొచ్చి ఫైవ్ స్టార్ హోటల్ లో పడేస్తే కృతజ్ఞత లేకుండా ఆ వెధవలతో నువ్వు కూడా చేరిపోతావా?" అంది.

    "రోడ్డుమీద ఉన్నందుకు నేనెప్పుడూ విచారించలేదే!" అన్నాడు అఖిల్ నిదానంగా.

    అతన్ని కట్ చేస్తూ అంది నీర్జా_

    "అది వదిలెయ్! నీ జీతం ఫిక్స్ చేయలేదనేకదా నీ ఆరాటం!"

    "అది ఇంతకుముందు. ఇప్పుడు అందరి డిమాండ్స్ గురించీ ఆరాటపడుతున్నాను నేను" అన్నాడతను.

    మాట పూర్తికాకముందే మళ్ళీ అతన్ని కట్ చేసింది నీర్జా.

    "నీ జీతం ఫిక్స్ చేశాం. నీకు అరియర్స్ ఎనిమిదివేలు రావాలి. ఈ కవర్ లో పదహారు వేలున్నాయి. అంటే రావలసినదానికి రెట్టింపు. అనవసరమైన గొడవల్లో నువ్వు యిరుక్కోకు. మేనేజ్ మెంట్ పక్షాన ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక లాభం చూపిస్తూనే వుంటాం. సెల్లార్ లో మీటింగ్ కు వచ్చిన వాళ్ళలో నా మనుషులు కొందరున్నారు. వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతూనే ఉంటుంది. నువ్వు చదువుకున్నవాడివి కదా! అందుకని నీకూ మా పక్షాన ఉండే అవకాశం యిస్తున్నా! డోంట్ జాయిన్ హాండ్స్ విత్ దట్ రిఫ్ రాప్! అండర్ స్టాండ్!"

    చదువుకున్నవాడిని కాబట్టి చదువుకున్నవాడిలా ప్రవర్తించడం నా ధర్మమనుకుంటాను. 'ఆకలితో ఉంటున్నాం' అన్న వాళ్ళ డిమాండ్ నన్ను కదిలించి వేసింది"

    అసహనంగా అంది నీర్జా-

    "ఆకలితో వుండేవాళ్ళు అరవై కోట్లమంది ఉన్నారు ఈ దేశంలో! అందర్నీ ఆదుకుంటావా?"

    "కొందరినయినా ఆదుకోగలిగితే చాలు"

    హటాత్తుగా నీర్జా మొహంలో ఎక్స్ ప్రెషన్ మారిపోయింది. అమ్మ తల్లిలా అయిపోయింది మళ్ళీ.

    'మొహానికి కాస్సేపు మాస్క్ పెట్టుకుంది. అది యిప్పుడు జారిపోయింది' అనిపించింది అఖిల్ కి.

    ఇంతలో ఇంటర్ కమ్ మోగింది.

    "వచ్చారా! లోపలికి రండి" అంది నీర్జా.

    మరుక్షణంలో ఎనిమిదిమంది మనుషులు లోపలికి వచ్చారు.

    "రండి! ప్లీజ్ బి సీటెడ్" అంది నీర్జా. అంటూనే అఖిల్ తో అంది "నువ్వు లేచి అక్కడ నిలబడు"

    కోపాన్ని ఆపుకుంటూ లేచాడతను. ఒక పక్కగా నిలబడ్డాడు. ఆ వచ్చినవాళ్ళు కుర్చీల్లో కూర్చున్నారు.

    "ఏర్పాట్లు బాగా సాగిపోతున్నాయా?" అంది నీర్జా వచ్చినవాళ్ళలో ఒకతనితో కుతూహలంగా.

    "ఏ వన్ ప్లస్ మేడమ్" అన్నాడతను భరోసా ఇస్తున్నట్లు.

    ఆ తర్వాత ఇక అఖిల్ ఉనికిని మర్చిపోయింది నీర్జా.

    బయటకు వెళ్ళిపోదామనిపించింది అఖిల్ కి.

    కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అతన్ని అక్కడే నిలబెట్టేశాయి.

    వాళ్ళ సంభాషణ తాలూకు సారాంశం ఏమిటంటే-

    నీర్జా తమ్ముడు రాజ్ కుమార్ కి పెళ్ళి సెటిలయింది.

    రాజ్ కుమార్ ఢిల్లీకి డాన్. రాజకీయాలలో పైపైకి వచ్చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ మాన్.

    ఇలాంటి సమర్ధుడు గనుక తన అల్లుడయితే మహారంజుగా ఉంటుందని మోజుపడ్డాడు మెహతా_భారీ హిందీ సినిమాలు తీసే మెగా ప్రొడ్యూసర్.

    ఇక్కడ ఒక తమాషా వుంది.

    ఒకవేపు సినిమాలు.

    ఇంకొకవేపు రాజకీయాలు.

    దేశంలో వున్న వ్యాపారాలన్నింటిలోకీ విపరీతమైన గ్లామర్ ఉన్న వ్యాపారాలు ఈ రెండూ!

    ఒకానొక వ్యక్తి ఒక సక్సెస్ ఫుల్ డాక్టర్ కావచ్చు, ఒక సక్సెస్ ఫుల్ ఇంజనీరు కావచ్చు, లాయరు కావచ్చు, కాంట్రాక్టరు కావచ్చు, మరేదైనా కావచ్చు.

    తన వృత్తి ఏదయినా కూడా అందులో బాగా సంపాదించాక యింక అతని దృష్టి రాజకీయాలవైపు మళ్ళుతుంది.

    లేదా సినిమాలవైపన్నా వెళ్తుంది.

    సంపాదించిన ఆస్తులు కాపాడుకోడానికి ఇంకా ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు మించిన లాభసాటి వ్యాపారం లేదు! లేదు! లేదు!

    లేదా సినిమాల్లోకి గనక డబ్బుని మళ్ళిస్తే అంతకుమించిన గ్లామరూ లేదు!

    అందుకనే ఇండియాలో అనేకానేక మంది సక్సెస్ ఫుల్ పీపుల్ కి అంతిమ లక్ష్యం రాజకీయాలుగానీ, సినిమా పరిశ్రమగానీ అవుతోంది.

    ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది.

    అది సినిమాలకీ, రాజకీయాలకీ వున్న అవినాభావ సంబంధం! సినిమాలూ, రాజకీయాలూ వ్యాపారాలన్నిటిలో అతి గ్లామరస్, అతి లాభసాటి వ్యాపారాలు కావచ్చు. కానీ సినిమాల్లో వున్నవాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు.

    అలాగే రాజకీయాల్లో వున్నవాళ్ళు చాలామంది సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటారు.

    రాజుల్లో రారాజుల్లాంటివి ఈ రెండు వ్యాపారాలూ! నిజం!

    డాన్ రాజ్ కుమార్ చాలా తెలివైనవాడు.

    అతను చిన్నప్పుడే గ్రహించాడు రాజకీయాలని మించిన వ్యాపారం లేదని!

    రాజకీయాల్లోకి రావడానికి అతి తేలిక మార్గం రౌడీయిజమే అని కూడా అతను పిన్నవయసులోనే గ్రహించేశాడు.

    అందుకే అతను చదువూ గిదువూ అని తన టైం వేస్ట్ చేసుకోలేదు. ఒక ఓల్డ్ డాన్ కి అనుచరుడిగా చేరాడు రాజ్ కుమార్. తర్వాత తనే డాన్ అయ్యాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు.

    వచ్చినవాళ్ళలో ఒకడు అంటున్నాడు నీర్జాతో-

    "మెహతాసాబ్ మెగా ప్రొడ్యూసర్! పెళ్ళిలో కనీసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప తన ఇమేజ్ కి భంగం అని  భావిస్తున్నారు ఆయన. అందుకని పెళ్ళి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాం!"

    నీర్జా స్మైల్ చేసింది.

    "పెళ్ళిలో మేమూ ఒక కోటి ఖర్చు చేయకపోతే మా ఇమేజ్ కూడా దెబ్బతింటుంది కదా!" అని సెక్రటరీ వైపు తిరిగింది.

    "మన ఏర్పాట్లేమిటో చెప్పు!" అంది.

    సెక్రటరీ గొంతు సవరించుకున్నాడు.

    "పెళ్ళికి లక్షలాది మంది గెస్టులు వస్తారు. అందుకని మ్యారేజ్ హాలు కాకుండా ఒక స్టేడియం అద్దెకు తీసుకున్నాం! స్టేడియం మొత్తం పూలతో డెకరేషన్! పూలన్నీ ఫ్లయిట్ లో బెంగుళూరు నుంచి వస్తాయి. స్టేడియంని అంతా ఒక మాయాబజారుగా మార్చేస్తున్నాం. స్టేడియం నిండా షాపులు వుంటాయి. ఒక్కో షాపులో ఒక్కొక్క రకం తినుబండారాలు! ఒక షాపులో జిలేబీలు! ఒక షాపులో బాసుందీ. ఒక షాపులో పళ్ళు. ఒక షాపులో ఐస్ క్రీములూ-అలా ప్రతి డజను షాపులకీ మధ్య ఒక బార్ వుంటుంది. చిరుతిండి యిష్టపడే వాళ్ళకోసం ఛాట్ బజార ఏర్పాటు చేస్తున్నాం. భేల్ పూరీ దగ్గర్నుంచి గప్ చుప్ దాకా అన్నీ వుంటాయి. ఇదిగో! ఇతను ఆ ప్రిపరేషన్స్ లో ఎక్స్ పర్ట్!" అని అఖిల్ వైపు చూపించాడు సెక్రటరీ.

    అందరూ అఖిల్ వైపు చూశారు.

    సెక్రటరీ మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు_

    "ఇరవై రకాల బిర్యానీలు-ఇరవై రకాల కూరలు-షాంపేన్ ఫ్రాన్స్ నుంచి వస్తుంది. స్కాచ్ విస్కీ స్కాట్లాండ్ నుంచే! హాలెండ్ బీర్, రష్యన్ ఓడ్కా, గోవా నుంచి ఫెనీ, కావాలనుకున్న వాళ్ళకి కంట్రీలిక్కర్ .... దాదాపు అన్ని పదార్ధాలలో, మద్యాలలో పొడిచేసిన ముత్యాలు కలుపుతాం. పదార్ధాలమీద పల్చటి బంగారురేకు....

    "వాటివల్ల రుచి వస్తుందా?" అన్నారెవరో.

    "తెలీదు. కానీ ఖరీదు పెరుగుతుంది. తద్వారా మా ఇమేజ్" అన్నాడు సెక్రటరీ.

    "ఒక చెట్టు పాతుతాం ఎంట్రన్స్ దగ్గర. దానికి ప్రపంచంలో పండే అన్ని జాతుల పళ్ళూ తెప్పించి వేళ్ళాడదీస్తాం! మేరేజ్ పండాల్ జైపూర్ హవామహల్ పాలెస్ షేపులో కట్టిస్తాం!

    దానికే పది లక్షలు ఖర్చవుతుందని అంచనా!

    అంతం లేకుండా అలా లిస్టు చదువుకుపోతూనే ఉన్నాడు సెక్రటరీ.

    అఖిల్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

    ఎంత దారుణమైన, ఎంత వ్యర్ధమైన ఖర్చు!

    అసహనంగా వెయిట్ చేసి వాళ్ళ మాటల మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అన్నాడు అఖిల్ -

    "మరి మా డిమాండ్స్ మాట ఏమిటి?" 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra